ప్రిన్స్ హ్యారి: ‘మా అన్న నన్ను కింద పడేలా కొట్టాడు’... కొత్త పుస్తకంలో సంచలన విషయాలు

ఫొటో సోర్స్, Getty Images
బ్రిటన్ యువరాజు హ్యారీ కొత్త పుస్తకం ‘స్పేర్’ అనేక సంచలన విషయాలకు కేంద్రంగా మారుతోంది.
తాను తొలిసారి సెక్స్‌లో పాల్గొనడం నుంచి అన్న విలియమ్ తన మీద చేయి చేసుకోవడం వరకు అనేక సంగతులను ఆ పుస్తకంలో ప్రిన్స్ హ్యారీ ప్రస్తావించారు.
బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్-3, ప్రిన్సెస్ డయానాల రెండో కుమారుడే ప్రిన్స్ హ్యారీ. ‘స్పేర్’ పుస్తకంలో ఆయన వెల్లడించిన అంశాల ప్రకారం...
‘కింద పడేలా కొట్టాడు’
2019లో ఒకసారి లండన్‌లోని నా ఇంట్లో విలియమ్ నన్ను కింద పడేలా కొట్టాడు. నా భార్య మేఘన్ మీద విలియమ్ చేసిన కామెంట్స్ వల్ల ఆ గొడవ జరిగింది. ‘25 మంది తాలిబాన్ ఫైటర్లను చంపాను’
2012-13లో అఫ్గానిస్తాన్‌లో హెలికాప్టర్ పైలెట్‌గా పని చేసినప్పుడు 25 మంది తాలిబాన్ ఫైటర్లను చంపాను. అందుకు నేను గర్వపడటం లేదు. అలా అని సిగ్గుగా లేదు. యుద్ధంలో ఉన్నప్పుడు నేను వారి గురించి ఆలోచించలేదు. చదరంగంలో పావులను తీసేసినట్లు వారిని తొలగించాను. మంచి వాళ్లను చంపక ముందే చెడ్డ వాళ్లను అంతం చేయాలి.
‘ఆమెను పెళ్లి చేసుకోవద్దని నాన్నకు చెప్పాం’
కమిల్లాను పెళ్లి చేసుకోవద్దని నాన్న(కింగ్ చార్లెస్-3)ను నేను, విలియం వేడుకున్నాం. ఆమె మమ్మల్ని సరిగ్గా చూసుకోక పోవచ్చు అనే భయపడ్డాం.
‘రాణి చనిపోయినట్లు బీబీసీలో చూసి తెలుసుకున్నా’
రాణి ఆరోగ్యం అత్యంత విషమంగా ఉన్నప్పుడు నాన్న ఫోన్ చేశారు. రాణి ఉన్న బల్మోరల్ ప్యాలెస్‌కు నన్ను ఒక్కడినే రమ్మన్నారు. నాతోపాటు మేఘన్‌ను తీసుకు రావొద్దని నాన్న చెప్పారు. నేను ప్రయాణిస్తున్న విమానం కిందకు దిగుతున్న సమయంలో మేఘన్ నుంచి నా ఫోన్‌కు మెసేజ్ వచ్చింది. అప్పుడే బీబీసీ వెబ్‌సైట్ చూడగా మా నాయనమ్మ చనిపోయిందని, మా నాన్న రాజు అయ్యాడని తెలిసింది.

ఫొటో సోర్స్, Reuters
‘17 ఏళ్లకే డ్రగ్స్ తీసుకున్నా’
డ్రగ్స్ తీసుకోవడమనేది మరీ అంత సంతోషం కలిగించే అంశం కాదు. 17 ఏళ్లకే ఒక మిత్రుని ఇంట్లో కొకైన్ తీసుకున్నా. ఆ తరువాత అనేక సార్లు డ్రగ్స్ తీసుకున్నా. అవి తీసుకున్నప్పుడు నన్ను నేను భిన్నమైన వ్యక్తిగా చూసుకునేవాడిని. కాలేజీలో ఉన్నప్పుడు బాత్రూలో గంజాయి తాగేవాడిని.
‘పబ్ వెనుక తొలిసారి సెక్స్‌లో పాల్గొన్నా’
నేను తొలిసారి నా కంటే వయసు ఎక్కువ ఉన్న ఆమెతో సెక్స్‌లో పాల్గొన్నా. అదీ ఒక పబ్ వెనుక ఉన్న ఖాళీ స్థలంలో. అది అవమానకరమైన ఘటన. అంత బిజీగా ఉండే పబ్ వెనుక బహిరంగ ప్రదేశంలో సెక్స్‌లో పాల్గొనడం అనేది నేను చేసిన తప్పుల్లో ఒకటి. మమ్మల్ని కచ్చితంగా ఎవరో ఒకరు చూసే ఉంటారు.
‘ఒత్తిడి వల్ల గర్భం రావడం కష్టమైంది’
పెళ్లి అయిన తరువాత వెంటనే మేఘన్, నేను పిల్లలను కనాలని అనుకున్నాం. కానీ బిజీ కెరియర్ వల్ల కుదరలేదు.
ఆ తరువాత మేఘన్ బరువు తక్కువగా ఉండటం వల్ల గర్భం దాల్చడం తనకు కష్టంగా మారుతుంది. అందుకే మేఘన్ బరువు పెరగడం ప్రారంభించింది. మేఘన్ బరువు తగ్గడానికి కారణం ఆమె ఒత్తిడికి గురి కావడమే.
ప్రిన్స్ హ్యారీ ఆత్మకథ ‘స్పేర్’ పుస్తకం ఇంకా మార్కెట్‌లోకి రాలేదు. ఈ నెల 10 నుంచి అమ్మకాలు మొదలవుతాయని చెబుతున్నారు.
కానీ స్పెయిన్‌లోని కొన్ని దుకాణాలు ‘స్పేర్’ పుస్తకాన్ని ఉంచాయి. దాంతో చాలా మంది జర్నలిస్టులు వాటి కోసం ఎగబడ్డారు. అలా బీబీసీ జర్నలిస్టుల్లో ఒకరు బుక్‌ను సంపాదించారు.
ఆ తరువాత పుస్తకంలోని విషయాలు బయటకు రావడంతో స్పెయిన్‌లోని ప్రధాన దుకాణాల్లో ప్రిన్స్ హ్యారీ పుస్తకాలను అమ్మడాన్ని ప్రస్తుతానికి ఆపేశారు.
ఇవి కూడా చదవండి
- జెరూసలేం: అల్-అక్సా... మందిరం ఒక్కటే... ముస్లింలు, యూదులకు పవిత్ర స్థలం ఎలా అయింది
- యువ అథ్లెట్లలో కొందరికి గుండెపోటు ఎందుకు వస్తోంది?
- గణితంలో బ్రిటన్ వెనుకబడిందా... 18ఏళ్ల వరకూ అందరూ మ్యాథ్స్ చదవాలంటున్న రిషి సునాక్
- ఉత్తర కొరియా: 2023లో కిమ్ అణుబాంబును పరీక్షిస్తారా? ఉభయ కొరియాల మధ్య ఘర్షణ జరుగుతుందా?
- మేరీ ఎలిజబెత్: 24 ఏళ్లు సన్యాసినిగా జీవించాక ప్రేమలో పడిన సిస్టర్... ఆ తర్వాత ఆమె జీవితం ఎన్ని మలుపులు తిరిగింది?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














