గర్భ నిర్ధారణకు మూత్ర పరీక్ష చేయడం 4,500 ఏళ్ళ కిందటే మొదలైందా... ఇదీ ప్రెగ్నెన్సీ టెస్టుల చరిత్ర

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, హెలెన్ కింగ్
- హోదా, ది కన్వర్జేషన్
ఈరోజుల్లో గర్భవతి అని తెలుసుకోవడం చాలా తేలిక. మీ మూత్రాన్ని స్టిక్‌పై వేసి, దాని మీద గీతల కోసం వేచిచూస్తే చాలు. మీకు గర్భం వచ్చిందో లేదో తెలిసిపోతుంది.
ఇంట్లోనే గర్భధారణ పరీక్షలు చేసుకునే సాధనాలను తొలుత 1960లలో మార్కెటింగ్ చేశారు.
హ్యూమన్ కోరియోనిక్ గోనాడోట్రోపిన్(హెచ్‌సీజీ) హార్మోన్‌ను గుర్తించడం ద్వారా ఈ సాధనాలతో ప్రెగ్నెన్సీని గుర్తించే వారు.
ఇది గర్భధారణ సమయంలో ప్రధానంగా ప్లాసెంటా(మావి)లోని కణాల ఆధారంగా ఉత్పత్తి అవుతుంది.
స్త్రీ అండాశయంలో సాధారణంగా గుడ్డుకు సహాయపడే హార్మోన్ ఇది.
రక్తపరీక్షలు గర్భం దాల్చిన 11 తర్వాత మీకు ఈ విషయాన్ని తెలియజేస్తాయి. అలాగే మూత్ర పరీక్షలు కొన్ని రోజులోనే ఈ విషయాన్ని చెబుతాయి.
అయితే, పాజిటివ్ ప్రెగ్నెన్సీ టెస్ట్‌లన్నీ కూడా పిల్లలు పుట్టేందుకు సహకరిస్తాయని కాదు. ఐదు ప్రెగ్నెన్సీలలో ఒకటి అబార్షన్ కూడా కావచ్చు.
కానీ, గర్భవతి అని పాజిటివ్ టెస్ట్ కనిపించగానే, అమ్మ, నాన్న అయ్యే ఈ కొత్త ప్రయాణాన్ని, అనుభూతిని తలుచుకుంటూ చాలా మంది సంబరపడుతూ ఉంటారు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
స్తనాల ఆకారాన్ని బట్టి...
కానీ, గతంలో గర్భ ధారణ పద్ధతులు భిన్నంగా ఉండేవి. పిరియడ్స్ రాకపోయినా లేదా పదే పదే తినాలని అనిపించినా కూడా గర్భవతులైనట్లు భావించేవారు.
ప్రాచీన గ్రీస్ కాలం నుంచి మహిళలు ఒకవేళ గర్భవతులైతే వారికి తెలుస్తుందని నమ్మే వారు.
సెక్సువల్ ఇంటర్‌కోర్స్ తర్వాత యుటెరస్ క్లోజ్ అయినట్లు వారు ఫీలయ్యేవారు. అప్పుడు గర్భవతులని అనుకునే వారు. కానీ, అది అసాధ్యం.
ఆ ప్రారంభ దశలోనే పిండోత్పత్తి అవ్వడం కానీ, పిండం ఎదుగుదల కానీ జరగదు.
అందుకే, మరింత కచ్చితంగా గర్భ నిర్ధారణ పరీక్ష చేసే పద్ధతులను కనిపెట్టేందుకు ప్రయత్నాలు కొనసాగుతూనే వచ్చాయి.
క్రీస్తు పూర్వం 4వ శతాబ్దంలో హిప్పోక్రాటిక్ వైద్య పరీక్ష అఫోరిజమ్స్ ఉండేది.
ఈ పరీక్ష ప్రకారం నిద్రపోయే ముందు మహిళలకు హైడ్రోమెల్ అనే మందును తాగించేవారు. ఇది మీడ్ అనే డ్రిక్. వైన్, నీళ్లు, తేనె మిశ్రమంతో దీన్ని తయారు చేస్తారు. దీన్ని తాగినప్పుడు ఒకవేళ మహిళ గర్భవతి అయితే కడుపులో నొప్పి, వికారంగా అనిపించేది.
13వ శతాబ్దపు వైద్యపరీక్ష ‘‘సీక్రెట్స్ ఆఫ్ ఉమెన్’’పై యూనివర్సిటీ ఆఫ్ ఆక్లాండ్ హిస్టరీ ప్రొఫెసర్ కిమ్ ఫిలిప్స్ అధ్యయనం చేశారు.
ఈ పరీక్ష ప్రకారం ఒకవేళ అమ్మాయిల స్తనాలు కిందకి వాలినట్లు అనిపిస్తే, ఆమె గర్భవతి అని అర్థం.
నెలసరిలో బయటికి వెళ్లే రక్తం పిండోత్పత్తి సమయంలో స్తనాల వద్దకు వెళ్తుందని వారు నమ్మేవారు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
మూత్రంతో ఎలా గుర్తించేవారు?
ఇప్పుడు గర్భవతి అని తెలుసుకునేందుకు మూత్ర పరీక్ష అత్యంత కీలకమైనదిగా మారింది. దీన్ని ఆధునిక విధానంగా కూడా చూస్తున్నారు.
కానీ, వాస్తవానికి ఈజిప్టియన్ కాలంలో రాసిన మూడు ప్రతుల ఆధారంగా, 4,500 ఏళ్ల కిందటే గర్భవతులని తెలుసుకునేందుకు మూత్ర పరీక్షలు చేసేవారని తెలిసింది.
ఒక మహిళ గర్భవతి లేదా నెల తప్పిందని తెలుసుకునేందుకు ఆమె మూత్రాన్ని కొన్ని రోజుల పాటు గోదుమలు, బార్లీ గింజలపై ఉంచేవారు.
ఒకవేళ బార్లీ గింజలు త్వరగా మొలకెత్తితే బాబు అని, గోదుమలు ముందు మొలకెత్తితే పాప అని నమ్మేవారు.
ఒకవేళ ఏ గింజలు కూడా మొలకెత్తకపోతే, ఆమె గర్భవతి కాదని అనుకునేవారు.
ప్రాచీన కాలంలో మూత్రంతో ఇలాంటి చాలా రకాల పరీక్షలను నిర్వహించారని పరిశోధనలలో తేలింది.
మధ్యయుగ కాలం నుంచి పలు మెడికల్ ప్రిస్క్రిప్షన్స్ ప్రకారం, మహిళల మూత్రంలో సూది ఉంచేవారు. ఒకవేళ మహిళ గర్భవతి అయితే ఆ సూది ఎర్రగా లేదా నల్లగా మారేది.
16వ శతాబ్దంలో ‘నీడిల్’(సూది) అనే పదాన్ని తప్పుగా ఊహించుకుని, ‘నీటెల్’ (దూలగొండు ఆకును) ఉపయోగించారు.
మహిళలు తమ మూత్రంలో రాత్రంతా ఈ ఆకును ఉంచేవారు. ఒకవేళ ఉదయానికల్లా దానిపై ఎర్ర మార్కులు ఏర్పడితే, ఆమె గర్భవతి అని అనుకునేవారు.
డాక్టర్ పర్యవేక్షణలో లేదా సొంతంగానే ఈ పరీక్షలు చేసుకునే వారు.
1518లో లండన్‌లోని రాయల్ కాలేజ్ ఆఫ్ ఫిజిషియన్స్ ఈ వైద్య విధానాలను నిషేధించారు.
దీనిలో యూరోస్కోపీస్(మూత్ర పరీక్ష) కూడా ఉంది. కానీ, కొంత మంది ఈ విధానాలను అనుసరించడం మాత్రం ఆపలేదు.
17వ శతాబ్దం ప్రారంభంలో, మిస్ ఫిలిప్స్ అనే మహిళ యూరోస్కోపీ ద్వారా గర్భవతి అని గుర్తించే విధాన వాడకంపై కోర్టులో కేసు వేసింది.
1590ల్లో లండన్‌లో కాథరీన్ చైర్ అనే మహిళ గర్భవతిని అని తెలుసుకునేందుకు చట్టవిరుద్ధమైన వైద్య విధానాన్ని అనుసరించారు.
సోపు, రెడ్ రోజ్ వాటర్‌తో బట్టలను ఉతకడం ద్వారా ఆమె గర్భవతని తెలుసుకోగలిగినట్లు కాథరీన్ చెప్పారు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
ఆధునిక విధానాలు ఏంటి?
నేడు మనకు తెలిసిన ఎన్నో పరీక్షలు ప్రధానంగా మూత్రం మీద ఆధారపడే జరుగుతున్నాయి.
17వ శతాబ్దం వరకు కూడా మూత్రం ఆధారంగా జరిపే ఈ పరీక్షల్లో ఎన్నో మార్పులు వచ్చినట్లు వైద్య పుస్తకాల్లో తేలింది.
ఒకవేళ మహిళ మూత్రాన్ని కొన్ని రోజుల పాటు మూసివేసిన ఒక కంటైనర్‌లో ఉంచితే... కొన్ని నిర్దిష్ట అంశాలను దానిలో మనం చూడొచ్చని 1656లో ‘కంప్లీట్ ప్రాక్టీస్ ఫర్ మిడ్‌వైవ్స్’ అనే పుసక్తంలో రాశారు.
మూత్రాన్ని మరిగిస్తే, ఒకవేళ వైట్ లైన్స్ కనిపిస్తే మహిళ గర్భవతని తెలుసుకోవడం మరో పద్ధతి.
1930లలో తొలుత ఈ గింజల పరీక్షలను ప్రతిపాదించినప్పుడు, ప్రాచీన ఈజిప్ట్‌లో దీన్ని మ్యాజికల్‌గా అభివర్ణించారు. దాన్ని కొట్టివేయలేదు.
70 శాతం వరకు, గర్భిణిగా ఉన్న మహిళల మూత్రంతో గింజలు మొలకెత్తుతున్నాయని ఒక రీసెర్చ్ టెస్టింగ్ థియరీ గుర్తించింది. కానీ, కడుపులో ఉన్నది బాబా పాపా అని తెలుసుకోవడానికి, దానికీ ఏ సంబంధమూ లేదని తేల్చారు.
గర్భవతి కాని మహిళలు లేదా పురుషుల మూత్రాన్ని వాడినప్పుడు, గింజలలో ఎలాంటి మార్పు కనిపించలేదు.
అంటే గర్భిణీల మూత్రంలో ప్రత్యేకమైన పదార్థాలుంటాయని స్పష్టంగా అర్థమైంది.
రోజ్ వాటర్‌లో బట్టలను ఉతకడం లేదా స్తనాల పరిశీలన కంటే కూడా గింజలు లేదా సూదులు వంటి చారిత్రాత్మక పరీక్షలు మరింత కచ్చితంగా ఉన్నాయని 20వ శతాబ్దపు విచారణలో తేలింది.

ఫొటో సోర్స్, Getty Images
ఎలుకలు, కుందేళ్లు, కప్పల ద్వారా...
1920-30ల మధ్యకాలంలో గర్భధారణ పరీక్షల్లో మరో రకమైన మూత్ర పరీక్ష విధానం అందుబాటులోకి వచ్చింది.
ఎలుకలు, కుందేళ్లు, కప్పలలోకి గర్భిణీల మూత్రాన్ని ఇంజెక్ట్ చేసి, వాటి అండాశయాల్లో మార్పులేమన్నా వచ్చాయో చూసేందుకు వాటిని చంపేవారు.
ఆ తర్వాత ఆఫ్రికన్ కప్పలను కూడా మహిళ గర్భవతో లేదో తెలుసుకోవడం కోసం ఉపయోగించారు. ఒకవేళ మహిళ గర్భవతి అయితే, ఆడ కప్పలు కూడా అండాలను విడుదల చేసేవి.
1950ల వరకు ఈ విధానాలపై పరిశోధనలు సాగాయి. కానీ, ఈ విధానాలన్ని ఖరీదైనవి, 100 శాతం కచ్చితమైనవి కాదని తేలింది.
1960ల్లో నేడు మనకు తెలిసిన యాంటీబాడీల పరీక్షలపై పనిచేయడం ప్రారంభించారు.
ముందు నుంచి మహిళల విషయంలో గర్భధారణ అనేది కీలక పాత్ర పోషిస్తూ వస్తోంది.
వారసత్వం విషయంలో గర్భధారణ పరీక్ష చాలా కీలకం.
ఇవి కూడా చదవండి:
- మోదీ, షీ జిన్‌పింగ్ భేటీలో ఏం జరిగింది... ఇక భారత్-చైనా సరిహద్దులో ఉద్రిక్తతలు తగ్గుతాయా?
- విశాఖ మేయర్ చాంబర్‌కు 100 మీ. దూరంలోని ‘బస్ బే’ ప్రారంభానికి ముందే ఎందుకు కూలిపోయింది?
- విడాకులు తీసుకోవడం ఎలా? ఏయే కారణాలతో అడగొచ్చు?
- ‘స్టాటిక్ షాక్’ అంటే ఏమిటి? హ్యాండ్ షేక్ ఇచ్చినా షాక్ కొట్టినట్లు ఎందుకు అవుతుంది?
- ఆదిత్య L1: సూర్యుడిపై పరిశోధనకు సెప్టెంబరు 2న ఇస్రో ప్రయోగం.. దీని లక్ష్యం ఏమిటి?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














