కాంస్య యుగం నాటి రాతి పలక మీద అతి ప్రాచీన 3-డీ చిత్రం చెబుతున్న రహస్యమేంటి?

ఫొటో సోర్స్, DENIS GLIKSMAN
ఫ్రాన్స్ లో కాంస్య యుగం నాటి అరుదైన రాతి పలక లభించింది. దీనిని యూరప్‌లోనే అత్యంత పురాతనమైన 3డి మ్యాప్ అని అనవచ్చని పరిశోధకులు చెబుతున్నారు.
2 మీటర్ల పొడవు 1.5 మీటర్ల వెడల్పు ఉన్న ఈ రాతి పలకను మొట్టమొదట 1900లో కనిపెట్టారు. ఇదే రాతి పలక తిరిగి ఫ్రాన్స్ లో ఒక కోట సెల్లార్లో 2014లో బయట పడింది.
4000 సంవత్సరాల పురాతనమైన ఈ రాతి పలక మీద చెక్కిన రూపాలు, ఆకారాలను బట్టి అవి పశ్చిమ బ్రిటనీలో ఒక ప్రాంతానికి చెందిన మ్యాప్ గా కనిపిస్తున్నట్లు పురావస్తు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

యూరప్‌లో పరిచయమున్న ఒక ప్రాంతానికి సంబంధించి దొరికిన అత్యంత ప్రాచీనమైన 3-డి మ్యాప్ ఇదే అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
దీనిని సెయింట్ బెలెక్ స్లాబ్ అని పిలుస్తారు. ఇది క్రీస్తు పూర్వం 1900 - 1650 మధ్య కాలానికి చెంది ఉంటుందని భావిస్తున్నారు.
పశ్చిమ బ్రిటనీలో 1900లో ఒక ప్రాచీన శ్మశానంలో తవ్వకాలు జరుపుతుండగా ఈ రాయి తొలి సారి పురావస్తు శాస్త్రవేత్త పాల్ డూ చాటెల్లియర్‌కు లభించింది.

ఫొటో సోర్స్, DENIS GLIKSMAN
అయితే, ఒక వంద సంవత్సరాల వరకు దీని సంగతి అందరూ మర్చిపోయారు. ఇది కొన్ని దశాబ్దాల పాటు చాటెలియర్ ఇంటి దగ్గర ఒక కందకంలో ఉండిపోయింది.
కానీ, అది మళ్లీ 2014లో దాని గురించి వెతుకుతున్న పరిశోధకులకు ఒక కోట సెల్లార్ లో కనిపించింది.
ఆ రాతి మీద చెక్కి ఉన్న గుర్తులు చూసి అది మ్యాప్ అయి ఉండవచ్చని పరిశోధకులు అనుమానించారు.
"ఆ రాతి మీద గీతలతో కలుపుతూ ఉన్న ఒకేలాంటి గుర్తులను బట్టి ఆ మ్యాప్ ఫినిస్టీర్లో ఉన్న ఒక ప్రాంతాన్ని సూచించింది" అని ఫ్రెంచ్ ప్రి హిస్టారిక్ సొసైటీ అధ్యయనం తెలిపింది.
వాటి మీద ఉన్న గుర్తులు రివర్ ఆడెట్ వ్యాలీకి ప్రతీకగా 3డిలో ఉన్నాయని పరిశోధకులు చెబుతున్నారు.
అందులో ఉన్న చాలా గీతలు నదిపై ఉన్న రవాణా మార్గాన్ని సూచిస్తున్నాయి.

ఫొటో సోర్స్, DENIS GLIKSMAN
ఆ రాతి పలక పై కనిపిస్తున్న ప్రాంతం ఆ నది ప్రవహిస్తున్న 18 మైళ్ళ ప్రాంతాన్ని 80 శాతం వరకు తలపిస్తున్నట్లు జియో లొకేషన్ వివరాలు చెబుతున్నాయి.
"ఇప్పటి వరకు లభించిన అతి పురాతనమైన మ్యాప్ ఇదే అయి ఉంటుంది" అని అధ్యయన రచయత, బోర్న్‌మౌత్ యూనివర్సిటీకి చెందిన డాక్టర్ క్లెమెంట్ నికోలస్ చెప్పారు.
"ప్రపంచంలో చాలా చోట్ల రాతి మీద చెక్కిన మ్యాప్ లు ఉండవచ్చు. కానీ, అందులో వివరాలను మనం ఊహించుకోవాలి. ఒక ప్రాంతాన్ని నిర్దిష్టంగా చూపించిన మ్యాప్ బహుశా ఇదే మొదటిది" అని ఆయన అన్నారు.
ఒక ప్రాంతాన్ని గుర్తించడానికి ఈ మ్యాప్‌ను వాడి ఉంటారని డాక్టర్ క్లెమెంట్ చెప్పారు.
"దీని ద్వారా ఒక ప్రాంతంపై హక్కులను ప్రకటించుకునేందుకు అప్పట్లో రాజులు కానీ, చక్రవర్తులు కానీ వాడి ఉంటారు" అని ఆయన వివరించారు.
మనం పూర్వీకులకు ఉన్న భౌగోళిక పరిజ్ఞానం గురించి తక్కువ అంచనా వేస్తూ ఉంటాం. ఈ రాయి మీద చెక్కిన విషయాలు చూస్తే వారికున్న భౌగోళిక జ్ఞానం అర్ధమవుతుంది" అని ఆయన అన్నారు.
ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్: భారత్‌లోని 18 రాష్ట్రాల్లో ‘డబుల్ మ్యూటెంట్ వేరియంట్’.. తెలుగు రాష్ట్రాల్లో 104 మందిలో యూకే, 20 మందిలో దక్షిణాఫ్రికా వేరియంట్
- కుతుబ్ మినార్ స్థానంలో అంతకు ముందు హిందూ దేవాలయం ఉండేదా?
- వీగర్ ముస్లిం జాతిని చైనా సమూలంగా తుడిచిపెట్టేస్తోందా? బ్రిటన్ నివేదికలో ఏం బయటపడింది?
- తమిళనాడు ఎన్నికల వల్లే శ్రీలంక వ్యతిరేక తీర్మానంపై ఓటింగ్‌కు భారత్ గైర్హాజరయ్యిందా...
- న్యూజీలాండ్ ప్రభుత్వం 'తల్లుల' కోసం చేసిన చట్టంపై చర్చ ఎందుకు... భారత్‌లో పరిస్థితి ఏంటి?
- భారత్-పాక్ సరిహద్దు: కచ్ నిర్బంధ కేంద్రంలో అయిదుగురు పాకిస్తానీలు ఎలా చనిపోయారు?
- మహిళల మోకాళ్లు, చిరిగిన జీన్స్‌పై ఎందుకింత చర్చ జరుగుతోంది
- 15 వందల మంది భారత సైనికుల భీకర పోరాటం రెండో ప్రపంచ యుద్ధ గతిని ఎలా మార్చిందంటే..
- 'ఒకవేళ నేను చనిపోతే మన బిడ్డను జాగ్రత్తగా చూసుకోండి'
- వరల్డ్ హ్యాపీనెస్ డే: అత్యంత సంతోషకర దేశంగా ఫిన్లాండ్, 139వ స్థానంలో భారత్
- మహాశివరాత్రి: పురుష లింగాకారానికి పూజలు చేసే అరుదైన ఆలయం.. గుడిమల్లం
- సిద్దిక్ కప్పన్: రేప్ కేసు రిపోర్ట్ చేయడానికి ప్రయత్నించినందుకు జైల్లో పెట్టి 'హింసిస్తున్నారు'
- ముస్లిం, క్రైస్తవ మతాలకు చెందిన మృతుల ఖననానికి మారుమూల దీవిని ఎంపిక చేసిన శ్రీలంక
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









