అఫ్గానిస్తాన్: కాబుల్ విమానాశ్రయానికి వెళ్లే దారిలో ఎన్నెన్నో గండాలు

ఫొటో సోర్స్, Getty Images
వేలాది అఫ్గాన్ పౌరులు, విదేశీయులు అఫ్గానిస్తాన్ వదిలి పారిపోవడానికి పరుగులు తీస్తున్నకొద్దీ, కాబూల్ విమానాశ్రయం బయట దృశ్యాలు మరింత భయానకంగా మారుతున్నాయి.
గత వారం దేశాన్ని తమ అధీనంలో తెచ్చుకున్న తాలిబాన్లు సరిహద్దులు మూసివేయడంతో, అఫ్గానిస్తాన్ నుంచి బయటపడాలనుకునే చాలా మందికి కాబుల్‌లోని విమానాశ్రయం ఒకే ఒక దారిగా మిగిలింది.
కానీ, అఫ్గాన్ పౌరులు దేశం వదిలి వెళ్లాలని తాము కోరుకోవడం లేదని తాలిబాన్లు చెబుతున్నారు. విమానాశ్రయం వైపు వెళ్లే రహదారుల్లో మిలిటెంట్లు చెక్ పాయింట్స్ ఏర్పాటు చేశారు.
హమీద్ కర్జాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం వైపు వెళ్లే మార్గంలో ఉన్న చెక్ పాయింట్స్‌ను కింద పసుపు బాక్సుల్లో చూడవచ్చు. తాలిబాన్లు ఆ మార్గంలో వెళ్లేవారిపై దాడి కూడా చేస్తున్నారు.

ఆదివారం నుంచి ఇక్కడ జరిగిన హింసలో 12 మంది చనిపోయారు. వీరంతా కాల్పుల్లో, తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయారు.
"విమానాశ్రయం వైపు ప్రయాణించడం అంటే ప్రాణాలతో చెలగాటమే" అని పేరు బయటపెట్టని ఒక తాలిబాన్ అధికారి రాయిటర్స్‌కు చెప్పారు.
విమానాశ్రయం ప్రహరీ లోపల 4 వేల మంది అమెరికా సైనికులు దానిని తాత్కాలికంగా తమ అధీనంలో ఉంచుకున్నారు. తాలిబాన్లు భారీ ఆయుధాలతో దానిని బయటనుంచి చుట్టుముట్టారు. ఆ ప్రాంతంలో భయానక వాతావరణాన్ని సృష్టించారు.

ఫొటో సోర్స్, Reuters
అఫ్గాన్ పౌరులు విమానాశ్రయం వైపు వెళ్లకుండా తాలిబాన్లు అడ్డుకుంటున్నట్లు తెలుస్తోంది. వీరిలో కొంతమంది వీసా ఉన్నవారు కూడా ఉన్నారు.
కానీ, జనం విమానాశ్రయం చేరుకోకుండానే మధ్యలోనే వారిపై దాడులు జరుగుతున్నట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.
"తాలిబన్లు గాల్లో కాల్పులు జరపడం, జనాలపైకి తుపాకీలు గురిపెట్టడం, జనాలను తాళ్లు, కర్రలతో కొట్టి తరుముతుండడం నేను చూశాను" లాస్ ఏంజెల్స్ టైమ్స్ పత్రిక ప్రతినిధి చెప్పారు.

ఫొటో సోర్స్, MARCUS YAM LA TIMES/GETTY IMAGES
మార్కస్ యామ్ తీసిన ఒక ఫొటోలో ఒక గాయపడిన మహిళ కూడా కనిపిస్తున్నారు.
జనం గత కొన్నిరోజులుగా నగరానికి ఉత్తరంగా ఉన్న విమానాశ్రయం చుట్టూ జనం గుమిగూడుతున్నారు.
బుధవారం జరిగిన తొక్కిసలాటలో 17 మంది గాయపడినట్లు రిపోర్టులు వచ్చాయి. వీరిలో చాలా మంది ముళ్ల కంచె ఉన్న గోడలపైకి ఎక్కాలని ప్రయత్నించారు.

ఫొటో సోర్స్, EPA
వీరిలో ఎక్కువగా చిన్న పిల్లలతో ఉన్న కుటుంబాలు, చాలా రోజులుగా తిండీ, నీళ్లు లేకుండా అలమటిస్తున్నవారు ఉన్నట్లు ఆ ప్రాంతంలో ఉన్న రిపోర్టర్లు చెబుతున్నారు.
తప్పించుకోగలమనే ఆశతో ఎంతోమంది చిన్న పిల్లలను గోడపైనుంచి అమెరికా సైనికులకు అందిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో షేర్ అవుతున్న వీడియోల్లో కనిపిస్తున్నాయి.

ఫొటో సోర్స్, RISE TO PEACE
యూరోపియన్ ప్రభుత్వాలు తమ పౌరులను, ఆఫ్గాన్ సహోద్యోగులను హడావిడిగా స్వదేశానికి తరలిస్తుండడంతో విమానాశ్రయం దగ్గర గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.
అఫ్గాన్ పౌరులు దేశంలోనే ఉండవచ్చని చెప్పిన తాలిబాన్లు విదేశీయులు, స్థానికులు సురక్షితంగా వెళ్లిపోడానికి అవకాశం కల్పిస్తామని కూడా చెప్పారు.
"విమానాశ్రయం దగ్గర అఫ్గాన్ ప్రజలు, విదేశీయులు, తాలిబన్ ఫైటర్ల మధ్య ఎలాంటి హింస, గొడవలు జరగకుండా మేం అడ్డుకుంటున్నాం" అని ఒక అధికారి చెప్పారు.

ఫొటో సోర్స్, Reuters
బీబీసీకి చిక్కిన ఐక్యరాజ్యసమితి రహస్య పత్రం ద్వారా తాలిబాన్ల తాజా హింస, వేధింపుల విషయం బయటపడింది.
నాటో, అమెరికా దళాలతో కలిసి పనిచేసిన వారి కోసం మిలిటెంట్లు తీవ్రంగా వెతుకుతున్నట్లు అందులో పేర్కొన్నారు.

కీలక మార్గాల్లో ట్రాఫిక్ జామ్‌లు
విమానాశ్రయంవైపు కదులుతున్న ప్రజల రద్దీని ఆయా ప్రాంతాల ఉపగ్రహ చిత్రాల ద్వారా చూడవచ్చు. వేలమంది దేశం నుంచి తప్పించుకోడానికి తమ వాహనాల్లో విమానాశ్రయంవైపు వెళ్లడానికి ప్రయత్నిస్తున్నారు.
తాలిబాన్ల పాలనకు భయపడిన అఫ్గాన్ పౌరులు దేశం నుంచి తప్పించుకోడానికి పరుగులు పెట్టడంతో మొదట సోమవారం కాబూల్ విమాశ్రయంలో జనం గుమిగూడిన దృశ్యాలు కనిపించాయి.
ఇవి కూడా చదవండి:
- ఓబీసీ బిల్లు: 127వ రాజ్యాంగ సవరణతో ఎవరికి లాభం, కులాలకా, పార్టీలకా?
- ఈ ఆర్థిక సంక్షోభం 'రాజకీయ-సామాజిక సంక్షోభం'గా మారనుందా
- అప్పుల ఊబిలో కూరుకుపోతున్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు - అభిప్రాయం
- ఏనుగుల ప్రాణాలు తీస్తున్న చర్మం వ్యాపారం, ఆసియాలో పెరుగుతున్న దారుణం
- నీరజ్ చోప్రా: ఒలింపిక్ గోల్డ్ గెలిచిన భారత అథ్లెట్ కెరీర్లో 5 కీలక మలుపులు
- పాకిస్తాన్లో ప్రధానమంత్రి నివాసాన్ని అద్దెకు ఇవ్వబోతున్నారా, ఇది నిజమేనా?
- కరోనా కాలంలో భారత ‘వ్యాక్సిన్ కింగ్’ ఆస్తి 25 శాతం వృద్ధి
- అంబానీ ఇంటి దగ్గర పేలుడు పదార్ధాల కేసు.. ఆ పోలీస్ అధికారి చుట్టూ ఎందుకు తిరుగుతోంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)








