ఇన్‌కమ్ ట్యాక్స్ భారాన్ని తగ్గించుకునే మార్గాలివే...
ఆధునిక అమెరికా వ్వవస్థాపకులలో ఒకరైన బెంజమిన్ ఫ్రాంక్లిన్ ఓ సందర్భంలో, "ఈ ప్రపంచంలో చావు, పన్ను నుంచి మాత్రం ఎవరూ తప్పించుకోలేరు."
దాదాపు అన్ని దేశాలలోనూ నిర్దేశిత పరిమితికి మించి ఆదాయం కలిగిన వారంతా ప్రభుత్వానికి తప్పకుండా ఆదాయపు పన్ను చెల్లిస్తుంటారు.
గతంలో కొన్ని అరబ్ దేశాలలో ఆదాయపు పన్ను ఉండేది కాదు. ప్రస్తుతం ఆ దేశాలలోనూ ఈ పన్నును అమలులోకి తీసుకొచ్చారు.
ఈ పరిస్థితుల్లో ఆదాయపు పన్ను నిబంధనల గురించి, ఆ నిబంధనలకు లోబడి ఎలా మదుపు చేయాలి? అనే అవగాహన చాలా ముఖ్యం.
ఏటా జనవరి రెండో వారానికి అటూఇటుగా చాలా కంపెనీలలో మదుపు చేసిన మొత్తానికి సంబంధించిన డాక్యుమెంట్లు సమర్పించాల్సి ఉంటుంది.
చాలామంది ఆ సమయానికి దగ్గర్లో హడావిడిగా ఏదైనా మదుపు చేసి, ఆ డాక్యుమెంట్లు దాఖలు చేస్తుంటారు.
అయితే, ఇది సరైన పద్ధతి కాదు. వీలైనంత త్వరగా మదుపు చేయడం మొదలు పెట్టాలి. ఈ ఏడాది ఆ గడువుకు మూడు నెలల సమయం ఉంది. ఈ మూడు నెలల సమయాన్ని ఉపయోగించుకుని తగిన జాగ్రత్తలు తీసుకుని ఎలా గరిష్ఠంగా లాభం పొందాలో ఈ వీడియోలో చూద్దాం.
ఇవి కూడా చదవండి:
- కాంతార మూవీ రివ్యూ: సినిమా అంతా ఒక లెవెల్లో ఉంటే చివరి పది నిమిషాలది మరో లెవెల్
- PM BJP-జనరిక్ మందులు: కీళ్ల నొప్పుల నుంచి క్యాన్సర్ చికిత్స దాకా ఏ మందులైనా 50 నుంచి 90 శాతం తక్కువ ధరకే.. అయినా వీటిని ఎందుకు కొనట్లేదు?
- Income Tax: ఆదాయ పన్నును మ్యాగ్జిమం తగ్గించుకోవడం ఎలా?
- ఆవు తేన్పుల మీద పన్ను... ఎక్కడ, ఎందుకు?
- బాలీవుడ్ ఎందుకు దక్షిణాది సినిమాల వెంట పడుతోంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)


