రాహుల్ గాంధీ: గడ్డకట్టించే దిల్లీ వాతావరణంలో ఆయనకు ఎందుకు చలిగా లేదు? ‘టీ-షర్ట్’తో ఎలా తిరుగుతున్నారు?

ఫొటో సోర్స్, ANI
దేశ రాజధాని దిల్లీలో సోమవారం ఉదయం ఉష్ణోగ్రత సుమారు 7 డిగ్రీల సెల్సియస్‌కి పడిపోయింది. ఇంతటి గడ్డ కట్టించే చలిలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కేవలం టీ-షర్ట్ మాత్రమే ధరించి మహాత్మా గాంధీ, మాజీ ప్రధాన మంత్రులు సమాధులను దర్శించి, శ్రద్ధాంజలి ఘటించారు.
అప్పటి నుంచి సోషల్ మీడియాలో ‘టీ-షర్ట్’ అనే పదం ట్రెండింగ్‌గా మారింది.
రాహుల్ గాంధీ కేవలం టీ-షర్ట్ ధరించి మాత్రమే కాక, ఎలాంటి సాక్స్‌లు లేకుండా, వట్టి కాళ్లతో మాజీ ప్రధానుల సమాధుల చుట్టూ ప్రదక్షిణలు చేశారు.
అయితే, ఈ సమాధులను దర్శించటానికి రాహుల్ గాంధీతో పాటు వచ్చిన ఇతర వ్యక్తులు కొందరు కోట్లు ధరించి కనిపించగా.. మరి కొందరు క్యాప్‌లు కూడా పెట్టుకున్నారు.
ఉత్తర భారతాన్ని వణుకుపుట్టిస్తున్న ఈ చలిలో రాహుల్ గాంధీ టీ-షర్ట్ మాత్రమే వేసుకోవడం ఇప్పుడే కొత్త కాదు.. గత కొన్ని రోజులుగా ఆయన ఈ విధంగానే కనిపిస్తున్న ఫోటోలు చక్కర్లు కొడుతూనే ఉన్నాయి.
భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ గత కొన్ని రోజులుగా తెల్లటి టీ-షర్ట్‌ను ధరించి పాదయాత్ర చేస్తున్నారు.
ఆయనతో పాటు ఈ యాత్రలో పాల్గొంటున్న చాలా మంది నేతలు, నటులు మాత్రం చలిని తట్టుకునే మందపాటి వస్త్రాలను ధరించి కనిపిస్తున్నారు.
రాహుల్ గాంధీ కేవలం టీ-షర్ట్ మాత్రమే ధరించి కనిపిస్తుండటంతో చాలా మంది ప్రజలు సోషల్ మీడియాలో పలు రకాల ప్రశ్నలు సంధిస్తున్నారు.
రాహుల్ గాంధీకి ఎందుకు చలిగా అనిపించడం లేదని ప్రశ్నిస్తున్నారు.
ప్రజలు ఏం మాట్లాడుకుంటున్నారో తెలుసుకోవడాని కంటే ముందు ఇంతటి చలిలో కేవలం టీ-షర్ట్ మాత్రమే ధరించడంపై రాహుల్ గాంధీ చెప్పిన సమాధానం ఒకసారి తెలుసుకుందాం..

ఫొటో సోర్స్, @BHARATJODO
రాహుల్ గాంధీ సమాధానం..
‘‘ఒక విలేకరి నన్నో ప్రశ్న వేశారు. మీకు చలిగా అనిపించడం లేదా? అని అడిగారు. వారు నన్నడుగుతారని నాకు తెలుసు, కానీ వారెందుకు భారత దేశంలో ఉన్న వ్యవసాయదారుల్ని ఈ ప్రశ్న వేయడం లేదు? దేశంలోని కార్మికులను ఎందుకు ఈ ప్రశ్న అడగడం లేదు? ఎందుకు వారు భారత్‌లోని పేద పిల్లల్ని అడగడం లేదు?’’ అని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు.
‘‘నేను 2,800 కిలోమీటర్లు నడవటం పెద్ద విషయం కాదని నేను భావిస్తున్నాను. భారత దేశమంతా ఇలానే నడుస్తుంది, జీవితాల కోసం ఇలానే పోరాడుతున్నారు. రైతులు, కార్మికులు వారి జీవనాలను ఇలానే సాగిస్తున్నారు. ఫ్యాక్టరీల్లో పనులు చేసుకునే కార్మికులు ఇలానే వారి బతుకును వెళ్లదీస్తున్నారు. మేమేమీ పెద్ద పని చేయ లేదు. భారత దేశమంతా ఈ పని చేస్తోంది. ప్రతి రోజూ చేస్తోంది. మేము 2,800 కిలోమీటర్లే నడిచాం. కానీ రైతులు రోజూ 10 వేల కి.మీలు, 15 వేల కి.మీలు, 20 వేల కి.మీలు నడుస్తున్నారు’’ అన్నారాయన.
మరోవైపు, విలేకరుల సమావేశాల్లో కాంగ్రెస్ పార్టీ విపక్షాల కోసం ‘దుప్పట్లు’ అనే పదాన్ని, తమ నేత కోసం ‘తపస్సు’ అనే పదాన్ని ఉపయోగిస్తోంది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
‘‘క్రిస్మస్ సెలవుల కోసం రాహుల్ గాంధీ విదేశాలకు వెళ్తున్నారని బీజేపీ నేతలు చెబుతున్నారు. కానీ, నేడు వణుకు పుట్టించే ఈ చలిలో, భారతీయ జనతా పార్టీ నేతలు, అధికార ప్రతినిధులు, నేతలు దుప్పట్లు కప్పుకున్న ఈ సమయంలో.. రాహుల్ గాంధీ మహాత్మాగాంధీ సమాధికి, నెహ్రూ సమాధికి, రాజీవ్ గాంధీ, చౌదరి చరణ్ సింగ్, శాస్త్రి, అటల్ సమాధులకు నివాళులర్పించడం ద్వారా ఆయన తపస్సును పూర్తి చేశారు ’’ అని కాంగ్రెస్ పార్టీ విలేకరులు సమావేశంలో తెలిపింది.
‘ఇది మానసిక, శారీరక, ఆధ్యాత్మిక, మనోవికాసానికి చెందిన శక్తి. ప్రాణాయామం, ఫిట్‌నెస్‌తో, మన శరీరం వణుకు పుట్టించే చలికి కూడా అంతలా ప్రభావితం కాదు’ అని తెహ్‌సీన్ పూనావాలా ట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
రాహుల్ గాంధీని ప్రధాన మంత్రిని చేయాలని, ఆయన దిల్లీ చలిలో కూడా పొట్టి చేతుల టీ-షర్ట్‌తో జీవించగలరని ‘ది ఫ్రస్ట్రేటెడ్ ఇండియన్’ పేరుతో ఉన్న ట్విటర్ అకౌంట్ ట్వీట్ చేసింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
7 డిగ్రీల ఉష్ణోగ్రతలో మామూలు ప్యాంట్, టీ-షర్ట్ ధరించి సంచరించడం హాస్యాస్పదం కాదని అభిషేక్ సంఘ్వీ ట్వీట్ చేశారు.
ఇంతటి చలిలో రాహుల్ గాంధీ టీ-షర్ట్ కింద మరే వస్త్రాలను వేసుకోలేదని ‘ఆర్‌జే స్పీక్స్’ అనే యూజర్ రాహుల్ గాంధీ ఫోటోలను షేర్ చేస్తూ తెలిపారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 4
డిసెంబర్ 24న జర్నలిస్టు వినోద్ శర్మ కూడా రాహుల్ గాంధీ ఫోటోను జత చేస్తూ ఒక ట్వీట్ చేశారు. ఆ ఫోటోలో రాహుల్‌తో పాటు రణ్‌దీప్ సుర్జేవాలా, శ్రీనివాస్ బీవీ ఉన్నారు.
ఈ ఫోటోలో కేవలం రాహుల్ గాంధీ మాత్రమే టీ-షర్ట్ వేసుకుని ఉండగా.. మిగిలిన వారందరూ చలిని తట్టుకునే వెచ్చటి వస్త్రాలను ధరించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 5
బాలీవుడ్ నటులు హృతిక్ రోషన్, విద్యుత్ జమ్వాల్, టైగర్ షరోఫ్ వాళ్లను వెనక్కి నెట్టేసి భారత ఫిట్‌నెస్ ఐకాన్‌గా రాహుల్ గాంధీని ప్రకటించాలని దివ్యా సిన్హా అనే యూజర్ ట్వీట్ చేశారు.
వణుకు పుట్టించే 6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలో కూడా రాహుల్ గాంధీ ఎంత సౌకర్యవంతంగా, ఫ్రీగా నడుస్తున్నారో చూడండి అంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 6
ఐదు రోజుల కిందట, భవికా కపూర్ కూడా రాహుల్ గాంధీని అద్భుతమైన వ్యక్తిగా అభివర్ణిస్తూ ట్వీట్ చేశారు. ఉక్కుతో ఆయన్ను చేసినట్టుందన్నారు.
100 రోజుల్లో 2600 కి.మీలు నడవడమే కాకుండా.. ఐదు నుంచి 6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతల్లో కూడా ఆయన టీ-షర్ట్‌లు మాత్రమే ధరించి నడుస్తున్నారని, సూపర్ ఫిట్ అంటూ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 7
రాహుల్ గాంధీని మహాత్మా గాంధీతో పోల్చుతూ వందితా మిశ్రా ఒక ట్వీట్ చేశారు. ‘‘రాహుల్ గాంధీ ఈ వాతావరణాన్ని అసలు పట్టించుకోవడం లేదు. గాంధీల మోకాళ్లలోనే ఖాదీ ధోతి చుట్టబడి ఉంది. నేడు రాహుల్ గాంధీ తెల్లటి టీ-షర్ట్, ట్రౌజర్‌లో గాంధీలా కనిపిస్తున్నారు. గాంధీలకు ఏ మాత్రం తక్కువ కానీ దేశభక్తి, చింతనలను మనం అర్థం చేసుకోవచ్చు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 8
మరో 500 కి.మీలకు పైగా ప్రయాణించాలి
తమిళనాడులోని కన్యాకుమారి నుంచి సెప్టెంబర్ 7, 2022న ప్రారంభమైన భారత్ జోడో యాత్ర ఇప్పటి వరకు 9 రాష్ట్రాల గుండా సాగింది.
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నేతృత్వంలో ఈ యాత్ర జరుగుతోంది. శనివారం ఉదయం బదర్‌పూర్ బోర్డర్ నుంచి రెడ్ పోర్ట్‌కి ఈ యాత్ర నడిచింది.
భారత్ జోడో యాత్ర ముందుగా నిర్ణయించిన ప్రొగ్రామ్ ప్రకారం.. రాహుల్ గాంధీ చేపట్టిన ఈ పాదయాత్ర జమ్మూ, కశ్మీర్‌లోని శ్రీనగర్‌లో ముగియనుంది. దీని కోసం ఆయన మరో 500 కి.మీలకు పైగా ప్రయాణించాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి:
- కరెంటు, తిండీ లేకుండా సముద్రంలోనే నెల రోజులు, చివరికి ఎలా బయటపడ్డారు?
- కోవిడ్-19 బీఎఫ్7: ఆక్సిజన్ సిలిండర్, మందులు కొని ఇంట్లో పెట్టుకోవాలా?
- అమ్మ ఒడి : బడికి వెళ్లే పిల్లలకు ఇచ్చే రూ.15 వేలు తీసుకోవడం ఎలా?
- క్రికెట్: ఈ ఏడాది అత్యధిక పరుగులు చేసిన టాప్ 5 భారత ఆటగాళ్లు వీళ్లే...
- చార్లీ చాప్లిన్ శవపేటికను దొంగతనం చేసి, అతడి భార్యను బ్లాక్ మెయిల్ చేసిన దొంగల కథ మీకు తెలుసా..?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)