పంటబంగన్: తీవ్రమైన ఎండలకు బయటపడిన పట్టణం...

పంటబంగన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, నీళ్ల నుంచి బయటపడ్డ పట్టణాన్ని చూసేందుకు పర్యాటకులు వస్తున్నారు.
    • రచయిత, జోయెల్ గింటో
    • హోదా, బీబీసీ న్యూస్

ఉష్ణోగ్రతలు పెరగడంతో దాదాపు 300 సంవత్సరాల చరిత్ర కలిగిన పట్టణం ఫిలిప్పీన్స్‌లో బయటపడింది. దాని పేరే పంటబంగన్.

1970లలో రిజర్వాయర్‌ను నిర్మించడంతో పంటబంగన్ పట్టణం మునిగిపోయింది.

అయితే, వాతావరణం పొడిగా, వేడిగా ఉన్నప్పుడు చాలా అరుదైన సందర్భాలలో నీటి నుంచి ఈ పంగబంగన్ శిథిలాలు బయటపడుతుంటాయి.

డ్యామ్ నిర్మాణం జరిగిన చాలాయేళ్ల తర్వాత ఈ పట్టణం మళ్లీ నీళ్ల నుంచి బయటపడి కనిపించిందని మర్లోన్ పలాడిన్ అనే ఇంజనీర్ ఏఎఫ్‌పీ వార్తా సంస్థతో అన్నారు.

దేశంలో దాదాపు సగం మంది కరువును ఎదుర్కొంటున్నారు, అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయికి చేరుకుంటున్నాయి.

ఎండల తీవ్రతతో పాఠశాలలు మూసివేశారు, ఉద్యోగులు ఇంటి నుంచే పని చేయాలని అధికారులు సూచించారు. తీవ్రమైన వేడి లక్షలమంది రోజువారీ జీవితాలకు అంతరాయం కలిగిస్తోంది.

రాబోయే రోజుల్లో వేడి పెరగొచ్చని వాతావరణ సంస్థ ‘పగసా’లో శాస్త్రవేత్తగా పని చేస్తున్న బెనిసన్ ఎస్టరేజా బీబీసీ న్యూస్‌తో అన్నారు.

"పెరుగుతున్న ఉష్ణోగ్రతలే ఫిలిప్పీన్స్‌లో వాతావరణ మార్పుకు కారణమవుతాయి. రాబోయే రోజుల్లో ఈ వేడి క్రమంగా పెరుగుతుంది" అని ఎస్టరేజా చెప్పారు.

ఫిలిప్పీన్స్ వెచ్చని, పొడి సీజన్ మధ్యలో ఉంది, ఎల్‌నినో లేదా పసిఫిక్ మహాసముద్రంలో ఉపరితల జలాలు అసాధారణంగా వేడెక్కితే ఉష్ణోగ్రత తీవ్రమవుతుంది.

ఈ దేశపు తూర్పు తీరమంతా పసిఫిక్ సముద్రం వైపు ఉంది.

పంటబంగన్

ఫొటో సోర్స్, Getty Images

పర్యాటక ప్రాంతంగా మారిన పంటబంగన్..

వాతావరణ మార్పుల ప్రభావంతో ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరంగా మారే దేశాలలో ఫిలిప్పీన్స్‌ ఒకటి.

దాని తడి శీతోష్ణస్థితి సీజన్, 2013లో సూపర్ టైఫూన్ హైయాన్ వంటి భారీ తుఫానులు వచ్చాయి. "పంటబంగన్, ఇతర ప్రాంతాలతో సహా ఇక్కడి ఆనకట్ట స్థాయిలు తగ్గుతాయనుకుంటున్నాం" అని ఎస్టరేజా చెప్పారు.

అధికారిక సమాచారం ప్రకారం అక్కడ నీటి మట్టం దాని సాధారణ గరిష్ఠ స్థాయి 221 మీ నుంచి దాదాపు 50 మీటర్ల మేర పడిపోయింది.

ఈ ప్రాంతంలో వర్షం పడకపోవడంతో శిథిలాలు మార్చిలో మళ్లీ కనిపించడం ప్రారంభించాయని ఏఎఫ్‌పీ వార్తా సంస్థకు తెలిపారు మార్లోన్ పలాడిన్.

ఈ పట్టణం రాజధాని మనీలాకు ఉత్తర దిశలో 202 కి.మీ దూరంలో ఉంది. దీంతో పంటబంగన్ పర్యాటకులను ఆకర్షిస్తోంది.

పంటబంగన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, నీళ్ల నుంచి బయటపడిన పంటబంగన్

ఇతర దేశాల్లోనే అదే తీరు....

ఉష్ణోగ్రత తీవ్రతతో ఫిలిప్పీన్స్‌తో పాటు ఇటీవల బంగ్లాదేశ్ కూడా విద్యాసంస్థలను మూసివేసింది.

ఈ ఏడాది జనవరి నుంచి ఏప్రిల్ మధ్య థాయ్‌లాండ్‌లో వడదెబ్బతో 30 మంది మరణించారు. 2023లో 37 మంది మరణించారని ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

మియన్మార్‌లోని సరిహద్దుల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు పైగా పెరిగాయి.

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)