కేరళ: కొచ్చిలోని క్రైస్తవ కమ్యూనిటీ సెంటర్‌లో బాంబు పెట్టిన వ్యక్తి గురించి పోలీసులు ఏం చెప్పారు?

కేరళ బ్లాస్ట్

ఫొటో సోర్స్, AFP VIA GETTY IMAGES

కొచ్చిలోని కలమస్సేరి ప్రాంతంలో ఆదివారం ఉదయం క్రిస్టియన్ కమ్యూనిటీకి చెందిన ఓ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన బాంబు పేలుళ్ల ఘటనకు సంబంధించి కొత్త సమాచారం వెలుగులోకి వచ్చింది.

జెహోవా విట్‌నెస్‌ అనే క్రైస్తవ మత సంఘం సమావేశంలో జరిగిన బాంబు పేలుళ్లకు తానే బాధ్యత వహిస్తున్నట్లు ఓ వ్యక్తి ప్రకటించారని రాష్ట్ర ఏడీజీపీ (లా అండ్ ఆర్డర్) అజిత్ కుమార్ తెలిపారు.

"ఉదయం, త్రిశూర్ రూరల్‌లోని కొడకరా పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయిన తర్వాత, ఆ బాంబు పేల్చింది తానేనని ఆ వ్యక్తి పోలీసులతో చెప్పాడు’’ అని అజిత్ కుమార్ చెప్పారు.

లొంగిపోయిన వ్యక్తి పేరు డొమినిక్ మార్టిన్ అని, తనను తాను జెహోవా విట్‌నెస్‌ సంస్థలో సభ్యుడిగా చెప్పుకుంటున్నాడని పోలీసులు వెల్లడించారు.

కేరళ బ్లాస్ట్

ఫొటో సోర్స్, ANI

కేరళ సీఎంతో మాట్లాడిన కేంద్ర హోంమంత్రి

‘‘పేలుడు తర్వాత తలెత్తిన పరిస్థితిలపై తదుపరి చర్యలను చర్చించేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌తో మాట్లాడారు’’ అని పీటీఐ వార్తా సంస్థ వెల్లడించింది.

యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్, నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్, ఎన్ఐఏ బృందాలను కేరళకు పంపాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశించారు.

కలమస్సేరిలో జరిగిన పేలుడులో ఒక వ్యక్తి మరణించారని పీటీఐ పేర్కొంది. 36 మంది గాయపడగా, వారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ తెలిపారు.

ఈ పేలుడు ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ విచారం వ్యక్తం చేస్తూ, ఇది దురదృష్టకరమని అభివర్ణించారు. దీనిని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంటుందన్నారు.

కేరళ బ్లాస్ట్

ఫొటో సోర్స్, ANI

పేలుడు ఎప్పుడు, ఎక్కడ జరిగింది

జమ్రా ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్‌లో ఉదయం 9.40 గంటల ప్రాంతంలో పేలుడు సంభవించిందని కేరళ డీజీపీ షేక్ దర్వేష్ తెలిపారు. అక్కడ క్రైస్తవ మతానికి సంబంధించిన ఓ కార్యక్రమానికి ఆదివారం చివరి రోజు

"ఇక్కడ జెహోవా విట్‌నెస్ సంఘం కార్యక్రమం జరుగుతోంది. పేలుడుకు సంబంధించి ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం, 36 మంది చికిత్స పొందుతుండగా ఒకరు మరణించారు. సీనియర్ పోలీసు అధికారులు అన్ని కోణాల్లో ఈ విషయాన్ని దర్యాప్తు చేస్తున్నారు. దీని వెనుక ఉన్నవారిని కఠనంగా శిక్షిస్తాం." అని కేరళ డీజీపీ చెప్పారు.

ఐఈడీ( ఇంప్రొవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైస్) పరికరం వల్లే పేలుడు సంభవించినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని డీజీపీ తెలిపారు.

"మేము ఈ కేసులో అన్ని విషయాలను పరిశీలిస్తున్నాం. ప్రజలు శాంతియుతంగా ఉండాలని, సోషల్ మీడియాలో ఎలాంటి ద్వేషపూరిత పోస్ట్‌లను పోస్ట్ చేయవద్దని విజ్ఞప్తి చేస్తున్నాం." అని డీజీపీ అన్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 1

కేరళ బ్లాస్ట్

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, బాంబు పేలుడు అనంతర దృశ్యాలు

కార్యక్రమం జరుగుతున్న సమయంలో పెద్ద పెద్ద పేలుళ్లు వినిపించాయని ప్రత్యక్ష సాక్షులు బీబీసీకి తెలిపారు.

హాల్‌లో రెండు బాంబులు పేలాయని కేరళ ఏడీజీపీ లా అండ్ ఆర్డర్, అజిత్ కుమార్ బీబీసీ అసోసియేట్ జర్నలిస్టు ఇమ్రాన్ ఖురేషీతో అన్నారు. పేలుడు జరిగిన సమయంలో హాలులో దాదాపు రెండు వేల మంది ఉన్నారు.

పేలుడు జరిగిన ప్రదేశాన్ని చుట్టుముట్టామని, సహాయక చర్యల కోసం అగ్నిమాపక బృందాన్ని రప్పించామని కేరళ పరిశ్రమల శాఖ మంత్రి పి.రాజీవ్‌ తెలిపారు.

ఆరోగ్య కార్యకర్తలు వీలైనంత త్వరగా విధుల్లోకి రావాలని పేలుడు తర్వాత రాష్ట్ర ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ కోరారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.

కలమస్సేరి మెడికల్ కాలేజీ, ఎర్నాకుళం జనరల్ హాస్పిటల్, కొట్టాయం మెడికల్ కాలేజీని కూడా అత్యవసర పరిస్థితులకు సిద్ధం చేయాలని ఆమె ఆదేశించారు.

కేరళ బ్లాస్ట్

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, కేరళ ఆరోగ్య శాఖమంత్రి వీణా జార్జ్

ఈ ఘటన విచారకరం: శశిథరూర్

ఒక మత సమావేశంలో బాంబు పేలుడు వార్త విని తాను షాక్‌కు గురయ్యానని కాంగ్రెస్ నేత, ఎంపీ శశిథరూర్ సోషల్ మీడియాలో వ్యాఖ్యానించారు.

"దీనిని నేను నిర్ద్వంద్వంగా ఖండిస్తున్నాను. దీనిపై పోలీసులు తక్షణమే చర్యలు తీసుకోవాలి.’’ అని ఆయన డిమాండ్ చేశారు.

ఇలాంటి సంఘటనలను ఖండించాలని, హింస ద్వారా ఏదైనా సాధించగలిగితే అది హింసేనని అందరికీ చెప్పాలని అన్ని మతాల పెద్దలకు విజ్ఞప్తి చేస్తున్నట్లు శశి థరూర్ వెల్లడించారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 2

వీడియో క్యాప్షన్, మణిపుర్ పరిణామాల రీత్యా బీజేపీతో ఇక పొత్తు ఉండదన్న మిజోరం ముఖ్యమంత్రి

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)