సబ్‌స్క్రిప్షన్‌: గర్ల్‌ఫ్రెండ్ కోసం డేటింగ్ వెబ్‌సైట్లో లాగిన్ అయ్యాడు.. ఏడాది తర్వాత ఏం జరిగిందంటే..

ప్రేమ

ఫొటో సోర్స్, Getty Images

గర్ల్‌ఫ్రెండ్ కోసం వెతుకుతున్న సైమన్, ఒక ఏడాది పాటు డేటింగ్ వెబ్‌సైట్ సబ్‌స్క్రిప్షన్‌కు సైన్ అప్ చేశారు.

కొన్ని నెలల్లోనే ఆయనకు అమ్మాయి దొరికింది.

కానీ, ఆయనకు తెలియకుండానే తన సబ్‌స్క్రిపక్షన్ రెన్యువల్ అయింది.

దాంతో రూ. 37 వేలు చెల్లించాలంటూ 'డెబిట్ కలెక్షన్ ఏజెన్సీ' ఆయన వెంటపడింది, బెదిరించడం మొదలుపెట్టింది.

సైమన్ కథ అసాధారణమైనదేం కాదు.

ఉపయోగించని సబ్‌స్క్రిప్షన్‌ అకౌంట్ కోసం సంవత్సరానికి రూ. వేల కోట్లు ఖర్చు చేస్తారని వినియోగదారుల వాచ్‌డాగ్ స్వచ్ఛంద సంస్థ 'సిటిజన్స్ అడ్వైస్ బ్యూరో' (సీఏబీ) చెబుతోంది.

ఇటీవల సర్వేలో పాల్గొన్న చాలామంది వ్యక్తులు ఆటో-రెన్యూవల్‌ని తప్పుబట్టారు.

మనలో చాలామంది సబ్‌స్క్రిప్షన్ ట్రాప్‌లో పడిపోయారు. ఫ్రీ ట్రయల్‌కు సైన్ అప్ చేసి, ఆపై దానిని రద్దు చేయడం మర్చిపోవడం వల్ల ఆ సేవల కోసం చెల్లింపులు చేయాల్సి వస్తోంది.

యూజర్లను 'సబ్‌స్క్రిప్షన్‌లో లాక్ చేయడానికి ఆన్‌లైన్ రిటైలర్లు ఉపయోగించే సాంకేతికతలు' అరికట్టడానికి బ్రిటన్‌ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.

ఇది కొత్త నిబంధనలను ప్రతిపాదిస్తోంది. దీని కోసం కంపెనీలు తమ కస్టమర్‌లు సబ్‌స్క్రయిబ్‌లో ఉన్నట్లు తెలుసుకునేలా వారికి "రిమైండర్ నోటీసులు" పంపవలసి ఉంటుంది.

ప్లాన్‌లపై అందరూ సంతోషంగా ఉండరు. కస్టమర్లకు తమ సబ్‌స్క్రిప్షన్‌ గురించి ప్రతీ ఆరు నెలలకు ఒకసారి గుర్తుచేసేలా యూకే ప్రభుత్వం కొత్త చట్టాలుండటంపై డిస్నీ అసంతృప్తి వ్యక్తంచేసింది.

ఆటో రెన్యువల్‌కు సంబంధించిన నోటీసులను పంపకపోవడం వంటి వ్యూహాలు వినియోగదారుల రక్షణ చట్టాలను ఉల్లంఘిస్తున్నాయని అమెరికా రెగ్యులేటర్‌లు కంపెనీలకు గుర్తుచేస్తున్నాయి.

కస్టమర్‌లను ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్‌ ఆటోమేటిక్ రెన్యువల్‌కు సైన్ అప్ చేయించి, 'రద్దు చేసే ఆప్షన్' కష్టతరం చేసిందని అమెజాన్‌పై అమెరికా ఈనెలలో ఆరోపణలు చేసింది. ఈ ఆరోపణలను ఆ సంస్థ ఖండించింది.

జాన్
ఫొటో క్యాప్షన్, జాన్

'18 నెలల పాటు నెలకు రూ. 720 చెల్లించా'

పెద్ద సంస్థలు ఇప్పుడు ఫుడ్ డెలివరీ నుంచి కాంటాక్ట్ లెన్స్‌ల వరకు సబ్‌స్క్రిప్షన్‌లను అందిస్తున్నాయి. ఇది విస్తరిస్తున్న మార్కెట్.

సైన్ అప్ చేసే వారికి చాలావరకు కంపెనీలు ఉచిత ట్రయల్ లేదా డిస్కౌంట్లను అందజేస్తాయి .

ఫ్రీ ట్రయల్ వ్యవధి ముగిశాక సభ్యత్వ రద్దు మర్చిపోవడంతో లాక్ అయినట్లు భావిస్తున్నామని బీబీసీతో పలువురు సబ్‌క్రైబర్స్ చెప్పారు.

ఉదాహరణకు జాన్ తాను 30-రోజుల ఉచిత వ్యవధి కోసం అమెజాన్ ఫ్రైం వీడియోకి సైన్ అప్ చేసి, రద్దు చేయడం మర్చిపోయినట్లు బీబీసీకి చెప్పారు.

"నేను ఎటువంటి కారణం లేకుండా 18 నెలల పాటు నెలకు 720 ఖర్చు చేశాను" అని అన్నారు.

విజయవంతమైన వ్యాపార వ్యూహం

అమెజాన్ వంటి కంపెనీలకు ఆటో-ఎన్‌రోల్‌మెంట్ అంత మంచిది కాదని ఎండర్స్ అనాలిసిస్‌లో రీసెర్చ్ అనలిస్ట్ క్లైర్ హోలుబోవ్‌స్కీజ్ అంటున్నారు.

కంపెనీలు తమ ప్రోడక్టులను మెరుగుపరచడానికి పెట్టుబడి పెట్టడం ద్వారా లేదా సులభ మార్గమైన సబ్‌స్క్రిప్షన్ ద్వారా తమ కస్టమర్ల సంఖ్యను పెంచుకోవచ్చని హోలుబోవ్‌స్కీజ్ అభిప్రాయపడుతున్నారు.

"కస్టమర్ ప్రోడక్ట్‌ను ఒకసారి ప్రయత్నించి, ఆపై లాక్ అయ్యి, కంపెనీకి సులభమైన రాబడిని అందిస్తారు" అని అంటున్నారు.

"ఇటీవలి కాలంలో వినియోగదారుల ఆలోచనా విధానంలో మార్పు వచ్చింది. అంటే మనం ఇప్పుడు నెలవారీ ప్రాతిపదికన ప్రోడక్టులు, సేవలకు చెల్లించడం అలవాటు చేసుకున్నాం" అని హోలుబోవ్‌స్కీజ్ చెబుతున్నారు.

కానీ సబ్‌స్క్రిప్షన్ మోడల్‌లు అనేవి కస్టమర్‌లకు ఉపయోగపడని డీల్ కానవసరం లేదు.

ఫ్రీ ప్రోడక్టులు లేదా డిస్కౌంట్‌లు ఇచ్చే చాలా సంస్థలు వినియోగదారులకు రెన్యువల్ సమయం వచ్చినప్పుడు గుర్తుచేస్తాయి.

మోసం

ఫొటో సోర్స్, Getty Images

'ఆటో రెన్యువల్ పూర్తిగా నిషేధించండి'

బ్రిటన్‌లో ప్రభుత్వ ముసాయిదా చట్టం''డిజిటల్ మార్కెట్స్, కాంపిటీషన్, వినియోగదారుల బిల్లు'' అనేది వినియోగదారులు న్యాయమైన ఒప్పందం పొందేలా చూడనుంది.

అయితే మరింత ముందుకు వెళ్లాలని, ఆటో-రెన్యూవల్‌లను పూర్తిగా నిషేధించాలని సిటిజన్స్ అడ్వైస్ అంటోంది.

ఉచిత ట్రయల్ తర్వాత సబ్‌స్క్రిప్షన్‌ల నుంచి వైదొలగడానికి బదులుగా వ్యక్తులు ప్లాన్ ఎంపిక చేసుకునేలా సంస్థలు కోరాలంటూ డిమాండ్ చేస్తోంది.

"వినియోగదారుల జేబులపై పడే ఒత్తిడిని ప్రభుత్వం గుర్తించాలి. ఇది సంస్కరణలకు ప్రారంభం కావాలి, కానీ, ముగింపునకు కాదు" అని పాలసీ, అడ్వొకసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మాథ్యూ ఆప్టన్ చెప్పారు.

సబ్‌స్క్రిప్షన్‌ దానికదే పునరుద్ధరించడం కష్టతరం చేసే ఏ ప్రయత్నానైనా తాను స్వాగతిస్తున్నట్లు జాన్ చెప్పాడు.

అయితే తాను మళ్లీ అందులో చిక్కుకుపోతానేమోనని ఆందోళన చెందుతున్నానని అంటున్నారు జాన్.

"ఇది ఒత్తిడికి గురిచేసింది, చాలా ఆందోళన కలిగించింది. ఈ కంపెనీలు డబ్బు గురించి మాత్రమే శ్రద్ధ వహిస్తూ, వ్యక్తులను పట్టించుకోకపోవడం హాస్యాస్పదం" అని అన్నారు.

ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

  • మీరు దేని కోసం సైన్ అప్ చేస్తున్నారో తెలుసుకోండి. నిజంగా ఏం పొందుతారు, దానికి మీరు ఎంతకాలం కట్టుబడి ఉన్నారు. ఎంత ఖర్చవుతుందో నిర్ధారించుకోండి.
  • చెల్లింపుల కోసం ముందస్తుగా టిక్ చేసిన బాక్సులు దానిలో ఉండకూడదు, ఎందుకంటే వాటికి అనుమతి లేదు.
  • రిమైండర్‌ను సెట్ చేయండి. మీరు ఒకవేళ ఉచిత సబ్‌స్క్రిప్షన్‌ కోసం సైన్ అప్ చేస్తే, ఉచిత వ్యవధి ముగియడానికి వారం ముందు రిమైండర్‌ సెట్ చేసుకోండి. మీకు వద్దు అనుకుంటే రద్దు చేయడం మర్చిపోవద్దు.
  • మీ బ్యాంక్ ఖాతాను తనిఖీ చేయండి. మీరు ఎంచుకోని ప్రోడక్టుల సభ్యత్వాలకు చెల్లింపులు జరుగుతున్నాయో చెక్ చేసుకోండి. వాటిని రద్దు చేయడానికి కంపెనీని సంప్రదించండి.

ఇవి కూడా చదవండి

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)