రోహిత్ శర్మ ఫ్యాన్‌ను హత్య చేసిన విరాట్ కోహ్లీ వీరాభిమాని... అసలేం జరిగింది?

ఫొటో సోర్స్, NURPHOTO
ఏ క్రికెటర్ గొప్ప అనే వాగ్వాదం చివరకు ఒక వ్యక్తి హత్యకు దారితీసింది.
తమిళనాడులో ఇద్దరు స్నేహితులు విరాట్ కోహ్లీ గొప్పా లేక రోహిత్ శర్మ గొప్ప అని ఘర్షణకు దిగారని, ఆ గొడవలో విరాట్ కోహ్లీ అభిమాని రోహిత్ శర్మ అభిమానిని హత్య చేసినట్లుగా వార్తలు వచ్చాయి.
విఘ్నేశ్ అనే రోహిత్ శర్మ అభిమానిని ధర్మరాజ్ అనే విరాట్ కోహ్లీ అభిమాని హత్య చేసినట్లుగా తమిళనాడు పోలీసులు తెలిపారు.
ఈ నేపథ్యంలో #ArrestKohli అనే హ్యాష్ ట్యాగ్ ట్విటర్‌లో బాగా ట్రెండ్ అవుతోంది.
విరాట్ కోహ్లీ 'దూకుడు' ఇందుకు కారణమని అందువల్ల విఘ్నేశ్ హత్యకు కోహ్లీ బాధ్యత వహించాలంటూ కొందరు ట్వీట్ చేస్తున్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
అయితే మరికొందరు విరాట్ కోహ్లీకి మద్దతుగా పోస్టు చేస్తున్నారు.
'గొప్ప క్రికెటర్' అయినందుకు కోహ్లీని అరెస్టు చేయాలా? అని కొందరు ప్రశ్నిస్తున్నారు. రోహిత్ శర్మ అభిమానులు కావాలనే #ArrestKohli అనే హ్యాష్ ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారని మరికొందరు విమర్శిస్తున్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
అసలు ఏం జరిగింది?
ధర్మరాజ్, విఘ్నేశ్ ఇద్దరూ స్నేహితులు.
ఘర్షణ జరిగిన సమయంలో స్నేహితులు తాగి ఉన్నట్లుగా వార్తా సంస్థ ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ తెలిపింది. ఐటీఐ పూర్తి చేసిన విగ్నేశ్ సింగపూర్ వెళ్లడానికి వర్క్ వీసా కోసం ఎదురు చూస్తున్నాడని, ధర్మరాజ్‌ను పోలీసులు అరెస్టు చేసి ఐపీసీ సెక్షన్ 302 కింద కేసు నమోదు చేసినట్లుగా ది హిందూ రిపోర్ట్ చేసింది.
కీలపలూరు పోలీసుల కథనం ప్రకారం...
'21 ఏళ్ల ఎస్.ధర్మరాజ్, 24 ఏళ్ల పి.విగ్నేశ్‌ల స్వస్థలం తమిళనాడులోని అరియలూరు జిల్లాకు చెందిన పొయ్యూరు గ్రామం. వారు స్నేహితులే కాదు ఇద్దరికి క్రికెట్ అంటే చాలా పిచ్చి.
విగ్నేశ్, రోహిత్ శర్మ అభిమాని కాగా ధర్మరాజ్ విరాట్ కోహ్లీ అభిమాని. మంగళవారం రాత్రి అంటే ఈ నెల 11న మల్లూరు సమీపంలోని స్మాల్ ఇండస్ట్రీయల్ డెవల్మెంట్ కార్పొరేషన్ ఇండస్ట్రీయిల్ ఎస్టేట్(ఎస్‌డీసీఓ) వద్ద ఒక ఖాళీ స్థలంలో మద్యం సేవిస్తున్నారు.

ఫొటో సోర్స్, DIBYANGSHU SARKAR
మద్యం సేవిస్తున్న సమయంలోనే వారిద్దరూ క్రికెట్ గురించి మాట్లాడుకోవడం మొదలు పెట్టారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో ముంబయి ఇండియన్స్‌ను సపోర్ట్ చేస్తున్నాడు విగ్నేశ్. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు మద్దతు ఇస్తున్నాడు ధర్మరాజ్.
క్రికెట్ గురించి మాట్లాడుకుంటున్న తరుణంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, విరాట్ కోహ్లీ గురించి విఘ్నేశ్ వ్యంగ్యంగా మాట్లాడాడు. అలాగే ధర్మరాజ్‌ను బాడీ షేమింగ్ చేసే అలవాటు కూడా విఘ్నేశ్‌కు ఉంది.
ధర్మరాజ్‌కు కాస్త నత్తి ఉంది. సరిగ్గా మాట్లాడలేడు. ఆ రోజు రాయల్ చాలెంజర్స్ బెంగళూరును ధర్మరాజ్ నత్తితో పోలుస్తూ ఎగతాళి చేశాడు విగ్నేశ్. దాంతో విగ్నేశ్‌కు కోపం వచ్చింది. ఆగ్రహంతో బాటిల్ తీసుకొని విఘ్నేశ్ మీద దాడి చేశాడు. క్రికెట్ బ్యాటు తీసుకొని తల మీద కొట్టాడు. ఆ తరువాత అక్కడి నుంచి పారిపోయాడు.
మరుసటి రోజు పొద్దున అంటే బుధవారం పనికి వెళ్తున్న సిడ్కో కార్మికులు ఖాళీ స్థలంలో విఘ్నేశ్ మృతదేహాన్ని చూశారు. వెంటనే వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు.'
ఇవి కూడా చదవండి:
- తెలుగు నేల మీద ఉన్న ఈ దీవులను చూస్తే విదేశీ యాత్రకు వచ్చిన ఫీలింగ్ కలుగుతుంది
- కేరళలో నరబలి: నిందితుడి ఇంటి వెనుక 61 శరీర భాగాలు- బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్
- షీ జిన్‌పింగ్: చైనా అధ్యక్షుడిగా మూడోసారి పగ్గాలు చేపట్టబోతున్న ఈ నిరంకుశ నేత కథేంటి?
- ఆవు తేన్పుల మీద పన్ను... ఎక్కడ, ఎందుకు?
- బాలీవుడ్ ఎందుకు దక్షిణాది సినిమాల వెంట పడుతోంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













