బ్లాక్ బెర్రీ: ఈ పండ్లు తింటే గుండె జబ్బు, క్యాన్సర్ దూరమవుతాయా?

ఫొటో సోర్స్, Empics
- రచయిత, నికోలా షబ్రూక్
- హోదా, బీబీసీ గుడ్ ఫుడ్
బ్లాక్‌బెర్రీల్లో పోషకాలు అపారంగా ఉంటాయి. ఇవి చిక్కటి ఊదాలాంటి నలుపు రంగులో చాలా ఆకర్షణీయంగా కనిపిస్తాయి.
సాధారణంగా యూకేలో వేసవి చివర నుంచి అక్టోబర్ మధ్య వరకు బ్లాక్‌బెర్రీలు లభిస్తాయి. అడవుల్లో, పొదల్లో వీటిని పెంచుతారు.
ప్రతీ బెర్రీ పండు పక్వానికి వచ్చేసరికి డ్రూప్‌లెట్స్ అని పిలిచే చిన్న, రసం నిండిన 20-50 గింజలుగా రూపాంతరం చెందుతుంది.

ఫొటో సోర్స్, Getty Images
పోషకాల గని
బ్లాక్‌బెర్రీల్లో ఉండే పోషకాలు చూద్దాం
80 గ్రాముల బ్లాక్‌బెర్రీలను తీసుకుంటే ఏమేం పోషకాలు లభిస్తాయో కింద చూడండి.
20 కేలరీల శక్తి
0.7 గ్రాములు ప్రొటీన్
0.2 గ్రాములు కొవ్వు
4.1 గ్రాముల కార్బొహైడ్రేట్స్
3.3 గ్రాములు ఫైబర్
128 మిల్లీ గ్రాముల పొటాషియం
1.12 మిల్లీ గ్రాముల మాంగనీస్
12 మిల్లీ గ్రాముల విటమిన్ ‘సి’
ఇప్పుడు టాప్-5 ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.

ఫొటో సోర్స్, Getty Images
1. గుండె వ్యాధుల నుంచి కాపాడుతుంది
బ్లాక్‌బెర్రీల్లో ఆంథోసినిన్స్ అనే మూలకం పుష్కలంగా ఉంటుంది. శక్తిమంతమైన యాంటీఆక్సిడెంట్లు దీనికి ముదురు పర్పుల్ రంగును అందిస్తాయి.
బ్లాక్‌బెర్రీ జ్యూస్‌లో లభించే ఆంథోసినిన్ సారం, గుండె జబ్బుల నుంచి రక్షించే లక్షణాలను కలిగి ఉన్నట్లు ఒక అధ్యయనం వివరించింది.
ఈ బ్లాక్ బెర్రీల్లో విటమిన్ ‘సి’, పొటాషియం కూడా అపారంగా ఉంటాయి.
ఆరోగ్యకరమైన హృదయ వ్యవస్థకు విటమిన్ ‘సి’, పొటాషియం చాలా సహాయకంగా ఉంటాయి.

ఫొటో సోర్స్, Getty Images
క్యాన్సర్ నివారణలో...
క్యాన్సర్‌ను నిరోధించే ‘సూపర్ ఫుడ్’ ఏదీ లేనప్పటికీ, మంచి ఆరోగ్యకరమైన ఆహారం క్యాన్సర్ ముప్పును తగ్గించగలదని రుజువులు ఉన్నాయి.
న్యూట్రీషన్ అండ్ క్యాన్సర్ జర్నల్ ప్రచురించిన ఒక అధ్యయనంలో తాజా బ్లాక్ బెర్రీలు, క్యాన్సర్ కణుతుల పెరుగుదల, క్యాన్సర్ వ్యాప్తిని నివారించడంలో సహాయపడతాయని కనుగొన్నారు. ఈ అంశంపై మరింత పరిశోధన అవసరం.

ఫొటో సోర్స్, Getty Images
మెదడు శక్తి పెరుగుదలలో...
ప్రతీరోజూ ఆహారంలో బ్లాక్‌బెర్రీలను తీసుకోవడం వల్ల మెటార్ (చలన), కాగ్నిటివ్ (అభిజ్ఞ) పనితీరు మెరుగుపడుతుందని న్యూట్రీషనల్ న్యూరోసైన్స్ జర్నల్ చేసిన ఒక అధ్యయనంలో తెలిసింది.
వైల్డ్ బ్లాక్‌బెర్రీలను తీసుకోవడం వల్ల అందులోని పాలీఫినోల్ కారణంగా మెదడుకు మేలు జరుగుతుందని యూరోపియన్ జర్నల్ ఆఫ్ న్యూట్రీషన్ చేసిన ఒక అధ్యయనం పేర్కొంది. మాంగనీస్ ఖనిజం కూడా ఈ పండ్లలో పుష్కలంగా లభిస్తుంది.
మెదడు పనితీరులో మాంగనీస్ చాలా కీలక పాత్ర పోషిస్తుంది. మాంగనీస్ లోపం వల్ల మూర్చ (ఎపిలెప్సీ) వచ్చే ముప్పు పెరుగుతుందని కనుగొన్నారు.
యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు
బ్లాక్‌బెర్రీల్లోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలపై అనేక అధ్యయనాలు జరిగాయి.
ఆర్థరైటిస్ వంటి ఇన్‌ఫ్లమేటరీ లక్షణాల నుంచి బ్లాక్‌బెర్రీలు రక్షణను అందిస్తాయని ఆ అధ్యయనాలు సూచించాయి.
అయితే, ఈ అంశంపై మరింత పరిశోధన అవసరం ఉంది. కడుపులోని అల్సర్ల వల్ల కలిగే మంటను 88 శాతం తగ్గించినట్లు మరో అధ్యయనం పేర్కొంది.

ఫొటో సోర్స్, Getty Images
నోటి ఆరోగ్యానికి...
బ్లాక్‌బెర్రీలలో యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు ఉన్నట్లు 2013 నాటి పీరియడాంటర్ రీసెర్చ్ జర్నల్ చేసిన ఒక అధ్యయనంలో కనుగొన్నారు.
అంతేకాకుండా యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ-వైరల్ ప్రభావాలు కూడా ఉన్నట్లు గుర్తించారు. ఇవన్నీ దంతాల ఇన్ఫెక్షన్లకు సహజంగానే థెరపీలాగా పనిచేయవచ్చు.
అందరూ బ్లాక్‌బెర్రీలను తినొచ్చా?
బ్లాక్‌బెర్రీల వల్ల అలర్జీలు రావడం చాలా అరుదు.
బెర్రీలు, రోసేసీ కుటుంబానికి చెందినవి అయినప్పటికీ ఇవి క్రాస్ రియాక్టివిటీ అలర్జీలకు పేరు పొందాయి. బిర్చ్ పోలెన్ అలర్జీలు ఉన్నవారికి కూడా బ్లాక్‌బెర్రీల వల్ల ఎలాంటి చేటు లేదని నివేదికలు తెలుపుతున్నాయి.
దీన్ని బట్టి బ్లాక్‌బెర్రీలు చాలావరకు సురక్షితమే అని చెప్పవచ్చు.
అయితే, మీకు సాలిసిలేట్స్ వల్ల ఇబ్బందులు ఉన్నట్లయితే బ్లాక్‌బెర్రీల్లో సాలిసిలేట్స్ ఉంటాయనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి.
- రామ్ చరణ్ – ఉపాసన: బొడ్డు తాడు రక్తాన్ని ఎందుకు ప్రిజర్వ్ చేస్తున్నారు? ఎంత ఖర్చవుతుంది
- ‘ద కోవెనంట్’: తనకు సాయం చేసి ప్రాణాల మీదకు తెచ్చుకున్న అఫ్గాన్ గైడ్‌ను కాపాడటానికి ప్రయత్నించే అమెరికా సైనికుడి కథ
- ఆదిపురుష్ - అవతార్ : ‘మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ’ అంటే ఏంటి, ఇది ఎలా పనిచేస్తుంది?
- ఆదిపురుష్: సీత ‘భారత పుత్రిక’ అనే డైలాగ్పై నేపాల్‌లో వివాదం ఏంటి?
- ‘అహింస’ రివ్యూ: డైరెక్టర్ తేజ మార్క్ కనిపించిందా? రామానాయుడి మనవడు అభిరామ్ నటన ఎలా ఉంది?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














