డీప్‌ఫేక్ టూల్ టెక్నిక్: చనిపోయిన బంధువులను సజీవంగా చూపించే టెక్నాలజీ

ఫొటో సోర్స్, MYHERITAGE
- రచయిత, జెన్ వేక్‌ఫీల్డ్
- హోదా, బీబీసీ టెక్నాలజీ రిపోర్టర్
జీనియాలజీ లేదా వంశవృక్షాన్ని రూపొందించే 'మై హెరిటేజ్' వెబ్ సైట్ ఒక టూల్ తీసుకొచ్చింది.
అది చనిపోయిన బంధువుల ఫొటోల ముఖాలను యానిమేట్ చేయడానికి ఒక ప్రత్యేక రకం డీప్ ఫేక్ టెక్నాలజీని ఉపయోగిస్తుంది.
ఆ టూల్‌కు 'డీప్ నోస్టాల్జియా' అనే పేరు పెట్టారు. కొంతమందికి ఈ ఫీచర్ సంచలనం సృష్టించేదిగా అనిపిస్తే, మరికొంతమందికి ఇది ఒక మాయాజాలంగా అనిపించవచ్చు.
డీప్ ఫేక్ వ్యక్తులను తయారు చేయకుండా అడ్డుకోడానికి తాము ఇందులో 'స్పీచ్' చేర్చలేదని ఈ కంపెనీ చెప్పింది.
డీప్ ఫేక్ టెక్నాలజీపై ఒక చట్టం తీసుకురావాలని బ్రిటన్ అనుకుంటున్న సమయంలో ఈ టూల్ బయటికొచ్చింది.
ఒకరి అంగీకారం లేకుండా డీప్ ఫేక్ వీడియోను రూపొందించడం చట్టవిరుద్ధంగా చేయాలనే ప్రతిపాదనను బ్రిటన్ లా కమిషన్ పరిశీలిస్తోందని చెబుతున్నారు.
ఈ టెక్నాలజీని దుర్వినియోగం చేయకుండా అడ్డుకోడానికే తాము ఉద్దేశపూర్వకంగా ఇందులో 'స్పీచ్'ను చేర్చలేదని మై హెరిటేజ్ సైట్ చెబుతోంది.
ఉదాహరణకు ప్రస్తుతం సజీవంగా ఉన్నవారి డీప్ ఫేక్ వీడియోలు రూపొందించకుండా ఉండడానికి కంపెనీ అలా చేసింది.
"మన పాత జ్ఞాపకాలకు ఒక రూపం ఇచ్చే ఉద్దేశంతో, మేం దీనిని రూపొందించాం" అని కొత్త టెక్నాలజీ గురించి సాధారణంగా అడిగే ప్రశ్నలకు జవాబుగా ఈ కంపెనీ చెప్పింది.
కానీ, కొంతమంది 'డీప్ ఫేక్ నోస్టాల్జియా' ఫీచర్‌ను ఇష్టపడతున్నారు. దానిని మాయాజాలంగా భావిస్తున్నారు. కానీ కొందరు మాత్రం దాన్ని ఒక సంచలనం సృష్టించే టూల్‌గా భావిస్తున్నారు. దానిని ఇష్పపడడ లేదు" అని కంపెనీ అంగీకరించింది.
"దీని ద్వారా వచ్చే ఫలితాలు వివాదాస్పదం కావచ్చు. ఈ టెక్నాలజీని 'నిర్లక్ష్యం' చేయడం కష్టం" అని కంపెనీ చెప్పింది.

ఫొటో సోర్స్, MYHERITAGE
ఫేక్ లింకన్ వీడియో
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) ఆధారంగా కంప్యూటర్లో రూపొందించిన వీడియోలను డీప్ ఫేక్ అంటారు. వాటిని ప్రస్తుత ఫొటోల ద్వారా రూపొందిస్తారు.
ఇజ్రాయెల్ కంపెనీ డీ-ఐటీ 'డీప్ నోస్టాల్జియా' టెక్నాలజీని అభివృద్ధి చేసింది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి, సజీవంగా ఉన్నవారి అంతకు ముందు వీడియోల ఆధారంగా ఆ కంపెనీ తమ అల్గారిథంకు శిక్షణ ఇచ్చింది. దాని ద్వారా ప్రజల ముఖాలు, వాళ్ల భావాలు మార్చి వీడియోలు రూపొందించవచ్చు.
మై హెరిటేజ్ వెబ్ సైట్‌లో క్వీన్ విక్టోరియా, ఫ్లోరెన్స్ నైటింగేల్ లాంటి చారిత్రక ప్రముఖుల యానిమేటెడ్ వీడియోలు చేశారు. ఈ నెల మొదట్లో ఒక కంపెనీ ఇదే టెక్నాలజీని ఉపయోగించి ఒక అబ్రహాం లింకన్ వీడియోను యూట్యూబ్‌లో పెట్టింది. దానిని లింకన్ జన్మదినం సందర్భంగా పోస్ట్ చేశారు.
ఈ వీడియో కలర్‌ఫుల్‌గా ఉంటుంది. ఇందులో అమెరికా మాజీ అధ్యక్షుడు అబ్రహాం లింకన్ మాట్లాడుతున్నట్లు చూపించారు.
ఈ టెక్నాలజీని ఉపయోగించి చాలామంది తమ పూర్వీకుల యానిమేటెడ్ వీడియోలు చేసి ట్విటర్‌లో పెట్టడం మొదలెట్టారు. కొంతమంది వాటిని అద్భుతంగా ఉన్నాయని చెబితే, మరికొంతమంది మాత్రం ఈ వీడియోలపై ఆందోళన వ్యక్తం చేశారు.
డిసెంబర్‌లో చానల్ 4 ఒక 'డీప్ ఫేక్ క్వీన్' వీడియోను రూపొందించింది. అందులో రాణి క్రిస్మస్ సందేశాన్ని ఇచ్చారు. ఈ టెక్నాలజీ ద్వారా ఎలా ఫేక్ న్యూస్ వ్యాపించేలా చేయవచ్చో ఈ వీడియోతో హెచ్చరించారు.

ఇవి కూడా చదవండి:
- వైజాగ్ స్టీల్ ప్లాంట్: ప్రైవేటీకరణ చేస్తే ఉద్యోగుల సంగతేంటి... గతంలో హిందుస్థాన్ జింక్ పరిశ్రమ విషయంలో ఏం జరిగింది?
- మోదీ సర్కారు ప్రభుత్వ కంపెనీలను ఎందుకు అమ్మేస్తోంది...
- కోవిడ్-19 వ్యాక్సీన్ ప్రపంచవ్యాప్తంగా అందరికీ అందుబాటులోకి రావడం సాధ్యమేనా?
- 'శోభనం రాత్రి కోసం తెప్పించే స్పెషల్ స్వీట్’
- హైదరాబాద్: సినిమాలు, పెళ్లి ఊరేగింపులు లేక గుర్రాల ఆకలిచావులు
- ఆంధ్రప్రదేశ్: ‘ప్రచారానికి వెళ్తే పేరంటానికా అని ఎగతాళి చేశారు... మగవాళ్లందరినీ ఓడించాం’
- భారత్-పాక్ సరిహద్దు: కచ్ నిర్బంధ కేంద్రంలో అయిదుగురు పాకిస్తానీలు ఎలా చనిపోయారు?
- కరోనావైరస్: ప్రపంచమంతా సుగంధ ద్రవ్యాలకు భారీగా పెరిగిన గిరాకీ.. పండించే రైతులకు మాత్రం కష్టాలు రెట్టింపు
- మోటేరా స్టేడియం.. అపూర్వమైన ప్రపంచ రికార్డులకు వేదిక
- నరసరావుపేట అనూష హత్య: నిందితుడు పోలీసు కస్టడీలో ఉన్నాడా... పరారీలో ఉన్నాడా?
- దేశద్రోహ చట్టం: అసమ్మతిని అణచివేయడానికి ప్రయోగిస్తున్న అస్త్రం
- స్పెషల్ స్టేటస్, త్రీ క్యాపిటల్స్: ఆంధ్రప్రదేశ్‌లో ఈ లిక్కర్ బ్రాండ్లు నిజంగానే ఉన్నాయా?
- హిట్లర్ కోసం విషం రుచిచూసే మహిళల కథ
- జ్యోతిషాన్ని నమ్మే వారి సంఖ్య విపరీతంగా పెరుగుతోంది... ఎందుకు?
- ఘట్కేసర్ ఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్య: తప్పెవరిది, అమ్మాయిలదా.. తల్లిదండ్రులదా.. సమాజానిదా? :అభిప్రాయం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








