తెలంగాణ ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థుల పూర్తి జాబితా.. 119 స్థానాలలో ఎవరెవరు పోటీ చేస్తున్నారంటే

తెలంగాణ ఎన్నికలు

ఫొటో సోర్స్, bandi sanjay, KTR, Bhatti Vikramarka, RS Praveen Kumar

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు ఏర్పాట్లు పూర్తయ్యాయి.

గురువారం(30.11.2023) ఉదయం 7 గంటల నుంచి తెలంగాణ వ్యాప్తంగా పోలింగ్ మొదలు కానుంది.

మొత్తం 119 నియోజకవర్గాలలో పాలక బీఆర్ఎస్ అన్ని స్థానాలలో పోటీ చేస్తుండగా కాంగ్రెస్ పార్టీ 118 చోట్ల సొంతంగా పోటీ చేస్తోంది. సీపీఐతో పొత్తు పెట్టుకోవడంతో కొత్తగూడెం స్థానాన్ని ఆ పార్టీ నేత కూనంనేని సాంబశివరావుకు ఇచ్చింది.

బీజేపీ మొత్తం 111 స్థానాలలో పోటీ చేస్తోంది. బీజేపీతో పొత్తులో ఉన్న జనసేన 8 చోట్ల పోటీ చేస్తోంది.

వీరితో పాటు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నాయకత్వంలోని బహుజన్ సమాజ్ పార్టీ 100 సీట్లలో పోటీ చేస్తోంది.

ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సిర్పూర్ నుంచి పోటీ చేస్తున్నారు. ఐఐటీ చదివి రాజకీయాలలో అడుగు పెడుతున్న దాసరి ఉష బీఎస్పీ నుంచి పెద్దపల్లిలో పోటీ చేస్తున్నారు.

మరోవైపు కాంగ్రెస్‌తో పొత్తులు కుదరకపోవడంతో సీపీఎం 19 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించింది.

అసదుద్దీన్ ఒవైసీ

ఫొటో సోర్స్, Getty Images

హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే ఏఐఎంఐఎం ఈ ఎన్నికలలో 9 సీట్లలో పోటీ చేస్తోంది.

ఈ ఎన్నికలకు ముందు పురుడు పోసుకున్న వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ప్రస్తుత ఎలక్షన్లలో పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది.

ఈ మేరకు ఆ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రకటన చేశారు.

మరోవైపు కేఏ పాల్‌కు చెందిన ప్రజాశాంతి పార్టీ కూడా కొన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది.

suresh shetkar

ఫొటో సోర్స్, suresh shetkar

చివరి నిమిషంలో మార్పులు

మరోవైపు చివరి రెండు మూడు రోజులో పార్టీలు మూడూ కొన్ని స్థానాలలో అభ్యర్థులను మార్చాయి.

బీఆర్ఎస్ ఆలంపూర్‌లో తొలుత ప్రకటించిన అబ్రహం స్థానంలో విజయుడికి టికెట్ ఇచ్చింది.

బీజేపీ బెల్లంపల్లిలో అంతకుముందు ప్రకటించిన అమరాజుల శ్రీదేవికి బదులుగా కొయ్యల ఏమాజీకి టికెట్ ఇచ్చింది.

కాంగ్రెస్ పార్టీ తన తుది జాబితాలో పటాన్‌చెరు అభ్యర్థిని మార్చింది. తొలుత ప్రకటించిన నీలం మధు ముదిరాజ్ స్థానంలో కాట శ్రీనివాస్ గౌడ్‌కు టికెట్ ఇచ్చింది.

దీంతో నీలం మధు ముదిరాజ్ బీఎస్పీ నుంచి పోటీ చేస్తున్నారు.

నారాయణఖేడ్‌లోనూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని మార్చింది. అక్కడ తొలుత ప్రకటించిన సురేశ్ షెట్కార్ స్థానంలో సంజీవరెడ్డికి అవకాశం ఇచ్చింది.

saritha tirupathayya

ఫొటో సోర్స్, facebook/saritha tirupathayya

ఫొటో క్యాప్షన్, ఎన్నికల ప్రచారంలో మహిళా అభ్యర్థి

కాగా బీఆర్ఎస్ 8 మంది మహిళలకు అవకాశం కల్పించగా, కాంగ్రెస్ పార్టీ 10 మంది మహిళలకు, బీజేపీ 14 మంది మహిళలకు అవకాశం కల్పించింది.

సికింద్రాబాద్ కంటోన్మెంట్ స్థానంలో బీఆర్ఎస్, బీజేపీలు రెండూ మహిళలకే అవకాశం ఇచ్చాయి.

ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఇటీవల మరణించిన విప్లవ గాయకుడు గద్దర్ కుమార్తె వెన్నెలకు టికెట్ ఇచ్చింది.

బీఆర్ఎస్ నుంచి లాస్య నందిత పోటీ చేస్తున్నారు. 2018 ఎన్నికలలో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి గెలిచిన సాయన్న కుమార్తె నందిత. సాయన్న కొద్దినెలల కిందట మరణించారు.

మొత్తంగా తెలంగాణలోని 119 నియోజకవర్గాలలో ప్రధాన పార్టీల నుంచి బరిలో ఎవరెవరు ఉన్నారో ఓసారి చూద్దాం..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థులు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థులు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థులు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థులు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థులు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థులు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థులు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థులు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థులు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థులు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థులు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థులు
వీడియో క్యాప్షన్, తెలుగు ముఖ్యమంత్రుల్లో ఏ కులం వారు ఎందరున్నారు?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)