మోదీ ప్రభుత్వం సీబీఐ, ఈడీలతో వ్యాపారులను అణచివేస్తోందా... అమెరికా పేపర్‌లో వచ్చిన యాడ్ మీద వివాదమేంటి?

వాల్ స్ట్రీట్ జర్నల్‌లో వచ్చిన ప్రకటన

ఫొటో సోర్స్, Social Media

ఇటీవల అమెరికా పత్రిక వాల్ స్ట్రీట్ జర్నల్‌లో పబ్లిష్ అయిన ఒక ప్రకటన వివాదాస్పదమైంది.

కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మల సీతారామన్, సుప్రీం కోర్టు న్యాయమూర్తులు, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులతో పాటు దేవాస్-ఆంత్రిక్స్ కేసుతో సంబంధం ఉన్న అధికారులను వెంటనే నిషేధించాలని ఆ ప్రకటన డిమాండ్ చేస్తోంది.

'వాంటెడ్ మోదీ మ్యాగ్నస్కి 11: భారత్‌ను పెట్టుబడులకు భద్రతలేని దేశంగా మార్చిన అధికారులను చూడండి' అంటూ ఈ నెల 13న వాల్ స్ట్రీట్ జర్నల్‌లో యాడ్ వచ్చింది.

అమెరికా గ్లోబల్ మ్యాగ్నస్కి చట్టం-2016 ప్రకారం, మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడిన విదేశీ ప్రభుత్వ అధికారులను నిషేధిస్తారు.

కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మల సీతారామన్ అమెరికా పర్యటనలో ఉన్న సమయంలోనే ఈ ప్రకటన పేపర్లో రావడం వివాదంగా మారింది. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎఫ్) వార్షిక సమావేశంలో పాల్గొనేందుకు ఈ నెల 11న ఆమె వాషింగ్టన్ వచ్చారు.

కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మల సీతారామన్

ఫొటో సోర్స్, Reuters

ప్రకటన ఎవరు ఇచ్చారు?

అమెరికాకు చెందిన స్వచ్ఛంద సంస్థ 'ఫ్రంటైర్స్ ఆఫ్ ఫ్రీడం' ఈ ప్రకటన ఇచ్చింది. 'వ్యక్తిగత స్వేచ్ఛ, శాంతి, పరిమితమైన ప్రభుత్వం, స్వేచ్ఛా మార్కెట్లు, సంప్రదాయ అమెరికా విలువలు' వంటి వాటి కోసం పాటుపడే సంస్థగా తన వెబ్‌సైట్‌లో ఫ్రంటైర్స్ ఆఫ్ ఫ్రీడం రాసుకుంది.

'రాజకీయ, వ్యాపార ప్రత్యర్థులను అణచి వేసేందుకు చట్టాలను, చట్టబద్ధ సంస్థలను మోదీ ప్రభుత్వంలోని ఈ అధికారులు ఉపయోగించుకుంటున్నారు. దీంతో భారత్‌లో పెట్టుబడులకు భద్రత లేకుండా పోయింది' అంటూ 11 మంది పేర్లను ఆ ప్రకటనలో రాశారు.

'గ్లోబల్ మ్యాగ్నస్కి హ్యూమన్ రైట్స్ అకౌంటబిలిటీ యాక్ట్ ప్రకారం, ఆ అధికారుల మీద నిషేధం విధించాలి' అంటూ ఆ సంస్థ అమెరికా ప్రభుత్వాన్ని కోరింది.

'భారత్‌లో అధికారులు ప్రభుత్వ సంస్థలను తమకు ఇష్టం వచ్చినట్లు ఉపయోగించుకుంటున్నారు' అంటూ ఈ ఏడాది అగస్టులో గ్లోబల్ మ్యాగ్నస్కి హ్యూమన్ రైట్స్ అకౌంటబిలిటీ యాక్ట్ కింద్ర పిటిషన్ ఫైల్ చేసింది ఫ్రంటైర్ ఆఫ్ ఫ్రీడం.

దేవాస్ మల్టీమీడియా అమెరికా, దాని సహవ్యవస్థాపకుడు రామచంద్రన్ విశ్వనాథన్ తరపున ఆ పిటిషన్ వేసినట్లుగా నివేదికలు చెబుతున్నాయి.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

ప్రకటనలో ఉన్న పేర్లు...

  • కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మల సీతారామన్
  • ఆంత్రిక్స్ చైర్మన్ రాకేశ్ శశిభూషణ్
  • సొలిసిటర్ జనరల్ ఎన్.వెంకటరామన్
  • జస్టిస్ హేమంత్ గుప్తా
  • జస్టిస్ వి.రామ సుబ్రమణియమ్
  • సీబీఐ డీఎస్‌పీ ఆశిష్ పారీఖ్
  • ఈడీ డైరెక్టర్ సంజయ్ కుమార్ మిశ్రా
  • ఈడీ డిప్యూటీ డైరెక్టర్ ఎ.సాదిక్ మహ్మద్
  • ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ ఆర్.రాజేశ్
  • ప్రత్యేక న్యాయమూర్తి చంద్ర శేఖర్

ఫ్రంటైర్ ఆఫ్ ఫ్రీడం వ్యవస్థాపకుడు, రిపబ్లికన్ సెనేటర్ జార్జ్ లాండ్రిత్ ఈ ప్రకటనను ట్వీట్ చేశారు. 'భారత్‌లో పెట్టుబడుల వాతావరణాన్ని దెబ్బతీసిన భారత మ్యాగ్నస్కి-11, ఆర్థికశాఖ మంత్రుల బండారాన్ని ఫ్రంటైర్ ఆఫ్ ఫ్రీడం బయట పెట్టింది' అంటూ ఆయన ట్వీట్‌లో రాశారు.

కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మల సీతారామన్

ఫొటో సోర్స్, Getty Images

ప్రకటన మీద విమర్శలు

ఆ ప్రకటను చాలా మంది భారత్‌లో విమర్శించారు.

'మోసగాళ్లు అమెరికా మీడియాను ఇలా ఆయుధంగా ఉపయోగించుకోవడం అవమానకరం' అని కేంద్ర ప్రసార, సమాచారశాఖ మంత్రిత్వ కార్యాలయంలోని సీనియర్ సలహాదారు కంచన్ గుప్తా ట్వీట్ చేశారు.

'పరారీలో ఉన్న దేవాస్ సీఈఓ రామచంద్ర విశ్వనాథన్' దీని వెనుక ఉన్నారంటూ ఆయన ట్విటర్‌లో రాశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

దేవాస్ మల్టీమీడియా సహవ్యవస్థాపకుడు రామచంద్ర విశ్వనాథన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, దేవాస్ మల్టీమీడియా సహవ్యవస్థాపకుడు రామచంద్ర విశ్వనాథన్

రామచంద్రన్ విశ్వనాథన్ ఎవరు?

దేవాస్ కంపెనీ సహవ్యవస్థాపకుడైన రామచంద్రన్ విశ్వనాథన్ అమెరికా పౌరుడు. 2005లో దేవాస్ మల్టీమీడియా కంపెనీ, ఇస్రో వాణిజ్య విభాగం ఆంత్రిక్స్ మధ్య ఉపగ్రహాలకు సంబంధించి ఒక ఒప్పందం కుదిరింది.

కానీ ఇందులో అవకతవకలు జరిగాయంటూ ఆ తరువాత ఆ డీల్‌ను రద్దు చేశారు. మారిషస్‌లోని దేవాస్ ఖాతాలను ఫ్రీజ్ చేయడంతోపాటు అవినీతి ఆరోపణలతో రామచంద్ర విశ్వనాథన్‌ను అరెస్టు చేయాలని భారత్ కోరుకుంటోంది. ఆయన మీద రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసేందుకు ఇంటర్‌పోల్‌ను కూడా కోరుతోంది భారత్. అలాగే అమెరికా నుంచి భారత్‌కు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోంది.

ఈ ఏడాది సెప్టెంబరులో మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి రామచంద్ర విశ్వనాథన్‌ను 'పరారీలో ఉన్న ఆర్థిక నేరస్థునిగా' ప్రకటించేందుకు ఈడీకి అనుమతి ఇచ్చింది బెంగళూరులోని ప్రత్యేక కోర్టు.

సుమారు 1.3 బిలియన్ డాలర్లకు సంబంధించి దేవాస్ మల్టీమీడియాకు అనుకూలంగా 2015లో ఇంటర్నేషనల్ చాంబర్ ఆఫ్ కామర్స్ ఇచ్చిన తీర్పును ఈ ఏడాది అగస్టులో దిల్లీ హై కోర్టు రద్దు చేసింది. అయితే దేవాస్ మల్టీమీడియా సంస్థ న్యాయపరమైన పోరాటం చేస్తోంది.

వీడియో క్యాప్షన్, రామప్ప పట్టు చీరలు... వీటి ప్రత్యేకత ఏమిటో తెలుసా?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)