బ్రిటన్ కింగ్ చేతికి కత్తిని అందించిన ఈ మహిళ ఎవరు, ఏం చేస్తారు?

ఫొటో సోర్స్, PA Media
- రచయిత, మరియా జకారో
- హోదా, బీబీసీ న్యూస్
బ్రిటన్ రాజు చేతికి కత్తిని అందించిన తొలి మహిళగా పెన్నీ మోర్డాంట్ ఘనత సాధించారు. పెన్నీ మోర్డాంట్, బ్రిటన్ ఎంపీ కూడా.
ఆమె పోర్ట్స్‌మౌత్ నార్త్‌కు ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. లార్డ్ ప్రెసిడెంట్ ఆఫ్ ద కౌన్సిల్ పదవిలో కూడా ఉన్నారు.
వెస్ట్‌మిన్‌స్టర్ అబేలో శనివారం జరిగిన బ్రిటన్ రాజు పట్టాభిషేక వేడుకలో అందంగా అలంకరించిన కత్తిని ఆమె కింగ్ చార్లెస్-3కు బహుకరించారు.
కింగ్ చార్లెస్-3 నడుముకు పెట్టిన ఒరలో కాసేపు ఆ కత్తిని ఉంచారు. ఈ సమయంలో ఆర్చ్‌బిషప్ ప్రార్థనలు నిర్వహించారు.
అనంతరం చార్లెస్-3 ఆ కత్తిని అక్కడున్న పీఠంపై ఉంచగా, దానికి డబ్బు చెల్లించి మోర్డాంట్ తిరిగి కత్తిని దక్కించుకున్నారు.
పట్టాభిషేక వేడుక మొత్తం మోర్డాంట్ చేతిలో కత్తిని పట్టుకొని కనిపించారు.

ఫొటో సోర్స్, PA Media
బాగా అలంకరించిన ఖడ్గాన్ని బహుకరించడం అనేది రాజుశక్తిని మంచి, చెడులను నిర్ణయించగల సామర్థ్యాన్ని సూచిస్తుందన్నది బ్రిటన్ రాచరికంలో ఒక నమ్మకం.
పట్టాభిషేక వేడుక ప్రారంభంలో వెస్ట్‌మిన్‌స్టర్ అబే మీదుగా జరిగిన ఊరేగింపులో మోర్డాంట్, 17వ శతాబ్దం నాటి ఖడ్గాన్ని చేతిలో పట్టుకున్నారు.
తర్వాత ఈ పురాతన ఖడ్గం స్థానంలో బాగా అలంకరించిన మరో కత్తిని చేతిలోకి తీసుకొని రాజుకు బహుకరించారు.
వేడుకలో మోర్డాంట్ స్థితప్రజ్ఞతను పలువును నెటిజన్లు సోషల్ మీడియాలో మెచ్చుకున్నారు.
‘రాజకీయాలతో సంబంధం లేకుండా పెన్నీ మోర్డాంట్ నిజంగా ఆకట్టుకున్నారు’ అని ఒక ట్విటర్ యూజర్ ఆమెను ప్రశంసించారు.
మరొక వ్యక్తి ఆమె వ్యక్తిగత శిక్షకుడిని మెచ్చుకోగా, టీవీ వ్యాఖ్యాత డాన్ వాకర్, ఆమెను ఒలింపిక్స్‌లో పాల్గొనాల్సిందిగా సూచించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది

ఫొటో సోర్స్, Getty Images
పలువురు ఎంపీలు కూడా వేడుకలో మోర్డాండ్ ప్రవర్తించిన తీరును మెచ్చుకున్నారు.
‘కత్తి కంటే మోర్డాంట్ శక్తిమంతమైనవారు’ అని లేబర్ పార్టీ ఎంపీ క్రిస్ బ్రయాంట్ వ్యాఖ్యానించగా, ‘‘పెన్నీ మోర్డాంట్ అద్భుతంగా కనిపించారు. ఖడ్గాన్ని చేతిలో పట్టుకొని ఆమె అందరి మనసును దోచారు’’ అని లేబర్ పార్టీ మరో ఎంపీ ఎమిలీ థార్న్‌బెరీ ట్వీట్ చేశారు.

ఫొటో సోర్స్, Getty Images
‘స్వర్డ్ ఆఫ్ స్టేట్’ గా పిలిచే ఆ ఖడ్గం చాలా బరువుగా ఉందని కానీ, తాను దాన్ని మోయగలిగానని ఈ వారం మొదట్లో బీబీసీ రేడియో సోలెంట్‌తో మోర్డాంట్ చెప్పారు.
ఆమె ధరించిన దుస్తులపై కూడా సోషల్ మీడియాలో ప్రశంసలు వచ్చాయి.
గత ఏడాది క్వీన్ ఎలిజబెత్-2 మరణాన్ని అధికారికంగా ప్రకటించే బాధ్యతను కూడా మోర్డాంట్ నిర్వహించారు.
ఇవి కూడా చదవండి:
- స్లీప్ పెరాలసిస్: నిద్రలో గుండెపై దెయ్యం కూర్చున్నట్లు ఎందుకు అనిపిస్తుంది?
- ‘ది కేరళ స్టోరీ’: ఇస్లాంలోకి మారిన అమ్మాయిల కథతో తీసిన ఈ సినిమాపై వివాదం ఎందుకు?
- అరికొంబన్: ఈ కిల్లర్ ఎలిఫెంట్ చేసిన పనికి తీసుకెళ్లి టైగర్ రిజర్వ్‌లో వదిలేశారు
- జైశంకర్: భారత్ తరఫున బలమైన గొంతుకా, లేక దూకుడుతో వచ్చిన పాపులారిటీనా?
- వరల్డ్ ఆస్తమా డే: ఉబ్బసం ఎందుకు వస్తుంది? నివారించడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి?
( బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















