#Hindiimposition: హిందీని రుద్దకండి... మరొక భాషా యుద్ధానికి తెరతీయకండి...కేంద్రానికి కేటీఆర్, స్టాలిన్ హెచ్చరిక

ఫొటో సోర్స్, Facebook/KTR
- రచయిత, వరికూటి రామకృష్ణ
- హోదా, బీబీసీ ప్రతినిధి
కేంద్ర హోం మంత్రి అమిత్ షా కమిటీ, హిందీ భాష మీద చేసిన సిఫారసులు వివాదంగా మారుతున్నాయి.
ప్రధానంగా దక్షిణాది రాష్ట్రాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అమిత్ షా కమిటీ సిఫారసులను తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ విమర్శించారు.
'హిందీ జాతీయ భాష కాదు'
దేశంలోని అన్ని భాషల్లో హిందీ కూడా ఒకటని దాన్ని బలవంతంగా రుద్దడం సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని కేటీఆర్ అన్నారు.
'భారత దేశానికి జాతీయ భాష లేదు. దేశంలోని అధికారిక భాషల్లో హిందీ కూడా ఒకటి.
ఐఐటీలు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నియమాకాల్లో హిందీ తప్పనిసరి చేయడం ద్వారా ఎన్‌డీఏ ప్రభుత్వం సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా నడుచుకుంటోంది.
భాషలను ఎంచుకునే చాయిస్ భారతీయులకు ఉండాలి. హిందీని బలవంతంగా రుద్దడాన్ని మేం వ్యతిరేకిస్తున్నాం' అని కేటీఆర్ ట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1

ఫొటో సోర్స్, Facebook/M. K. Stalin
'మరొక భాషా యుద్ధానికి తెరతీయకండి'
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఇంకాస్త స్వరం పెంచి... హిందీని బలవంతంగా రుద్దడం ద్వారా మరొక భాషా యుద్ధానికి తెరతీయకండి అంటూ ఇప్పటికే కేంద్రాన్ని గట్టిగా హెచ్చరించారు.
'భారతదేశ ఐక్యతను యూనియన్ గవర్నమెంట్ కాపాడాలి' అని ఆయన అన్నారు.
హిందీని రుద్దడం ద్వారా భారత దేశపు భిన్నత్వాన్ని ధ్వంసం చేసేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విరామం లేకుండా పని చేస్తోందని, ఇది ఆందోళన కలిగించే విషయమని ఆయన ట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
‘అమిత్ షా కమిటీ చేసిన సిఫారసులు భారతదేశ సమైఖ్యతకు ప్రమాదం కలిగించేలా ఉన్నాయి.
రాజ్యాంగం 8వ షెడ్యూల్‌లో 22 అధికారిక భాషలు ఉన్నాయి. అందులో తమిళం కూడా ఒకటి. ఈ భాషలన్నింటికీ సమానమైన హక్కులు ఉంటాయి. ఇలాంటప్పుడు హిందీని మాత్రమే ఉమ్మడి భాషగా చేయాలంటూ అమిత్ షా కమిటీ సిఫారసు చేయాల్సిన అవసరం ఏం వచ్చింది?
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల నియమక పరీక్షల్లో ఇంగ్లిష్‌ను తొలగిస్తే హిందీకే ప్రాధాన్యం లభిస్తుంది.
హిందీ చదవడం వస్తేనే ఉద్యోగం ఇవ్వాలంటూ కూడా పార్లమెంటరీ కమిటీ సిఫారసు చేసింది. ఇంగ్లిష్ అనుసంధాన భాషగా ఉన్న రాష్ట్రాల్లోనూ హిందీని తప్పనిసరి చేస్తున్నారు.
హిందీ వాడకుంటే చర్యలు తీసుకుంటామని అధికారులను బెదిరిస్తున్నారు. ఇది రాజ్యాంగ విరుద్ధం. ఇది భారత్‌కు చేటు చేస్తుంది.
భారత్‌లో హిందీ మాట్లాడే వారి కంటే ఇతర భాషలు మాట్లాడే జనాభా సంఖ్యనే ఎక్కువ. ప్రతి భాషకు ఒక ప్రత్యేకత ఉంటుంది. భాషాపరమైన సంస్కృతి మన దేశంలో ఉంది.
హిందీ ఆధిపత్యం నుంచి భారతీయ భాషలను కాపాడేందుకు దేశంలోని విశిష్టమైన సంస్కృతిని రక్షించేందుకు ఇంగ్లిష్ కూడా అధికారిక భాషగా కొనసాగాలి.
1965లో హిందీని రుద్దాలని చూస్తే తమిళ భాషను రక్షించుకునేందుకు ఈ గడ్డ మీద యువత ఎలా పోరాడిందో తమ ప్రాణాలను ఎలా త్యాగం చేసిందో మరచిపోకండి.
హిందీ మాట్లాడే వాళ్లను భారతీయ పౌరులుగాను ఇతర భాషలు మాట్లాడే వారిని ద్వితీయ శ్రేణి పౌరులుగా చూసే తీరుతో దేశంలో విభజన తీసుకురాకండి.
హిందీని మళ్లీ రుద్దడం ద్వారా మరొక భాషా యుద్ధానికి తెరతీయకండి' అని స్టాలిన్ అన్నారు.

ఫొటో సోర్స్, Facebook/Pinarayi Vijayan
‘సమాజానికి మంచిది కాదు’
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కూడా అమిత్ షా కమిటీ ప్రతిపాదనలను వ్యతిరేకించారు. ఈమేరకు ప్రధాని నరేంద్ర మోదీకి ఆయన లేఖ రాశారు.
'యువతను తమ మాతృ భాషతో పాటు ఇతర భాషలు నేర్చుకునేందుకు ప్రోత్సహిస్తున్నప్పటికీ ఒక భాషను బలవంతంగా రుద్దుతున్నారనే ఆలోచన ప్రజల్లో వస్తే అది ఆందోళనకు దారి తీస్తుంది.
ఉద్యోగాల కోసం సిద్ధమయ్యేవారు కంగారు పడతారు. నష్టం జరగక ముందే తగిన దిద్దుబాటు చర్యలు తీసుకునేలా ప్రధాని జోక్యం చేసుకోవాలి.
భారత్‌లో అనేక భాషలున్నాయి. ఏ భాషను జాతీయ భాష అనడానికి లేదు.
ప్రభుత్వరంగంలో యువతకు ఉన్న అవకాశాలే తక్కువ. ఇలాంటి సమయంలో భాషా ప్రాతిపదికన ఒక వర్గం వారిని పక్కన పెట్టడమనేది సమాజానికి మంచి చేయదు' అని పినరయి విజయన్ రాశారు.

ఫొటో సోర్స్, Facebook/H D Kumaraswamy
‘ఈ దేశం హిందువులు, హిందీ వాళ్లది మాత్రమే కాదు’
కర్నాటక మాజీ ముఖ్యమంత్రి, జేడీ(ఎస్) నేత కుమారస్వామి కూడా పార్లమెంటరీ కమిటీ సిఫారసులను విమర్శించారు.
హిందీని బలవంతంగా రుద్ది, దేశాన్ని 'హిందిస్తాన్'గా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. 'భారత్ సమాఖ్యను దెబ్బతీసేలా అనేక సిఫారసులున్నాయి. ఒకే దేశం-ఒకే మతం- ఒకే భాష అనే నినాదంతో సమాఖ్య వ్యవస్థను దెబ్బతీయాలని అమిత్ షా నేతృత్వంలోని కమిటీ భావిస్తోంది' అని కుమారస్వామి అన్నారు.
'కమిటీ చేసిన సిఫారసులను ఎట్టి పరిస్థితుల్లోనూ అమలు చేయకూడదు. అన్ని రాష్ట్రాలు, ప్రత్యేకించి దక్షిణ రాష్ట్రాలు కలిసి కట్టుగా దీన్ని వ్యతిరేకించాలి' అని ఆయన పిలుపునిచ్చారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
బీజేపీ ఇలాగే హిందీని రుద్దాలని ప్రయత్నిస్తూ పోతే దేశంలో భాషా పరమైన సంక్షోభం ఏర్పడుతుంది. భారత్ అంటే హిందువులు, హిందీ మాత్రమే కాదు. అది అందరిదీ' అని కుమారస్వామి ట్వీట్ చేశారు.
దక్షిణాది రాష్ట్రాల విద్యార్థులు హిందీ మాట్లాడే రాష్ట్రాల్లోని కేంద్రీయ విద్యా సంస్థల్లో చేరితే వారి పరిస్థితి ఏంటని కొందరు ప్రశ్నిస్తున్నారు.
'హిందీ మాట్లాడే రాష్ట్రాల్లోని కేంద్ర ప్రభుత్వ ఉన్నత విద్యాసంస్థల్లో ఆల్ ఇండియా ప్రాతిపదికన ప్రవేశాలు ఉంటాయి. హిందీ మాట్లాడే రాష్ట్రాల్లో చదవడానికి ఇతర రాష్ట్రాల నుంచి కూడా విద్యార్థులు వస్తారు. దక్షిణాది రాష్ట్రాల వారు కూడా అందులో ఉంటారు. అలాంటప్పుడు హిందీలో మాత్రమే బోధించడం ఎంత వరకు సబబు?' అని తమిళనాడు కమ్యూనిస్టు నేత వెంకటేశన్ బీబీసీ తమిళ్‌తో అన్నారు.

ఫొటో సోర్స్, Facebook/Amit Shah
ప్రభుత్వ మద్దతుదారులు ఏమంటున్నారు?
హిందీ భాష మీద అమిత్ షా కమిటీ చేసిన సిఫారసుల మీద ఆందోళన అవసరం లేదని కొందరు చెబుతున్నారు.
కేటగిరి-ఎ జాబితాలోని రాష్ట్రాల్లో మాత్రమే ఐఐటీ వంటి ఉన్నత విద్యా సంస్థల్లో హిందీ మీడియం ఉంటుందని, ఇతర రాష్ట్రాల్లో వారి వారి భాషల్లో బోధించొచ్చని చెబుతున్నారు.
ఇంగ్లిష్ విదేశీ భాష అని... దాని స్థానంలో హిందీని, స్థానిక భాషలను తీసుకురావాలని బీజేడీ నేత భరృహరి మహ్తాబ్ వార్తా సంస్థ పీటీఐతో అన్నారు. అమిత్ షా నేతృత్వంలోని కమిటీకి ఆయన డిప్యూటీ చైర్మన్‌గా ఉన్నారు.
విద్యా బోధన అధికారిక భాష లేదా స్థానిక భాషల్లో మాత్రమే ఉండాలని కొత్త జాతీయ విద్యా విధానం చెబుతోందని దాని ప్రకారమే కమిటీ సిఫారసులు చేసిందని ఆయన అన్నారు.
భారత్‌లోని అన్ని రాష్ట్రాలను, కేంద్ర పాలిత ప్రాంతాలను మూడు విభాగాలు విభజించారు.
కేటగిరి 'ఎ': ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్, ఝార్ఖండ్, హరియాణా, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, దిల్లీ, అండమాన్ అండ్ నికోబార్ దీవులు
కేటగిరి 'బి': గుజరాత్, మహారాష్ట్ర, పంజాబ్, ఛండీగడ్ కేంద్ర పాలిత ప్రాంతాలు, దామన్ అండ్ డయ్యూ, దాద్రా అండ్ నగర్ హవేలీ
కేటగిరి 'సి': దక్షిణాది రాష్ట్రాలతో సహా భారత్‌లోని మిగతా ప్రాంతాలన్నీ ఈ విభాగంలో ఉంటాయి.

ఫొటో సోర్స్, Getty Images
అమిత్ షా కమిటీ సిఫారసులు ఏంటి?
అధికారిక భాష మీద ఏర్పాటు చేసిన అమిత్ షా నేతృత్వంలోని కమిటీ పోయిన నెలలో తన నివేదికను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సమర్పించింది.
అందులోని కీలక అంశాలు...
- ఐఐటీ, ఐఐఎం, ఎయిమ్స్, కేంద్ర విశ్వవిద్యాలయాలు, కేంద్రీయ విద్యాలయాలు వంటి వాటిల్లో ఇంగ్లిష్‌కు బదులు హిందీ మీడియంలో బోధించాలి. ఇంగ్లిష్‌ను ఆప్షనల్‌గా ఉంచాలి.
- హిందీ మాట్లాడే రాష్ట్రాల్లో దీన్ని తప్పనిసరిగా అమలు చేయాలి. ఇతర రాష్ట్రాల్లో అక్కడి ప్రాంతీయ భాషల్లో బోధించాలి.
- ఐక్యరాజ్యసమితిలో హిందీ కూడా అధికార భాషల్లో ఒకటిగా ఉండాలి.
- అన్ని రాష్ట్రాల్లోనూ ఇంగ్లిష్ కంటే స్థానిక భాషలకే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి.
- 'ఎ' కేటగిరీ రాష్ట్రాల్లో హిందీకి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి. 100శాతం దాన్ని వాడాలి.
- పోటీ పరీక్షల్లో తప్పనిసరిగా ఇంగ్లిష్‌లో ప్రశ్నాపత్రాలు ఇవ్వడాన్ని నిలిపి వేయాలి.
- హిందీ మాట్లాడే రాష్ట్రాల్లోని హై కోర్టుల్లో తీర్పులను హిందీలోకి అనువదించేలా తగిన చర్యలు తీసుకోవాలి.
- హిందీ మాట్లాడే రాష్ట్రాల్లో పని చేసే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు హిందీలోనే కార్యకలాపాలు సాగించాలి. లేదంటే హెచ్చరిస్తారు. హెచ్చరించినా మారకపోతే వార్షిక పనితీరు మదింపులో ఆ ప్రభావం ఉంటుంది.
- కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, మంత్రిత్వశాఖలు, విభాగాలలో లేఖలు, ఫ్యాక్స్‌లు, ఇ-మెయిల్స్ వంటివి హిందీలోనే ఉండాలి. లేదా స్థానిక భాషలో ఉండాలి.
- కేంద్ర ప్రభుత్వ అధికారిక పనులు, ఆహ్వాన పత్రాలు, ఉపన్యాసాలు వంటి వాటిలో హిందీ లేదా స్థానిక భాషలను మాత్రమే వాడాలి.
అటు సోషల్ మీడియాలోనూ దీని మీద చర్చ జరుగుతోంది. #Hindiimposition అనే హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతోంది.
ఉత్తరప్రదేశ్‌లో హిందీ ఒక్కటే కాదని ఏడు భాషలున్నాయని @abhi_aditya10 అనే యూజర్ ట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 4
‘సైన్స్, టెక్నాలజీ ఇంగ్లిష్‌లో ఉంటే హిందీ నేర్చుకోవాల్సిన అవసరం ఏంటి? హిందీలో మనం కంప్యూటర్ ప్రోగ్రామింగ్ రాయగలమా?’ అని @_govindvarma అనే హ్యాండిల్ ట్వీట్ చేసింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 5
అయితే మరికొందరు అమిత్ షా కమిటీ సిఫారసులను ఆహ్వానిస్తున్నారు. ‘హిందీ మాట్లాడే రాష్ట్రాల్లో ఇంగ్లిష్ బదులు హిందీ తీసుకు రావడంతో పాటు ఇతర రాష్ట్రాల్లో ఇంగ్లిష్‌కు బదులు స్థానిక భాషలను తీసుకు వస్తారు. ఇది హిందీని రుద్దడం ఎలా అవుతుంది?’ అని శశాంక్ శేఖర్ ఝా అనే సుప్రీం కోర్టు న్యాయవాది ప్రశ్నించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 6
ఇవి కూడా చదవండి:
- పంజాబ్: ఖైదీలు తమ భాగస్వాములతో జైలులోనే ఏకాంతంగా గడపొచ్చు, లైంగికంగానూ కలవొచ్చు
- లేపాక్షిలో స్తంభం నిజంగా గాల్లో వేలాడుతోందా, దాని వెనకున్న వాస్తవాలేంటి ?
- స్పీకర్ ఫార్మాట్ అంటే ఏమిటి? ఎమ్మెల్యేల రాజీనామాలు ఆ పద్ధతిలో లేకుంటే చెల్లవా?
- రాజరాజ చోళుడు హిందువు కాదా, అసలు హిందూ అనే మతమే లేదా, చరిత్ర ఏం చెబుతోంది?
- శ్రీకాకుళం జిల్లా: బట్టలు ఉతకం అన్న రజకులు.. ఇతర కులాల సహాయ నిరాకరణ.. ఏం జరిగింది? - బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













