నాలుగు కాళ్లతో పుట్టిన బాలుడికి వైద్యులు ఆ భారం ఎలా తొలగించారు?

ఎయిమ్స్‌, వైద్యులు
    • రచయిత, అన్షుల్ సింగ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

నేను మోహిత్ కుమార్‌ని మొదటిసారి కలిసినప్పుడు, తన రెండు చేతులతో చొక్కా ముందు భాగాన్ని పట్టుకుని ఉన్నాడు.

మోహిత్ గత 17 ఏళ్లుగా ఇలాగే చేస్తున్నాడు. ఇలా చేయడం మోహిత్‌కి అలవాటయిపోయింది.

ఈ అలవాటుకి కారణం ఏమిటంటే, మోహిత్‌కు కొన్ని రోజుల క్రితం వరకు నాలుగు కాళ్లు ఉండేవి.

కానీ, ఇప్పుడు అలా చొక్కాను పట్టుకుని ఉండాల్సిన అవసరం లేదు.

(హెచ్చరిక: కొన్ని ఫోటోలు, వివరాలు మిమ్మల్ని కలవరపెట్టవచ్చు.)

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ఫిబ్రవరిలో మోహిత్‌కి ఆపరేషన్ జరిగింది. అదనంగా ఉన్న రెండు కాళ్లను ఆయన శరీరం నుంచి తొలగించారు.

ఈ అరుదైన శస్త్రచికిత్సను దిల్లీలోని ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) వైద్యులు నిర్వహించారు.

తన కడుపు దగ్గర ఉన్న రెండు అదనపు కాళ్లను తొలగించారంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నారు ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌కు చెందిన మోహిత్.

"నాకు నాలుగు కాళ్లు ఉండేవి. వాటిని తొలగించలేరని నేను అనుకున్నాను, ఇక్కడికి (AIIMS) వచ్చినప్పుడు చాలా భయపడ్డాను కానీ వైద్యులు వాటిని తొలగించారు" అని మోహిత్ చెప్పారు.

"ఇప్పుడు నాకు ఆనందంగా ఉంది. నా పొట్ట మీద నుంచి పెద్ద బరువు దిగిపోయినట్లు అనిపిస్తుంది."

వైద్య శాస్త్ర భాషలో ఇలాంటి కేసులను పారసైటిక్ ట్విన్స్ అని అంటారు.

మోహిత్ శరీరంలో రెండు అదనపు కాళ్లు, పిరుదులు, బాహ్య జననేంద్రియాలు, ఛాతీ ధమనులకు అతుక్కుని ఉన్నాయి. ఆ కాళ్ల బరువు 15 కిలోగ్రాముల వరకు ఉంది.

ఎయిమ్స్‌లోని సర్జరీ విభాగం అదనపు ప్రొఫెసర్ డాక్టర్ అసురి కృష్ణ నేతృత్వంలోని వైద్యుల బృందం ఫిబ్రవరి 8న రెండు గంటలకు పైగా శస్త్రచికిత్స నిర్వహించింది.

పారసైటిక్ ట్విన్స్ గురించి డాక్టర్ అసురి కృష్ణ బీబీసీతో మాట్లాడుతూ.. "అండం, స్పెర్మ్ కలిసినప్పుడు, ఒక జైగోట్(సంయుక్త జీవకణము) ఏర్పడుతుంది. సాధారణంగా ఈ జైగోట్ క్రమంగా బేబీగా అభివృద్ధి చెందుతుంది" అని అన్నారు.

"కొన్నిసార్లు ఇది ప్రారంభంలోనే రెండు భాగాలుగా విడిపోతుంది. దీని వల్ల కవలలు పుడతారు."

"కొన్నిసార్లు వాటిని పూర్తిగా తొలగించలేని పరిస్థితి తలెత్తుతుంది. ఎందుకంటే ఆ కణాలు ఒకదానికొకటి అతుక్కుని ఉంటాయి, కానీ పూర్తి బేబీగా అభివృద్ధి చెందుతాయి. ఈ పరిస్థితిలో అవిభక్త కవలలు పుడతారు అని ఆయన అన్నారు.

"మోహిత్ కేసులో ఇద్దరు పిల్లలను వేరు చేసినట్టుకాదు, ఎందుకంటే ఒక బేబీ పూర్తిగా అభివృద్ధి చెందలేదు. ఫలితంగా ఒకరు పూర్తి బేబీగా మారారు, మరొకరు పారసైటిక్ ట్విన్‌గా మోహిత్‌కి అతుక్కుపోయారు."

"ఈ పారసైటిక్ ట్విన్... పూర్తిగా అభివృద్ధి చెందిన బేబీనుండి రక్తం, పోషకాలు తీసుకుంటుంది."

అయితే ఇక్కడ చెపుకోవలసిన విషయం ఏమిటంటే, పారసైటిక్ ట్విన్ అవయవాలు నొప్పి, స్పర్శతో పాటు వాతావరణంలో మార్పులను కూడా అనుభూతి చెందుతాయి.

ప్రపంచవ్యాప్తంగా పారసైటిక్ ట్విన్స్ కేసులు 40-50 మాత్రమే నమోదయ్యాయని, ఆ కేసులలో కూడా పిల్లలకు శస్త్రచికిత్స చేయడానికి ప్రయత్నించామని డాక్టర్ కృష్ణ బీబీసీకి చెప్పారు.

AIIMS

ఫొటో సోర్స్, Getty Images

ఎయిమ్స్‌లోని సర్జరీ విభాగం అదనపు ప్రొఫెసర్ డాక్టర్ అసురి కృష్ణ నేతృత్వంలోని వైద్యుల బృందం ఫిబ్రవరి 8న రెండు గంటలకు పైగా శస్త్రచికిత్స నిర్వహించింది.

పారసైటిక్ ట్విన్స్ గురించి డాక్టర్ అసురి కృష్ణ బీబీసీతో మాట్లాడుతూ, "అండం, స్పెర్మ్ కలిసినప్పుడు, ఒక జైగోట్(సంయుక్త జీవకణము) ఏర్పడుతుంది. సాధారణంగా ఈ జైగోట్ క్రమంగా బేబీగా అభివృద్ధి చెందుతుంది" అని అన్నారు.

"కొన్నిసార్లు ఇది ప్రారంభంలోనే రెండు భాగాలుగా విడిపోతుంది. దీని వల్ల కవలలు పుడతారు."

"కొన్నిసార్లు వాటిని పూర్తిగా తొలగించలేని పరిస్థితి తలెత్తుతుంది. ఎందుకంటే ఆ కణాలు ఒకదానికొకటి అతుక్కుని ఉంటాయి, కానీ పూర్తి బేబీగా అభివృద్ధి చెందుతాయి. ఈ పరిస్థితిలో, అవిభక్త కవలలు పుడతారు అని ఆయన అన్నారు.

"మోహిత్ కేసులో ఇద్దరు పిల్లలను వేరు చేసినట్టుకాదు, ఎందుకంటే ఒక బేబీ పూర్తిగా అభివృద్ధి చెందలేదు. ఫలితంగా ఒకరు పూర్తి బేబీగా మారారు, మరొకరు పారసైటిక్ ట్విన్‌గా మోహిత్‌కి అతుక్కుపోయారు."

"ఈ పారసైటిక్ ట్విన్... పూర్తిగా అభివృద్ధి చెందిన బేబీనుండి రక్తం, పోషకాలు తీసుకుంటుంది."

అయితే ఇక్కడ చెపుకోవలసిన విషయం ఏమిటంటే, పారసైటిక్ ట్విన్ అవయవాలు నొప్పి, స్పర్శతో పాటు వాతావరణంలో మార్పులను కూడా అనుభూతి చెందుతాయి.

ప్రపంచవ్యాప్తంగా పారసైటిక్ ట్విన్స్ కేసులు 40 నుంచి 50 మాత్రమే నమోదయ్యాయని, ఆ కేసులలో కూడా పిల్లలకు శస్త్రచికిత్స చేయడానికి ప్రయత్నించామని డాక్టర్ కృష్ణ బీబీసీకి చెప్పారు.

శస్త్రచికిత్స, మోహిత్ కుమార్

ఫొటో సోర్స్, BBC/TARIQ KHAN

ఫొటో క్యాప్షన్, శస్త్రచికిత్సకు ముందు మోహిత్ కుమార్.

కడుపు లోపల నుండి రెండు కాళ్లు బయటకు రావడం వల్ల బిడ్డ పెరుగుదలపై ప్రభావం పడుతోందని శస్త్రచికిత్స చేసిన వైద్యుల బృందం తెలిపింది.

ఈ అదనపు కాళ్లు శరీరంలోని ఇతర భాగాలకు హాని కలిగించవచ్చు, కాబట్టి శస్త్రచికిత్స చేసి తొలగించాల్సి ఉంటుంది.

ఈ పారసైటిక్ ట్విన్ మోహిత్ ఛాతీ ఎముకకు అనుసంధానించబడి ఉందని, ఛాతీ సిర నుంచి రక్తం పొందుతోందని సీటీ స్కాన్‌లో గుర్తించారు.

"ఆపరేషన్ సమయంలో పారసైటిక్ ట్విన్ భాగాన్ని తొలగించిన వెంటనే 30-40 శాతం రక్తం శరీరం నుంచి పోయింది. దాంతో మోహిత్ రక్తపోటు పడిపోయింది." అని డాక్టర్ కృష్ణ తెలిపారు.

"ఇలా జరుగుతుందని మేం ముందుగానే ఊహించాం అందుకే సిద్ధంగా ఉన్నాం. వెంటనే రక్తపోటు సాధారణ స్థాయికి తెచ్చాం అని చెప్పారు. అయితే ఈ సమయంలో, ఏ అవయవం లేదా కణజాలం దెబ్బతినకుండా మేం జాగ్రత్త తీసుకోవలసి వచ్చింది."అని ఆయన అన్నారు.

దీని తరువాత వైద్యులు కడుపు లోపల ఉన్న తిత్తిని తొలగించారు.

రేడియాలజిస్టులు, అనస్థీషియా నిపుణులు, ప్లాస్టిక్ సర్జన్లతో కూడిన వైద్యుల బృందం ఈ ఆపరేషన్ చేసింది. నాలుగు రోజుల తర్వాత రోగిని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు.

వైద్యులు

ఫొటో సోర్స్, BBC/TARIQ KHAN

ఫొటో క్యాప్షన్, మోహిత్‌కు నాలుగు కాళ్ళు ఉండటం వల్ల చదువు మధ్యలోనే ఆపేయాల్సి వచ్చిందని మోహిత్ తండ్రి చెప్పారు.

మోహిత్ నాలుగు నెలల వయసులో తన తల్లిని కోల్పోయారు. తండ్రి ముఖేష్ కుమార్ కశ్యప్ చిన్నప్పటి నుండి మోహిత్‌ని జాగ్రత్తగా చూసుకుంటున్నారు.

నాలుగు కాళ్లు ఉండటం వల్ల మోహిత్ శారీరక సమస్యలు మాత్రమే కాకుండా సామాజిక సవాళ్లను కూడా ఎదుర్కోవలసి వచ్చింది.

"మోహిత్‌ని స్కూల్‌కి పంపినప్పుడు, ఇతర పిల్లలతో గొడవలు జరిగేవి. తనను ఇబ్బంది పెడుతున్నారని, అందరూ నాలుగు కాళ్లు అని ఎగతాళి చేస్తున్నారని నాతో చెప్పి బాధ పడేవాడు, దాంతో స్కూల్‌ మాన్పించేశాను" మోహిత్ తండ్రి ముఖేష్ కుమార్ చెప్పారు.

దాంతో మోహిత్ 8వ తరగతి మధ్యలోనే తన చదువును ఆపేయాల్సివచ్చింది. ఇప్పుడు పాత రోజులను మరచిపోయి మళ్లీ చదువుకోవాలనుకుంటున్నారు మోహిత్.

"ఒక భారం తొలగిపోయినట్లు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు నేను ఇతర పిల్లల్లాగే కనిపిస్తాను అని మోహిత్ ఆనందం వ్యక్తం చేశారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)