బకింగ్‌హమ్ ప్యాలెస్ బాల్కనీ నుంచి ప్రజలకు రాజకుటుంబం అభివాదం

ఫొటో సోర్స్, Getty Images
కింగ్ చార్లెస్ III, క్వీన్ కాన్సర్ట్ కామిల్లా, ఇతర కుటుంబ సభ్యులు బకింగ్‌హామ్ ప్యాలెస్ బాల్కనీ నుంచి ప్రజలకు అభివాదం చేశారు.
వెస్ట్‌మినిస్టర్ అబేలో పట్టాభిషేక ఘట్టం ముగిసిన తర్వాత రాయల్ ఫ్యామిలీ సభ్యులు తిరిగి బకింగ్‌హమ్ ప్యాలెస్ వచ్చారు.
అక్కడ వేలమంది ప్రజలు ఎదురు చూస్తుండగా, రాజకుటుంబం బాల్కనీ నుంచి ప్రజలకు కనిపించారు.
వెస్ట్‌మినిస్టర్ అబేలో తండ్రి పట్టాభిషేకానికి హాజరైన కింగ్ చార్లెస్ III రెండో కుమారుడు హ్యారీ, బాల్కనీ అప్పియరెన్స్‌లో మాత్రం కుటుంబ సభ్యులతో కలిసి కనిపించ లేదు.
బీబీసీకి అందిన సమాచారం ప్రకారం హ్యారీకి బాల్కనీ నుంచి ప్రజలకు కనిపించే కార్యక్రమానికి ఆహ్వానం అందలేదు. పట్టాభిషేక కార్యక్రమానికి హ్యారీ భార్య మేఘాన్ హాజరు కాలేదు

ఫొటో సోర్స్, Reuters



