WORDLE: ఈ సరదా గేమ్ మరో సుడోకు అవుతుందా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, జేన్ వేక్‌ఫీల్డ్
- హోదా, టెక్నాలజీ ప్రతినిధి
నిస్సంకోచంగా.. ఇది చాలా సింపుల్ గేమ్. ఇది యాప్ కాదు. కానీ వెబ్ బేస్డ్. దీన్ని రూపొందించిన వాళ్లకు ఈ గేమ్‌కు వ్యసనపరుల్ని తయారు చేసే ఉద్దేశం లేదు.
అయితే, ఈ గేమ్ ఆడుతున్న వారిలో చాలా మంది ప్రతీ రోజూ ఒకటి కంటే ఎక్కువ పజిల్స్ కావాలని కోరుతున్నారు.
ప్రకటనల ఆధారంగా చూస్తారా లేక డేటా ఖర్చు చేస్తున్న దాన్ని బట్టి చూస్తారా .. ఎలా చూసినా సరే.. కొన్ని నెలల్లోనే ఇది లక్షల మంది యూజర్లను సంపాదించింది.
ఖాళీలను పూరించిన సమాధానాలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసే అవకాశం ఉండటం దీన్ని ప్రత్యేకంగా మార్చింది.
వర్డ్‌లె..ఇప్పుడీ గేమ్ ఇంటర్నెట్ సంచలనం. న్యూయార్క్ టైమ్స్ చాలా భారీ మొత్తానికి దీన్ని కొనుగోలు చేసింది. కచ్చితంగా ఎంతకు అని బయటకు చెప్పకున్నా.. ఆ మొత్తం ఏడంకెల్లో ఉంది. ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే కొన్ని కోట్లు కావచ్చు.
రెడిట్ ఇంజనీర్ జోష్ వార్డ్‌లె లాక్‌డౌన్ సమయంలో సరదాగా స్నేహితురాలితో ఆడుకునేందుకు ఈ గేమ్‌ని సృష్టించారు. ప్రతీ రోజూ ఒక ఐదక్షరాల పదం.. అందులో మిస్సైన ఒక అక్షరాన్ని కనుక్కోవడమే ఈ గేమ్.
ఓ పజిల్‌లో ఐదక్షరాల పదంలో అక్షరాలను కనుక్కునేందుకు ఆటగాళ్లు తమ ఊహలకు పదును పెడతారు.
ఆ రోజు వచ్చిన పదంలో మిస్సైన అక్షరాన్ని తప్పుగా ఎంటర్ చేస్తే పసుపు పచ్చ రంగులో .. కచ్చితంగా కనుక్కుంటే ఆకుపచ్చ రంగులో వస్తుంది.
మీరు ఎంటర్ చేసిన అక్షరం ఆ పదంలో లేకుంటే గ్రే కలర్ చూపిస్తుంది. అలా, ఒక్కో అక్షరాన్ని కనుక్కుంటూ పదాన్ని పూర్తి చేయడమే వర్డ్‌లె గేమ్.
రోజుకో గ్రిడ్. ఒక్కో గ్రిడ్ ( పజిల్ )లో ఆరు పదాలు. ఆ పదాల్లోని అక్షరాలు కనుక్కునేందుకు రోజంతా సమయం ఉంటుంది. కానీ.. అందుకోసం ఉన్న అవకాశాలు ఆరు మాత్రమే.
న్యూయార్క్ టైమ్స్ వివరాల ప్రకారం ఈ ఆటను ప్రతీ రోజూ మూడు లక్షల మంది ఆడుతున్నారు.
ఈ గేమ్‌ను భారీ మొత్తానికి విక్రయించారనే వార్త.. గేమ్ ఆడేవాళ్లకు షాకిచ్చింది. గేమ్ కనుక్కున్న వ్యక్తి కష్టానికి ఫలితం దక్కిందని కొంతమంది అనుకున్నారు.
నాకు సంతోషంగా ఉంది మిస్టర్ వర్డ్‌లె అంటూ జోష్ వార్డ్‌లె ను ఉద్దేశించి ఒకరు ట్వీట్ చేశారు.
"ఆయన ఈ గేమ్‌ను తన సహచరి కోసం సృష్టించారు. ఆమెకు అలాంటి పజిల్ గేమ్స్ ఇష్టం. ఆ తర్వాత ఆయన దాన్ని అందరికీ ఉచితంగా అందించారు" అన్నారు.
"ఇప్పుడతను ఆ గేమ్‌ను కోట్ల రూపాయలకు అమ్ముకున్నారు. ఎందుకంటే ఆయన మరొకరిని ప్రేమించారు కాబట్టి" అని మరొకరు ట్వీట్ చేశారు.

ఫొటో సోర్స్, Getty Images
అభిమానుల ఆందోళన
ఈ గేమ్‌ను భారీ ధరకు కొనుగోలు చేసిన న్యూయార్క్ టైమ్స్ .. ఇప్పటిలాగే దీనిని ఉచితంగా ఆడుకోనిస్తుందా అనేది చాలా మంది అభిమానులకు ఉన్న సందేహం.
వర్డ్‌లె గేమ్ వెబ్‌లో ఉచితంగానే ఉంటుందని... ఛానల్ ఫోర్‌లో వచ్చే కౌంట్‌డౌన్ కార్యక్రమ వ్యాఖ్యాత సూసీ డెంట్ ఆశించారు.
గేమ్‌ను వెబ్‌లో ఫ్రీగానే ఉంచుతాం అని న్యూయార్క్ టైమ్స్ హామీ ఇచ్చినా.. ఇతర మార్గాల్లో ఎలాంటి ఖర్చులు మోపుతారో అని అభిమానులు ఆందోళన చెందుతున్నట్లు టెక్సాస్ టెక్ యూనివర్సిటీ క్రియేటివ్ మీడియా ఇండస్ట్రీస్ అసోసియేట్ ప్రొఫెసర్ నిక్ బౌమెన్ బీబీసీతో చెప్పారు.
ఈ ఆట ఆడుకోవడానికి డేటా ఖర్చు చేయాల్సివచ్చినా.. యూజర్ నేమ్స్, ప్రొఫైల్స్ క్రియేట్ చేయాలని కోరినా.. గేమ్ మొదలు పెట్టగానే తెరపైకి ప్రకటనలు వచ్చినా.. ఈ ఆటకున్న ఆకర్షణ తగ్గిపోవచ్చు.
ఈ ఆటకు ఆదరణ క్రమంగా పెరిగిందనడంలో ఎవరికీ ఎలాంటి సందేహం లేదు.
గతేడాది అక్టోబర్‌లో వర్డ్‌లె వెబ్‌సైట్‌కున్న విజిట్స్ నెలకు 5వేలు మాత్రమే. వెబ్‌సైట్ ట్రాఫిక్ అనాలసిస్ సైట్ లెక్కలప్రకారం ఈ ఏడాది జనవరి చివరి నాటికి నాలుగున్నర కోట్ల విజిట్స్ ఉన్నాయి.
అమెరికా, ఆస్ట్రేలియా, యూకేలో ఈ ఆటకు 66 శాతం మంది యూజర్లు ఉన్నారు. సగటున ప్రతీ ఒక్కరు ఈ అట మీద 8 నిముషాలు గడుపుతున్నారు. ఈ గేమ్ కొనుగోలు చేయాలనుకునే వారిని ఉత్తేజపరిచే గణాంకాలివి.
ఈ గేమ్ న్యూయార్క్ టైమ్స్‌కు గుదిబండలా మారుతుందా అనేది, అప్పుడే చెప్పలేమన్నారు ప్రొఫెసర్ బౌమన్.

ఫొటో సోర్స్, Getty Images
వెల్లడించలేని ఇబ్బందికరమైన పరిస్థితి
మనకు కావల్సింది ఈ ఆట ఒక్కటే అని భావించడం పొరపాటు అనేది ప్రొఫెసర్ బౌమన్ అభిప్రాయం.
"ఆట నిజంగా స్థిరత్వాన్ని దృష్టిలో ఉంచుకుని రూపొందించబడిందని కచ్చితంగా చెప్పలేను. ఇది చాలా ఆహ్లాదకరమైన కొత్తదనం. కానీ, గేమ్ సృష్టిస్తున్న సంచలనం, అది చాలా క్లిష్టంగా ఉంటుంది." అన్నారాయన.
వర్డ్‌లె సక్సెస్ అనేది కేవలం పదాల్లోనే లేదు. దాని విజయ రహస్యం ఏంటనేది కూడా ఏమీ అంచనా వేయలేని పరిస్థితి.
పదాల ఆధారంగా ఆడుకునే ఆటలు మనకు చాలా కాలంగా ఉన్నాయని ప్రొఫెసర్ బౌమన్ చెప్పారు. టైమ్ పాస్ కోసం ఆడుకునే ఆటలకు మార్కెట్‌లో కొదవేమీ లేదు.
ఈ ఆట ఇంతలా విజయవంతం కావడానికి కారణం.. దీని కంటూ ప్రత్యేకంగా ఒక ప్రపంచం ఏర్పడటం. అందులో ఒకటి మనం జీవిస్తున్న డిజిటల్ ప్రపంచం రెండో దశ కావచ్చు.
వర్డ్‌లె విస్తరణలో మౌఖిక ప్రచారం కీలక పాత్ర పోషించింది. ఈ ఆట ఆడేవాళ్లు రోజులో ఐదు నిముషాల సమయం కేటాయించడంలా ఉండటం మరో అదనపు ఆకర్షణ. ప్రస్తుతం చాలా గేమ్స్‌లో ఉన్నట్లుగా 'రేపు రండి' అనే అభ్యర్థన ఇందులో లేదు.
ఇది చాలా త్వరగా సంప్రదాయ పరంపరగా మారింది. ఆన్‌లైన్‌లో వస్తున్న ఈ గేమ్ పజిల్స్ విస్తృత ప్రపంచంలో బాగంగా మారాయి. గేమ్ యూజర్లు ఈ ఆటను అల్లికలు, దైనందిన జీవితంలో కనిపించే వస్తువుల్లోని నమూనాల్లో చూపిస్తున్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
దీనికున్న షేరబులిటీ కూడా కీలకమైనది. స్నేహితులు, కుటుంబ సభ్యుల మధ్య నిరంతరం జరిగే సంభాషణల్లో పజిల్ గ్రిడ్స్, వాటిని పూర్తి చేయడాన్ని షేర్ చేస్తూ వచ్చారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
చాలా మంది పజిల్స్ పూర్తి చేయడంలో లాజిక్ ఉపయోగిస్తారు. ఉదాహరణకు.. సాధారణ అచ్చులు లేదా హల్లులను ఉపయోగించడం లాంటిది. కొంతమంది గతంలో ఉపయోగించిన పదాలను ట్రాక్ చేయడానికి స్ప్రెడ్‌షీట్‌లను చూస్తున్నారు.
ఇందులో అంతిమంగా వైఫల్యాలేమీ ఉండవు. విజయం సాధించాలంటే అధిక మోతాదులో అదృష్టం కూడా ఉండాలనేది చాలా మంది అంగీకరించే అంశం.
వర్డ్‌లెలో పదాలను పూర్తి చేయడంలో భయంకరమైన పోటీ ఏమీ లేదు. ఇది ఆడుతున్న వారు తాము సాధించిన ప్రగతి, పని తీరు చెక్ చేసుకునే వీలుంది.
ఇందులో వివాదాలు కూడా ఉన్నాయి. ఫేవర్ అనే పదం విషయంలో అమెరికన్ స్పెల్లింగ్‌ను పరిగణించడం అందులో ఒకటి
ఇందులో కొన్ని హృదయాన్ని కదిలించే కథలు కూడా ఉన్నాయి.
వర్డ్‌లె గేమ్ పాపులర్ అవుతున్న సమయంలోనే అదే పేరుతో యాప్‌ను సృష్టించిన వ్యక్తి ఒకరు తన యాప్‌ను ఎక్కువ మంది డౌన్‌లోడ్ చేసుకోవడం గమనించారు.
ఆ తర్వాత గేమ్ రూపకర్తను సంప్రదించారు. గేమ్‌ను అమ్ముతున్న సమయంలో తన యాప్‌ను కూడా అమ్మి పెట్టాలని.. వచ్చిన డబ్బుని సేవకు విరాళంగా ఇస్తానని చెప్పారు.
అయితే జోష్ వార్డ్‌లె డబ్బు కోసం నకిలీ వెర్షన్లను ఆమ్మడాన్ని వ్యతిరేకించారు. యాపిల్ సంస్థ అలాంటి నకిలీ యాప్‌లలో కొన్నింటిన తన యాప్ స్టోర్ నుంచి తొలగించింది.

ఫొటో సోర్స్, Getty Images
అలా కుదిరింది
వర్డ్‌లె గేమ్ రూపకల్పన, విస్తరణలో న్యూయార్క్ టైమ్స్ పెద్ద పాత్ర పోషించిందని గేమ్ రూపకర్త వార్డ్‌లె చెప్పారు.
ఈ ఆటను రూపొందించాలని వార్డ్‌లీ, ఆయన స్నేహితురాలు నిర్ణయించుకున్నప్పుడు.. వాళ్లు న్యూయార్క్ టైమ్స్ పత్రికలోని క్రాస్ వర్డ్స్ పజిల్స్‌ను పరిశీలించారు. అలా న్యూయార్క్ టైమ్స్ ఈ కథలో భాగస్వామిగా మారింది.
పైగా ఈ గేమ్‌ను సొంత వెబ్ సైట్‌లో లాంచ్ చేయడం కూడా బాగా కలిసొచ్చింది. అయితే, కాపీరైట్ లేదా ట్రేడ్ మార్క్ లేని ఒక గేమ్ భవిష్యత్ అంచనా వేయడం కష్టం.
ట్రేడ్‌మార్క్ అప్లికేషన్లు
ఈ గేమ్ గతంలో వచ్చిన కొన్ని గేమ్‌ల మాదిరిగానే ఉందని చాలా మంది ఆరోపించారు. అలాంటి వాటిలో జొట్టో, మాస్టర్ మైండ్, లింగో లాంటి కొన్ని ఉన్నాయి.
వర్డ్ పజిల్ గేమింగ్‌కు అవసరమైన సాఫ్ట్ వేర్ హక్కుల కోసం వర్డ్‌లె తరపున ఇటీవల రెండు ట్రేడ్ మార్క్ దరఖాస్తులు వచ్చినట్లు క్లారివేట్ అనే మేథో హక్కుల విశ్లేషణ సంస్థ కంటెంట్ స్ట్రాటజీ హెడ్ రాబర్ట్ రీడింగ్ చెప్పారు.
ఈ రెండు దరఖాస్తులు శాన్‌ఫ్రాన్సిస్కోలోని ఎన్ఎఫ్‌టీ టెక్నాలజీ అనే మల్టీ నేషనల్ కంపెనీ, మంకీ ల్యాబ్స్ అనే మరో బహుళ జాతీయ సంస్థ నుంచి వచ్చినట్లు రీడింగ్ చెప్పారు.
అయితే, ఈ సంస్థలకు గేమ్ రూపకర్తతో కానీ, న్యూయార్క్ టైమ్స్‌తో కానీ సంబంధాలున్నాయా లేదా అనే విషయం తనకు తెలియదన్నారాయన.
షేర్ చేయడానికి వీలైన పజిల్స్‌ను న్యూజిలాండ్‌కు చెందిన ఓ ఆటగాడు రూపొందించాడని దానిని తాను గేమ్ గా మార్చినట్లు వార్డ్‌లె స్లేట్ మేగజైన్ తో చెప్పారు.
అప్రమత్తంగా ఉండాల్సిన సమయం
ఇప్పటికే మార్కెట్‌లో చాలా నకిలీలు ఉన్నాయి. స్వియర్డ్లే ఇలాంటి సిద్ధాంతాన్నే అనుసరిస్తోంది.
అయితే అందులో స్వియర్ పదాలనే వాడాలంటోంది, అలాగే నెర్డ్లే కూడా ప్రతీ రోజూ ఒక లెక్కను ఇచ్చి దాన్ని పరిష్కరించాలని చెబుతోంది. అయితే అది చాలా తేలికగా పరిష్కరించేలా చూసుకుంటోంది.
సరదా కోసం నెర్డ్లేను రూపొందించిన రిచర్డ్ మాన్ వర్డ్‌లె పట్ల సానుభూతి వ్యక్తం చేశారు. నెర్డ్లే నుంచి రోజువారీ హోస్టింగ్ ఖర్చులను మాత్రమే ఆశిస్తున్న్టలు ఆయన బీబీసీ న్యూస్ తో చెప్పారు.
"ఈ గేమ్ కు ఆదరణ ఇంకా పెరుగుతుంది. ఈ గేమ్ ను నడుపుతున్నందుకు జోష్ వార్డ్‌లెకు ఎప్పటికీ నష్టాలు రాకపోవచ్చు. అయితే దాన్ని అమ్ముకునేందుకు ఆయనకు అన్ని హక్కులు ఉన్నాయి. గేమ్ యాజమాన్యం మారడం వల్ల ఈ ఆటలకు ఉన్న ఆదరణ నిలబడుతుందా అన్నదొక్కటే ఆశ్చర్యం కలిగించే అంశం" అన్నారాయన.
ఊహించడం ఎందుకు?
ప్రస్తుతం వర్డ్‌లె ఒక వ్యాపార సంస్థ చేతుల్లో ఉందని రీడింగ్ చెప్పారు.
"అది డబ్బు ఆర్జించని వ్యక్తి నిర్వహిస్తున్న ఉచిత వెబ్‌సైట్‌గా ఉన్నప్పటి కంటే ఇప్పుడు దాన్ని కొనుగోలు చేసిన వారు మరింత జాగ్రత్తగా ఉండాలి" అని ఆయన అన్నారు.
న్యూయార్క్ టైమ్స్ దగ్గరున్న ఈ గేమ్ రానున్న రోజుల్లో కొత్త కంపెనీల చేతుల్లోకి వెళ్లవచ్చు. భవిష్యత్తు ఏమైనప్పటికీ, ఈ ఆటలో భాగంగా ఉండాలనుకుంటున్నారా, లేదా అనేది అభిమానులే నిర్ణయించుకోవాలి.
అలా ఉండాలనుకునే వారు తర్వాత ఏమి జరుగుతుందో ఊహించడం అనవసరం. ఎందుకంటే అది ఐదక్షరాల పదంలో చుట్టిపారేసే తేలికైన అంశం కాదు మరి.
ఇవి కూడా చదవండి:
- గల్వాన్ డీకోడెడ్: 'గల్వాన్ లోయలో జరిగిన భారీ నష్టాన్ని చైనా దాచిపెడుతోంది'.. క్లాక్సన్ నివేదిక వెల్లడి
- మియన్మార్: సాయుధ సైనికులను అడ్డుకునేందుకు ఒక నన్ మోకాళ్ల మీద కూర్చున్నపుడు ఏం జరిగింది?
- 768 కిలోమీటర్ల పొడవైన మెరుపు.. సరికొత్త ప్రపంచ రికార్డు
- గుంటూరు జిన్నా టవర్: ఆకుపచ్చగా ఉన్న ఈ టవర్‌కి భారత్ జెండా రంగులు ఎవరు., ఎందుకు వేశారు?
- స్టాలిన్గ్రాడ్ యుద్ధం: హిట్లర్ ఆత్మహత్యకు కారణమైన ఈ యుద్ధంలో ఏం జరిగింది? ఎలా ముగిసింది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
















