గౌతమ్ అదానీ: మోదీతో స్నేహాన్ని ఒప్పుకున్నారా, సోషల్ మీడియాలో చర్చ ఏంటి?

గౌతమ్ అదానీ

ఫొటో సోర్స్, Getty Images

అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ప్రధాని మోదీతో ఆయనకున్న 'స్నేహం' గురించి, రాహుల్ గాంధీ చేస్తున్న ఆరోపణలపై స్పందించారు.

అదానీ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.

"ఆయన (రాహుల్ గాంధీ) వల్లే ప్రజలకు అదానీ పేరు బాగా తెలిసింది" అని అదానీ అన్నారు.

"మోదీ జీ నుంచి మీకు ఎటువంటి వ్యక్తిగత సహాయం లభించదు" అయితే, "మోదీతో స్నేహం బాగుంది" అని అన్నారు. 

కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌ గాంధీ, మోదీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు అదానీ గ్రూపుకు, మోదీ ప్రభుత్వంతో 'స్నేహసంబంధాలు' ఉన్నాయని చాలాకాలంగా చెబుతూ వస్తున్నారు. 

ఈ ఆరోపణలపై, గౌతమ్ అదానీ స్పందిస్తూ, రాహుల్ గాంధీని తాను 'గౌరవిస్తానని', ఆయన ఆరోపణలను 'రాజకీయ వాక్చాతుర్యం'గా పరిగణిస్తానని అన్నారు. 

ప్రైవేట్ న్యూస్ ఛానెల్ 'ఇండియా టీవీ'తో గౌతమ్ అదానీ సంభాషించారు.

"2014 ఎన్నికల దగ్గర నుంచి రాహుల్ గాంధీ మాపై మాటల దాడి చేస్తూనే ఉన్నారు. దానివల్లే మీ అందరికీ అదానీ ఎవరో తెలిసింది. అందువల్లే నేనిక్కడ కూర్చుని ఇంటర్వ్యూ ఇస్తున్నాను" అన్నారు అదానీ. 

గౌతమ్ అదానీ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో వివిధ స్పందనలు వస్తున్నాయి. అదానీ బాగా మాట్లాడారని కొందరు ప్రశంసిస్తుండగా, రాహుల్ గాంధీ లేవనెత్తిన ప్రశ్నలకు అదానీ వివరణ ఇచ్చుకున్నారని మరికొందరు అంటున్నారు.

అదే ఇంటర్వ్యూలో గౌతం అదానీ 2011 నవంబర్ 26 ముంబై దాడుల గురించి ప్రస్తావించారు. ఆరోజు తాను తాజ్ హోటల్‌లోనే ఉన్నానని, భద్రతా దళాలు తనను రక్షించాయని చెప్పారు.

ఆసియాలోని అత్యంత ధనవంతుడు, ప్రపంచంలోని అత్యంత సంపన్నుల జాబితాలో మూడవ స్థానంలో ఉన్న గౌతమ్ అదానీ ఒక సాధారణ వజ్రాల వ్యాపారిగా కెరీర్ ప్రారంభించారు. 

నేడు ఆయన వ్యాపారం ఓడరేవులు, విమానాశ్రయాలు, ఇంధనం, సౌరశక్తి, బొగ్గు గనులు, సిమెంట్, గృహనిర్మాణం నుంచి పెట్రోకెమికల్స్ వరకు వివిధ రంగాలకు విస్తరించింది.

రాహుల్ గాంధీ

ఫొటో సోర్స్, ANI

రాహుల్ గాంధీ ఏమన్నారు, అదానీ స్పందన ఏమిటి?

దేశంలోని పేదల సొమ్మును రెండు అతిపెద్ద వ్యాపార వర్గాలకు (అదానీ, అంబానీ) కేంద్ర ప్రభుత్వం ధారపోస్తోందని రాహుల్ గాంధీ పలుమార్లు ఆరోపించారు. 

ఇటీవల రాహుల్ గాంధీ 'భారత్ జోడో యాత్ర' దిల్లీ చేరినప్పుడు, ఎర్రకోట వద్ద ప్రసంగిస్తూ "కేంద్రంలో మోదీ ప్రభుత్వం కాదు, అంబానీ-అదానీల ప్రభుత్వం ఉంది" అని మరోసారి ఆరోపించారు. 

ఈ వ్యాఖ్యలపై అదానీని ప్రశ్నించగా, "రాహుల్‌ గాంధీ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు. ఆయన వ్యాఖ్యలపై ఒక వ్యాపారవేత్తగా నేను స్పందించడం మంచిది కాదు. ఆయన గౌరవనీయమైన నేత. ఆయన కూడా ఈ దేశ ప్రజల ప్రగతినే కోరుకుంటున్నారని నేను భావిస్తున్నాను" అని అదానీ అన్నారు. 

"రాజకీయాల్లో ఆవేశంలో ఓ మాట వస్తుంది. నేను దాన్ని ఆయన రాజకీయ వాక్చాతుర్యంగా పరిగణిస్తాను తప్పితే అంతకన్నా ఎక్కువగా తీసుకోను" అని అన్నారు.

గత ఏడాది ఫిబ్రవరిలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ, "మోదీ ప్రభుత్వం భారతదేశంలోని అన్ని పోర్టులు, అన్ని విమానాశ్రయాలు, మొత్తం గ్యాస్, మైనింగ్, గ్రీన్ ఎనర్జీ రంగాలను గౌతం అదానీకి కట్టబెట్టింది" అన్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది

ప్రభుత్వ రంగ బ్యాంకుల నుంచి రుణాలపై సంజాయిషీ

అదానీ గ్రూప్ వివిధ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులలో పెడుతున్న పెట్టుబడి ప్రభుత్వ రంగ బ్యాంకుల నుంచి తీసుకున్న రుణమని రాహుల్ గాంధీ ఆరోపించారు. 

గౌతమ్ అదానీకి రెండు లక్షల కోట్ల రూపాయల అప్పు ఉందని, ప్రజల సొమ్ముతో వ్యాపారం పెంచుకుంటున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. 

అయితే, ఈ వాదనలన్నీ "తప్పు" అని అదానీ అన్నారు.

కాంగ్రెస్, మోదీతో స్నేహంపై ఏమన్నారు?

కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాజస్థాన్‌లో రూ. 68 వేల కోట్ల రూపాయల పెట్టుబడిపై అదానీ స్పందిస్తూ, "ఈ పెట్టుబడులను రాహుల్ గాంధీ ప్రశంసించారని" అన్నారు. 

"రాహుల్ గాంధీ విధానం అభివృద్ధికి విరుద్ధం కాదని నేను నమ్ముతున్నాను. రాజకీయ వాక్చాతుర్యం వేరు, నిజమైన ఆరోపణలు వేరు. ఏది నిజమో ప్రజలే తెల్చుకుంటారు" అని ఆయన అన్నారు. 

అదానీ గ్రూప్ విజయంలో ప్రధాని నరేంద్ర మోదీ హస్తం ఉందన్న ఆరోపణలపై స్పందిస్తూ, "మోదీతో సమస్య ఉన్నవారు మాత్రమే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారని" అన్నారు. 

"మీకు మోదీ జీ నుంచి ఎటువంటి వ్యక్తిగత సహాయం అందదు. మోదీ జీ సుమారు 12 సంవత్సరాలు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయనతో మంచి స్నేహం కుదిరిందని నేను గర్వంగా చెప్పగలను" అని అదానీ అన్నారు.

అదానీ

ఫొటో సోర్స్, Getty Images

సోషల్ మీడియాలో చర్చలు

ఈ ఇంటర్వ్యూలో అదానీ మాట్లాడిన విషయాలపై కొందరు ఆయనను విమర్శిస్తున్నారు. కానీ, కొందరు ఆయన 'సెన్స్ ఆఫ్ హ్యూమర్'ని ప్రశంసించారు. 

"అదానీ ఏమీ గొప్పగా కనిపెట్టలేదు. తన రాజకీయ పలుకుబడిని ఉపయోగించి బ్యాంకుల వద్ద రుణాలు తీసుకుని కంపెనీలు కొనుగోలు చేశారు. ప్రజల సొమ్ముతో బ్యాంకులకు రుణాలు చెల్లిస్తున్నారు" అని భరత్ పాండే అనే యూజర్ ట్వీట్ చేశారు.

"రాహుల్ గాంధీ ఆరోపణలపై అదానీ సమాధానాలు నచ్చాయి. ఈ ఇంటర్వ్యూలో వేరే స్థాయి ఎనర్జీ కనిపించింది" అని ఆశిష్ పారిక్ అనే యూజర్ రాశారు.

"మోదీ ఆయన పక్కన ఉన్నప్పుడు, ఆయనకు రాహుల్ గాంధీ అవసరం ఏముంది? మోదీ ఆయన కోసం 18 గంటలు పనిచేస్తారు. మరీ ఇంత శ్రమపడకండి" అని అంజన రాశారు. 

"రాహుల్ గాంధీ వల్లే తాను ఇక్కడ ఇంటర్వ్యూ ఇచ్చే స్థాయికి వచ్చానని అదానీ అన్నారు. అటువంటి సానుకూల దృక్పథాన్ని చూడటం ఆనందంగా ఉంది" అని సుజాత అనే యూజర్ రాశారు. 

ఇవి కూడా చదవండి: