ఎన్‌విడియా ఎలా గూగుల్‌ను మించిపోయింది? ఈ సక్సెస్‌కు 3 కారణాలివే...

ఫొటో సోర్స్, Getty Images
అత్యుత్తమ ఫలితాల ప్రకటన, షేర్ల విలువ పెరగడం లాంటి అంశాలతో స్టాక్ మార్కెట్లలో దూసుకుపోయిన ఎన్‌విడియా ఉత్సాహం ఇప్పుడు రెట్టింపవుతోంది.
ప్రాసెసర్లు తయారు చేసే ఈ అమెరికన్ సంస్థ మార్కెట్ విలువ 200 కోట్ల డాలర్లకు చేరుకుంది. అమెరికాలో సాంకేతిక రంగంలో దిగ్గజాలు మైక్రోసాఫ్ట్, యాపిల్ మాత్రమే ఇలాంటి విజయాన్ని సాధించాయి.
మార్కెట్ క్యాపిటలైజేషన్‌లో ఎన్‌విడియా గూగుల్ మాతృసంస్థ అల్పాబెట్‌ను అధిగమించింది.
“అభివృద్ధిని కొనసాగించడానికి అవకాశాలు అద్భుతంగా ఉన్నాయి” అని సంస్థ సీఈఓ జెన్సన్ హ్వాంగ్ ఇన్వెస్టర్లతో చెప్పారు.
2023లో మూడు రెట్లు పెరిగిన సంస్థ షేర్లు, ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 60 శాతం దాటి పెరిగాయి.
శక్తివంతమైన గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిటన్లు తయా చేయడం ద్వారా చిప్స్ తయారీ రంగంలో తానే మహరాజునని ఎన్‌విడియాా నిరూపించింది.
గణాంకాలను చాలా వేగంగా లెక్కించగల ఎలక్ట్రానిక్ సర్క్యూట్లను నివిడియా తయారు చేస్తోంది. ఈ ప్రాసెసర్లను ఎక్కువగా అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగంలో ఉపయోగిస్తున్నారు. మార్కెట్‌లో వీటి విలువ ఒక్కొక్కటి వేల డాలర్లు పలుకుతోంది.
ఈ ప్రాసెసర్లకు గిరాకీ ఏ విధంగా ఉందంటే, వాటిని వజ్రాలను తరలించినట్లుగా కట్టుదిట్టమైన భద్రత మధ్య ట్రక్కుల్లో తరలిస్తున్నారు.
గ్రాఫిక్ ప్రాసెసర్ యూనిట్ల తయారీలో 80 శాతం మార్కెట్‌ను సంపాదించుకున్న ఇంటెల్, ఏఎండీ కంటే ఎన్‌విడియా అవకాశాలు పెరుగుతున్నాయి.
కాలిఫోర్నియా కేంద్రంగా నడుస్తున్న ఈ టెక్నాలజీ దిగ్గజం విజయంలో కీలక పాత్ర పోషిస్తున్న మూడు కారణాలేంటో చూద్దాం.

ఫొటో సోర్స్, Getty Images
1. వీడియో గేమ్స్ నుంచి అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైపు
30 ఏళ్ల క్రితం వీడియో గేమ్స్‌లో ఉపయోగించే చిప్స్ తయారీ సంస్థగా ఎన్‌విడియా ప్రయాణం ప్రారంభమైంది.
మార్కెట్‌లో బాగా గిరాకీ ఉన్న వీడియో గేములు, యానిమేషన్స్, ఇమేజేస్, రెండరింగ్ వీడియోస్ లాంటి విభాగాల్లో నివిడియా తయారు చేసిన గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్లకు డిమాండ్ భారిగా ఉండేది.
వీడియో గేమ్స్ చిప్స్ తయారీ అనేది సంస్థకు సంబంధించి చాలా ఏళ్ల క్రితం నాటి మాట.
జీపీయూలకు ఇతర విభాగాల్లోనూ ఉన్న డిమాండ్‌ను సంస్థ త్వరగానే అర్థం చేసుకుంది. కంప్యూటర్లలో పనితీరుని మెరుగు పరిచే సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ల గురించి తెలుసుకుంది.
గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ లాంటి దిగ్గజ సంస్థలు తమ వద్ద ఉన్న డేటాను భద్రపరిచేందుకు ఎన్‌విడియా తయారు చేస్తున్న ప్రాసెసర్ల అవసరాన్ని గుర్తించాయి. అలాగే క్రిప్టో కరెన్సీల మైనింగ్ చేసే సంస్థలకు కూడా ఇవి అవసరంగా మారాయి.
అదే సమయంలో ఇంజనీర్లు కూడా తమ చిప్స్ ఉపయోగించి కృత్రిమ మేథస్సు సాయంతో గణాంకాల్ని వేగంగా సిద్ధం చేయడం కూడా ప్రారంభమైంది. దీంతో వారికి అవసరమైన లెక్కల్ని చేయడానికి ప్రాసెసర్ల అవసరం పెరిగింది.
ప్రస్తుతం అత్యాధునిక జీపీయూల తయారీలో ఎన్‌విడియా ముందుంది. అత్యాధునిక సాంకేతిక కృత్రిమ మేధలో ఈ సంస్థ తయారు చేసిన హెచ్ 100 ప్రాసెసర్లను ఉపయోగిస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
2. పోటీ దారులను అధిగమించి...
అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్స్‌కు శిక్షణ ఇచ్చేందుకు గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ కోసం తయారు చేసే సెమీ కండక్టర్స్ కూడా అవసరం అని సంస్థ గుర్తించింది.
ఈ రంగంలో ప్రత్యర్థుల మీద పై చేయి సాదించేందుకు నివిడియాకు ఇది బాగా ఉపయోగపడింది.
2006ను అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విషయంలో సంస్థ పూర్తి స్థాయి నిబద్దతను ప్రకటించింది. కఠినమైన లెక్కలకు సంబంధించిన సమస్యలను కూడా సులువుగా పరిష్కరించగలిగే చిప్స్ తయారీ కోసం సీయూడీఏ అనే లాంగ్వేజ్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు సంస్థ ప్రకటించింది.
దీంతో ప్రత్యర్థులైన ఏఎండీ, ఇంటెల్ లాంటి సంస్థలు అర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ రంగంలోకి అడుగు పెట్టకముందే నివిడియా ఆ మార్కెట్ మీద ఆధిపత్యం చలాయించడం మొదలైంది.
అయితే ఆ ఆధిపత్యం ఎంతో కాలం కొనసాగలేదు. పోటీ సంస్థలు భారీ పెట్టుబడులతో తమ వేగాన్ని పెంచాయి. మార్కెట్ వాటాలో ఎక్కువ భాగాన్ని దక్కించుకున్నాయి.
గూగుల్, అమెజాన్ , మైక్రోసాఫ్ట్ లాంటి సంస్థలు ఓ వైపు గ్రాఫిక్స్ ప్రాసెసర్ యూనిట్లను తయారు చేస్తూనే క్లౌడ్ కంప్యూటింగ్‌ను కూడా అభివృద్ధి చేశాయి. అర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ కోసం తమదైన సొంత చిప్స్ తయారు చేయడం ప్రారంభించాయి.

ఫొటో సోర్స్, Getty Images
3. ఎన్‌విడియా ఉత్పత్తులకు విపరీతమైన గిరాకీ
గేమింగ్, డేటా సెంటర్లు, అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అప్లికేషన్ల నుండి ఎన్‌విడియా ప్రాసెసర్ల కోసం డిమాండ్ ఊహించని స్థాయిలో పెరిగింది.
ప్రత్యేకంగా గతేడాది చూస్తే, పవర్ లార్జ్ అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మాడల్స్‌కి చెందిన సర్వర్ల కోసం ఖరీదైన గ్రాఫిక్స్ ప్రాసెసర్లకు డిమాండ్ వేగంగా పెరిగింది.
మిగతా టెక్నాలజీ సంస్థలతో పోలిస్తే ఎన్‌విడియా పేరు అంతగా తెలియదు. అయితే చాట్ జీపీటీ లాంచ్ చేసిన తర్వాత ఈసంస్థ వేగంగా తెర మీదకు దూసుకొచ్చింది. చాట్ జీపీటీని అందుబాటులోకి తెచ్చిన టెక్నాలజీ సంస్థ ఓపెన్ ఏఐ అభివృద్ధి చేసి అర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్స్‌లో ఎన్‌విడియా ప్రాసెసర్లను ఉపయోగిస్తున్నారు.
అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మాడల్స్ అభివృద్ధిలో నివిడియా చిప్స్ కీలకంగా మారాయని నిపుణులు చెబుతున్నారు.
జీపీయూ మార్కెట్‌లో నివిడియా ప్రత్యర్థి సంస్థల మీద ఆధిపత్యం ఎంత కాలం కొనసాగుతుందనేది చెప్పడం కష్టం.
మార్కెట్‌లో పోటీ పరంగా చూస్తే ప్రస్తుతానికి ఎన్‌విడియా దాని ప్రత్యర్థులు కాస్త అటుఇటుగా సమానంగా ఉన్నారు. ఎన్‌విడియా తయారు చేస్తున్న హెచ్ 100 చిప్స్‌కున్న గిరాకీ కొనసాగుతూనే ఉంది. అనేక మంది ఈ చిప్ కోసం ఆరు నెలలు వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది.
అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అప్లికేషన్స్ అభివృద్దికి అవసరమైన చిప్స్‌కున్న డిమాండ్ సప్లయ్ మధ్య అంతరం తగ్గడానికి మరో ఏడాది పట్టవచ్చని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. అది కూడా ఏఎండీ, ఇంటెల్ ప్రస్తుతం చేస్తున్న స్థాయిలో తమ ఉత్పత్తులను కొనసాగించగిలిగితేనే ఇది సాధ్యం అనేది వారి అభిప్రాయం.
అప్పటి వరకూ డిమాండ్‌కు తగ్గ సరఫరా నియంత్రిత స్థాయిలోనే కొనసాగుతుంది.
ఇవి కూడా చదవండి:
- రూ.2,800 కోట్ల జాక్‌పాట్ తగిలిన వ్యక్తికి డబ్బులు ఇచ్చేందుకు నిరాకరించిన లాటరీ కంపెనీ
- లాటరీ తగిలినట్లు ఈ దేశం ఒక్కసారిగా సంపన్న దేశంగా ఎలా మారింది?
- మొసలి కడుపులో 70 నాణేలు.. ఎలా తీశారంటే
- ఉపవాసం చేస్తే బరువు తగ్గుతారా? ఫాస్టింగ్‌తో శరీరంలో ఏం జరుగుతుంది?
- చంద్రగిరి నది: వంద కేజీల బరువుండే అత్యంత అరుదైన మంచి నీటి తాబేలును గుర్తించిన పరిశోధకులు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














