వాంగ్ వెన్బిన్: భారత్-చైనా సరిహద్దుల్లో పరిస్థితి ‘సాధారణం’గానే ఉంది

అరుణాచల్‌ ప్రదేశ్‌లోని తవాంగ్‌లో భారత్‌, చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణల్లో సైనికులు ఎవరూ చనిపోలేదని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ లోక్‌సభలో తెలిపారు.

లైవ్ కవరేజీ

  1. పార్లమెంటుపై దాడికి 22 ఏళ్లు: ఆ రోజు సరిగ్గా ఏం జరిగిందంటే...

  2. లైవ్ పేజీ అప్‌డేట్స్ సమాప్తం

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్‌పేజీ అప్‌డేట్స్‌ను ఇంతటితో ముగిస్తున్నాం. స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్‌డేట్స్‌తో మళ్లీ రేపు ఉదయం కలుద్దాం.

  3. తమిళనాడు: తండ్రి సమాధి వెతుకుతూ మలేసియా వరకు సాగిన భారతీయుడి ప్రయాణం

  4. ఫాదర్ స్టాన్ స్వామీ ల్యాప్‌టాప్‌లో తప్పుడు ఆధారాలు ఉంచారా? అమెరికా సంస్థ ఏం చెబుతోంది?

    ఫాదర్ స్టాన్ స్వామీ

    ఫొటో సోర్స్, RAVI PRAKASH/BBC

    భీమా కోరేగావ్ కేసులో నిందితునిగా ఉన్న ఫాదర్ స్టాన్ స్వామీ ల్యాప్‌టాప్‌లో హ్యాకర్ల సాయంతో కొన్ని ‘ఆధారాల’ను ఉంచినట్లు అమెరికాకు చెందిన ఫోరెన్సిక్ సంస్థ వెల్లడిచింది.

    వాషింగ్టన్ పోస్ట్ కథనం ప్రకారం... ‘భీమీ కోరేగావ్ కేసులో ఫాదర్ స్టాన్ స్వామీకి వ్యతిరేకంగా కొన్ని పత్రాలను హ్యాకర్లు ఆయన ల్యాప్‌టాప్‌లో ఉంచారని ఫోరెన్సిక్ సంస్థ ఆర్సెనల్ కన్సల్టింగ్ తెలిపింది. మొత్తం 44 డాక్యుమెంట్లు ల్యాప్‌టాప్‌లో ఉంచారు. మావోయిస్టులకు ఫాదర్ స్టాన్ స్వామీ రాసినట్లుగా చెబుతున్న లెటర్ కూడా వాటిలో ఒకటి.’

    గతంలో కూడా ఆర్సెనల్ కన్సల్టింగ్ ఇలాంటి ఆరోపణలే చేసింది.

    భీమా కోరేగావ్ కేసులో నిందితునిగా ఉన్న ఫాదర్ స్టాన్ స్వామీ(84) ఈ ఏడాది జులైలో కస్టడీలోనే చనిపోయారు.

  5. ‘యుద్ధం చేయనంటే నేలమాళిగల్లో బంధిస్తున్నారు’

  6. బ్రేకింగ్ న్యూస్, వైఎస్ షర్మిల పాదయాత్రకు హై కోర్టు అనుమతి

    తెలంగాణలో వైఎస్ షర్మిల పాదయాత్రకు హై కోర్టు అనుమతి ఇచ్చింది.

    తనను పాదయాత్ర చేయనివ్వకుండా పోలీసులు అడ్డుకుంటున్నారంటూ తాజాగా ఆమె ఆమరణ నిరాహార దీక్షకు కూడా దిగారు.

  7. బంగ్లాదేశ్: షేక్ హసీనా గద్దె దిగాలంటూ నిరసనలు

  8. తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోకు జైలు శిక్ష, జరిమాన

    ఆంధ్రప్రదేశ్ హై కోర్టు... టీటీడీ ఈవో ధర్మారెడ్డికి జైలు శిక్ష, జరిమాన విధించింది.

    ముగ్గురు ఉద్యోగుల రెగ్యులైజేషన్ మీద కోర్టు ఆదేశాలు అమలు చేయకుండా కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని నెల రోజులు జైలు శిక్ష, రూ.2 వేలు జరిమానా విధిస్తూ హై కోర్టు తీర్పునిచ్చింది.

  9. కేరళ‌లో ఫిల్మ్ ఫెస్టివల్‌కి ఈ ఇరాన్ మహిళా నిర్మాత జుట్టు కత్తిరించి పంపించారు ఎందుకు

  10. కింజరాపు రామ్మోహన్నాయుడు: ‘విశాఖ స్టీలు ప్లాంటులో నియామకాలు ఎందుకు ఆపేశారు?’

    కింజరాపు రామ్మోహన్నాయుడు

    ఫొటో సోర్స్, SANSAD TV - LOK SABHA/YouTube

    విశాఖపట్నం(దక్షిణ కోస్తా) రైల్వే జోన్‌కు పూర్తి నిధులు కేటాయించాలని శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్నాయుడు కోరారు.

    లోక్‌సభలో మాట్లాడిన ఆయన వాల్తేరు డివిజన్‌ను మూసివేయకుండా దాన్ని దక్షిణ కోస్తా రైల్వే జోన్‌లోనే ఉంచాలని విజ్ఞప్తి చేశారు. వాల్తేరు డివిజన్ దేశంలోనే ఎక్కువగా లాభాలు ఆర్జించే వాటిలో ఒకటని ఆయన తెలిపారు.

    ‘విశాఖ స్టీలు ప్లాంట్‌ను ప్రైవేటీకరించాలన్న నిర్ణయం మీద కేంద్రం మరొకసారి ఆలోచించాలి. ప్రైవేటీకరణ చేస్తున్నట్లు ప్రకటించాక నియామకాలు, ప్రమోషన్లు వంటివి నిలిపి వేశారు. వాటిని ఆపాల్సిన అవసరం ఏముంది’ అని ఆయన ప్రశ్నించారు.

  11. సుప్రీంకోర్టులోనైనా ఉచితంగా వ‌కీలును పెట్టుకుని వాదించడం ఎలా, ఉచిత న్యాయ సహాయం ఎలా పొందాలి

  12. వైఎస్ షర్మిల: ‘పోలీసులు నన్ను హై కోర్టుకు వెళ్లనివ్వడం లేదు’

    పాదయాత్ర కోసం తెలంగాణ హై కోర్టును ఆశ్రయించేందుకు పోలీసులు తనను అనుమతించడం లేదని వైఎస్‌ఆర్‌టీపీ చీఫ్ వైఎస్ షర్మిల ఆరోపించారు.

    ‘మేం హై కోర్టుకు వెళ్తాం. కానీ కోర్టుకు వెళ్లకుండా నన్ను ఇప్పుడు అడ్డుకుంటున్నారు. ఇది తాలిబానా? లేక అఫ్గానిస్తానా?’ అని షర్మిల అన్నట్లు వార్తా సంస్థ ఏఎన్‌ఐ ట్వీట్ చేసింది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  13. గత ఆర్థికసంవత్సరంలో రూ.1.74 లక్షల కోట్ల రుణాలు రైటాఫ్

    గత ఆర్థికసంవత్సరం(2021-22)లో రూ.1,74,966 కోట్ల రుణాలను బ్యాంకులు రైటాఫ్ చేసినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది.

    రైటాఫ్ చేసిన రుణాలలో రూ.33,534 కోట్లు రివకరీ చేసినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) తెలిపిందని కేంద్ర ఆర్థికశాఖ సహాయక మంత్రి భగవత్ కరాద్ రాజ్యసభకు వెల్లడించారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  14. అమిత్ షా: ‘చైనా ఎంబసీ నుంచి రూ.1.35 కోట్లు తీసుకున్న రాజీవ్ గాంధీ ఫౌండేషన్’

    రాజీవ్ గాంధీ ఫౌండేషన్‌కు చైనా ఎంబసీ రూ.1.35 కోట్లు ఇచ్చిందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆరోపించారు.

    ‘2005-07 మధ్య చైనా ఎంబసీ నుంచి రూ.1.35 కోట్లను రాజీవ్ గాంధీ ఫౌండేషన్ తీసుకుంది. నిబంధనలు ఉల్లంఘించినందుకే హోంశాఖ ఆ ఫౌండేషన్ మీద ఆంక్షలు విధించింది. ఈ విషయం చర్చకు రాకుండా ఉండేందుకు భారత్-చైనా సైనికుల మధ్య ఘర్షణ మీద పార్లమెంటులో రాద్ధాంతం చేసింది’ అని అమిత్ షా మీడియాతో అన్నారు.

    ఇటీవల రాజీవ్ గాంధీ ఫౌండేషన్‌కున్న ఫారిన్ కాంట్రిబ్యూషన్ లైసెన్స్‌ను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది.

    నేడు పార్లమెంటులోని క్వశ్చన్ అవర్‌లో దీని మీద చర్చ ఉందని, దీని నుంచి కాంగ్రెస్ తప్పించుకునేందుకు ఆ పార్టీ పార్లమెంటులో గందరగోళం సృష్టించిందని అమిత్ షా విమర్శించారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  15. ‘సలాం హారతి’ పేరు మార్పు వివాదం ఏమిటి? హిందూ దేవాలయాల్లో టిప్పు సుల్తాన్ దీన్ని ప్రవేశపెట్టారా

  16. ఆంధ్రప్రదేశ్: ‘వృద్ధాప్య పెన్షన్ రూ.2,750కి పెంపు’

    ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్

    ఫొటో సోర్స్, YSRCP Social Media/Facebook

    వృద్ధాప్య పెన్షన్‌ను రూ.2,500 నుంచి రూ.2,750కి పెంచుతూ ఆంధ్రప్రదేశ్ మంత్రి మండలి నిర్ణయం తీసుకుంది. మొత్తం 62.31 లక్షల మందికి పెన్షన్ ఇస్తున్నారు.

    జిందాల్ స్టీల్‌తో కలిసి కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయడం, ఏపీ జ్యూడిషియల్ అకాడమీలో 55 పోస్టుల భర్తీ‌ వంటి ఇతర నిర్ణయాలు కూడా కేబినెట్ సమావేశంలో తీసుకున్నారు.

  17. చైనా విదేశాంగశాఖ: భారత-చైనా సరిహద్దుల్లో పరిస్థితి ‘సాధారణం’గానే ఉంది

    చైనా విదేశాంగశాఖ ప్రతినిధి వాంగ్ వెన్బిన్

    ఫొటో సోర్స్, EPA

    భారత్-చైనా సరిహద్దుల్లో పరిస్థితి ‘సాధారణం’గానే ఉన్నట్లు చైనా విదేశాంగశాఖ ప్రతినిధి వాంగ్ వెన్బిన్ ప్రకటించారని వార్తా సంస్థ రాయిటర్స్ రిపోర్ట్ చేసింది.

    ఈ నెల 9న తవాంగ్ సెక్టార్‌లోని యాంగ్సేలో చైనా, భారత సైనికుల మధ్య ఘర్షణలు జరిగినట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో చైనా ఈ ప్రకటన చేసింది.

  18. అరుణాచల్ ప్రదేశ్‌: 'చైనా సైన్యం వాస్తవాధీన రేఖ మీదకు వచ్చింది.. మన సైన్యం తిప్పికొట్టింది'

  19. గ్రీన్‌ల్యాండ్ ఆదివాసీ మహిళలు: ‘నా అనుమతి లేకుండానే నాకు గర్భం రాకుండా చేసేశారు.. ప్రతీసారి నెలసరి వచ్చినా గర్భవతి అయ్యే దాన్ని కాదు’

  20. పరుగెత్తుతూ గ్రేట్ వాల్ ఆఫ్ చైనాను చుట్టేస్తున్న అన్న , తమ్ముడు