నేటి లైవ్ పేజీ అప్‌డేట్స్ సమాప్తం
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్‌పేజీ అప్‌డేట్స్‌ను ఇంతటితో ముగిస్తున్నాం.
స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్‌డేట్స్‌తో మళ్లీ రేపు ఉదయం కలుద్దాం.
బిహార్‌లోని చాప్రాలో కల్తీ మద్యం తాగి 17 మంది చనిపోయినట్లు జిల్లా కలెక్టర్ బీబీసీ హిందీకి తెలిపారు. ఈ మరణాలపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్లు ఆయన చెప్పారు.
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్‌పేజీ అప్‌డేట్స్‌ను ఇంతటితో ముగిస్తున్నాం.
స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్‌డేట్స్‌తో మళ్లీ రేపు ఉదయం కలుద్దాం.

ఫొటో సోర్స్, ANI
బిహార్‌లోని చాప్రాలో కల్తీ మద్యం తాగి 17 మంది చనిపోయినట్లు జిల్లా కలెక్టర్ బీబీసీ హిందీకి తెలిపారు. ఈ మరణాలపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్లు ఆయన చెప్పారు.
సారణ్‌లోని ప్రభుత్వాస్పత్రికి 17 మంది మృతదేహాలను పోస్టుమార్టం కోసం తీసుకువచ్చారని సివిల్ సర్జన్ సాగర్ దులాల్ సిన్హా వెల్లడించారు.
కల్తీ మద్యం తాగిన వారిలో ఇంకా 8 మంది చాప్రాలోని సదర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఫొటో సోర్స్, ANI
పోలీసులు, వార్తా సంస్థల కథనం ప్రకారం.. సరణ్ జిల్లాలోని చాప్రా ప్రాంతంలో ఇసాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం రాత్రి పొద్దుపోయాక కొంత మంది కల్తీ మద్యం తాగారు. ఆ తర్వాత వారి ఆరోగ్యం అకస్మాత్తుగా విషమించింది. వారిని చాప్రాలోని సదర్ ఆస్పత్రికి తరలించారు.

ఫొటో సోర్స్, ANI
వీరిలో 17 మందిచనిపోవటంతో స్థానిక ప్రజల్లో తీవ్ర ఆగ్రహం పెల్లుబుకుతోంది. కల్తీ మద్యం తాగటమే ఈ మరణాలకు కారణమని బిహార్‌లోని ప్రతిపక్ష పార్టీలు చెప్తున్నాయి. ప్రభుత్వం మీద తవ్రస్థాయిలో విరుచుకుపడ్డాయి. ఈ విషయం బిహార్ నుంచి దిల్లీ వరక పతాక శీర్షికలకు ఎక్కింది.

ఫొటో సోర్స్, Getty Images
విద్యా, ఉపాధి రంగాలలో ఓబీసీలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించే ప్రతిపాదన ఏదీ ప్రభుత్వం వద్ద లేదని సామాజిక న్యాయ శాఖ సహాయ మంత్రి ప్రతిమా భౌమక్ బుధవారం రాజ్యసభలో చెప్పారు.
ఓబీసీలకు జనాభా ప్రాతిపదికపై విద్యా, ఉపాధి రంగాల్లో రిజర్వేషన్ కల్పించాలని సుదీర్ఘకాలంగా వస్తున్న న్యాయమైన డిమాండ్‌ను ప్రభుత్వం పరిగణలోకి తీసుకుందా, పరిగణలోకి తీసుకున్న పక్షంలో ఓబీసీలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఏమిటి అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ ఈ విషయం వెల్లడించారు.
ఇందిరా సహాని కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు లోబడి ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్ కల్పిస్తున్నట్లు చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలతో కలిపి మొత్తం 50 శాతం రిజర్వేషన్‌ను అమలు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు.
జనాభా ప్రాతిపదికపై ఓబీసీలకు రిజర్వేష్ కల్పించాలంటూ దేశం వ్యాప్తంగా వివిధ వ్యక్తులు, సంస్థల నుంచి ప్రభుత్వానికి వినతులు అందుతున్నాయని ఆమె పేర్కొన్నారు.
ఏపీలో మూడు రూర్బన్ మిషన్ క్లస్టర్ల అభివృద్ధి
ఆంధ్రప్రదేశ్‌లోని అరకు లోయ, ఏలూరు, రంపచోడవరం క్లస్టర్లను శ్యామ ప్రసాద్ ముఖర్జీ రూర్బన్ మిషన్ కింద ఎంపిక చేసినట్లు గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి తెలిపారు. రాజ్యసభలో ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ ఈ మిషన్ కింద 21 విభాగాలలో చేపట్టిన వివిధ ప్రాజెక్ట్‌ల గురించి వివరించారు.

దేశ రాజధాని దిల్లీలో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) జాతీయ కార్యాలయాన్ని ఆ పార్టీ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు బుధవారం ఉదయం ప్రారంభించారు.
కేసీఆర్ ఇటీవల తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ పేరును భారత రాష్ట్ర సమితిగా మార్చారు. ఈ పేరు మార్పుకు తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం తెలిపింది.
ఈ నేపథ్యంలో దిల్లీలో బీఆర్ఎస్ జాతీయ కార్యాలయాన్ని కేసీఆర్ ప్రారంభించారు. పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం బీఆర్ఎస్ జెండాను కూడా కేసీఆర్ ఆవిష్కరించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
ఈ కార్యక్రమానికి సమాజ్‌వాది పార్టీ అధినేత, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, జేడీఎస్ అధినేత, కర్ణాటక మాజీ ముఖ్యమంతరి కుమారస్వామిలతో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు.
పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించటానికి ముందు సీఎం కేసీఆర్ దంపతులు రాజశ్యామల యాగం, చండీయాగం నిర్వహించారు. వారి కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

ఫొటో సోర్స్, ANI
దేశ రాజధాని నగరం దిల్లీలో ఒక స్కూలు విద్యార్థిని మీద యాసిడ్ దాడి జరిగింది.
ద్వారకా జిల్లాలో ఉదయం 9 గంటల ప్రాంతంలో ఈ ఘోరం చోటు చేసుకుందని, ఒక బాలిక మీద ఒక బాలుడు యాసిడ్ విసిరాడని పోలీసులు చెప్పారు.
బాలికను సప్ధర్‌జంగ్ ఆస్పత్రిలో చేర్చామని, ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు.
ఆ ఘటన జరిగినపుడు బాధిత బాలికతో పాటు ఆమె చెల్లెలు కూడా ఉందన్నారు. ఈ దాడికి సంబంధించి తనకు తెలిసిన ఇద్దరి మీద ఆ బాలిక అనుమానం వ్యక్తం చేసినట్లు చెప్పారు.
పోలీసులు ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
దేశంలో యాసిడ్‌ను నిషేధించటం కోసం దిల్లీ మహిళా కమిషన్ కొన్నేళ్లుగా పోరాడుతోందని, ప్రభుత్వం ఎప్పుడు మేలుకొంటుందని ఆ కమిషన్ చైర్‌పర్సన్ స్వాతి మలేవాల్ ఒక ట్వీట్‌లో ప్రశ్నించారు.
యాసిడ్ దాడి బాధితురాలికి న్యాయం లభించేలా చేస్తామన్నారు. జాతీయ మహిళా కమిషన్ కూడా ఈ దాడి ఉదంతాన్ని సుమోటోగా స్వీకరించింది. ఆస్పత్రికి ప్రత్యేక బృందాన్ని పంపిస్తోంది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
బాధితురాలి తండ్రి ఏఎన్ఐ వార్తా సంస్థతతో మాట్లాడుతూ.. తన కూతుర్లు ఇద్దరూ ఉదయం స్కూలుకు వెళ్లటానికి బయల్దేరారని చెప్పారు. ‘‘కొద్ది సేపటికి చిన్న కూతురు పరుగున ఇంటికి తిరిగి వచ్చింది. ఇద్దరు బాలురు వచ్చి అక్క మీద యాసిడ్ పోసి వెళ్లిపోయారని చెప్పింది. ఆ బాలురు ముఖాలకు ముసుగులు కప్పుకుని ఉన్నారు’’ అని ఆయన తెలిపారు.
తన కూతురు పరిస్థితి చాలా విషమంగా ఉందని, ఆమె రెండు కళ్లలోకీ యాసిడ్ వెళ్లిందని ఆయన చెప్పారు.
భారతదేశంలో యాసిడ్ దాడుల కేసులు చాలా ఉన్నాయి. ప్రభుత్వ గణాంకాల ప్రకారం ప్రతి ఏటా దాదాపు 1,000 కేసులు వెలుగులోకి వస్తున్నాయి. కానీ వాస్తవ సంఖ్య దీనికన్నా చాలా రెట్లు ఎక్కువగా ఉంటుందని సామాజిక కార్యకర్తలు చెప్తున్నారు.
కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ చేస్తున్న భారత్ జోడో యాత్రలో రిజర్వ్ బ్యాంకు మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ పాల్గొన్నారు.
రాజన్, రాహుల్ గాంధీ కలసి నడుస్తున్న ఫొటోలు, వీడియోలను కాంగ్రెస్ పార్టీ పోస్ట్ చేసింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది

ఫొటో సోర్స్, Getty Images
క్రొయేషియాతో జరిగిన సెమీ ఫైనల్‌లో 3-0 తేడాతో ఘన విజయం సాధించిన అర్జెంటీనా జట్టు ఫిఫా ప్రపంచకప్ 2022 ఫైనల్ చేరుకుంది.
అర్జెంటీనా జట్టు 6వ సారి ఫిఫా ప్రపంచకప్ ఫైనల్‌కు చేరుకుంది.
ఈ విజయంలో లియోనల్ మెస్సీ తన జట్టును ముందుండి నడిపించాడు. 22 ఏళ్ల జూలియన్ అల్వరెజ్ కూడా ప్రధాన పాత్ర పోషించాడు.
దీంతో ఆదివారం జరిగే ఫైనల్ పోరుకు అర్జెంటీనా జట్టు రెడీ అయ్యింది. అయితే, ఫ్రాన్స్, మొరాకోల మధ్య జరగనున్న మరొక సెమీ ఫైనల్‌లో ఫలితాన్ని బట్టి ప్రత్యర్థి ఎవరో తేలనుంది.
34వ నిమిషంలో మెస్సీ పెనాల్టీని గోల్‌గా మెస్సీ గోల్‌గా మలచగా.. మరో ఐదు నిమిషాల తర్వాత మెస్సీ అందించిన హెడర్‌ను అల్వరెజ్ గోల్‌పోస్టులోకి పంపించాడు.
వీరిద్దరూ సమన్వయంతో మరొక గోల్ కొట్టారు.
1978, 1986 తర్వాత అర్జెంటీనా మరొక ప్రపంచకప్ గెలవలేదు.
మెస్సీ కూడా తన ఖాతాలో ఎన్నో ట్రోఫీలు సాధించినప్పటికీ ప్రపంచకప్ అనేది కలగానే మిగిలిపోయింది.
2014లో కూడా అర్జెంటీనాను మెస్సీ ప్రపంచకప్ ఫైనల్ వరకూ తీసుకెళ్లినా.. అప్పుడు జర్మనీ చేతిలో ఓడిపోయింది.
ఇప్పుడు మెస్సీ తన కలను నెరవేర్చుకునే సమయం వచ్చిందని ఫుట్‌బాల్ నిపుణులు అంటున్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
హాయ్, బీబీసీ తెలుగు న్యూస్ లైవ్ పేజీకి స్వాగతం.