ఓటరు కార్డును మీ మొబైల్ ఫోన్లోనే డౌన్‌లోడ్ చేసుకోవడం ఎలా?

ఫొటో సోర్స్, ECI
ఓటర్ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకోవాలనుకునేవారు స్మార్ట్ ఫోన్లో కానీ డెస్క్‌టాప్/లాప్‌టాప్ నుంచి కానీ https://nvsp.in వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.
ఈ వెబ్‌సైట్ క్లిక్ చేయగానే https://voters.eci.gov.in/ యూఆర్ఎల్‌తో పేజ్ ఓపెన్ అవుతుంది.
అందులో ఫార్మ్స్ అనే ట్యాబ్ కింద న్యూ రిజిస్ట్రేషన్ ఫర్ జనరల్ ఎలక్టర్స్ అని కనిపిస్తుంది.
అక్కడి నుంచి కొంచెం కిందకు స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే ఆలివ్ గ్రీన్ కలర్ బ్యాక్‌గ్రౌండ్‌పై E-EPIC Download అనేది కనిపిస్తుంది.
దానిపై క్లిక్ చేయగానే లాగిన్ పేజ్ ఓపెన్ అవుతుంది.

ఫొటో సోర్స్, eci
అందులో ఇండియన్ రెసిడెంట్ ఎలక్టర్, ఇండియన్ ఓవర్సీస్ ఎలక్టర్ అనే రెండు ఆప్షన్లు కనిపిస్తాయి.
అందులో ఇండియన్ రెసిడెంట్ ఎలక్టర్ అనేది డీఫాల్ట్‌గా హైలైట్ అయి కనిపిస్తుంది. ఒకవేళ ఎన్‌ఆర్ఐ ఓటర్లు అయితే ఇండియన్ ఓవర్సీస్ ఎలక్టర్ అనేది సెలక్ట్ చేయాలి. లేదంటే ‘ఇండియన్ రెసిడెంట్ ఎలక్టర్’ కింద కనిపించే ఖాళీలో కోరిన వివరాలు నింపాలి.
రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ కానీ, ఓటర్ గుర్తింపు కార్డ్ నంబర్ కానీ, ఈమెయిల్ ఐడీ కానీ అక్కడ నింపాలి. దిగువన పాస్‌వర్డ్, క్యాప్చాలు నింపి లాగిన్ కావాలి.
ఒకవేళ అంతకుముందు ఈ వెబ్‌సైట్‌లో ఎన్నడూ రిజిష్టర్ చేసుకోని ఓటర్లు అయినట్లయితే లాగిన్ కింద కనిపించే ‘సైన్ అప్’ అనే ఆప్షన్ ఎంచుకుని మొదట రిజిష్టర్ చేసుకోవాలి.

ఫొటో సోర్స్, ECI
రిజిస్టర్ చేసుకోవడం ఎలా?
సైన్ అప్ అనే చోట క్లిక్ చేస్తే వేరే పేజ్ ఓపెన్ అవుతుంది. అక్కడ మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడీ నింపాలి. ఈ రెండింటిలో మొబైల్ నంబర్ తప్పనిసరిగా నింపాల్సి ఉండగా, ఈమెయిల్ ఐడీ ఇవ్వాలా వద్దా అనేది యూజర్ ఇష్టం.
దాని కింద కనిపించే క్యాప్చాను అక్కడ ఇచ్చిన బాక్స్‌లో ఫిల్ చేసి కంటిన్యూ అనే బటన్ ప్రెస్ చేయాలి.
అక్కడ మీ పేరు, పాస్ వర్డ్ నింపాల్సి ఉంటుంది. ఆ రెండు వివరాలు నింపిన తరువాత ‘రిక్వెస్ట్ ఓటీపీ’ అనే బటన్‌పై క్లిక్ చేస్తే మొబైల్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది.
ఆ ఓటీపీ నింపిన తరువాత సబ్మిట్ చేయగా రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది.

ఫొటో సోర్స్, eci
మళ్లీ లాగిన్ పేజ్‌లోకి వచ్చి మొబైల్ నంబర్, పాస్‌వర్డ్ నింపి ‘రిక్వెస్ట్ ఓటీపీ’ అనే బటన్ క్లిక్ చేయాలి.
మొబైల్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది.. దాన్ని అక్కడ నింపి ‘వెరిఫై అండ్ లాగిన్’ అనే బటన్‌పై క్లిక్ చేయాలి.
వెంటనే మరో పేజ్ ఓపెన్ అవుతుంది. అక్కడ మీ ఓటర్ గుర్తింపు కార్డు నంబర్ కానీ, ఓటరు కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న ఫార్మ్ రిఫరెన్స్ నంబర్ కానీ నింపాలి.
దాంతో పాటే ‘సెలెక్ట్ స్టేట్’ అని ఉన్న చోట మీరు ఏ రాష్ట్రంలో ఓటరో ఆ రాష్ట్రం పేరు సెలక్ట్ చేసుకోవాలి. అంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్రం సెలక్ట్ చేసుకోవాలి.
ఆ కిందనే ఉన్న సెర్చ్ బటన్ క్లిక్ చేయగానే మీ పేరు, రాస్ట్రం, అసెంబ్లీ నియోజకవర్గం, ఓరట్ కార్డు నంబర్, ఫోన్ నంబర్(మాస్క్ చేసి) కనిపిస్తాయి.
దాని కింద సెండ్ ఓటీపీ అని కనిపిస్తుంది..
దానిపై క్లిక్ చేయగా ఓటీపీ వస్తుంది.. ఆ ఓటీపీ నింపి.. వెరిఫై బటన్ క్లిక్ చేయాలి..
అప్పుడు Download E-EPIC అని కనిపిస్తుంది.. దానిపై క్లిక్ చేయాలి.. వెంటనే మీ ఓటర్ గుర్తింపు కార్డు డౌన్ లోడ్ అవుతుంది. ‘కంగ్రాచ్యులేషన్స్ యువర్ ఈఎపిక్ ఫర్ ద ఎపిక్ నంబర్ హేజ్ బీన్ సక్సెస్‌ఫుల్లీ జనరేటెడ్’ అని ఆకుపచ్చ రంగు అక్షరాలలో కనిపిస్తే డౌన్ లోడ్ అయినట్లే.
పీడీఎఫ్ రూపంలో ఓటర్ కార్డ్ డౌన్లోడ్ అవుతుంది. దాన్ని ఫోన్లో కానీ డెస్క్‌టాప్‌లో కానీ లాప్‌టాప్‌లో కానీ సేవ్ చేసుకోవచ్చు.
లేదంటే డిజిలాకర్‌లో కూడా అప్‌లోడ్ చేసుకోవచ్చు. అవసరం అనుకుంటే దాన్ని ప్రింట్ చేయించి లామినేషన్ కూడా చేయించుకోవచ్చు.
పాస్ వర్డ్ మర్చిపోతే...
లాగిన్ అయ్యేటప్పుడు పాస్‌వర్డ్ తప్పు కొట్టినా, పాస్ వర్డ్ మర్చిపోయినా ఫర్‌గాట్ పాస్‌వర్డ్ ఆప్షన్ ఎంచుకుని అక్కడ కోరిన వివరాలు నింపి మళ్లీ పాస్ వర్డ్ జనరేట్ చేయొచ్చు.
అలా జనరేట్ చేసిన కొత్త పాస్‌వర్డ్ ఉపయోగించి మళ్లీ లాగిన్ అయి ఓటర్ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకోవాలి.
ఇవి కూడా చదవండి:
- బిగ్‌బాస్ విన్నర్, యూట్యూబర్ ఎల్వీష్ యాదవ్... రేవ్ పార్టీలకు పాము విషాన్ని సప్లయ్ చేశారా?
- మొహమ్మద్ షమీ: మా బౌలింగ్ తుపానుకు కారణమదే
- అఫ్గానిస్తాన్: అంతర్యుద్ధం, పేదరికంతో అల్లాడుతున్న తాలిబాన్ల పాలనలో క్రికెట్ ఎలా వికసించింది?
- చిత్తూరు: భార్యతో ఉన్నప్పుడు పురుషుడు.. బాయ్‌ఫ్రెండ్‌ను కలిస్తే మహిళ
- ఐఫోన్ హ్యాకింగ్ ఆరోపణలు: యాపిల్ వివరణపై కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ ఏమన్నారు?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














