న్యూజీలాండ్‌తో భారత్ ఓటమిపై పాకిస్తానీల స్పందన ఎలా ఉంది, ఎవరేమన్నారు

ఫొటో సోర్స్, Reuters
టీ20 వరల్డ్ కప్‌లో పాకిస్తాన్, న్యూజీలాండ్‌లతో ఆడిన మ్యాచుల్లో ఓటమి పాలైన భారత్ సెమీ ఫైనల్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. దీంతో దేశవ్యాప్తంగా అభిమానులు తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు.
న్యూజీలాండ్‌తో భారత్ ఆటతీరు పాకిస్తాన్ మాజీ క్రీడాకారులను కూడా ఆశ్చర్యంలో పడేసింది.
పాకిస్తాన్‌తో తొలి మ్యాచ్‌లో 10 వికెట్ల తేడాతో ఓడిన తర్వాత న్యూజీలాండ్‌తో అయినా భారత్ సత్తా చూపిస్తుందని ఆశించిన షోయబ్ అఖ్తర్, ఇంజమామ్ ఉల్ హక్ లాంటి పాక్ మాజీ క్రికెటర్లు టీమిండియా ప్రదర్శనను విశ్లేషిస్తూ ఏకంగా వీడియోలు విడుదల చేశారు.
అఫ్గాన్‌తో గెలవడం కూడా కష్టమే
భారత్-న్యూజీలాండ్ మ్యాచ్ అనంతరం పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ తన యూట్యూబ్ చానల్లో ఒక వీడియో పోస్ట్ చేశారు. న్యూజీలాండ్‌తో భారత్ గేమ్ ప్లాన్ చూసి షాకయ్యానని అన్నారు.
"మొదటి విషయం ఏంటంటే భారత్ టాస్ ఓడిపోయింది. అక్కడే జట్టు ఒత్తిడికి గురైంది. మొదట బౌలింగ్ చేసినపుడు బంతి దూసుకొస్తుంటే మనం ఏం చేయలేం. తర్వాత బౌలింగ్ చేసిన జట్టుకు బంతి స్వింగ్ కాదు.
టాస్ ఓడినప్పటికీ, కివీస్ బౌలర్ల బంతులు స్వింగ్ అవుతున్నా..అక్కడ భారత్ ఆటతీరు నాకు అర్థం కాలేదు. ఒకరు కాదు ఇద్దరు కాదు అందరూ షాట్లు కొట్టడానికి ప్రయత్నించారు. కాస్త మ్యాచ్‌లో నిలదొక్కుకుని, ఒత్తిడి పెంచుండాలి. వాళ్లు ఏ మైండ్‌సెట్‌తో ఆడారో తెలీలేదు, అందరూ షాట్లు కొట్టడానికి ప్రయత్నించారు" అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
న్యూజీలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ తన బ్యాటింగ్ ఆర్డర్ మార్చడాన్ని షోయబ్ ప్రశ్నించారు. హార్దిక్ పాండ్యతో మొదటే బౌలింగ్ చేయించకపోవడాన్ని విమర్శించారు.
"భారత్ ఏ గేమ్ ప్లాన్‌తో ఆడిందో అర్థం కాలేదు. భారత్ చేసిన స్కోరు తక్కువే. ఆటగాళ్లందరూ పానిక్ బటన్ నొక్కేశారు. విరాట్ కోహ్లీ తన నంబర్లో రాలేదు, రోహిత్ శర్మ స్థానం మార్చారు. కొత్త కుర్రాడిని ఓపెనింగ్ పంపించారు. టాస్ ఓడినపుడే పానిక్ అయిపోయారు. షాట్లు కొట్టారు. అక్కడ భారత్ నాకు ఒక సాదాసీదా టీమ్‌లా కనిపించింది" అని చెప్పారు.
బ్యాటింగ్ మాత్రమే కాదు.. భారత్ బౌలింగ్ కూడా అంత స్పెషల్‌గా ఏం లేదన్నారు షోయబ్. భారత్ టోర్నీ నుంచి ఎగ్జిట్ అయినట్టు అనిపిస్తోందన్నారు.
బుమ్రా, వరుణ్ ఓకే. కానీ మిగతా వారి బౌలింగ్ నాకు సాదాసీదాగా కనిపించింది. అక్కడ అసలు భారత జట్టు ఉన్నట్టే కనిపించలేదు.. భారత్ ఇలా ఎగ్జిట్ అవడం నాకు నచ్చలేదు. అంటే, ఇప్పుడు నాకు ఎగ్జిట్ అయిపోయినట్టే అనిపిస్తోంది. భారత్‌కు ఒక ఛాన్స్ ఉంది. ఆ జట్టు తనను నిరూపించుకోవాలంటే అఫ్గాన్‌తో మ్యాచ్ గెలవాలి. కానీ అది కూడా కష్టమే. అబుదాబిలో అఫ్గానిస్తాన్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంటే, భారత్‌కు ఇబ్బంది తప్పదు. అక్కడ బాల్ స్వింగ్ అవుతుంది. భారత్ 150 చేసినా, 175 కొట్టినా అఫ్గానిస్తాన్ కొట్టేస్తుంది. అందుకే నాకు భారత్‌కు మరిన్ని కష్టాలు ఉన్నట్టు కనిపిస్తోంది".
ఒత్తిడికి చిత్తయ్యారు-ఇంజమామ్
పాకిస్తాన్‌తో ఓడిన తర్వాత మీడియా, సోషల్ మీడియా వల్ల భారత జట్టుపై విపరీతమైన ఒత్తిడి పడిందని, దాన్నుంచి వాళ్లు కోలుకోలేకపోయారని ఇంజమాన్ అన్నారు. న్యూజీలాండ్ బౌలింగ్ ముందు భారత్ బ్యాటింగ్ తేలిపోయిందన్నారు.
"ఇండియా పూర్తిగా నిరుత్సాహంలో మునిగింది. అంత పెద్ద టీమ్ ఎంత ఒత్తిడిలో మునిగిందంటే.. నేను ఇండియా టీమ్ ఇలా ఆడ్డం ఎప్పుడూ చూళ్లేదు. న్యూజీలాండ్ ఇద్దరు స్పిన్నర్లూ అంత వరల్డ్ క్లాస్ కూడా కాదు..కానీ వాళ్ల బౌలింగ్‌లో భారత ఆటగాళ్లకు సింగిల్స్ తీయడం కూడా కష్టమైంది. నాకు ఒకటి అర్థమైంది. పాకిస్తాన్‌తో ఓటమి తర్వాత మీడియా, సోషల్ మీడియా ఇండియా టీమ్‌పై ఎంత ప్రెజర్ పెట్టిందంటే.. జట్టు దాన్నుంచి కోలుకోలేకపోయింది" అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఆట అన్నాక గెలుపోటములు ఉంటాయన్న ఇంజమామ్ 12 సార్లు పాకిస్తాన్‌తో గెలిచారంటే ఎప్పుడూ ఓడిపోరని అర్థం కాదు కదా అని ప్రశ్నించారు. బ్యాటింగ్ ఆర్డర్ మార్చిన భారత్ తన బలహీనతను స్వయంగా బయటపెట్టిందన్నారు.
"బౌలింగ్ విషయానికి వస్తే అసలు ఇండియా టీమ్ ఎక్కడా కనిపించలేదు. స్కోర్ చిన్నదే. కానీ పాకిస్తాన్‌తో మ్యాచ్ తర్వాత ఎదురైన ఒత్తిడి వల్ల భారత్ తమ బ్యాటింగ్ ఆర్డర్ కూడా మార్చింది. ఒక్క మ్యాచ్‌లో ఓడినందుకే రోహిత్ శర్మ, విరాట్ స్థానాలు మారిపోయాయి. నేను కూడా పెద్ద టీమ్స్‌తో ఆడాను. మనం హర్ట్ అయినప్పుడు.. ప్రత్యర్థి జట్టుకు నేను హర్ట్ అయ్యాను అని చూపించుకోం. భారత్ తమ బలహీనతను పూర్తిగా తెరిచి చూపించేసింది" అంటారు ఇంజమామ్..
భారత్ ఓటమికి కెప్టెన్ విరాట్ కోహ్లీ కుటుంబాన్ని టార్గెట్ చేయడం తప్పని, ఆటను ఆటగానే చూడాలని ఆన అన్నారు.
"విరాట్ కోహ్లీకి బెదిరింపులు వస్తున్నాయి. ఇది ఆట. మనం ఇండియా, పాకిస్తాన్ కావచ్చు.. కానీ, మేమంతా ఆటగాళ్లం, ఒకే సమాజం. ఒకే కుటుంబం. మీకు విరాట్ కోహ్లీ ఆట నచ్చకపోతే, తన కెప్టెన్సీ నచ్చకపోతే దాని గురించి మాట్లాడవచ్చు. కానీ, అతడి ఫామిలీని ఏం అనకూడదు. ఇటీవల షమీకి కూడా అలాగే జరిగింది. ఒకసారి బాగా ఆడుతాం, ఇంకోసారి సరిగా ఆడం.. ఒక్కోసారి గెలుస్తాం, ఇంకోసారి ఓడిపోతాం..కానీ, దాన్ని అక్కడివరకే ఉంచాలి. ఇది విని నాకు చాలా బాధేసింది" అన్నారు.

ఫొటో సోర్స్, AAMIR QURESHI/AFP VIA GETTY IMAGES
పాక్ సోషల్ మీడియాలో ట్రోల్స్
పాక్‌తో భారత్ ఓటమి తర్వాత సంబరాలు చేసుకున్న పాకిస్తానీలు, టీమిండియా న్యూజీలాండ్‌తో కూడా ఓడిపోవడంతో సోషల్ మీడియాలో రెచ్చిపోయారు.
సయ్యద్ హైదర్ అనే ఒక యూజర్ టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫొటోతో ఒక ట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
పాక్‌తో 10 వికెట్ల తేడాతో ఓడిపోయినా, న్యూజీలాండ్‌తో 8 వికెట్ల తేడాతో ఓడి ఆటతీరు మెరుగుపరుచుకున్న భారత జట్టుకు శుభాకాంక్షలు చెప్పాడు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
మరికొందరైతే భారత జట్టు ఇప్పటివరకూ కొట్టిన సిక్సర్లను అంతకు ముందు పాక్ మ్యాచ్‌లో ఆసిఫ్ అలీ కొట్టిన 7 సిక్సర్లతో పోలుస్తూ ట్రోల్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
షా అనే యూజర్ భారత్ ఆడబోయే మిగతా మ్యాచ్‌ల గురించి వ్యంగ్యంగా ట్వీట్ చేశాడు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 4
భారత్ తర్వాత తను ఆడబోయే అఫ్గానిస్తాన్‌తో మ్యాచ్ గురించి మన్సూర్ నిసార్ మరో ట్వీట్ చేశాడు.
విమర్శలు, ట్రోల్స్‌తోపాటూ భారత జట్టుకు అనుకూలంగా పాకిస్తానీలు ట్రోల్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 5
కోహ్లీ గొప్ప క్రీడాకారుడు, బ్యాట్స్‌మెన్.. భారత్‌కు ఎన్నో మ్యాచ్‌లు గెలిపించాడు. అతడిని ట్రోల్ చేయడం సరికాదు" అని బియా అనే యూజర్ ట్వీట్ చేశారు. క్రికెట్ వన్ మ్యాన్ షో కాదన్నారు.
ఇవి కూడా చదవండి:
- ‘‘మేం చనిపోయాక మా పిల్లల పరిస్థితేంటి? నాలాంటి తల్లితండ్రులందరినీ వేధించే ప్రశ్న ఇదే’’
- సవ్యసాచి: ‘ఇది కండోమ్ ప్రకటనా? నగల ప్రకటనా?’- ఈ బ్రాండ్‌ను ఎందుకు నిషేధించమంటున్నారు
- ఉత్తరాఖండ్‌లో ఒకటి తర్వాత మరొకటిగా గ్రామాలు ఎందుకు ఖాళీ అయిపోతున్నాయి?
- భారత్‌లో పిల్లలకు కోవిడ్ వ్యాక్సీన్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది?
- 'ఏపీలో విద్యుత్ కొరత లేదు.. తప్పుడు ప్రచారం చేస్తే చర్యలు'
- సెక్సువల్ అటానమీ: భార్య శరీరంపై భర్తకు సర్వ హక్కులు ఉంటాయా? సెక్స్ భంగిమల కోసం బలవంతం చేయవచ్చా?
- ఉత్తర కొరియాలో డ్రగ్స్, తీవ్రవాదం, ఆయుధ విక్రయాల గుట్టు విప్పిన ఒక సీక్రెట్ ఏజెంట్
- కోవిడ్-19: మా అమ్మను డాక్టర్లు గినియా పిగ్లా భావించి ప్రయోగాలు చేశారు
- నీళ్లపైనే నగరాలు.. భవిష్యత్తు ఇదేనా? యూరప్ దేశాల్లో ఈ ప్రయోగాలు ఎందుకు జరుగుతున్నాయి?
- కశ్మీర్లో భయాందోళనల్లో హిందువులు.. శాంతి, భద్రతలపై ప్రభుత్వానివి ఉత్తి మాటలేనా?
- లిపులేఖ్ రోడ్డు విషయంలో భారత్ తీరుపై నేపాల్‌లో ఆగ్రహం ఎందుకు
- కాలాపానీ: నేపాల్ సరిహద్దులోని 35 చ.కి.మీ భూమి సమస్యను వాజ్‌పేయి నుంచి మోదీ వరకు ఎవ్వరూ ఎందుకు పరిష్కరించలేదు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)










