షారూఖ్ ఖాన్: ‘సోషల్ మీడియా వ్యతిరేక పోకడలు విభజన పూరితం, విధ్వంసకరం’

సోషల్ మీడియా వినియోగంలో వ్యతిరేకతాభావం పెరిగిందని, కానీ అది తన వంటి వారి మీద ప్రభావం చూపబోదని, తాము సానుకూలదృక్పథంతోనే ఉంటామని బాలీవుడ్ నటుడు షారూఖ్ ఖాన్ పేర్కొన్నారు.

లైవ్ కవరేజీ

  1. నేటి లైవ్ పేజీ అప్‌డేట్స్ సమాప్తం

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్‌పేజీ అప్‌డేట్స్‌ను ఇంతటితో ముగిస్తున్నాం.

    స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్‌డేట్స్‌తో మళ్లీ రేపు ఉదయం కలుద్దాం.

  2. భారత్, పాకిస్తాన్ సరిహద్దుల్లో 7 కిలోమీటర్ల పొడవైన లఖ్‌పత్ కోట గురించి మీకు తెలుసా?

  3. షారూఖ్ ఖాన్: ‘సోషల్ మీడియా వ్యతిరేక పోకడలు విభజన పూరితం, విధ్వంసకరం’

    షారూఖ్ ఖాన్, అమితాబ్ బచ్చన్

    ఫొటో సోర్స్, ANI

    సోషల్ మీడియా వినియోగంలో వ్యతిరేకతాభావం పెరిగిందని, కానీ అది తన వంటి వారి మీద ప్రభావం చూపబోదని, తాము సానుకూలదృక్పథంతోనే ఉంటామని బాలీవుడ్ నటుడు షారూఖ్ ఖాన్ పేర్కొన్నారు.

    పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో గురవారం సాయంత్రం 28వ ఇంటర్నేషనల్ కోల్‌కతా ఫిల్మ్ ఫెస్టివల్ ప్రారంభోత్సవంలో ఆయన ప్రసంగించారు.

    ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో పాటు సినీనటులు అమితాబ్ బచ్చన్, జయా బచ్చన్, మహేష్‌బాబు, రాణి ముఖర్జీ, క్రికెటర్ సౌరవ్ గంగూలీ తదితరులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 1

    ‘‘సోషల్ మీడియాలో తరచుగా.. మానవ స్వభావాన్ని అత్యంత హీనస్థాయికి పరిమితం చేసే ఒక తరహా సంకుచిత అభిప్రాయం నడుస్తుంటుంది. వ్యతిరేకతాభావం వల్ల సోషల్ మీడియా వినియోగం పెరుగుతుందని నేను ఎక్కడో చదివాను. అలాంటి పోకడలు.. విభజన పూరితంగా, విధ్వంసపూరితంగా ఉండే ఒక ఉమ్మడి కథనాన్ని తయారు చేస్తాయి’’ అని షారూఖ్ వ్యాఖ్యానించారు.

    ‘‘ప్రపంచం ఏం చేసినా సరే మా వంటి వాళ్లు సానుకూల దృక్పథంతోనే ఉంటారు’’ అని చెప్పారు.

    షారూఖ్ ఖాన్, దీపికా పడుకోన్ నటించిన తాజా చిత్రం ‘పఠాన్’లోని ఒక పాట ‘బేషరమ్ రంగ్’ తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అయింది. దానితోపాటే ఆ సినిమాను బాయ్‌కాట్ చేయాలనే డిమాండ్లు కూడా పెరగటం మొదలైంది.

    దిపికా, షారూఖ్‌ల డ్యూయట్‌ అయిన ఆ పాటలో ఒక చోట దీపికా కాషాయ రంగు బికినీ ధరించి కనిపిస్తుంది. ఈ పాట అశ్లీలంగా ఉందని కొందరు విమర్శించారు. ఇంకొందరు ఇది హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందని మండిపడ్డారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 2

    అమితాబ్ బచ్చన్ సుదీర్ఘంగా ప్రసంగిస్తూ.. బ్రిటిష్ కాలం నాటి సెన్సార్‌షిప్ గురించి మాట్లాడారు. స్వాతంత్ర్యానికి ముందు అణచివేతదారులకు వ్యతిరేకంగా, మతతత్వానికి వ్యతిరేకంగా, సామాజిక సామరస్యం కోసం రూపొందించిన సినిమాల గురించి చెప్పారు. పౌర స్వాతంత్ర్యాలు, భావప్రకటనా స్వాతంత్ర్యాల మీద ఇప్పుడు కూడా ప్రశ్నలు లేవనెత్తుతున్నారని పేర్కొన్నారు.

    ఇదిలావుంటే.. దర్శకుడు మహేష్ భట్ మాట్లాడుతూ ‘‘ప్రస్తుత రాజకీయ అనిశ్చితి కాలంలో భారతదేశపు పిల్లలు పశ్చిమ దేశాల ఆలోచనలను తిరస్కరించటానికి ప్రయత్నిస్తున్నారు. అది వారు పశ్చిమ దేశాల నుంచి నేర్చుకున్న పాఠం. అది మన కార్యక్రమం కాదు. భారతదేశం అన్ని జాతులనూ ఐక్యం చేసే దేశం. ఠాగూర్ చెప్పిన ఆ మాటలు భారతీయులందరి హృదయాల్లో మార్మోగాలి’’ అని వ్యాఖ్యానించారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 3
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 3

    అమితాబ్ బచ్చన్ బెంగాల్‌కు చెందిన వ్యక్తి కాకపోయినప్పటికీ.. సినిమా రంగానికి ఆయన చేసిన కృషికి గాను ఆయనను భారత రత్నతో గౌరవించాలని తాము డిమాండ్ చేస్తామని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చెప్పారు.

  4. అగ్ని-5 బాలిస్టిక్ క్షిపణిని రాత్రివేళ విజయవంతంగా పరీక్షించిన భారత్

    అగ్ని-5 క్షిపణి

    ఫొటో సోర్స్, ANI

    ఫొటో క్యాప్షన్, అగ్ని-5 క్షిపణి ప్రతీకాత్మక చిత్రం

    అణ్వాయుధాలను మోసుకెళ్లగల అగ్ని-5 బాలిస్టిక్ మిసైల్‌ను భారతదేశం రాత్రిపూట ప్రయోగించే పరీక్షను విజయవంతంగా నిర్వహించింది. ఈ క్షిపణి 5,000 కిలోమీటర్లకు పైగా దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు.

    ‘‘కొత్త సాంకేతిక పరిజ్ఞానం, పరికరాలతో ఈ క్షిపణి బరువు గతంకన్నా తగ్గింది. ఈ కొత్త టెక్నాలజీ, పరికరాల పనితీరును రూఢి చేసుకోవటానికి ఈ పరీక్షను నిర్వహించాం. అగ్ని-5 క్షిపణి పరిధిని పెంచగలిగే సామర్థ్యాన్ని ఈ పరీక్ష నిరూపించింది’’ అని సంబంధిత వర్గాలు చెప్పినట్లు ఏఎన్ఐ వార్తా సంస్థ ఒక కథనంలో తెలిపింది.

    అగ్ని-5 క్షిపణిని భారతదేశం ఇంతకుముందు చివరిసారిగా 2021లో నిర్వహించింది. తాజాగా గురువారం సాయంత్రం ఒడిషాలోని ఏపీజే అబ్దుల్ కలాం దీవి నుంచి ఈ క్షిపణిని ప్రయోగించారు.

  5. అక్కడ చికెన్ కంటే ఎలుక మాంసం ధర ఎక్కువ... దీని రుచి ఎలా ఉంటుంది?

  6. థాయ్ యువరాణి: గుండె సంబంధిత సమస్యతో కుప్పకూలిన రాజు పెద్దకూతురు

    యువరాణి బజ్రకితియభ

    ఫొటో సోర్స్, Getty Images

    థాయ్ రాజు పెద్ద కూతురు బుధవారం సాయంత్రం గుండె సంబంధిత సమస్యతో కుప్పకూలినట్టు థాయ్‌ల్యాండ్ రాయల్ ప్యాలస్ ప్రకటన విడుదల చేసింది.

    ఈశాన్య బ్యాంకాక్‌లో తన పెంపుడు కుక్కలకు శిక్షణ ఇస్తున్న సమయంలో థాయ్ రాజు వజిరలాంగ్ కార్న్ పెద్ద కూతురు, యువరాణి బజ్రకితియభ గుండె సంబంధిత వ్యాధితో కుప్పకూలినట్టు ప్యాలస్ పేర్కొంది.

    థాయ్ రాజు మొదటి భార్య సోమ్‌సావాలి కూతురే ఈ యువరాణి. ఆయనకు పెద్ద బిడ్డ తానే. యువరాణికి ప్రస్తుతం 44 ఏళ్ల వయసుంటుంది. రాజువజిరలాంగ్ కార్న్ తన తర్వాత వారసుల పేరును ఇప్పటి వరకు ప్రకటించనప్పటికీ, ఆయన తర్వాత ఈమెనే ఈ పదవిని చేపట్టబోయే వారసురాలిగా భావించే వారు.

    రాజుకి ఉన్న ముగ్గురు పిల్లల్లో 1924 ప్యాలెస్ ఆఫ్ సక్సెషన్ కింద బజ్రకితియభనే తర్వాత యువరాణి పీఠంపై ఆశీనులయ్యేందుకు అర్హురాలిగా ఉన్నారు.

    యువరాణి అస్వస్థతకు గురైన వెంటనే దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత ఆమెను హెలికాప్టర్‌లో బ్యాంకాక్‌లోని ప్రముఖ ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు.

    యువరాణి ఆరోగ్య పరిస్థితి గత రాత్రి సమయానికి కొంత వరకు నిలకడగా మారినట్టు ప్యాలస్ పేర్కొంది. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం ఎలా ఉందో ఈ స్టేట్‌మెంట్ చెప్పడం లేదు. అయితే ఆమె ఆరోగ్యం రాయల్ ప్యాలస్ చెప్పిన దాని కంటే మరింత ప్రమాదకరంగా ఉందని కొన్ని రిపోర్టులు చెబుతున్నాయి.

    2016లో రాజు భూమిబోల్‌పై తన తండ్రి గెలిచిన తర్వాత ఆయన అంతర్గత సర్కిల్‌లో ఆమె కీలకంగా మారారు. రాజు వ్యక్తిగత సంరక్షణలో సీనియర్ ఆఫీసర్‌గా కూడా ఉన్నారు.

    అమెరికా రెండు యూనివర్సిటీల నుంచి ఆమె పోస్టు గ్రాడ్యుయేట్ డిగ్రీలను పొందారు. ఆమె ఫిట్‌నెస్ ఔత్సాహికురాలు.థాయ్‌ల్యాండ్‌లో పీనల్ సంస్కరణల విషయంలో ఆమెంతో కృషి చేశారు.

    మహిళా ఖైదీల కోసం ఆమె పనిచేశారు. 2012 నుంచి 2014 వరకు ఆస్ట్రియాకు థాయ్‌ల్యాండ్ రాయబారిగా బజ్రకితియభ పనిచేశారు.

  7. జె.పి.నడ్డా: ‘లద్దాక్ నుంచి తెలంగాణను కలిపేంత దూరం రోడ్లను తెలంగాణలో నిర్మించాం’

    జె.పి.నడ్డా

    ఫొటో సోర్స్, BJP Telangana

    బీఆర్ఎస్ పార్టీ కి ప్రజలు త్వరలో వీఆర్ఎస్ ఇస్తారని అన్నారు బిజేపి జాతీయ అధ్యక్షుడు జెపి.నడ్డా. తెలంగాణ ధనిక రాష్ట్రం అనేది ఒకప్పటి మాట అని ఇప్పుడు అది అప్పుల రాష్ట్రం అని తెలంగాణలో కమలం వికసించి కేసీఆర్ ఇంటికి పోతారన్నారు.

    తెలంగాణ బీజేపి రాష్ట్రఅధ్యక్షుడు బండి సంజయ్ 5వ విడత ప్రజాసంగ్రామ యాత్ర ముంగింపు సందర్భంగా కరీంనగర్ ఎస్సార్ఆర్ కాలేజ్ గ్రౌండ్లో నిర్వహించిన బహిరంగ సభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నడ్డా మాట్లాడుతు టీఆర్ఎస్ పై తీవ్ర విమర్శలు చేశారు.

    బండి సంజయ్ యాత్ర

    ఫొటో సోర్స్, BJP Telangana

    ప్రజాసంగ్రామ యాత్రను అడ్డుకునేందుకు గతంలో ప్రయత్నించారని, ఈ రోజుకూడా తన పర్యటనను అడ్డుకునేందుకు చూశారని ఆరోపించారు.

    గత ఐదేళ్ల కాలంలో తెలంగాణలో కేంద్ర నిధులతో 4996 కి.మీ రోడ్లను నిర్మించామని, అది లద్దాక్ నుండి తెలంగాణను కలిపేంత దూరం అని అన్నారు. సీఎం కుమార్తె, ఎమ్మెల్సీ కవితను కేంద్ర దర్యాప్తు సంస్థలు ఎందుకు ప్రశ్నిస్తున్నాయని నడ్డా ప్రశ్నించారు. ధరణి పోర్టల్ తెలంగాణలో టీఆర్ఎస్ వారికి దోచుకునే సాధనంగా మారిందని ఆరోపించారు.

    బండి సంజయ్ యాత్ర

    ఫొటో సోర్స్, BJP Telangana

    తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్‌గా మారిన టీఆర్ఎస్ పార్టీకి తెలంగాణతో సంబందం లేదని, బీఆర్ఎస్ పేరుతో దేశాన్ని దోచుకునేందుకు బయల్దేరారని విమర్శించారు. బీఆర్ఎస్ అంటే బార్ అండ్ రెస్టారెంట్ పార్టీ అని బందిపోట్ల రాష్ట్ర సమితి అని ఎద్దేవా చేశారు.

    ఫాంహౌజ్‌లో పడుకున్న కేసీఆర్‌ను ప్రజాసంగ్రామయాత్ర బయటకు తెచ్చిందని ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇవ్వలేని బిచ్చపు రాష్ట్రంగా తెలంగాణను కేసీఆర్ మార్చారని బండి సంజయ్ ఆరోపించారు. మళ్లీ అధికారం ఇస్తే తెలంగాణను మరింత అప్పులపాలు చేస్తారని బండి సంజయ్ అన్నారు.

  8. ''మా మామను ఎరిత్రియా సైన్యం చంపేసింది’’: ఐక్యరాజ్య సమితి ప్రజారోగ్య విభాగం అధిపతి టెడ్రోస్

    టెడ్రోస్ అథనామ్ ఘెబ్రేయేసస్

    ఫొటో సోర్స్, EPA

    ఎరిత్రియా సైనిక దళాలు తన మామను చంపేశాయని ఐక్యరాజ్య సమితి ప్రజారోగ్య విభాగం అధిపతి టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ ఆరోపించారు.

    ఇథియోపియా యుద్ధరంగంగా మారిన టిగ్రే ప్రాంతంలోని ఒక గ్రామంలో తన మామతో పాటు మరో 50 మందికి పైగా పౌరులను పాశవికంగా హత్య చేసినట్లు తనకు తెలిసిందని ఆయన చెప్పారు.

    టెడ్రోస్ కుటుంబం టిగ్రే నుంచి వలస వచ్చింది. తన పరిస్థితి బాగోలేదని, ఇథియోపియన్‌గా ఇప్పటికీ తనకు వణుకుపుడుతూనే ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

    ఈ ఆరోపణలపై ఎరిత్రియా ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు.

    కోవిడ్ -19 సమస్యలపై జెనీవాలో బుధవారం జరిగిన డబ్ల్యూహెచ్‌వో బ్రీఫింగ్‌లో డాక్టర్ టెడ్రోస్ మాట్లాడుతూ.. "మా మామను ఎరిట్రియన్ సైన్యం హత్య చేసినట్లు శనివారం నాకు సమాచారం అందింది. నా తల్లితో మాట్లాడాను, మామ వారి కుటుంబంలో చిన్నవాడు. దీంతో ఆమె కుప్పకూలిపోయింది. ఆయన దాదాపు నా వయసు వ్యక్తే'' అని చెప్పారు.

    అయితే దాడి జరిగిన సమయం లేదా ఆ గ్రామం వివరాలు మాత్రం టెడ్రోస్ వెల్లడించలేదు.

    ఇథియోపియా ప్రభుత్వం, టిగ్రే పీపుల్స్ లిబరేషన్ ఫ్రంట్ మధ్య నవంబర్‌లో కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. అప్పుడు టెడ్రోస్ స్పందిస్తూ.. "ఈ పిచ్చి ఆగిపోతుంది" అని ఆశాభావం వ్యక్తం చేశారు.

    అయితే ఇథియోపియా పొరుగున ఉన్న అమ్హారా ప్రాంతానికి చెందిన ఎరిత్రియన్ దళాలు ఈ ఒప్పందంలో భాగం కాలేదు.

  9. రిషి రాజ్‌పోపట్: 2500 ఏళ్ల నాటి సంస్కృత సమస్యకు.. భారతీయ విద్యార్థి పరిష్కారం

  10. భారత ఆర్థికవ్యవస్థ: ‘‘జీతాలు పెరగలేదు.. అద్దెలు, ధరలు, చార్జీలు అన్నీ పెరిగిపోయాయి.. రెండు ఉద్యోగాలు చేసినా పూట గడవటం కష్టమవుతోంది’’

  11. ఫుట్‌బాల్ ప్రపంచకప్‌: మొరాకో ఓటమిపై అభిమానులు.. ‘మేం ఓడిపోయాం.. కానీ, చాలా గర్వంగా ఉంది’

  12. ‘అమరజీవి’ పొట్టి శ్రీరాములు మరణానికి కారకులెవరు? ఈ దీక్ష ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసమా?

  13. భారత్-చైనా ఉద్రిక్తతలు: సరిహద్దుల్లో ఇప్పుడు ఘర్షణ ఎందుకు, ఇది చైనా వ్యూహమా?

  14. ఫిఫా ప్రపంచకప్ 2022: ఫైనల్ చేరిన ఫ్రాన్స్.. మొరాకో ఓటమి

    ఫిఫా ప్రపంచకప్ 2022: ఫైనల్ చేరిన ఫ్రాన్స్.. మొరాకో ఓటమి

    ఫొటో సోర్స్, Getty Images

    ప్రపంచకప్‌ సాధించిన తొలి ఆఫ్రికా దేశంగా నిలవాలనుకున్న మొరాకో ఆశలు వాడిపోయాయి.

    బుధవారం రాత్రి ఫ్రాన్స్‌తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో మొరాకో జట్టు 0-2 గోల్స్ తేడాతో ఓడిపోయింది.

    ఫైనల్స్‌కు చేరిన ఫ్రాన్స్ జట్టు ఆదివారం అర్జెంటీనాతో తలపడనుంది.

    దీంతో పలువురు అభిమానులు అంచనా వేసినట్లుగా ఫ్రాన్స్ స్టార్ ఆటగాడు ఎంబపే-అర్జెంటీనా స్టార్ ఆటగాడు లియోనల్ మెస్సీల మధ్య పోరు జరుగనుంది.

    ఏ మాత్రం అంచనాలు లేకుండా ఖతార్‌లో జరుగుతున్న ఫిఫా ప్రపంచకప్ 2022లో అడుగుపెట్టిన మొరాకో జట్టు తన ఆటతీరుతోనూ, మ్యాచ్‌ ముగిసిన తర్వాత తమ ప్రవర్తనతోనూ ఫుట్‌బాల్ అభిమానుల మనస్సులు గెలుచుకుంది.

    వాస్తవానికి ఆ జట్టు సెమీ ఫైనల్ చేరడం కూడా ఒక రికార్డే.

    ఫిఫా ప్రపంచకప్ 2022: ఫైనల్ చేరిన ఫ్రాన్స్.. మొరాకో ఓటమి

    ఫొటో సోర్స్, Getty Images

    ఫొటో క్యాప్షన్, నిరాశలో మొరాకో అభిమానులు
    ఫిఫా ప్రపంచకప్ 2022: ఫైనల్ చేరిన ఫ్రాన్స్.. మొరాకో ఓటమి

    ఫొటో సోర్స్, Getty Images

    ఫొటో క్యాప్షన్, మ్యాచ్ అనంతరం నమాజ్ చేస్తున్న మొరాకో ఆటగాళ్లు