డాలర్ ఎందుకు బలపడుతోంది? రూపాయి బలహీనపడుతోందా లేదా?

నిర్మలా సీతారామన్
    • రచయిత, వరికూటి రామకృష్ణ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

'రూపాయి బలహీన పడలేదు... డాలరు బలపడుతోంది.'

రోజురోజుకు రూపాయి విలువ పడిపోతూ ఉంది కదా... దాన్ని కట్టడి చేసేందుకు మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు అని ఒక జర్నలిస్టు తాజాగా ప్రశ్నించినప్పుడు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మల సీతారామన్ ఇచ్చిన సమాధానం ఇది.

ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతోంది. కొందరు సరదాగా మీమ్స్ చేస్తుంటే మరికొందరు సెటైర్లు వేస్తున్నారు.

అయితే నిర్మల సీతారామన్ సొంత పార్టీ నేత సుబ్రమణియన్ స్వామి కూడా సెటైర్ వేయడం విశేషం.

'మేం ఓడిపోలేదు... ప్రత్యర్థులు గెలిచారు' అనే మీమ్‌ను పోస్ట్ చేస్తూ 'అభినందనలు. జేఎన్‌యు ఎప్పటికీ ఫెయిల్ కాదు' అని ఆయన రాశారు. జేఎన్‌యులో నిర్మల సీతారామన్ ఎంఏ చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

'నేను సింగిల్‌గా లేను. మిగతా వాళ్లు త్వరగా పెళ్లి చేసుకుంటున్నారు.' అనే మీమ్‌ను @Artisharma001 అనే ట్విటర్ హ్యాండిల్ పోస్ట్ చేసింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

‘ఇకపై పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులు ఇలా చెబుతారు...

నేను ఫెయిల్ కాలేదు... మిగతా వాళ్లు పాస్ అయ్యారు' అనే మీమ్‌ను ముమిన్‌బాట్ అనే యూజర్ పోస్ట్ చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 3
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 3

రూపాయి విలువ పడిపోవడం మీద బీజేపీ 'రెండు నాలుకల'తో మాట్లాడుతోందని ఇంకొందరు విమర్శిస్తున్నారు.

కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రూపాయి విలువ పడిపోవడం మీద నరేంద్ర మోదీ చేసిన విమర్శలను నేడు కొందరు షేర్ చేస్తున్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 4
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 4

యూపీఏ హయాంలో రూపాయి విలువ క్షీణించడం మీద నిర్మల సీతారామన్ ఆందోళన వ్యక్తం చేశారు. నాడు ఆమె చేసిన వ్యాఖ్యలను, నేటి వ్యాఖ్యలను కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 5
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 5

సరే ఈ మీమ్స్, సెటైర్స్ ఎలా ఉన్నప్పటికీ ఒక కరెన్సీ ఎందుకు బలపడుతుంది? మరొక కరెన్సీ ఎందుకు బలహీన పడుతుంది? ఒకసారి చూద్దాం.

డాలర్, రూపాయి, యూరో... ఇలా కరెన్సీ ఏదైనా సరే... వాటిని విడివిడిగా చూసినప్పుడు మనకు వాటి బలం లేదా బలహీనత తెలియదు. ఒక కరెన్సీని మరొక కరెన్సీతో పోల్చినప్పుడు అది తెలుస్తుంది.

అమెరికా డాలర్

ఫొటో సోర్స్, Getty Images

ఇతర కరెన్సీలతో ఎందుకు పోల్చుతారు?

దీనికి సమాధానం అంతర్జాతీయ మార్కెట్‌లో ఉంది. ప్రపంచంలో ఏ దేశం కూడా ఒంటరిగా మనుగడ సాగించలేదు. తయారు చేసిన వస్తువులను అమ్ముకోవడానికో లేదా అవసరమైన వాటిని కొనుక్కోవడానికో ఇతర దేశాల మీద ప్రతి దేశం ఆధారపడాల్సిందే. భారత్ విషయంలోనూ అంతే.

అమ్మడం, కొనడం అంటే డబ్బులు ఇచ్చిపుచ్చుకోవడమే కదా. డబ్బులు ఇవ్వాలంటే ఒక కరెన్సీ కావాలి. ఆ కరెన్సీకి ఒక మారకం విలువ ఉండాలి. ఇతర కరెన్సీలతో పోల్చినప్పుడు ఒక కరెన్సీకి ఉండే డిమాండ్‌ను బట్టి ఆ మారకం విలువను లెక్కిస్తారు.

పోర్టులోని కంటైనర్లు

ఫొటో సోర్స్, Getty Images

కరెన్సీ విలువను ప్రభావితం చేసే అంశాలు ఏంటి?

ఒక దేశపు కరెన్సీ విలువ అనేక అంశాల మీద ఆధారపడి ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఆ కరెన్సీకి ఉండే డిమాండ్‌, దాని సప్లైని బట్టి విలువ పెరుగుతూ తగ్గుతూ ఉంటుంది.

అంతర్జాతీయ వాణిజ్యం: ఒక దేశానికి చెందిన వస్తువులు, సేవలకు ఇతర దేశాల్లో డిమాండ్ ఎక్కువగా ఉంటే ఆ దేశానికి చెందిన కరెన్సీ విలువ పెరుగుతుంది. లేదంటే తగ్గుతుంది.

ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్లు వంటివి కూడా కరెన్సీ విలువను ప్రభావితం చేస్తాయి.

వడ్డీరేట్లు: ఉదాహరణకు ఒక దేశంలో వడ్డీ రేట్లు అధిక స్థాయిలో ఉన్నప్పుడు మంచి రిటర్న్ వస్తుందనే ఉద్దేశంతో విదేశీ పెట్టుబడిదారులు మదుపు చేయడం మొదలుపెడతారు. అప్పుడు ఆ దేశపు కరెన్సీకి డిమాండ్ పెరిగి దాని విలువ పెరుగుతుంది.

ద్రవ్యోల్బణం: ధరలు అధికంగా ఉన్నప్పుడు కరెన్సీ విలువ పడిపోతూ ఉంటుంది. ధరలు పెరగడం వల్ల ప్రజల కొనుగోలు శక్తి తగ్గి ఆర్థికకార్యకలాపాలు మందగిస్తాయి. దాంతో ఆర్థికవ్యవస్థ పురోగతి నెమ్మదించి విదేశీ పెట్టుబడులు తగ్గిపోతాయి.

ఇలాంటి సందర్భాల్లో పెరుగుతున్న ధరలను కట్టడి చేయడానికి రిజర్వ్ లేదా సెంట్రల్ బ్యాంకులు వడ్డీ రేట్లు పెంచుతుంటాయి. తద్వారా కరెన్సీ విలువను మళ్లీ పెంచేందుకు ప్రయత్నిస్తాయి.

ఇప్పుడు భారత్‌లో జరుగుతోంది ఇదే. ధరలు ఎక్కువగా ఉండటం వల్ల తరచూ ఆర్‌బీఐ వడ్డీ రేట్లు పెంచుతూ పోతోంది. ఈ ఏడాది సుమారు నాలుగు సార్లు రెపో రేటును పెంచారు.

అమెరికా జాతీయ జెండా

ఫొటో సోర్స్, Getty Images

డాలర్ బలపడటం అంటే?

డాలర్ బలంగా ఉంది... బలపడుతోంది... ఇటీవల తరచూ వినిపిస్తున్న మాటలు. అసలు బలంగా ఉందని ఎలా చెబుతారు?

ముందుగా రూపాయి, డాలర్ చూద్దాం.

ప్రస్తుతం ఒక డాలర్ విలువ సుమారు 82 రూపాయలు ఉంది. ఏడాది కిందట ఇదే నెలలో సుమారు 75 రూపాయలుగా ఉంది. అంటే రూపాయితో పోలిస్తే నేడు డాలర్ బలపడిందని అర్థం.

ఇప్పుడు శ్రీలంక రూపాయి, ఇండియన్ రూపాయి తీసుకొంటే... ప్రస్తుతం ఒక భారత రూపాయి విలువ సుమారు 4.43 శ్రీలంక రూపాయలుగా ఉంది. కానీ ఏడాది కిందట ఇదే నెలలో సుమారు 2.50 శ్రీలంక రూపాయలుగా ఉంది. అంటే భారత్ రూపాయితో పోలిస్తే శ్రీలంక కరెన్సీ బలహీనపడిందని భావించాలి.

ముడిచమురు బావి

ఫొటో సోర్స్, Getty Images

డాలర్ ఎందుకు బలపడుతోంది?

ఇటీవల కాలంలో ఇతర దేశాల కరెన్సీలతో పోలిస్తే అమెరికా డాలర్ బాగా బలపడుతోంది. ఇందుకు ప్రధాన కారణాల్లో ఒకటి అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు పెంచడం.

ఇంతకు ముందే చెప్పినట్లు వడ్డీ రేట్లు పెంచినప్పుడు ఆ దేశపు కరెన్సీ విలువ కూడా బలపడుతుంది. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు పెంచింది.

వడ్డీ రేట్లు పెరిగితే పెట్టుబడులు, మదుపు కూడా పెరుగుతుంది. అమెరికా ట్రెజరీ బాండ్స్ వంటి వాటిలో మదుపు చేసే వారి సంఖ్య పెరగడం వల్ల డాలర్ మరింత బలపడుతుంది.

అమెరికా డాలర్ ఇండెక్స్ ఈ ఏడాది సుమారు 17శాతం పెరిగింది.

రూపాయి, యూరో, జపాన్ యెన్ వంటివి అమెరికా డాలర్‌తో పోలిస్తే బలహీనపడుతూ వస్తున్నాయి.

అమెరికా డాలర్ బలపడటానికి మరొక బలమైన కారణం ఉంది. అంతర్జాతీయ వాణిజ్యంలో మెజారిటీ ఆర్థికలావాదేవీలు డాలర్లలోనే జరుగుతాయి. ప్రధానంగా ముడిచమురు కొనుగోళ్లకు సంబంధించిన చెల్లింపులు దాదాపుగా డాలర్లలోనే ఉంటాయి.

యుక్రెయిన్-రష్యా యుద్ధంతో ప్రపంచవ్యాప్తంగా ముడిచమురు, గ్యాస్ సరఫరా మీద ప్రభావం పడింది. ఫలితంగా వాటి ధరలు బాగా పెరిగాయి. దాంతో చెల్లింపులు చేసేందుకు అధిక డాలర్లను దేశాలు కొనడం ప్రారంభించాయి. ఫలితంగా డిమాండ్ పెరిగి డాలర్‌ రోజురోజుకు బలపడుతూ పోతోంది.

ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి ఏర్పడినప్పుడు బంగారం మాదిరిగానే పెట్టుబడి పెట్టడానికి డాలర్‌ను కూడా సురక్షితంగా భావిస్తుంటారు. దాని విలువ పెరగడానికి ఇదీ ఒక కారణం.

భారత కరెన్సీ రూపాయి

ఫొటో సోర్స్, Getty Images

రూపాయి ఎందుకు బలహీనపడుతోంది?

ముడిచమురు ధరలు: అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు బాగా పెరిగాయి. ప్రస్తుతం బ్రెంట్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర సుమారు 92 డాలర్లుగా ఉంది. 2020 ఏప్రిల్‌లో సుమారు 20 డాలర్లుగా ఉన్న బ్రెంట్, ఆ తరువాత కరోనా సంక్షోభం, యుక్రెయిన్-రష్యా యుద్ధం వల్ల ఈ ఏడాది 120 డాలర్లకు పైగా పెరిగింది.

భారత్ చమురు కొనేటప్పుడు చెల్లింపులు డాలర్లలో చేయాల్సి ఉంటుంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకపు విలువ తక్కువ. కాబట్టి ముడిచమురు ధర పెరిగినప్పుడు ఎక్కువ డాలర్లను భారత్ ఇవ్వాల్సి ఉంటుంది.

ఉదాహరణకు 2019 అగస్టులో డాలర్ విలువ సుమారు 70 రూపాయలుగా ఉంది. నాడు బ్రెంట్ ధర దాదాపుగా 60 డాలర్లుగా ఉంది. అంటే ఒక బ్యారెల్ ముడిచమురు కొనడానికి నాడు భారత్ సుమారు రూ.4,200 చెల్లిస్తే సరిపోతుంది.

ఇప్పుడు డాలర్ విలువ దాదాపు 82 రూపాయలు. బ్రెంట్ ధర ప్రస్తుతం 92 డాలర్లు. ఇప్పుడు ఒక బ్యారెల్ ముడిచమురు కొనాలంటే రూ.7,544 ఇవ్వాల్సి ఉంటుంది.

ఈ చెల్లింపుల కోసం మరిన్ని డాలర్లను భారత్ కొనాల్సి ఉంటుంది కాబట్టి డిమాండ్ పెరిగి అమెరికా డాలర్ బలపడుతుంది.

విదేశీ మదుపర్లు: అమెరికాలో వడ్డీ రేట్లు పెరగడం వల్ల ఇటీవల కాలంలో భారత్‌లోని తమ పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్న విదేశీయుల సంఖ్య పెరుగుతోంది. ఈ ఏడాది జనవరి నుంచి జూన్ మధ్య విదేశీ సంస్థాగత మదుపర్లు(ఎఫ్‌ఐఐ) డబ్బులు వెనక్కి తీసుకున్నారు. దీంతో డాలర్‌కు డిమాండ్ పెరిగింది అదే సమయంలో రూపాయికి తగ్గింది.

రూపాయి విలువ

కొన్ని ఇతర అంతర్జాతీయ కరెన్సీలతో పోలిస్తే రూపాయి విలువ కాస్త మెరుగ్గా కనిపిస్తోంది. యూరో, బ్రిటన్ పౌండ్, జపాన్ యెన్‌తో పోల్చినప్పుడు రూపాయి బలపడింది.

వీడియో క్యాప్షన్, ‘అందం అంటే తెల్లగా కనిపించడం’ అనే భావనను తొలగించడం కోసం నేను ఇంకా కష్టపడుతున్నా

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)