PS-1: ఆదిత్య కరికాలన్‌ను హత్య చేసిందెవరు, చరిత్ర ఏం చెబుతోంది?

ఆదిత్య కరకాలన్ పాత్ర పోషించిన విక్రమ్

ఫొటో సోర్స్, @Chiyaan/TWITTER

    • రచయిత, మురళీధరన్ కాశీ విశ్వనాథన్
    • హోదా, బీబీసీ తమిళ్

ఆదిత్య కరికాలన్ సుందర చోళ (రెండవ పరాంతక) మొదటి కుమారుడు. ఈయన విజయాలయ చోళ వారసత్వంలో రెండవ దశలో పాలించిన చోళ రాజు.

సుందర చోళునికి పరాంతకన్ దేవి అమ్మన్, వనవాన్ మాదేవి అనే ఇద్దరు భార్యలు ఉండేవారు. వనవాన్ మాదేవికి ఆదిత్య కరికాలన్, కుందువాయ్, అరుళ్‌మొళి అనే ముగ్గురు పిల్లలు ఉన్నారు.

చోళ వారసత్వం ప్రకారం సుందర చోళునికి రాజ్యాధికారం దక్కించుకునే వారసత్వం లేదు.

కంధరథిత చోళుడు మరణించే సమయానికి మధురాంతక ఉత్తమ చోళుడు చాలా చిన్న పిల్లవాడు. దీంతో, కంధరథిత సోదరుడు అరింజయ చోళుడు రాజు అయ్యారు.

కానీ, ఆయన చక్రవర్తి అయిన కొన్ని రోజులకే మరణించారు. దీంతో, ఆయన కొడుకు సుందర చోళుడు సింహాసనాన్ని అధిష్టించారు.

కానీ, కంధరథిత కుమారుడు మధురాంతక ఉత్తమ చోళునికి రాజు కావాలనే కోరిక ఉండేది.

సుందర చోళుని మొదటి కుమారుడు ఆదిత్య కరికాలన్ చిన్న తనం నుంచే ధైర్య సాహసాలు, ధీరత్వాన్ని ప్రదర్శించేవారు.

ఆయన యుద్ధంలో పాండ్య రాజు వీర పాండ్యన్‌ను ఓడించినట్లు అనైమంగళం రాగి శాసనాలు చెబుతున్నాయి.

"మను వంశానికి వెలుగైన ఆదిత్యన్ సింహపు పిల్ల ఏనుగులను చంపేందుకు పోరాడినట్లుగా వీర పాండ్యన్ తో పోరాడారు" అని ఈ రాగి శాసనం పై లిఖించి ఉంటుంది.

క్రీస్తు శకం 966లో ఆదిత్య కరికాలన్ యువరాజు అయ్యారు. కానీ, మూడేళ్ళ తర్వాత 969లో ఆయన హత్యకు గురయ్యారు.

కొన్ని నెలల తర్వాత సుందర చోళుడు కూడా పుత్రశోకంతో మరణించారు.

ఆదిత్య కరికాలన్‌ను హత్య చేసినందుకు పెరియ బల్వట్టరాయ న్యూనతతో కుంగిపోతున్నట్లు చెప్పినట్లు కల్కి రచించిన పొన్నియన్ సెల్వన్ నవలలో పేర్కొన్నారు. ఆయన తన భార్య నందిని పై విసిరిన గొడ్డలి పొరపాటున ఆదిత్యకు తగిలి మరణించినట్లు రాశారు. ఇందుకు శిక్షగా బల్వట్టరాయ ఆత్మహత్య చేసుకుని మరణించినట్లు ఈ పుస్తకంలో రాశారు.

కల్కి నవలలో కదంబూర్‌కోటలో జరిగిన కుట్ర, అదే కోటలో జరిగిన ఆదిత్యుని హత్య అనే రెండు ముఖ్యమైన ఘట్టాలు ఉంటాయి.

ఈ నవలలో మొదటి నుంచి రవిదాసన్, సోమన్ సంభవన్, పరమేశ్వరన్ లను చోళ వంశాన్ని నాశనం చేసేందుకు ప్రయత్నిస్తున్న వారిగా చిత్రీకరించారు.

వీరిని పాండ్య రాజు వీర పాండ్యన్ మరణానికి ప్రతీకారం తీర్చుకునేందుకు వచ్చిన పాండ్య వంశ అత్యవసర సేనలుగా కల్కి నవల పేర్కొంది.

కానీ, ఆదిత్య హత్యకు చరిత్ర చెప్పే కారణాలు వేరుగా ఉన్నాయి.

పొన్నియిన్ సెల్వన్

ఫొటో సోర్స్, LYCA/MADRAS TALKIE

ఆదిత్య హత్య విషయం వెలుగులోకి ఎలా వచ్చింది?

తమిళనాడులోని కుద్దలూర్ జిల్లాలో కట్టు‌మన్నార్‌కుడి దగ్గర ఉదయార్‌కుడిలో అనంతేశ్వర శివుని ఆలయం ఉంది. ఈ ఆలయం గర్భాలయానికి పశ్చిమ దిక్కులో ఒక శాసనం చెక్కి ఉంది.

రాజరాజ పరిపాలనా కాలంలో రెండవ సంవత్సరంలో ఈ శాసనాన్ని చెక్కారు.

ఈ శాసనం ప్రకారం ఆదిత్య కరికాలన్ హత్యతో సంబంధం ఉన్నవారి నుంచి స్వాధీనం చేసుకున్న భూములను అమ్మేందుకు అనుమతి ఇచ్చింది.

"ఆదిత్య కరికాలన్ ను హత్య చేసిన వారు రంబి రవిదాసన్, పరమేశ్వరన్, ఆయన సోదరుడు మలయనూరన్, ఆయన సోదరులు, పిల్లలు, బంధువులైన రామప్పన్ సోదరీసోదరులు, వారి పిల్లల ఆస్తులను జప్తు చేసి ఆ స్థలాలను కొట్టాయూర్ బ్రహ్మశ్రీ రాజన్, పుల్లమంగళం చంద్రశేఖర పట్టన్ కు అప్పగించాలి" అని ఈ శాసనంలో రాశారు.

సోమన్ సోదరుడు రవిదాసన్ పంచవన్ ప్రమధి రాజన్, ఆయన సోదరుడు పరమేశ్వరన్ ఇరుముడి చోళ బ్రహ్మాదిరాజన్ కలిసి ఆదిత్య కరికాలన్ ను హత్య చేశారని ఈ శాసనంలో రాశారు.

ఆదిత్య కరకాలన్ పాత్ర పోషించిన విక్రమ్

ఫొటో సోర్స్, @chiyaan/TWITTER

సోమన్, రవిదాసన్, పరమేశ్వరన్ ఎవరు? వీళ్ళు ఆదిత్యను ఎందుకు హత్య చేశారు? పాండ్య రాజ్యంలో బ్రాహ్మణ అధికారులకు పంచవన్ బ్రహ్మాదిరాజన్ అనే బిరుదును ఇస్తారు. ఇదే కుటుంబంలో ఇద్దరు సోదరులు చోళ, పాండ్య రాజ్యాల్లో అధికారులుగా మారారు.

వారీ హత్యను ఎందుకు చేశారు? ఈ హత్య ద్వారా వీర పాండ్యన్ మరణానికి ప్రతీకారం తీర్చుకున్నారు.

అయితే, సింహాసనాన్ని అధిష్టించేందుకు వేచి చూస్తున్న ఉత్తమ చోళుడే ఈ హత్య చేయించాడని మరొక వాదన ఉంది. కొంత మంది ఈ హత్య వెనుక రాజరాజ, కుందవై ఉన్నారని అంటారు.

చోళాస్ పుస్తక రచయత కేఏ నీలకంఠ శాస్త్రి రచించిన పుస్తకంలో ఉత్తమ చోళుడే ఆదిత్యను హత్య చేయించాడని రాశారు.

పోస్ట్‌ YouTube స్కిప్ చేయండి
Google YouTube ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of YouTube ముగిసింది

"ఉత్తమ చోళునికి ఈ హత్యతో సంబంధం లేదని చెప్పలేం. ఆయనకు సింహాసనం కావాలి. ఆయన సింహాసనాన్ని బంధువులు తీసుకున్నారని భావించారు. దీంతో, ఆయన ఇతరుల మద్దతుతో ఆదిత్య ను హత్య చేయించి తనను రాజును చేయమని సుందర చోళుని బలవంతం చేశారు. మరో మార్గం లేక సుందర చోళుడు ఆయన కోరికను అంగీకరించారు" అని నీలకంఠ శాస్త్రి పుస్తకంలో రాశారు.

అయితే, లేటర్ చోళాస్" పుస్తక రచయత టీవీ సదాశివ పండారథర్ ఈ వాదనతో అంగీకరించరు. ఉత్తమ చోళుడు తనకిష్టమైనంత కాలం రాజ్యాన్ని పాలించవచ్చని రాజరాజ చోళునికి సింహాసనం ఇచ్చే అవసరం లేదని థిరువలంగాడు రాగి శాసనాల్లో కనిపిస్తుంది.

ఆయన సింహాసనం కోసం ఆదిత్యుని హత్య చేయించి ఉంటే ఆయనకు ప్రజల మద్దతు, అధికారుల సహకారం లభించి ఉండేది కాదని ఈ శాసనాల్లో పేర్కొన్నారు.

"ఉత్తమ చోళుని కాలంలో హత్యకు పాల్పడిన వారికి శిక్ష పడలేదు. వారికి రాజ రాజ చోళుని కాలంలో శిక్ష పడింది.

హత్య చేసిన ఒక వ్యక్తిని ఆయనకు సంబంధించిన వ్యక్తులకు రాజ రాజ పరిపాలనా కాలంలో శిక్ష విధించినట్లు ఉదయార్‌కుడి శాసనంలో ఉంది. హతులను గుర్తించి శిక్షించేందుకు కొంత కాలం పట్టి ఉంటుంది. అప్పటికే ఉత్తమ చోళుని పరిపాలన ముగిసి ఉండవచ్చు. దీంతో, మిగిలిన హతులను రాజ రాజ కాలంలో శిక్షించారు. ఇది సహజమైన విషయమే. ఉత్తమ చోళుడు హతులను శిక్షించకుండా వదిలేశారనడానికి ఎటువంటి ఆధారాలు లేవు." అని సదాశివ పండారాథర్ అన్నారు.

ఆదిత్య కరకాలన్ పాత్ర పోషించిన విక్రమ్

ఫొటో సోర్స్, @chiyaan/Twitter

ఆదిత్య హత్య వెనుక కుందవై, అరుళ్‌మోళి ఉన్నారని 1971లో ఆర్ వి శ్రీనివాసన్ చెన్నై వివేకానంద కాలేజీ పత్రికకు రాసిన వ్యాసంలో పేర్కొన్నారు.

ఈ విషయాన్ని కుదువాయిల్ బాల సుబ్రహ్మణ్యన్ ఆయన వ్యాసంలో రాశారు.

ఈ హత్య వెనుక ఉన్న అనేక సిద్ధాంతాలను ఉదయార్‌కుడి శాసనం అనే వ్యాసంలో సమీక్షించారు.

"ఆదిత్య హత్యను పాండ్య రాజ్యంలో ప్రణాళిక చేసినట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఎసాళం అనే గ్రామంలో ఒకటవ రాజేంద్ర చెక్కించిన రాగి శాసనంలో, ఆదిత్య కర కాలన్ వీర పాండ్యన్‌ను తల నరికి కర్రకు తగిలించి తంజావూరు కోట ముందు వేలదీసినట్లు రాశారు. యుద్ధ ధర్మానికి వ్యతిరేకంగా ఆయన చేసిన ఈ నేరానికి పాండ్యులు ప్రతీకారం తీర్చుకున్నారు" అని రాశారు.

మధురాంతక ఉత్తమ చోళుని పాలన పట్ల రాజ రాజ చోళునికి చాలా గౌరవం ఉంది. రాజరాజ రాజేంద్ర చోళునికి మధురాంతక అనే ముద్దు పేరు కూడా పెట్టుకున్నారు. ఇలాంటి చారిత్రక ఆధారాలను చూడకుండా ఉత్తమ చోళుడే ఆదిత్యుని హత్యకు కారణమని అనడం సరైంది కాదని అంటారు.

"కేవలం ఉదయాళూర్ శాసనాల ఆధారంగా ఆదిత్యుని హత్య చేసిన వారెవరో ముగింపునకు రావడానికి వీలు లేదని అంటారు.

ఈ శాసనం కేవలం హతుల గురించి ఒక వాక్యంలో చెబుతోంది. కానీ, ఈ హత్య, శిక్షకు సంబంధించి ఇదే పూర్తి శాసనం అని చెప్పలేం" అని బాల సుబ్రహ్మణ్యన్ చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)