షోయబ్ అక్తర్‌కు సొంతదేశంలో అవమానం- షో నుంచి వెళ్లిపోమన్న టీవీ హోస్ట్

ఫొటో సోర్స్, Getty Images
పాకిస్తాన్ క్రికెట్ జట్టు అధికారిక ప్రసారదారు పీటీవీ నెట్‌వర్క్. మంగళవారం రాత్రి 'గేమ్ ఆన్ హై' అనే పీటీవీ కార్యక్రమంలో పాల్గొన్న పాక్ మాజీ స్టార్ బౌలర్ షోయబ్ అక్తర్ అవమానాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది.
న్యూజిలాండ్ జట్టుపై పాకిస్తాన్ గెలిచిన తర్వాత ప్రసారమైన కార్యక్రమంలో ఈ ఘటన జరిగింది. టీవీలో కార్యక్రమం ప్రసారం జరుగుతుండగా, ఇతర విదేశీ వ్యాఖ్యాతల ముందు అక్తర్‌కు ఈ అవమానం జరిగింది. ఆ సమయంలో వారంతా మ్యాచ్‌ను విశ్లేషిస్తున్నారు. ఈ కార్యక్రమానికి హోస్ట్‌గా నోమాన్ నియాజ్ వ్యవహరించారు.
కార్యక్రమంలో భాగంగా మాట్లాడుతూ అక్తర్, పాకిస్తాన్ క్రికెట్ లీగ్ (పీఎస్‌ఎల్) టీమ్ లాహోర్ ఖలంధర్స్‌ను పొగిడారు. షహీన్ షా ఆఫ్రిది, హారీస్ రవూఫ్ లాంటి ఆటగాళ్లు ఆ జట్టు నుంచే వెలుగులోకి వచ్చారని వ్యాఖ్యానించారు.
దీంతో నోమన్‌కు అక్తర్‌పై కోపమొచ్చింది. వెంటనే అక్తర్‌పై అరుస్తూ 'నీవు కాస్త మొరటుగా ఉన్నావు. ఈ మాట అనాలని నేను అనుకోలేదు. కానీ నువ్వు మర్యాద కాపాడుకోవాలనుకుంటే ఇక్కడ నుంచి వెంటనే వెళ్లిపోవచ్చు' అని అన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
ఆ మాటలు వినగానే షాకైన అక్తర్ అక్కడ ఏం జరుగుతుందో అర్థం చేసుకోలేకపోయాడు. అక్తర్‌పై ఆగ్రహించిన నోమాన్ వెంటనే మరో గెస్ట్‌తో మాట్లాడారు. ఆ తర్వాత కూడా గొడవ సర్దుకోకపోవడంతో నోమాన్ షోలో వాణిజ్యప్రకటనను ప్రసారం చేశారు. కానీ ఆయన ఎందుకు అక్తర్‌ను షో నుంచి వెళ్లిపొమ్మన్నారో అనే అంశంపై ఇప్పటికీ స్పష్టత రాలేదు.
వాణిజ్య ప్రకటన అనంతరం షో ప్రారంభమయ్యాక కూడా ఆ వాతావరణంలో ఎలాంటి మార్పు రాలేదు.
పరిస్థితిలో మార్పు తీసుకువచ్చేందుకు అక్తర్ ప్రయత్నించినప్పటికీ అది సఫలం కాలేదు. దీంతో షో నుంచి వెళ్లిపోవాలని అక్తర్ నిర్ణయం తీసుకున్నారు. తన సీటు నుంచి లేచిన అక్తర్, అక్కడున్న ఇతర గెస్ట్‌లకు క్షమాపణ చెప్పి వెళ్లిపోయారు. అక్తర్‌తో పటు సనా మీర్, సర్ వివియన్ రిచర్డ్స్, డేవిడ్ గోవర్ ఆ కార్యక్రమానికి అతిథులుగా వచ్చారు.
''ఐ యామ్ వెరీ సారీ. పీటీవీ నుంచి నేను వైదొలుగుతున్నా. రాజీనామా చేస్తున్నా. ఒక జాతీయ టీవీ చానెల్ నా పట్ల ప్రవర్తించిన తీరుకు ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. అందుకే ఇక్కడ నుంచి వెళ్లిపోతున్నా. థాంక్స్'' అని మైక్‌లో షోయబ్ అక్తర్ ప్రకటించారు.
ఇంత జరుగుతున్నప్పటికీ, నోమాన్ మాత్రం అక్తర్‌ను పట్టించుకోకుండా తన పని తాను చేసుకుపోయారు. తర్వాత ట్విట్టర్ వేదికగా అక్తర్ ఒక వీడియోను షేర్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
''పీటీవీ కార్యక్రమంలో ఒక అసహ్యకరమైన సంఘటన జరిగింది. నోమాన్ ఇలా ఎందుకు చేశారో నాకు తెలియదు. దాని గురించి ఏమీ చెప్పకుండానే షోలో ఆయన బ్రేక్‌కు వెళ్లారు. ఒక జాతీయ టీవీలో నేషనల్ స్టార్‌ను అనవసరంగా అవమానించారు. ఆ తర్వాత నన్ను అలాగే వదిలేసి ఆయన వెళ్లిపోయారు. అక్కడ సూపర్‌స్టార్ ప్లేయర్లు, విదేశీ అతిథులు కూర్చున్నారు. వాళ్ల ముందు నా ఇమేజ్ సంగతి ఏంటి? నువ్వు, నాతో దురుసుగా ప్రవర్తించిన ఈ వీడియో క్లిప్ కచ్చితంగా వైరల్ అవుతుందని నోమాన్‌కు చెప్పాను.''
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
''దీన్ని ఇక్కడితో ఆపేయ్. దీనికి ఏదైనా పరిష్కారం ఆలోచించు. లేకపోతే దీనికి సంబంధించి చాలా ఘోరమైన మెసేజ్‌లు వస్తుంటాయి. విదేశీ అతిథుల గురించి ఆలోచించకు. ఇదే టీవీలో నాకు సారీ చెప్పు అని నేను నోమాన్‌కు చెప్పాను. కానీ దానికి ఆయన ససేమిరా అన్నారు. దీంతో అక్కడ నుంచి వెళ్లిపోవాలని నేను నిర్ణయించుకున్నా.''
''ఆ కార్యక్రమంలో నాకు జరిగిన నష్టాన్ని పూడ్చేందుకు ప్రయత్నించా. కానీ అది సాధ్యం కాలేదు. చాలా బాధగా అనిపించింది. అక్కడే విదేశీ గెస్ట్‌లు కూర్చున్నారు. వారంతా ఏం అనుకొని ఉంటారు. ఇక నాకు అక్కడ వేరే ఏ అవకాశం దొరకలేదు. అందుకే అక్కడ నుంచి వెళ్లిపోయా'' అని అక్తర్ చెప్పుకొచ్చారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 4
ఈ ఘటనపై పాకిస్తాన్ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ''ప్రజాధనంతో పీటీవీ నడుస్తోంది. ఈ దేశానికి చెందిన గొప్ప క్రీడాకారులతో ఎలా మాట్లాడాలో కూడా తెలియని వారిని మేం సహించలేం. తక్షణమే నోమాన్ నియాజ్‌పై ప్రభుత్వం తక్షణమే చర్య తీసుకోవాలని నేను డిమాండ్ చేస్తున్నా'' అని ఉమర్ ఫిరోజ్ అనే వ్యక్తి సోషల్ మీడియాలో పేర్కొన్నారు.
''పీటీవీలో మన దేశ హీరో షోయబ్ అక్తర్‌ను నోమాన్ నియాజ్ అవమానించిన తీరు చాలా బాధాకరం. షోయబ్ నిజమైన హీరో. ఆయనెప్పటికీ హీరోగానే ఉంటారు. నోమాన్ ఇలా చేశాడంటే నమ్మలేకపోతున్నా'' అని పాకిస్తాన్ సీనియర్ జర్నలిస్ట్ ముబాషెర్ లుక్‌మైన్ అన్నారు.
ఇవి కూడా చదవండి:
- పెగాసస్ వివాదం: ‘జాతీయ భద్రత అని కేంద్ర ప్రభుత్వం చెప్పినంత మాత్రాన మేం చూస్తూ కూర్చోం’ - సుప్రీం కోర్టు
- ‘పాక్‌తో మ్యాచ్‌లో బుమ్రా, భువనేశ్వర్ కూడా రాణించలేదు.. మరి షమీనే ఎందుకు టార్గెట్ చేశారు?’
- తప్పుడు వార్తలు, రెచ్చగొట్టే కంటెంట్‌ను కంట్రోల్ చేయడంలో ఫేస్‌బుక్ చేతులెత్తేసిందా?
- పాకిస్తాన్ విజయంపై హర్షం వ్యక్తం చేస్తూ వాట్సాప్ స్టేటస్.. మోదీ స్కూల్ టీచర్‌పై కేసు నమోదు
- కోవిడ్ మృతుల కుటుంబాలకు రూ. 50 వేలు - దరఖాస్తులు ఆహ్వానిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు
- చైనా కొత్త సరిహద్దు చట్టంతో భారత్‌కు సమస్యలు పెరుగుతాయా
- టీ20 వరల్డ్ కప్: భారత్‌పై పాకిస్తాన్ గెలుపు ఇస్లాం విజయం ఎలా అవుతుంది?
- టి20 వరల్డ్ కప్ సూపర్ 12: గ్రూప్ 2లో టాప్ పొజిషన్లో పాకిస్తాన్
- కోవిడ్ వ్యాక్సినేషన్: వ్యాక్సీన్ తీసుకున్న తర్వాత కూడా కరోనావైరస్ సోకుతుందా?
- సిరియా: ఇస్లామిక్ స్టేట్ శిబిరాలలో చిన్నారుల జీవితాలు మగ్గిపోవాల్సిందేనా, అక్కడ కూడా మతాన్ని నూరిపోస్తున్నారా
- కరోనావైరస్: వ్యాక్సీన్లు తీసుకున్న తర్వాత దుష్ప్రభావాలు వస్తే ఏం చేయాలి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)








