ICYMI: ఈ వారం తప్పకుండా చదవాల్సిన కథనాలివి

సూర్యగ్రహణాన్ని నేరుగా కళ్లతో చూడటం వల్ల కళ్లు దెబ్బతినే ప్రమాదం ఉంది

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, సూర్యగ్రహణాన్ని నేరుగా కళ్లతో చూడటం వల్ల కళ్లు దెబ్బతినే ప్రమాదం ఉంది

1. గ్రహణం సమయంలో సెక్స్ చేయొచ్చా? నమ్మకాలేంటి, వాటి శాస్త్రీయత ఎంత?

ఈ నెల 25న సూర్యగ్రహణం ఏర్పడుతోంది.

గ్రహణం రోజున ఏం చేయాలో ఏం చేయకూడదో ఇప్పటికే సోషల్ మీడియాలో చాలా మంది చెప్పేస్తున్నారు.

బాగా ప్రచారంలో ఉన్న కొన్ని నమ్మకాలు, వాటిలో నిజానిజాల గురించి ప్రజలకు వివరించేందుకు బీబీసీ ప్రయత్నించింది.

గ్రహణం సమయంలో అన్నం వండకూడదా?

గర్భవతులు బయటకు రాకూడదా?

గ్రహణం సమయంలో నిద్ర పోకూడదా? సెక్స్‌లో పాల్గొన కూడదా?

ఇవి కూడా చదవండి

స్పామ్ కాల్స్

ఫొటో సోర్స్, Getty Images

2. 'స్పామ్ కాల్స్ గోలేంట్రా బాబూ' అని మీకెప్పుడైనా అనిపించిందా... దీనికి విరుడుగు ఏంటి?

"హలో! మీకు 2 లక్షల లోన్ మంజూరు అయింది."

దరఖాస్తు చేయని లోన్ ఎలా మంజూరు అయిందో అర్థం కాదు.

"కంగ్రాట్యులేషన్స్! మీరు లక్కీ డ్రా గెలుచుకున్నారు. విదేశాలకు వెళ్లేందుకు, విలాసవంతమైన రిసార్ట్ లో గడిపేందుకు అవకాశం. కాల్ పూర్తిగా వినండి."

లక్కీ డ్రా అనగానే తెలియకుండానే ఆ కాల్ వినేందుకు ఆసక్తి చూపిస్తారు.

ఇలాంటి కాల్స్ వచ్చినప్పుడు అందరికీ ముందుగా ఎదురయ్యే ప్రశ్న: మన టెలిఫోన్ నంబర్ ఈ అపరిచిత సంస్థలు లేదా వ్యక్తుల దగ్గరకు ఎలా వెళ్ళింది?

అసలు ఇలాంటి స్పామ్ కాల్స్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి?

ఇవి కూడా చదవండి

లంపీ స్కిన్ వ్యాధి

ఫొటో సోర్స్, Getty Images

3. లంపీ స్కిన్ వ్యాధి సోకిన పశువుల పాలు తాగొచ్చా? ఈ వైరస్ మనుషులకూ సోకుతోందా?

లంపీ స్కిన్ వ్యాధి ఇప్పటివరకు దేశంలోని 24 లక్షల పశువులకు సోకింది. 1,10,000 పశువులు ప్రాణాలు కోల్పోయాయి.

లంపీ స్కిన్ వ్యాధికి సంబంధించి ఎన్నో అంశాలు ప్రచారంలో ఉన్నాయి.

లంపీ స్కిన్ వ్యాధి సోకిన పశువుల పాలు తాగొచ్చా?

లంపీ స్కిన్ వ్యాధి పాకిస్తాన్ నుంచి భారత్‌కు వచ్చిందా?

వ్యాక్సీన్ వేస్తే పశువులు చనిపోతున్నాయా?

ఇవి కూడా చదవండి

Supercontinent Amasia

4. మహా సముద్రాలు మాయమైపోతాయా? ఖండాలు కలిసిపోతాయా? ఎప్పుడు, ఎక్కడ, ఎలా?

మహాసముద్రాలు, విస్తారమైన ఖండాలతో భూమి నిరంతరం మారుతూ ఉంటుంది.

కొత్త ఖండాలు ఏర్పడడం, పాత ఖండాలు విచ్ఛిన్నం కావడం భౌగోళిక చక్రంలో భాగం.

అయితే, ఆస్ట్రేలియాలో ఉన్న పరిశోధకులు కంప్యూటర్ మోడల్స్ ఉపయోగించి తదుపరి కొత్త ఖండం ఎప్పుడు, ఎలా ఏర్పడుతుందన్నది అంచనా వేశారు.

ఇవి కూడా చదవండి

ఆయుష్మాన్ ఖురానా

ఫొటో సోర్స్, @ayushmannk

5. డాక్టర్ జీ: గైనకాలజిస్టుగా పనిచేసే పురుషుడి జీవితం ఎలా ఉంటుంది?

గైనకాలజిస్టు లేదా అబ్‌స్టెట్రీషియన్ పేరు చెప్పగానే చాలా మందికి మహిళా డాక్టర్లు మాత్రమే గుర్తుకువస్తారు.

చాలామంది మహిళలు కూడా ఫిమేల్ గైనకాలజిస్టు దగ్గరకు వెళ్లడానికే ఇష్టపడతారు.

అసలు మేల్ గైనకాలజిస్టుగా పనిచేసే వారి జీవితం ఎలా ఉంటుంది?

మహిళల పూర్తి వ్యక్తిగత విషయాల్లో సేవలు అందించేటప్పుడు మగ డాక్టర్లు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)