IPL 2025 రిటెన్షన్ లిస్ట్: అత్యధిక ధర ఏ ఆటగాడికంటే..

క్లాసెన్‌ను అట్టిపెట్టుకున్న సన్ రైజర్స్ హైదరాబాద్

ఫొటో సోర్స్, https://x.com/IPL

ఫొటో క్యాప్షన్, హెన్రిచ్ క్లాసెన్ కోసం రూ. 23కోట్లు

ఐపీఎల్ మెగా వేలం నిర్వహణకు ముందు రిటెయిన్ ఆటగాళ్ల జాబితాను ఫ్రాంచైజీలు విడుదల చేశాయి. ఒక్కో జట్టు ఆరుగురు ఆటగాళ్లను రిటెయిన్ చేసుకునే సౌలభ్యం ఉంది. వారిలో కనీసం ఒకరు అన్‌క్యాప్‌డ్ ప్లేయర్ అయ్యుండాలి.

కోల్‌కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ ఆరుగురు ఆటగాళ్లను రిటెయిన్ చేసుకోగా, పంజాబ్ కింగ్స్ ఎలెవన్ అందరికన్నా తక్కువగా కేవలం ఇద్దరు ప్లేయర్లనే రిటెయిన్ చేసుకుంది.

కిందటిసారి వేలంలో ఆస్ట్రేలియా ఆటగాళ్ల కోసం భారీగా ఖర్చుపెట్టిన సన్ రైజర్స్ ఈ సారి హెన్రిచ్ క్లాసెన్‌‌ను రిటెయిన్ చేసుకోవడానికి రూ.23 కోట్లు వెచ్చించింది.

అన్ క్యాప్‌డ్ ప్లేయర్ జాబితాలో ఉన్న ధోనీ నాలుగు కోట్లతో చెన్నై సూపర్ కింగ్స్‌కు కొనసాగనున్నాడు.

రోహిత్ శర్మ, హార్థిక్ పాండ్యాను ముంబై ఇండియన్స్, కోహ్లీని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ కొనసాగిస్తున్నాయి. కే ఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్, గ్లెన్ మాక్స్‌వెల్ వంటి ఆటగాళ్లను ఆయా జట్లు రిటెయిన్ చేసుకోలేదు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
అన్‌క్యాప్‌డ్ ప్లేయర్‌గా ధోనీ

ఫొటో సోర్స్, https://www.chennaisuperkings.com

ఫొటో క్యాప్షన్, ఐదుగురు ఆటగాళ్లను రిటెయిన్ చేసుకున్న చెన్నై

రుతురాజ్ గైక్వాడ్‌కు రూ.18కోట్లు

ఐపీఎల్ 2025 కోసం చెన్నై సూపర్ కింగ్స్ ఐదుగురు ఆటగాళ్లను రిటెయిన్ చేసింది.

అన్ క్యాప్‌డ్ ప్లేయర్‌గా మహేంద్ర సింగ్ ధోనీని 4కోట్ల రూపాయలతో చెన్నై సూపర్ కింగ్స్ రిటెయిన్ చేసుకుంది.

ధోనితోపాటు...

రుతురాజ్ గైక్వాడ్(రూ.18కోట్లు)

రవీంద్ర జడేజా(రూ.18కోట్లు)

మతీషా పతిరాన(రూ.13కోట్లు)

శివమ్ దూబే(రూ.12 కోట్లు) రిటెయిన్ చేసుకుంది.

రూ.16.50కోట్లతో అక్సర్ పటేల్‌‌ను రిటెయిన్ చేసుకున్న ఢిల్లీ క్యాపిటల్స్

ఫొటో సోర్స్, https://www.iplt20.com/teams/delhi-capitals

ఫొటో క్యాప్షన్, రిషబ్ పంత్‌ను రిటెయిన్ చేసుకోని దిల్లీ క్యాపిటల్స్

రిషబ్ పంత్‌‌ను రిటెయిన్ చేయని దిల్లీ క్యాపిటల్స్

దిల్లీ క్యాపిటల్స్‌లో అధిక ధర అక్షర్ పటేల్‌కు దక్కింది. రిషబ్ పంత్‌ను దిల్లీ క్యాపిటల్స్ రిటెయిన్ చేసుకోలేదు.

దిల్లీ క్యాపిటల్స్ రిటెయిన్ చేసుకున్న ఆటగాళ్ల జాబితా

అక్షర్ పటేల్ (రూ.16.50కోట్లు)

కుల్‌దీప్ యాదవ్‌ (రూ.13.25కోట్లు)

ట్రిస్టన్ స్టబ్స్‌ (రూ.10కోట్లు)

అభిషేక్ పోరల్ (రూ.4కోట్లు)

ఐపీఎల్, రిటెయిన్ లిస్ట్

ఫొటో సోర్స్, https://www.iplt20.com/teams/gujarat-titans

ఫొటో క్యాప్షన్, ఐదుగురిని రిటెయిన్ చేసుకున్న గుజరాత్

రషీద్‌ఖాన్‌ కోసం రూ.18కోట్లు

ఫైవ్ రిటెయిన్ టైటాన్స్ పేరుతో గుజరాత్ టైటాన్స్ కొనసాగిస్తున్న ఆటగాళ్ల జాబితాను ప్రకటించింది.

రషీద్ ఖాన్(రూ.18 కోట్లు)

శుభ్‌మన్ గిల్(రూ.16.50కోట్లు)

సాయి సుదర్శన్(రూ.8.50కోట్లు)

రాహుల్ తెవాటియా(రూ.4కోట్లు)

షారూఖ్‌ఖాన్ (రూ.4కోట్లు)

ఐపీఎల్, రిటెయిన్ లిస్ట్

ఫొటో సోర్స్, https://x.com/IPL

ఫొటో క్యాప్షన్, ఆరుగురు ఆటగాళ్లను రిటెయిన్ చేసుకున్న కోల్‌కతా

కోల్‌కతా నైట్ రైడర్స్‌లో ఆరుగురు...

కోల్‌కతా నైట్ రైడర్స్ ఆరుగురు ఆటగాళ్లను రిటెయిన్ చేసుకుంది.

ఆండ్రూ రసెల్ (రూ.12కోట్లు)

సునీల్ నరైన్ (రూ.12కోట్లు)

రింకూ సింగ్ (రూ.13కోట్లు)

వరుణ్ చక్రవర్తి (రూ.12కోట్లు)

హర్షిత్ రానా(రూ.4కోట్లు) (అన్‌క్యాప్డ్ ప్లేయర్)

రమణదీప్ సింగ్‌(రూ.4కోట్లు) (అన్‌క్యాప్డ్ ప్లేయర్)

రిటెయిన్ కాని కేఎల్

లక్నో సూపర్ జెయింట్స్ ఐదుగురు ఆటగాళ్లను కొనసాగిస్తోంది. కెప్టెన్ కే ఎల్ రాహుల్‌ రిటెయిన్ జాబితాలో లేడు.

నికోలస్ పూరన్ (రూ.21కోట్లు)

మయాంక్ యాదవ్ (రూ.11కోట్లు)

రవి బిష్ణోయ్(రూ.11కోట్లు)

మొహ్‌సిన్ ఖాన్ (రూ.4కోట్లు) (అన్‌క్యాప్‌డ్ ప్లేయర్)

అయుష్ బదోని (రూ.4కోట్లు)(అన్‌క్యాప్‌డ్ ప్లేయర్)

బుమ్రా కోసం రూ.18కోట్లు

ఫొటో సోర్స్, https://www.mumbaiindians.com

ఫొటో క్యాప్షన్, ఐదుగురిని రిటెయిన్ చేసిన ముంబై ఇండియన్స్

బుమ్రా కోసం రూ.18కోట్లు

కెప్టెన్ హార్థిక్ పాండ్యతో పాటు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మను ముంబై ఇండియన్స్ రిటెయిన్ చేసుకుంది. అయితే ఎక్కువ డబ్బు మాత్రం బుమ్రా కోసం ఖర్చు పెట్టింది.

జస్పిత్ బుమ్రా (రూ.18కోట్లు)

సూర్యకుమార్ యాదవ్ (రూ.16.35కోట్లు)

హార్థిక్ పాండ్య (రూ.16.35కోట్లు)

రోహిత్ శర్మ (రూ.16.30కోట్లు)

తిలక్ వర్మ (రూ.8కోట్లు)

పంజాబ్ కింగ్స్‌లో ఇద్దరే

పంజాబ్ కింగ్స్ ప్రభ్‌సిమ్రన్ సింగ్, శశాంక్ సింగ్‌ను రిటెయిన్ చేసుకుంది.

ప్రభ్‌సిమ్రన్ సింగ్ (రూ.4కోట్లు)

శశాంక్ సింగ్‌ (రూ.5.50కోట్లు)

సంజు, యశస్వికి రూ.18కోట్లు

రాజస్థాన్ రాయల్స్ ఆరుగురు ఆటగాళ్లను రిటెయిన్ చేసుకుంది

సంజు శాంసన్ (రూ.18కోట్లు)

యశస్వి జైశ్వాల్ (రూ.18కోట్లు)

రియాన్ పరాగ్ (రూ.14కోట్లు)

ధ్రువ్ జురెల్ (రూ.14కోట్లు)

షిమ్రోన్ హెట్‌మెయర్ (రూ.11కోట్లు)

సందీప్ శర్మ (రూ.4కోట్లు) (అన్‌క్యాప్‌డ్ ప్లేయర్)

ఐపీఎల్, రిటెయిన్ లిస్ట్

ఫొటో సోర్స్, https://www.royalchallengers.com/

ఫొటో క్యాప్షన్, రూ.21 కోట్లతో ఆర్సీబీ కోహ్లీని రిటెయిన్ చేసుకుంది

కోహ్లీ కోసం రూ.21కోట్లు

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ ముగ్గురి ఆటగాళ్లను రిటెయిన్ చేసుకున్నట్టు తెలిపింది.

విరాట్ కోహ్లి (రూ.21కోట్లు)

రజత్ పటిదార్ (రూ.11కోట్లు)

యశ్ దయాల్ (రూ.5కోట్లు)

మళ్లీ భారీగా ఖర్చుపెట్టిన సన్ రైజర్స్

సన్ రైజర్స్ హైదరాబాద్ ఐదుగురు ఆటగాళ్లను రిటెయిన్ చేసుకుంది.

హెన్రిక్ క్లాసెన్‌కు అత్యధికంగా 23కోట్లు ఖర్చుపెట్టింది.

పాట్ కమిన్స్ (రూ.18కోట్లు)

అభిషేక్ శర్మ(రూ.14కోట్లు)

నితిశ్ రెడ్డి (రూ.6కోట్లు)

హెన్రిక్ క్లాసెన్(రూ.23 కోట్లు)

ట్రావిస్ హెడ్(రూ.14కోట్లు)

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)