తొలి సింథటిక్ మానవ పిండాన్ని తయారు చేసిన శాస్త్రవేత్తలు...ఇది నైతికమేనా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, జేమ్స్ గళ్లఘర్
- హోదా, బీబీసీ ప్రతినిధి
శాస్త్రవేత్తలు తొలి సింథటిక్ మానవ పిండాలను తయారుచేశారు. అయితే, అండం, వీర్యం లేకుండా పిండం తయారుచేయడంపై నైతికపరమైన విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.
కొన్ని రోజులు లేదా వారాల వయసున్న సింథటిక్ పిండాలను అధ్యయనం చేయడం ద్వారా మానవ అభివృద్ధిలో దశలను మరింత సునిశితంగా అర్థం చేసుకోవచ్చని, కొంతమంది స్త్రీలు మొదటి దశల్లోనే గర్భం ఎందుకు కోల్పోతారో తెలుసుకోవడానికి ఇది ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
ప్రస్తుతానికి ఆ పిండాలను శిశువులుగా మారే వరకు తీసుకెళ్లాలని ఎవరూ భావించట్లేదు. అయితే, ఈ అంశంలో చాలా వేగంగా జరుగుతున్న పురోగతి నైతికమైన, చట్టపరమైన సమస్యలను లేవనెత్తుతోంది.
ఈ విభాగంలో జరుగుతున్న ఈ పరిశోధన "చాలా జాగ్రత్తగా, మెళకువతో, పారదర్శకంగా" ముందుకెళ్లాలని, ప్రజలు భయపడకుండా, కంగారుపడకుండా జాగ్రత్త వహించాలని ఫ్రాన్సిస్ క్రిక్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన ప్రొఫెసర్ జేమ్స్ బ్రిస్కో అన్నారు.
మానవ సింథటిక్ పిండాలను అభివృద్ధి పరిచినట్లు స్టెమ్ సెల్ రీసెర్చ్ కోసం ఇంటర్నేషనల్ సొసైటీ నిర్వహించిన వార్షిక సమావేశంలో శాస్త్రవేత్తలు ప్రకటించారు.
సింథటిక్ పిండాలను "పిండం మోడల్స్" అని కూడా అంటున్నారు. ఇవి మానవ సహజ పిండాలను ప్రతిబింబిస్తాయి కానీ, అసలైన పిండాలు కావు.
కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం, కాలిఫోర్నియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలలో ప్రొఫెసర్ మాగ్దలీనా జెర్నికా-గోట్జ్‌లు ప్రయోగశాలలో ఈ సింథటిక్ పిండాలను అభివృద్ధి చేశారు.
ఈ పరిశోధన పూర్తి వివరాలు ఇంకా పబ్లిష్ కాలేదు. శాస్త్రీయ పరిశీలన కోసం నివేదికను అందుబాటులో ఉంచారు. అయితే, చాలామంది పరిశోధకులు ఈ నివేదిక ప్రాముఖ్యతపై కామెంట్ చేయలేకపోతున్నారు.
సింథటిక్ పిండాలను అండం, వీర్యం కలయిక ద్వారా కాకుండా ఒక స్టెమ్ సెల్ నుంచి తయారుచేశారు.

ఫొటో సోర్స్, UNIVERSITY OF CAMBRIDGE
మెదడు రూపుదిద్దుకోవడంతో పాటు గుండె కొట్టుకుంది
స్టెమ్ సెల్స్ శరీరంలో ఏ సెల్-టైప్‌గా అయినా మారే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. వీటిని కనుక సరైన మార్గంలో ఉపయోగిస్తే, సింథటింక్ పిండాలుగా మార్చవచ్చు.
మానవ శరీరంలోని పదార్థాలను వాడుతూ ఇలాంటిది సాధించడం ఇదే తొలిసారి. అంతేకాక, ఇది పూర్తిగా ‘‘సింథటిక్’’ కాదు. లేబరేటరీలో సంప్రదాయ పిండం నుంచి ఈ కణాల గురించి సమాచారం తెలుసుకున్నారు.
‘‘నిజంగా ఇది అద్భుతం. పిండం స్టెమ్ సెల్స్ నుంచే పూర్తిగా దీన్ని అభివృద్ధి చేశారు.’’ అని ప్రొఫెసర్ జెర్నికా-గోయెట్జ్, గార్డియన్ న్యూస్‌పేపర్‌కి చెప్పారు.
మెదడు రూపుదిద్దుకోవడంతో పాటు, గుండె కొట్టుకునేలా సింథటిక్ ఎలుక పిండాలను ఇప్పటికే ఆమె అభివృద్ధి చేశారు.
ఇదే సమయంలో చైనాలోని శాస్త్రవేత్తలు సింథటిక్ కోతుల పిండాలను మహిళా కోతుల్లోకి ప్రవేశపెట్టారు. అయితే, దీనికి సంబంధించిన అన్ని ప్రెగ్నెన్సీలు విఫలమయ్యాయి.
ఈ సింథటిక్ పిండాలు సాధారణ పిండాల్లాగా ఉండవు.
అయితే, వీరి పరిశోధనలో ఈ పిండాలను ఎలా వాడారన్నది మాత్రం ఇంకా అస్పష్టంగానే ఉంది.

ఫొటో సోర్స్, AMADEI AND HANDFORD
‘‘స్టెమ్ సెల్స్ నుంచి రూపొందించిన ఈ మానవ పిండాల మోడల్స్‌ను ఐవీఎఫ్ లాంటి మానవ పిండాల చికిత్సకు ప్రత్యామ్నాయంగా వెంటనే అందుబాటులో ఉండే చికిత్సగా దీన్ని వాడొచ్చు’’ అని ప్రొఫెసర్ బిస్కో అన్నారు.
మరోవైపు వీటిని ఎలా వాడాలి అనే దానిపై స్పష్టమైన ప్రమాణాలు, మార్గదర్శకాలు ఉండాలన్నారు.
చాలా దేశాల్లో మానవ పిండాల పరిశోధనలో 14 రోజుల నిబంధనను వాడుతున్నారు. మానవ అండాన్ని ఫలదీకరణం చేసి పిండంగా మార్చి, దాన్ని పెంచేందుకు 14 రోజుల సమయాన్ని అనుమతి ఇస్తున్నారు.
మానవ పిండాలను 14 రోజులకు మించి బయట పెంచకూడదని ప్రపంచ దేశాల శాస్త్రవేత్తలు నిర్ణయించారు.
అయితే, ‘పిండం మోడల్స్’ చట్టపరమైన పిండాలు కాకపోవడంతో, ఒకేరకమైన చట్టాలు వర్తించవు.
‘’14 రోజుల సమయాన్ని మించి కూడా ఈ కణాలను పెంచేలా మేం త్వరలోనే టెక్నాలజీ రూపొందించనున్నాం. మానవాభివృద్ధి పరిణామ క్రమంలో మరిన్ని అంశాలను తెలుసుకునే అవకాశం ఉంటుంది’’ అని యూనివర్సిటీ ఆఫ్ బర్మింగ్హమ్‌కు చెందిన డాక్టర్ ఇల్డెమ్ అకెర్మాన్ చెప్పారు.
ఫలదీకరణను అర్థం చేసుకునేందుకు
ఈ పరిశోధనను ముందుకు తీసుకెళ్లేందుకు అవసరమైన మార్గదర్శకాలను రూపొందించేందుకు బ్రిటన్‌లోని న్యాయ, నైతిక నిపుణులు ముందుకు వచ్చారు.
మానవ జీవితాల్లో ప్రాథమిక దశలను మరింత లోతుగా అర్థం చేసుకునేందుకు ఈ సింథటిక్ పిండాలు సహకరిస్తాయని పరిశోధకులు ఆశాభావం వ్యక్తం చేశారు.
‘‘మానవాభివృద్ధిలో ఈ విషయం గురించి మాకు చాలా తక్కువగా తెలుసు. కానీ, చాలా మంది ప్రెగ్నెన్సీలను కోల్పోతున్నప్పుడు ఈ పరిశోధన వచ్చింది. ఫలదీకరణను అర్థం చేసుకునేందుకు, ప్రారంభంలోనే గర్భస్రావానికి ఎందుకు గురవుతున్నారన్న విషయాలపై తక్షణమే తెలుసుకునేందుకు ఈ మోడల్స్ మనకు సహకరిస్తాయి’’ అని యూనివర్సిటీ ఆఫ్ మాంచెస్టర్‌కి చెందిన ప్రొఫెసర్ రోగర్ స్టర్మీ చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- బఠానీ రుచి లేని కొత్త రకం బఠానీలు, సోయాకు ప్రత్యామ్నాయం దొరికినట్టేనా?
- క్రానియోఫారింగియోమా: ఈ జబ్బు వస్తే 23 ఏళ్ల వ్యక్తి కూడా 13 ఏళ్ల కుర్రాడిలా కనిపిస్తాడు, ఎందుకిలా జరుగుతుంది?
- పసిపిల్లలు ఒకరి తరువాత ఒకరు చనిపోతూనే ఉన్నారు... ఏమిటీ దారుణం?
- ‘నేను అత్యాచారం వల్ల పుట్టాను.. కానీ, ఆ ప్రభావం నాపై పడనివ్వను'
- ‘మెదడు లేని బిడ్డ కడుపులో ఉందని తెలిసినా అబార్షన్‌కు ఒప్పుకోలేదు'... కూతురికి జరిగిన అన్యాయంపై ఓ తల్లి పోరాటం.
( బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















