ఈ ఆవు ఎత్తే దాని ప్రాణాలను కాపాడింది... ఎలాగో తెలుసా?

సాధారణంగా ఆవుల ఎత్తు ఒక మీటరుకు కొంచెం అటు ఇటుగా ఉంటుంది. కానీ ఇప్పుడు మీరు చూడబోతున్న ఆవు ఎత్తు 1.94 మీటర్లు.
నికర్స్ అని పిలుచుకునే ఈ ఆవు ఆస్ట్రేలియాలో ఉంది. దీని ఎత్తు సాధారణ ఆవులకన్నా రెట్టింపు. అదే దాని ప్రాణాలను కాపాడింది.
హోల్‌స్టీన్ ఫ్రీసియన్ జాతికి చెందిన ఈ ఆవు వయసు ఏడేళ్లు. దీని బరువు 1400 కేజీలు.
ఇది ఎక్కువ ఎత్తుగా ఉండటంతో దీన్ని పెంచడం కష్టమనుకున్న యజమాని కబేళాకు అమ్మేశాడు. కానీ ఆ ఎత్తే దాని ప్రాణాలను నిలబెట్టింది.
ఈ ఆవును చంపుదామని ప్రయత్నించిన కబేళా యజమానికి దాని మెడ అందలేదు. దీంతో దాన్ని వదిలేశాడు. అలా అది బతికి బయటపడింది.
దాదాపు రెండు మీటర్ల ఎత్తు ఉన్నప్పటికీ ఇది ప్రపంచంలోని అత్యంత ఎత్తైన ఆవు అయితే కాదు. ఆ రికార్డు ఓ ఇటలీ ఆవు పేరిట ఉంది. దాని ఎత్తు 2.02 మీటర్లు.
ఇవి కూడా చదవండి.
- అడవిని నేలమట్టం చేస్తున్న బుల్డోజర్ను ప్రతిఘటించిన ఒరాంగుటాన్
- టీఆర్ఎస్, మహాకూటమి ముందున్న సవాళ్లు
- బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ఇచ్చిన రాజీవ్ గాంధీని చంపించిన ఎల్టీటీఈ ప్రభాకరన్
- గూగుల్ రాక ముందు జీవితం ఎలా ఉండేది?
- హైదరాబాద్ నిజాం భారత సైన్యానికి ఎందుకు లొంగిపోయారు?
- చరిత్ర: భారత్ నుంచి బ్రిటన్ ఎంత సంపద దోచుకెళ్లింది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








