రాయల్ వెడ్డింగ్: రాకుమారుడికి ముంబయి డబ్బావాలాల కానుక

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, రిపోర్టింగ్: రాహుల్ రణ్‌శుభే, షూట్ ఎడిట్: శరద్
- హోదా, బీబీసీ ప్రతినిధులు
బ్రిటన్ రాచకుటుంబంలో జరిగే వివాహ వేడుకలకు ఆహ్వానితులలో ప్రపంచ నలుమూలల నుంచి విచ్చేసే వీఐపీలే ఉంటారని భావిస్తాం. కానీ 2005లో జరిగిన ప్రిన్స్ ఛార్లెస్, కెమెల్లా పార్కర్‌ల పెళ్లి వేడుకకు భారత్ నుంచి ఎవ్వరూ ఊహించని ఓ విఐపీ బృందం వెళ్లింది.
8 రోజుల పాటు రాచకుటుంబ ఆతిథ్యం స్వీకరించింది. విందు వినోదాల్లో పాల్గొని జీవితానికి సరిపడా జ్ఞాపకాలను తెచ్చుకుంది.
ఇంతకీ ఆ వీఐపీలు ఎవరో తెలుసా? ముంబయి డబ్బావాలాలు.
బ్రిటన్‌లోని విండ్సర్ క్యాజిల్‌లో శనివారం బ్రిటన్ యువరాజు హ్యారీ, అమెరికా నటి మేఘన్ మార్కెల్‌ల పెళ్లి మరి కొద్ది గంటల్లో జరుగనుంది.
ఈ నేపథ్యంలో 2005లో లండన్‌లో జరిగిన ప్రిన్స్ ఛార్లెస్, కెమెల్లా పార్కర్‌ల వివాహానికి హాజరైన ముంబయి డబ్బావాలాలతో బీబీసీ మాట్లాడింది.
నాటి వేడుకకు సంబంధించి వారు తమ జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు.
అప్పట్లో రాకుమారుడు ఛార్లెస్‌కు వివాహం సందర్భంగా ఒక బహుమానం అందజేశామని, ఇప్పుడు కూడా ముంబయి డబ్బావాలా సంఘం తరఫున, భారత్ తరఫున ప్రిన్స్ హ్యారీకి శుభాకాంక్షలు తెలుపుతూ కానుక పంపిస్తామని చెప్పారు.
డబ్బావాలా ఇంకా ఏమన్నారో ఈ వీడియోలో చూడండి.
ఈవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









