#UnstoppableWithNBKS2: '1995లో మనం తీసుకున్న బిగ్ డెసిషన్ తప్పా?' - బాలకృష్ణ, చంద్రబాబు టాక్ షోపై సోషల్ రియాక్షన్స్

అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే సీజన్ 2

ఫొటో సోర్స్, AHA/FACEBOOK

ఫొటో క్యాప్షన్, చంద్రబాబు నాయుడు, బాలకృష్ణ
    • రచయిత, పద్మ మీనాక్షి
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఆహా ఓటీటీ వేదికలో 'అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే' సీజన్-2 శుక్రవారం ప్రారంభమైంది. ఈ షో హోస్ట్ సినీ నటుడు బాలకృష్ణ రెండో సీజన్ తొలి ఎపిసోడ్‌లో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఇంటర్వ్యూ చేశారు.

ఈ ఇంటర్వ్యూలో ఆయన చంద్రబాబును వ్యక్తిగత, రాజకీయ ప్రశ్నలు అడిగారు. ఈ షోకు సంబంధించిన ట్రైలర్ అక్టోబరు 11న విడుదలైంది.

ఈ ట్రైలర్‌కు విడుదలైన నాలుగు రోజుల్లోనే 30 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. 7,996 కామెంట్లు లభించాయి.

షో ప్రసారానికి ముందే ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో బాగా ప్రచారం పొందింది. ఇరు వర్గాలకు చెందిన వారి మధ్య విమర్శల వర్షం మొదలైంది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

అయితే, ఈ ట్రైలర్‌లో బాలకృష్ణ "మీ జీవితంలో తీసుకున్న అతి పెద్ద నిర్ణయం అని అడిగినప్పుడు, 95లో తీసుకున్న నిర్ణయం అని అంటూ, 1995లో మనం తీసుకున్న నిర్ణయం తప్పా?" అని చంద్రబాబు నాయుడు బాలకృష్ణను ప్రశ్నించారు. "ఆ రోజు నాకింకా గుర్తుంది" అని బాలకృష్ణ అన్నారు.

"కాళ్లుపట్టుకుని నా మాట వినమని అడుక్కున్నా, ఆయన వినలేదు" అని చంద్రబాబు అన్నారు.

ఈ అంశం రాజకీయ చర్చకు దారి తీసింది. వైసీపీ నాయకులు ఈ ట్రైలర్‌లో చంద్రబాబు చెప్పిన విషయాల పట్ల స్పందించారు.

లక్ష్మీ పార్వతి

ఫొటో సోర్స్, RGV/FACEBOOK

ఫొటో క్యాప్షన్, లక్ష్మీ పార్వతి

చంద్రబాబు ఎన్టీఆర్ కాళ్ళు పట్టుకోవడం పచ్చి అబద్ధమని వైసీపీ నాయకురాలు, ఎన్టీఆర్ రెండవ భార్య లక్ష్మీ పార్వతి అన్నారు. ఆమె ఈ అంశం పై టీవీ-9తో మాట్లాడారు.

"నా జీవితంలో ఆయనొక ఆరాధ్య దైవం. ఎప్పుడూ నా గుండెల్లో ఉంటారు" అని ఎన్టీ రామారావును ఉద్దేశించి చంద్రబాబు అన్న మాటల పట్ల కూడా లక్ష్మీ పార్వతి స్పందించారు.

తెలుగుదేశం ఓడిపోతుందని బాబు ప్రచారం చేయించారని ఆమె ఆరోపించారు. చంద్రబాబు అధికార దాహమే ఎన్ఠీఆర్‌ను చంపేసిందని విమర్శించారు. ఇద్దరు వెన్నుపోటు దారులు ఒకరినొకరు సమర్ధించుకున్నట్లుగా ఈ ట్రైలర్ ఉందని ఆమె ఒక న్యూస్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు.

సోషల్ మీడియాలో ట్రైలర్, షోలకు మిశ్రమ స్పందనలు లభిస్తున్నాయి.

"గొప్ప నిర్ణయాలు - గొప్ప క్షణాలు" మనసు విప్పి మాట్లాడిన లెజెండ్‌ చూడండి అంటూ సినీ విలేఖరి వంశీ కాక ట్వీట్ చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

"ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత చంద్రబాబు నాయుడు మీద ఉన్న గౌరవం, ప్రేమ పెరిగిపోయాయి" అంటూ సాయి కిరణ్ అనే యూజర్ ట్వీట్ చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 3
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 3

దీనిపై ఆంధ్రప్రదేశ్ పర్యాటక మంత్రి రోజా కూడా స్పందించారు.

రోజా

ఫొటో సోర్స్, Roja selvamani/FACE BOOK

"అన్ స్టాపబుల్ షోలో బావ, బావమరుదులు అబద్ధాలను ఎంత కళ్ళార్పకుండా చెప్పారో అందరూ గమనించి ఉంటారు. ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచి పార్టీని లాక్కున్న చంద్రబాబు నాయుడు తిరిగి బాలకృష్ణను నేను చేసింది తప్పా అని అడగడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. పచ్చ మీడియా ద్వారా చెబితే నమ్మడం లేదు కాబట్టి వేరే చానెల్ ద్వారా మాట్లాడుతున్నారు" అని రోజా విమర్శించారు.

అయితే, బాలకృష్ణ షో మీద రాజకీయ ప్రత్యర్థులు ఏమి మాట్లాడాలో తెలియక అకారణంగా విమర్శలు చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్యచౌదరి అన్నారు. "చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను బాలకృష్ణ సమర్ధించడం ద్వారా ఎన్టీఆర్ కుటుంబంలో జరిగిన వ్యవహారం బయటపడింది. ప్రత్యర్ధులు ఈ తరంలో టీడీపీ పట్ల అపోహలు కలిగించాలని చేస్తున్న ప్రయత్నాలకు చంద్రబాబు అడ్డుకట్ట వేశారు. ఇది రాజకీయంగా కీలక పరిణామం. లోకేష్, చంద్రబాబు పై చేస్తున్న విమర్శలకు ఇకనైనా అడ్డుకట్ట పడుతుందని భావిస్తున్నాం" అని ఆయన అన్నారు.

ఈ ఎపిసోడ్ గురించి ఆహా' కొన్ని పట్టణాల్లో పోస్టర్లను కూడా పెట్టింది.

ఈ ఎపిసోడ్ ఫైర్ సృష్టిస్తుందని మరొక యూజర్ ట్వీట్ చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 4
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 4

"చంద్రబాబు అసలు స్వభావం, ఎన్టీఆర్ పై వెన్నుపోటు గురించి తెలుసుకోవాలంటే నాదెండ్ల భాస్కరరావు లేదా ఆయన తోడల్లుడు దగ్గుబాటి రాసిన "ఒక చరిత్ర కొన్ని నిజాలు" పుస్తకం చదవాలి. అప్పుడు అసలు విషయాలు బయటపడతాయి" అని అరవింద్ జాషువా అనే ఫేస్ బుక్ యూజర్ పోస్టు పెట్టారు.

కాంగ్రెస్ నాయకుడైన సర్దార్ పటేల్ పేరును బీజేపీ వాడుకుంటున్నట్లుగానే రాష్ట్రంలో ఎన్టీఆర్ ఇమేజ్‌ను వాడుకోవాలని జగన్ చూస్తున్నారనే విషయాన్ని గుర్తించే చంద్రబాబు ఈ షోను ప్లాన్ చేసినట్లుగా అనిపిస్తోందని టైమ్స్ ఆఫ్ ఇండియా అసిస్టెంట్ ఎడిటర్ ధారా గోపి అన్నారు.

ఆయన బీబీసీ విలేఖరి శంకర్ వడిశెట్టితో మాట్లాడుతూ, " చంద్రబాబుతో విభేదించిన సమయంలో దగ్గుబాటి వెంకటేశ్వర రావు, హరికృష్ణ 1995 నాటి వాస్తవాలను వెల్లడించారు.

"ప్రస్తుతం రాజకీయ వేదిక కాకపోయినా, రాజకీయ విషయాలనుచర్చించాల్సిన అవసరం లేకపోయినా 1995 నాటి పరిస్థితిని ప్రత్యేకంగా ప్రస్తావించడం వెనుక రాజకీయ కారణాలున్నాయి" అని ఆయన అభిప్రాయపడ్డారు.

అయితే, ఈ ఇంటర్వ్యూలో చంద్రబాబును బాలకృష్ణ కొన్ని సరదా ప్రశ్నలు కూడా అడిగారు.

"మీ జీవితంలో మీరు చేసిన మోస్ట్ రొమాంటిక్ పనేంటి?" అని బాలకృష్ణ ప్రశ్నించినప్పుడు, "మీ కంటే ఎక్కువే చేశాను. మీరు సినిమాల్లో చేస్తే, నేను కాలేజీలో చేశాను" అని సమాధానమిచ్చారు.

"మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు అని అడిగినప్పుడు, రాజశేఖర్ రెడ్డి నేను కలిసి తిరిగేవాళ్ళం" అని సమాధానం చెప్పారు.

(అదనపు సమాచారం: విజయవాడ నుంచి శంకర్ వడిశెట్టి)

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)