2024: కొత్త సంవత్సరం వేడుకలు అందరి కన్నా ముందు ఏ ప్రాంతంలో జరుపుకొన్నారు?

2024 సంవత్సరం తలుపు తట్టింది.
అయితే అంతర్జాతీయ టైమ్ లైన్ ప్రకారం, వివిధ దేశాల్లో తేదీలు మారే సమయం కొంత భిన్నంగా ఉంటుంది.
న్యూ ఇయర్ వేడుకలు మొదట మధ్య పసిఫిక్ మహాసముద్రంలోని కిరిబాటి ద్వీపంలో మొదలయ్యాయి.
దీని తరువాత న్యూజిలాండ్‌లోని ఆక్లండ్ స్కైటవర్ వద్ద అద్భుతమైన బాణాసంచా వెలుగులతో కొత్త సంవత్సరాన్ని జరుపుకొన్నారు.
న్యూజిలాండ్‌లో ఉత్తర, దక్షిణాన రెండు ప్రధాన ద్వీపాలు ఉన్నాయి. ఈ రెండింటికి ఒకే కాలరేఖ ఉంది. అంటే దీనర్థం ఈ రెండు ప్రాంతాల్లో ఒకే సమయంలో కొత్త సంవత్సరం ప్రారంభమైందని.
ప్రపంచం మొత్తం గురించి మాట్లాడుకుంటే, క్యాలెండర్ మారేందుకు కొన్ని ప్రాంతాల్లో ఇంకొన్ని గంటలు పడుతుంది.


సిడ్నీ: ఎనిమిదిన్నర టన్నుల బాణసంచా

ఫొటో సోర్స్, EPA-EFE/REX/SHUTTERSTOCK
ఆస్ట్రేలియాలోని సిడ్నీలో కొత్త సంవత్సరం వేడుకలు బ్రహ్మాండంగా జరిగాయి. దాదాపు ఎనిమిదిన్నర టన్నుల బాణాసంచా వెలుగులు విరజిమ్మింది.
హార్బర్ బ్రిడ్జి, ఓపెరా హౌస్‌పై ఉన్న అంబరమంతా మిరుమిట్లు గొలిపింది.
ఈ బాణసంచా వెలుగుల కోసం 15 నెలల ముందుగానే పనులు మొదలయ్యాయి.

దాదాపు 12 నిమిషాల సేపు ఈ వెలుగులు కొనసాగాయి. ఇదే సమయంలో ప్రజలు నృత్యం చేశారు. సిడ్నీతోపాటు కాన్‌బెర్రా, మెల్‌బోర్న్‌లో కూడా కొత్త సంవత్సరం సంబరాలు జరుపుకొన్నారు.
ప్రజలు పరస్పరం నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పుకున్నారు. డాన్సులు చేసేవారిని, బాణసంచా వెలుగులను చూస్తూ సంతోషించారు.
జపాన్‌లో న్యూ ఇయర్

జపాన్‌లోనూ 2024 కొత్త సంవత్సరాన్ని ప్రజలెంతో ఉత్సాహంగా ఆహ్వానించారు.
అర్ధరాత్రి 12 గంటలు కాగానే, దేశవ్యాప్తంగా ఉన్న బౌద్ధాలయాల్లో గంటలు నిరంతరాయంగా మోగాయి.
ప్రతి గుడిలోనూ 108 సార్లు గంటలు మోగాయి. జపాన్ రాజధాని టోక్యోలో ప్రజలంతా తేదీ ఎప్పుడు మారుతుందా అని ఆసక్తిగా ఎదురుచూశారు.
దక్షిణ కొరియా రాజధాని సోల్, ఉత్తర కొరియా రాజధాని ప్యాంగ్యాంగ్‌లోనూ ప్రజలు నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్నారు.
ఇవి కూడా చదవండి:
- 2024: సూపర్ ఎల్ నినో అంటే ఏంటి? దీని ప్రభావంతో భారత్‌లో ఈ ఏడాది కరవు తప్పదా
- తొలిప్రేమ ఎందుకంత మధురం?
- క్రికెట్: ధోనీతో యువ ఆటగాడైన రాబిన్ మింజ్‌ను ఎందుకు పోల్చుతున్నారు? ఐపీఎల్లో తొలి గిరిజన ఆటగాడు ఈయనేనా
- ది గ్రేట్ రిఫ్ట్: భూమిని చీల్చుకుంటూ పుట్టుకొస్తున్న కొత్త మహాసముద్రం
- అయోధ్య రాముడి విగ్రహం కోసం నేపాల్ నుంచి తెచ్చిన భారీ శిలలు ఏమయ్యాయి... వాటితో విగ్రహాలు చేయలేదా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














