మల్లికార్జున ఖర్గే: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడు మోదీ-షాలను ఢీ కొట్టగలరా, ఉత్తర భారత ప్రజలను ఆకట్టుకోగలరా

కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, ఇమ్రాన్ ఖురేషీ
    • హోదా, బీబీసీ హిందీ

కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే ఆ పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో గెలిచారు. మరొక సీనియర్ నేత శశి థరూర్‌ను ఓడించి పీఠం దక్కించుకున్నారు. అక్టోబర్ 26న ఆయన కొత్త అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరిస్తారని కాంగ్రెస్ ఎంపీ రణదీప్ సూర్జేవాల్ వెల్లడించారు.

కాంగ్రెస్ చరిత్రలో 24 ఏళ్ల తరువాత గాంధీ కుటుంబం నుంచి కాకుండా బయటి వ్యక్తి ఆ పార్టీ అధ్యక్ష పదవి చేపట్టారు. ‘‘మా పార్టీ పునరుజ్జీవం, నిజంగా ఇక్కడి నుంచే ప్రారంభమైందని భావిస్తున్నా’’ అంటూ ఎన్నికల ఫలితాల తరువాత వ్యాఖ్యానించారు శశిథరూర్.

చివరిసారి 1996లో సీతారాం కేసరి ఆ పార్టీ అధ్యక్షునిగా పగ్గాలు చేపట్టారు. ఆ తరువాత 1998లో బలవంతంగా సోనియా గాంధీ కోసం ఆయన చేత రాజీనామా చేయించారు. నాటి నుంచి 19 ఏళ్ల పాటు అంటే 2017 వరకు ఆమె కాంగ్రెస్ అధ్యక్ష పదవిలో ఉన్నారు.

2017 డిసెంబరులో సోనియా గాంధీ కొడుకు రాహుల్ గాంధీ, ఎటువంటి పోటీ లేకుండానే కాంగ్రెస్ అధ్యక్షుడు అయ్యారు. కానీ 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమికి బాధ్యత వహిస్తూ అదే ఏడాది అగస్టులో అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. నాటి నుంచి సోనియా గాంధీ తాత్కాలికంగా అధ్యక్ష పదవిలో కొనసాగుతున్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

గాంధీ కుటుంబానికి విధేయుడు, నమ్మకస్తుడైన మల్లికార్జున ఖర్గే గెలుపును చాలా మంది ముందుగానే ఊహించారు. గతంలో కేంద్ర మంత్రిగా పని చేసిన ఖర్గే పార్టీలో సంస్కరణలు తీసుకొస్తానంటూ ప్రకటించారు. 50శాతం పార్టీ పదవులను 50ఏళ్ల లోపు వారికే ఇస్తామంటూ హామీ ఇచ్చారు.

కర్నాటక రాష్ట్రానికి చెందిన ఈ 80ఏళ్ల సీనియర్ కాంగ్రెస్ నేత, 2024 సాధారణ ఎన్నికల్లో ముందుండి కాంగ్రెస్ శ్రేణులను నడిపించనున్నారు. సుమారు 18 నెలల్లో ఎన్నికలు రానున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీకి చెందిన బీజేపీని ఢీ కొట్టాలంటే కాంగ్రెస్ పార్టీని సంస్కరించాలని విశ్లేషకులు అంటున్నారు.

‘‘నిర్మాణాత్మకంగా, సంస్థాగతంగా, సైద్ధాంతికపరంగా కూడా అత్యంత దారుణమైన స్థితిలో ఉన్న’’ కాంగ్రెస్‌ పార్టీని ముందుకు నడిపించడమనే అతి పెద్ద సవాలు మల్లికార్జున ఖర్గే ముందు ఉంది.

కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే‌తో శశి థరూర్

ఫొటో సోర్స్, Facebook/Shashi Tharoor

మల్లికార్జున ఖర్గే ఎవరు?

మల్లికార్జున ఖర్గే చాలా కాలంగా రాజకీయాల్లో కొనసాగుతున్నారు. దళిత సామాజిక వర్గానికి చెందిన ఆయన, 1942లో బీదర్ జిల్లాలో జన్మించారు. బీదర్‌కు పక్కనే ఉండే గుల్బర్గాకు కుటుంబం వెళ్లడంతో ఆయన అక్కడే పెరిగారు.

న్యాయశాస్త్రం చదివిన ఆయన, తొలి రోజుల్లో కార్మిక సంఘాల తరఫున వాదించేవారు. విద్యార్థిగా ఉన్న రోజుల నుంచే రాజకీయాల్లో ఖర్గే చురుకుగా ఉండే వారు. 1969లో కాంగ్రెస్ పార్టీలో ఆయన చేరారు.

నాటి కర్నాటక కాంగ్రెస్ అధ్యక్షుడు దేవరాజ్ అర్స్ కోరిక మేరకు 1972లో గుర్మిత్కల్ నుంచి ఖర్గే పోటీ చేశారు. అది అగ్రవర్ణాలుగా భావించే కులాల ఆధిపత్యం ఉన్న నియోజకవర్గం. అలాంటి నియోజకవర్గం నుంచి 9 సార్లు వరుసగా గెలిచారు ఖర్గే. చితాపుర్ నుంచి కూడా ఆయన పోటీ చేసి విజయం సాధించారు.

‘‘ఆయన దళిత నాయకునిగానే ఎదిగినా అన్ని కులాలతోనూ సఖ్యంగానే ఉండేవారు’’ అని రాజకీయ విశ్లేషకుడు ఇందూధర హొన్నాపుర అన్నారు.

కర్నాటక ప్రభుత్వంలో అనేక శాఖల్లో మంత్రిగా కూడా ఖర్గే పని చేశారు.

సోనియాగాంధీతో మల్లికార్జున ఖర్గే

ఫొటో సోర్స్, Getty Images

ఆ తరువాత 2009లో గుల్బర్గా లోక్‌సభ స్థానం నుంచి తొలిసారి గెలవడంతో ఆయన రాజకీయ కార్యకలాపాల కేంద్రం దిల్లీకి చేరింది. 2014లోనూ ఆయన ఎంపీగా గెలిచారు. కానీ 2019 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. 2021లో ఆయనను రాజ్యసభకు పంపించింది కాంగ్రెస్ పార్టీ.

యూపీఏ ప్రభుత్వంలో రైల్వేశాఖ, కార్మికశాఖ మంత్రిగా ఖర్గే పని చేశారు. పార్లమెంటులో ప్రతిపక్షనేతగాను సేవలు అందించారు. కానీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి అనేది ఆయన జీవితంలోనే అత్యంత కఠినమైన పరీక్షగా భావిస్తున్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

2014 నుంచి నరేంద్ర మోదీ, అమిత్ షా నేతృత్వంలో బీజేపీ ఎదుగుతూ వస్తుంటే మరొకవైపు కాంగ్రెస్ పతనమవుతూ వస్తోంది. 2019 సాధారణ ఎన్నికల్లో బీజేపీ 303 లోక్‌సభ సీట్లు గెలిస్తే కాంగ్రెస్ గెలిచింది 53 సీట్లు మాత్రమే.

దేశంలోని అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయింది. ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో మాత్రమే పాలన సాగిస్తోంది.

రాహుల్ గాంధీతో మల్లికార్జున ఖర్గే

ఫొటో సోర్స్, Twitter/Mallikarjuna Kharge

మోదీని ఢీ కొట్టగలరా?

కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడు బీజేపీని ఢీ కొట్టాలంటే అనేక సవాళ్లు అధిగమించాల్సి ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. ముందుగా తాను గాంధీల చేతిలో 'కీలుబొమ్మ'ను కాదు అని ఖర్గే నిరూపించుకోవాల్సి ఉంటుంది. పార్టీ తన నియంత్రణలోనే ఉందని చూపించాల్సి ఉంటుందని అంటున్నారు.

ప్రతి అంశం మీద తాను గాంధీ కుటుంబాన్ని కలవకపోవచ్చని ఇటీవల ఖర్గే అన్నారు. అయితే పార్టీని నడపడంలో గాంధీ కుటుంబానికి అపారమైన అనుభవం ఉన్నందున వారి 'మార్గదర్శకత్వం', 'సలహాలు' తీసుకుంటానని చెప్పారు.

ఖర్గేకు ఎదురయ్యే రెండో సవాలు, పార్టీలోని అసంతృప్తులు. ఇటీవల కాలంలో కాంగ్రెస్‌లోని చాలా మంది సీనియర్ నేతలు పార్టీ మీద అసంతృప్తితో ఉన్నారు. కొందరు పార్టీని వీడి వెళ్లిపోయారు. పార్టీలోని అసంతృప్తిని ఆయన డీల్ చేయాల్సి ఉంటుంది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 3
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 3

‘‘కాంగ్రెస్‌లో భిన్న వర్గాల మధ్య విబేధాలను పరిష్కరించడంలో ఆయనకు మంచి పేరు ఉంది. ఆయన ఇతరులతో గొడవకు దిగే రకం కాదు’’ అని రాజకీయ వ్యాఖ్యాత కె. బెనెడిక్ట్ అన్నారు.

మరొకవైపు ఇంకో వాదన వినపడుతోంది. దక్షిణ భారత్‌కు చెందిన ఒక రాజకీయ నాయకుడు ఉత్తర భారత్‌లోని ఉత్తరప్రదేశ్, బిహార్ ప్రజలను ఆకట్టుకోగలరా? ఆ రెండు రాష్ట్రాల్లో కలిపి 120 ఎంపీ సీట్లు ఉన్నాయి. కానీ అక్కడ కాంగ్రెస్ పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది.

‘‘దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ పార్టీకి కొత్త ఉత్సాహాన్ని ఇచ్చే శక్తి ఆయనలో లేదు’’ అని జర్నలిస్ట్ పూర్ణిమ జోషి అన్నారు.

'ఆయన మంచి వ్యక్తి. అత్యంత అనుభవజ్ఞుడైన రాజకీయనేత. అందులో సందేహం లేదు. కానీ కాంగ్రెస్‌లో ఉన్న శూన్యాన్ని భర్తీ చేసి, దానికి కొత్త రూపురేఖలు ఆయన ఇవ్వలేరు' అని ఆమె అభిప్రాయపడ్డారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 4
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 4

అంతే కాదు మోదీ-షాలను ఖర్గే ఢీ కొట్టగలరని ఆమె భావించడం లేదు.

‘‘మోదీ-షా భాషలో మాట్లాడగల నేతలు కాంగ్రెస్ పార్టీకి కావాలి. తమదైన శైలితో ఎత్తుకు పైఎత్తులు వేసి బీజేపీని చిత్తు చేయగల వ్యక్తి అవసరం ఆ పార్టీకి ఉంది. కానీ కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడు సైద్ధాంతికంగా మోదీ-షా ద్వయంతో ఢీ కొట్టగలరేమో. ఇది ఒక్కటే ఆయనకు సానుకూలంశం’’ అని పూర్ణిమ విశ్లేషించారు.

వీడియో క్యాప్షన్, ఈరోజు బీబీసీ నూరవ పుట్టినరోజు సందర్భంగా అలనాటి బీబీసీ రేడియో ప్రసారకుల విశేషాలు

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)