Argentina vs France: అర్జెంటీనాకు యువ ఆటగాడు జులియన్ అల్వారెజ్ ఎలా కీలకం అయ్యాడు

ఫుట్ బాల్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, ఆండీ క్రియర్
    • హోదా, బీబీసీ స్పోర్ట్స్, దోహా నుంచి

జులియన్ అల్వారెజ్. 22 ఏళ్ల అర్జెంటీనా ఫుట్‌బాల్ క్రీడాకారుడు.

సెమీఫైనల్‌లో క్రొయేషియాతో జరిగిన మ్యాచ్‌లో రెండు గోల్స్ సాధించాడు. అర్జెంటీనా ప్రపంచకప్ ఫైనల్ చేరడంలో కీలక పాత్ర పోషించాడు.

మ్యాచ్ అనంతరం జులియన్ గురించి కెప్టెన్ లియొనల్ మెస్సీ మాట్లాడుతూ.. ‘‘అద్భుతం, అసాధారణం’’ అని అభివర్ణించారు.

మాంచెస్టర్ సిటీ ఆటగాడైన అల్వారెజ్ తన వరల్డ్‌కప్ గోల్స్ సంఖ్యను నాలుగుకు పెంచుకున్నారు. అయిదు గోల్స్‌తో టాప్ ప్లేస్‌లో సహచరుడు మెస్సీ, ఫ్రాన్స్ ఆటగాడు కైలియన్ ఎంబాపే ఉన్నారు.

చివరిసారి 1986 ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా, ఆదివారం ఫ్రాన్స్‌తో టైటిల్ పోరులో తలపడనుంది.

జులియన్ తన ఆటతో ఇంత ముఖ్యమైన వ్యక్తి అవుతాడని ఎవరూ అనుకుని ఉండరని మెస్సీ అన్నాడు.

''అతను మాకు అందించిన సాయం కచ్చితంగా అద్భుతమైంది'' అని చెప్పాడు మెస్సీ. 

మెస్సీ

ఫొటో సోర్స్, Getty Images

ఖతార్ మీడియా హెడ్‌లైన్లలో 35 ఏళ్ల మెస్సీకే ప్రాముఖ్యత దక్కింది. మెస్సీకి ఆఖరి ప్రపంచకప్‌గా భావిస్తున్న ఈ టోర్నీలో అతడు అద్భుత ప్రదర్శన కనబరిచాడు.

ఇప్పటికే మెస్సీ ఐదు గోల్స్ చేశారు. అర్జెంటీనా సాధించిన మిగతా 12 గోల్స్‌లో మూడింటిలో భాగస్వామ్యం అయ్యారు. అయితే అల్వారెజ్ ఆటతో అతనికి కొద్దిగా వార్తల్లో ప్రాచుర్యం తగ్గింది.

ఈ యువ స్ట్రైకర్ ప్రపంచకప్‌లో అర్జెంటీనా తరపున ప్రముఖంగా కనిపిస్తారని ఊహించలేదు.

అల్వారెజ్ సౌదీ అరేబియా (ఓటమి), మెక్సికో (గెలుపు)లతో జరిగిన మ్యాచ్‌లలో సబ్‌స్టిట్యూట్‌గా ఆడాడు. కోచ్ లియోనెల్ స్కాలనీ కూడా మొదట్లో ఇంటర్ మిలన్‌కు చెందిన లౌటరో మార్టినెజ్‌కే ప్రాధాన్యత ఇచ్చారు. 

అల్వారెజ్ నాలుగు మ్యాచ్‌ల నుంచే ఆడుతున్నప్పటికీ సెమీ‌ఫైనల్ (3-0) విజయంలో తన ఉత్తమ ప్రదర్శన కనబరిచాడు.

చివరి రెండు గోల్స్ కొట్టడానికి ముందు మెస్సీ పెనాల్టీ‌ కారణంగా కనిపించలేదు.

''మొత్తం ప్రపంచకప్‌లో, గత మంగళవారం కూడా అతను అసాధారణంగా కనిపించాడు'' అని మెస్సీ అన్నారు.

''అతను మా కోసం చేయాల్సిందంతా చేశాడు. ప్రతిదాని కోసం పోరాడాడు, అవకాశాలను సృష్టించాడు. అతను ప్రతీదానికి అర్హుడు ఎందుకంటే అతనొక అశ్చర్యకరమైన ఆవిష్కరణ, అందమైన వ్యక్తి కాబట్టి'' అని స్పష్టం చేశాడు కెప్టెన్.

మెస్సీ

ఫొటో సోర్స్, Getty Images

మాజీ ఆటగాళ్లు ఏమంటున్నారు?

జనవరి 2022లో రివర్ ప్లేట్ నుంచి మాంచెస్టర్ సిటీ దాదాపు రూ. 149 కోట్లు ఇచ్చి అల్వారెజ్‌‌ను కొనుక్కుంది.

మాంచెస్టర్‌తో అల్వారెజ్ ఒప్పందం ఐదున్నరేళ్లు ఉండనుంది. అయితే లోన్‌లో భాగంగా అర్జెంటీనా చాంపియన్స్ తరఫున అతను ఈ ఏడాది జూలై వరకు ఆడారు.

ఈ సీజన్‌లో అతను 12 ప్రీమియర్ లీగ్‌లలో పాల్గొన్నారు. అయితే ఎక్కువగా సబ్‌స్టిట్యూట్‌గానే ఉన్నా మూడు గోల్స్ సాధించారు.

మాజీ అర్జెంటీనా, సిటీ డిఫెండర్ పాబ్లో జబాలెటా బీబీసీ స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ.. ''అతని పని తీరు నమ్మశక్యంగా లేదు'' అని అన్నారు.

అతను మెస్సీతో కలిసి ఆడుతున్నాడని, అయితే బయటి నుంచి అతను మాత్రం మెస్సీ పరిగెత్తకండి, నేను మీ కోసం చేస్తానని అంటున్నాడని పాబ్లో చెప్పారు.

ఫుట్‌బాల్

ఫొటో సోర్స్, Getty Images

''అలా చేయడానికి విశాల హృదయం ఉండాలి. ప్రపంచకప్‌లో అతను బెంచ్ నుంచే మొదలుపెట్టాడు. ఒక అవకాశం పొందాడు. తెలివిగా ఆడాడు'' అని వ్యాఖ్యానించారు పాబ్లో.

మాజీ ఇంగ్లండ్ మిడ్‌ఫీల్డర్ జెర్మైన్ జెనాస్ స్పందిస్తూ.. " ఇంత చిన్న వయస్సులో అలాంటి వేదికపై తన దేశం కోసం ఆ సమయంలో అంత గొప్ప ప్రదర్శన చేయడం నమ్మశక్యంగా లేదు" అని అన్నారు. 

ఖతార్‌లో అల్వారెజ్ ఆటతీరు చూసిన మాంచెస్టర్ సిటీ అభిమానులు రాబోయే రోజులు ఏం జరుగుతుందోనని ఆతృతగా ఎదురుచూస్తుంటారు. అతను 8 అంతర్జాతీయ మ్యాచ్‌లలో 7 గోల్స్ చేశాడు.

2010లో గొంజాలో హిగ్వైన్ తర్వాత 22 లేదా అంతకంటే తక్కువ వయస్సులో ప్రపంచ‌కప్‌లో 4 గోల్స్ చేసిన రెండో అర్జెంటీనా ఆటగాడిగా అల్వారెజ్ నిలిచారు.

1958లో ఫ్రాన్స్‌పై 5-2తో బ్రెజిల్ లెజెండ్ పీలే హ్యాట్రిక్ సాధించిన తర్వాత ప్రపంచ‌కప్ సెమీ‌ఫైనల్‌లో ఒకటి కంటే ఎక్కువ గోల్స్ చేసిన అతి పిన్న వయసుగల ఆటగాడిగా కూడా ఆయన నిలిచారు.

వీడియో క్యాప్షన్, డేవిడ్ బెక్‌హమ్: 12 గంటలకు పైగా క్యూలో నిలబడి క్వీన్ ఎలిజబెత్ 2కు నివాళులు

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)