ICYMI: ఈ వారం తప్పకుండా చదవాల్సిన కథనాలివి

ఫొటో సోర్స్, Getty Images
1. రోహింజ్యా ముస్లింలతో ఈ పడవలు సముద్రం మధ్యలో ఎలా మాయం అవుతున్నాయి?
అంతా చీకటి, విపరీతమైన చలి, చుట్టూ ఎవరూ కనిపించడం లేదు.
మియన్మార్‌లోని రఖాయిన్ స్టేట్‌కు బంగ్లాదేశ్‌లోని కాక్స్ బజార్ నగరానికి మధ్యనుండే నది వైపుగా 24 ఏళ్ల ఫజల్ అహ్మద్ (పేరు మార్చాం) చాలా జాగ్రత్తగా వెళ్తున్నారు.
బంగ్లాదేశ్‌లోని రోహింజ్యా శిబిరాల్లో దాదాపు పదేళ్లు ఆయన గడిపారు. అక్రమంగా దేశాలు దాటించే ముఠాలకు డబ్బులు ఇచ్చి ఇక్కడి నుంచి వెళ్లిపోయేందుకు ఆయన సిద్ధమయ్యారు. ''ఇలా ప్రమాదకర మార్గాల్లో వెళ్లి మధ్యలోనే చాలా మంది ప్రాణాలు కోల్పోయారని నాకు తెలుసు. అయితే, చాలామంది ఇలానే మలేసియాకు కూడా వెళ్లారు. ఇక్కడ జీవితం భరించలేకపోతున్నాను''అని అహ్మద్ బీబీసీతో చెప్పారు. పూర్తి కథనం కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి.
ఇవి కూడా చదవండి

ఫొటో సోర్స్, Getty Images
2. పైసా ఖర్చు లేకుండా ఆన్‌లైన్‌లో టెలిఫోన్ ద్వారా లేదా వీడియో కన్సల్టేషన్ పొందడం ఎలా?
అనారోగ్యం వస్తే వైద్యుల దగ్గరకు వెళ్లడం తప్పనిసరి. అయితే, ప్రభుత్వ ఆసుపత్రులైనా, ప్రైవేటు క్లినిక్కులైనా డాక్టర్ కన్సల్టేషన్ కోసం గంటల తరబడి క్యూలో వేచి చూసి ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాల్సి వస్తోంది. పైగా ఇది ఎంతో ఖరీదుతో కూడుకున్న వ్యవహారం.
ప్రైవేటుగా ఆన్‌లైన్‌లో డాక్టర్ కన్సల్టేషన్ కూడా ఏమాత్రం ఉచితం కాదు. దానికి వందల రూపాయాల్లో చార్జీలు విధించే ప్రైవేటు వైద్యులు ఆసుపత్రులు కూడా చాలా ఉన్నాయి.
కానీ ప్రజలకు పైసా ఖర్చు లేకుండా ఆన్‌లైన్‌లో టెలిఫోన్ ద్వారా లేదా వీడియో కన్సల్టేషన్ ద్వారా వైద్యుడ్ని సంప్రదించి, వైద్య పరీక్షలు చేయించుకునే అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం పూర్తీ ఉచితంగా కల్పిస్తోంది. పూర్తి కథనం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.
ఇవి కూడా చదవండి

ఫొటో సోర్స్, Getty Images
3. ఈపీఎస్: అధిక పెన్షన్ పొందాలంటే ఏం చేయాలి?
ఇప్పుడు మరింత మంది ఉద్యోగులు పదవీ విరమణ తరువాత అధిక మొత్తంలో పెన్షన్ పొందే సదుపాయం అందుబాటులోకి వచ్చింది.
2022లో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఈమేరకు ఉద్యోగ భవిష్య నిధి సంస్థ(ఈపీఎఫ్ఓ) కొత్త మార్గదర్శకాలను ఇటీవల విడుదల చేసింది.
అధిక మొత్తంలో పెన్షన్ పొందేందుకు ఎవరు అర్హులు? ఆ సదుపాయాన్ని వినియోగించుకోవాలా? వద్దా? వంటి విషయాలను వివరంగా చూద్దాం. పూర్తి కథనం కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి.
ఇవి కూడా చదవండి

ఫొటో సోర్స్, PIF/SAUDI ARABIA
4.సౌదీ అరేబియా: 'ముకాబ్' మహా నిర్మాణం ప్రపంచంలో మరో అద్భుతం కాబోతోందా?
తేలే పర్వతాలు, వేరే గ్రహానికి తీసుకెళ్లే శాటిలైట్లు, ఫ్లయింగ్ డ్రాగన్స్.. ఇది హాలీవుడ్ సినిమా కాదు, సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లో రూపుదిద్దుకుంటున్న అత్యంత భారీ భవనం 'ది ముకాబ్'.
ఆకాశ హార్మ్యాాలు, జలపాతాలు, విందు, వినోదాలతో ఇది మరో ప్రపంచానికి తలుపులు తెరుస్తుంది అంటోంది సౌదీ ప్రభుత్వం.
సౌదీ రాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన 'న్యూ మురబ్బా డెవెలప్మెంట్ కంపెనీ' (ఎన్ఎండీసీ).. రాజధాని రియాద్‌లో సరికొత్త నగరాన్ని నిర్మించేందుకు శ్రీకారం చుట్టింది. పూర్తి కథనం కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి.
ఇవి కూడా చదవండి

ఫొటో సోర్స్, Getty Images
5. ఏజ్ ఆఫ్ కన్సెంట్: సమ్మతి తెలపాలంటే కనీస వయసు ఎంత ఉండాలి?
సెక్స్‌కు సమ్మతి తెలిపే కనీస వయసు ఏది?
చాలా కాలంగా ఈ ప్రశ్న వినిపిస్తూనే ఉంది. కొన్ని దేశాల్లో అదొక వివాదంగానూ ఉంది.
'మినిమం ఏజ్ ఆఫ్ సెక్సువల్ కన్సెంట్'ను తగ్గించాలంటూ భారత్‌లో కొందరు కోరుతుంటే పెంచాలంటూ మరికొన్ని దేశాల్లో డిమాండ్లు వినిపిస్తున్నాయి.
సెక్స్‌కు సమ్మతి తెలిపే కనీస వయసును పెంచాలంటూ ఇటీవలే జపాన్ నిర్ణయించడంతో ఆ అంశం మళ్లీ చర్చలోకి వచ్చింది. జపాన్‌లో 'ఏజ్ ఆఫ్ కన్సెంట్' ప్రస్తుతం 13ఏళ్లుగా ఉంది. దీన్ని 16ఏళ్లకు పెంచాలని ఆ దేశ న్యాయశాఖ ప్రతిపాదించింది. పూర్తి కథనం కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి.
ఇవి కూడా చదవండి:
- ఆంగ్లో ఇండియన్స్ అంటే ఎవరు, ఎందుకు తమ మూలాలు వెతుక్కుంటున్నారు-?
- మాతృభాషా దినోత్సవం: తెలుగు భాషకు ప్రాచీన హోదా వల్ల ఏదైనా మేలు జరిగిందా?
- ఎస్కే యూనివర్సిటీ- విద్యార్ధులు, ఉద్యోగుల సంక్షేమానికి హోమం, చందా కోసం రిజిస్ట్రార్ సర్క్యులర్ జారీ చేయడంపై విమర్శలు
- మహా శివరాత్రి: పార్వతి ఒడిలో పవళించిన శివుడు - పురాతన పళ్లికొండేశ్వర ఆలయం విశేషాలు మీకు తెలుసా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








