జాన్వీ కపూర్ నటించిన బవాల్ సినిమాను అమెజాన్ ప్రైమ్ నుంచి తొలగించాలని యూదు సంస్థ డిమాండ్
హిట్లర్ కాలం నాటి మారణహోమాన్ని అభ్యంతరకరంగా చూపించిన బవాల్ సినిమాను స్ట్రీమింగ్ చేయకుండా తొలగించాలని ఒక యూదుల సంస్థ అమెజాన్ ప్రైమ్‌కు లేఖ రాసింది.
లైవ్ కవరేజీ
రూ. 500 నోట్లపై స్టార్ గుర్తు ఉంటే అవి ఒరిజినలా, నకిలీనా... ఆర్‌బీఐ ఏం చెప్పింది?
‘అమ్మానాన్నే నన్ను చంపేయాలనుకున్నారు’
నేటి బీబీసీ తెలుగు లైవ్ పేజీని ముగిస్తున్నాం
ఇంతటితో బీబీసీ తెలుగు లైవ్ పేజీని ముగిస్తున్నాం.
తాజా న్యూస్ అప్డేట్స్‌తో రేపు ఉదయం మళ్ళీ కలుసుకుందాం.
నమస్తే. గుడ్ నైట్.
మరుగుజ్జు అథ్లెట్స్: అంతర్జాతీయంగా సత్తా చాటడమే లక్ష్యం
జాన్వీ కపూర్ నటించిన బవాల్‌ను అమెజాన్ ప్రైమ్ నుంచి తీసేయాలని యూదు సంస్థ డిమాండ్

ఫొటో సోర్స్, SPICE PR
హిట్లర్ కాలం నాటి మారణహోమాన్ని అభ్యంతరకరంగా చూపించిన బవాల్ సినిమాను స్ట్రీమింగ్ చేయకుండా తొలగించాలని ఒక యూదుల సంస్థ అమెజాన్ ప్రైమ్‌కు లేఖ రాసింది.
“లక్షలాది మంది యూదుల మరణాలను, అనుభవించిన బాధలను ఈ చిత్రం అపహాస్యం చేసింది” అని సైమన్ వయెసంథాల్ సెంటర్ ఆరోపించింది. ఒక ప్రేమ కథా చిత్రంలో మారణహోమాన్ని చూపించిన తీరుకు బహుశా భారతదేశంలో కూడా విమర్శలు వచ్చే ఉంటాయని ఆ సెంటర్ వ్యాఖ్యానించింది.
అయితే, ఈవిమర్శలను తాము ఊహించలేదని చిత్ర దర్శకుడు, నటీనటులు అభిప్రాయపడ్డారు.
ఈ సినిమా గత శుక్రవార ప్రైమ్ వీడియోలో విడుదలైంది. అప్పటి నుంచీ ఈ చిత్రం మీద విమర్శలు వినిపిస్తూనే ఉన్నాయి. ప్రేమకథలోని ప్రధాన పాత్రలకు, మారణహోమానికి మధ్య సారూప్యాలు చూపించే ప్రయత్నాన్ని కొందరు విమర్శించారు.
కొత్తగా పెళ్ళయిన జంట యూరప్ యాత్రకు వెళ్ళడమనే కథాంశంతో తీసిన ఈ చిత్రంలో వరుణ్ ధవన్, జాన్వి కపూర్ నటించారు. హిస్టరీ టీచర్ అయిన హీరో ఇందుల్ ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ ద్వారా చరిత్ర పాఠాలు చెబుతుంటారు. బీటలువారిన వివాహబంధాన్ని తిరిగి నిలబెట్టుకోవాలనే చివరి ప్రయత్నాన్ని హీరోయిన్ చేస్తుంటారు.
అయితే, మానవ నరమేధానికి సంబంధించిన చరిత్రను ప్రేమకథకు ఆపాదిస్తూ వినిపించే డైలాగులు చౌకబారుగా ఉన్నాయని విమర్శలు వచ్చాయి. ఇందులో ఒక పాత్ర ‘మనమంత హిట్లర్లమే కదా’అంటూ నాయిక మనిషి దురాశ గురించి చెబుతారు.
పది లక్షల మందికి పైగా యూదులను హతమార్చిన ఔష్విట్జ్ క్యాంప్‌ను ప్రస్తావిస్తూ, ‘ప్రతి బంధం తనదైన ఔష్విట్జ్ నుంచి వెళ్ళాల్సిందే’అనే డైలాగ్ మరోచోట ఆమె నోటనే పలికిస్తారు.
తీవ్రమైన అంశాన్ని ఇలా తేలిక చేసి చూపడం తప్పంటూ, ఆ సినిమాను స్ట్రీమింగ్ నుంచి తీసేయాలని యూదు సంస్థలు డిమాండ్ చేశాయి.
అయితే, దర్శకుడు నితేశ్ తివారీ, “సినిమాలను భూతద్దంలో పెట్టి చూడకూడదు. అలా చూస్తే అన్నీ తప్పులే కనిపిస్తాయి” అని అన్నారు.
ఆంగ్ సాన్ సూచీ: మియన్మార్ నేత జైలు నుంచి గృహ నిర్బంధానికి..

ఫొటో సోర్స్, Getty Images
మియన్మార్ నాయకురాలు ఆంగ్ సాన్ సూచీని జైలు నుంచి తరలించి, గృహ నిర్బంధంలో ఉంచారు.
సోమవారం నే పీ టాలోని ప్రభుత్వ భవనానికి సూచీని తరలించినట్లు జైలు వర్గాలు తెలిపాయని బీబీసీ బర్మా వెల్లడించింది. 2021 ఫిబ్రవరిలో సైనిక తిరుగుబాటు సమయంలోసూచీని అరెస్టు చేశారు
నోబెల్ శాంతి బహుమతిని గెలుచుకున్న సూచీ ఈ ఏడాది జూన్ వరకు గృహనిర్బంధంలో ఉన్నారు. ఆ తర్వాత ఆమెను జైలుకు తరలించారు. మియన్మార్ సైన్యం చేపట్టిన విచారణలో 78 ఏళ్ల సూచీకి 33 ఏళ్ల శిక్ష పడింది.
అయితే, గత రెండేళ్ల నుంచి ఆమె ఆరోగ్యంపై ఎలాంటి సమాచారం బయటకు రాలేదు. ప్రభుత్వం ఆమెను గృహనిర్బంధానికి తీసుకెళ్లడం సానుకూల చర్యగా పరిగణిస్తున్నారు.
సూచీని జైలు నుంచి తరలించారనే వార్తను సైన్యం ఇంకా అధికారికంగా ధ్రువీకరించలేదు.
హైదరాబాద్ యువతి అమెరికాలో ఎంఎస్ చదివేందుకు వెళ్లి రోడ్డు పక్కన దీనస్థితిలో కనిపించారు... అసలేం జరిగింది?
హస్తప్రయోగ ఘటనలు బహిరంగ ప్రదేశాల్లో పెరుగుతున్నాయి... మహిళలు ఎలా ఫిర్యాదు చేయాలి?
ఛత్తీస్‌గఢ్ ఐఏఎస్ అధికారి రానూ సాహూను ఎందుకు అరెస్ట్ చేశారు?
స్వలింగ సంపర్కులకు మద్దతుగా భారత్‌లో తొలి 'ప్రైడ్ మార్చ్' ఎప్పుడు జరిగింది... చరిత్ర సృష్టించిన ఈ మార్చ్ కథేంటి?
తెలంగాణ: ఎడతెగని వానలతో పొంగిపొర్లుతున్న జలాశయాలు, ప్రమాదకరంగా జలపాతాలు, టూరిస్టులకు అధికారుల హెచ్చరికలు
మణిపుర్ హింసపై వస్తున్న వార్తల్లో ఏది నిజం, ఏది అబద్ధం?
వినుకొండలో వైసీపీ, టీడీపీ శ్రేణుల ఘర్షణ.. గాల్లోకి కాల్పులు జరిపిన సీఐ

ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లా వినుకొండలో వైసీపీ, టీడీపీ శ్రేణుల మధ్య గురువారం ఘర్షణ జరిగింది.
మాజీ ఎమ్మెల్యే ఆంజనేయులుపై నమోదైన కేసులకు వ్యతిరేకంగా టీడీపీ ఆందోళన చేస్తోంది.
అదే మార్గంలో వెళ్తున్న ఎమ్మెల్యే బ్రహ్మనాయుడి వాహనం ముందు టీడీపీ నిరసనకు ప్రయత్నించింది.
ఆ సమయంలో రెండు వర్గాల మధ్య వాగ్వాదం ముదిరి ప్రత్యక్ష దాడులకు దారితీసింది.
కర్రలతో కొట్టుకున్నారు. రాళ్ళ దాడి జరిగింది.
పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు సీఐ సాంబశివరావు గాల్లోకి కాల్పులు జరిపారు.
గోడకుర్చీ వేస్తే బీపీ తగ్గుతుందా?
ముత్యాలధార జలపాతానికి వెళ్లి చిక్కుపోయిన 80 మంది టూరిస్టులు.. ఎలా రక్షించారంటే, ప్రవీణ్ కుమార్, బీబీసీ కోసం

ములుగు జిల్లా వెంకటాపురం మండలం వీరభద్రం సమీపంలోని ‘ముత్యాలధార’ జలపాతం సందర్శనకు వెళ్లి తిరిగి వస్తుండగా వాగు వద్ద చిక్కుకుపోయిన 80 మంది టూరిస్టులను పోలీసులు కాపాడారు.
ములుగు పోలీసులు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టి కాపాడారు.
కరీంనగర్, వరంగల్, హన్మకొండ, వరంగల్ జిల్లాలకు చెందిన టూరిస్టులు బుధవారం మధ్యాహ్నం అటవీప్రాంతంలోని జలపాతం చూసి తిరుగు ప్రయాణంలో వాగు ఉద్ధృతి పెరగడంతో అక్కడే చిక్కుకుపోయారు.

వాగులో ప్రవాహం తగ్గకపోవడం, మరో వైపు చీకటి పడుతుండటంతో డయల్ 100 సహాయంతో ములుగు పోలీసుల సహాయం కోరారు.
ములుగు ఎస్పీ గౌస్ ఆలం ఆధ్వర్యంలో 50 మంది సభ్యుల డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అర్ధరాత్రి రెస్క్యూ ఆపరేషన్ మొదలుపెట్టి తెల్లవారుజాము 3 గంటల ప్రాంతంలో టూరిస్ట్‌లను వరద ప్రవాహం నుంచి సురక్షిత ప్రాంతానికి తీసుకువచ్చారు.
చిక్కుకుపోయిన వారంతా 30 ఏళ్ల లోపు యువకులే అని పోలీసులు తెలిపారు.
సుమారు 12 గంటల పాటు ప్రవాహంలో చిక్కుకుపోయిన టూరిస్టులకు రెస్క్యూ ముగిసిన తర్వాత ఆహారం, మందులు అందించారు.
టూరిస్టులలో ఒకరు తేలు కాటుకు గురవడంతో ప్రాథమిక చికిత్స అందించారు.
భారీ వర్షాలు కురుస్తున్నందున అత్యవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటకు రావొద్దని ములుగు ఎస్పీ గౌస్ ఆలం కోరారు.

కడప స్టీల్ ప్లాంట్: కేంద్రం లాభం లేదంటోంది.. జగన్ సొంత జిల్లాలో ఉక్కు కర్మాగారం భవిష్యత్తేమిటి
అబ్దుల్ కలాం: చనిపోవడానికి ముందు ఆ చివరి ఐదు గంటల్లో ఏం జరిగింది
యూఎఫ్‌ఓ, ఏలియన్స్‌పై ఏకమైన అమెరికా కాంగ్రెస్, కాయ్‌లా ఎప్‌స్టెయిన్, బీబీసీ న్యూస్

యూఎఫ్‌ఓలు, ఏలియన్స్‌పై అమెరికా కాంగ్రెస్ నిజానిజాలు తెలుసుకోవాలని అనుకుంటోంది.
అన్ ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్ (యూఎఫ్‌ఓ)గా పిలిచే ఈ దృగ్విషయంపై అత్యున్నత స్థాయిలో పరిశీలన, విచారణ జరిపేందుకు హౌజ్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ బుధవారం దీనిపై ఒక ప్యానెల్‌ను ఏర్పాటు చేసింది.
‘‘ఎగిరే సాసర్లు, గ్రీన్ మెన్ గురించి యూఎస్ చట్టసభ సభ్యులు విచారించడం లేదు. మేం వీటికి సంబంధించిన వాస్తవాలను పొందబోతున్నాం’’ అని సమావేశం ప్రారంభానికి ముందు రిపబ్లికన్ టిమ్ బుర్చెట్ చెప్పారు.
ఈ తరహా ఆబ్జెక్టులతో తమకు ఎదురైన అనుభవాల గురించి ముగ్గురు సాక్షులు సభావేదికగా పంచుకున్నారు.
ఇది జాతీయ భద్రతకు ముప్పును కలిగించే ప్రమాదం ఉందని సభలోని సభ్యులంతా అంగీకరించారు.
యూఏపీ (అన్‌ఐడెంటిఫైడ్ అనామలస్ ఫినామినా) ల గురించి తమకు మరింత పారదర్శక సమాచారం అందించాలని వారు కొత్తగా ఏర్పాటైన ప్యానెల్‌ను డిమాండ్ చేశారు.
‘‘టిక్-టాక్’’ ఆకారంలో ఉన్న యూఏపీతో తనకు ఎదురైన అనుభవం గురించి అమెరికా రిటైర్డ్ నేవీ కమాండర్ డేవిడ్ ఫ్రేవర్ పంచుకున్నారు.
హాయ్!
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.
