Ripped Jeans: మహిళల మోకాళ్లు, చిరిగిన జీన్స్‌పై ఎందుకింత చర్చ జరుగుతోంది

జీన్స్ ధరించిన యువత

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, గీతా పాండే
    • హోదా, బీబీసీ ప్రతినిధి

యువత నైతికంగా తప్పు దారి పట్టడానికి దుస్తులు కారణమని నిందించే పితృస్వామ్య సమాజం మళ్ళీ వార్తల్లోకొచ్చింది.

ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి తీర్థ్‌సింగ్ రావత్ ఇటీవల పదవిని చేపట్టిన తర్వాత చేసిన ఒక ప్రసంగంలో జీన్స్ ప్రస్తావన తెచ్చి వార్తల్లో నిలిచారు.

గత వారం ఆయన బాలల హక్కుల రాష్ట్ర కమిషన్ నిర్వహించిన ఒక వర్క్‌షాప్‌లో మాట్లాడుతూ "యువతను పట్టిపీడిస్తున్న సమస్య రిప్డ్ (చిరుగులు ఉన్న) జీన్స్" అని వ్యాఖ్యానించారు.

ఆయన ఫ్లైట్‌లో ప్రయాణం చేసిన ఒక మహిళ వస్త్రధారణ గురించి తన ప్రసంగంలో ప్రస్తావించారు. ఆ మహిళ రిప్డ్ జీన్స్, బూట్లు, చేతికి బ్రేస్‌లెట్ ధరించి ఇద్దరు పిల్లలతో కలిసి ప్రయాణం చేస్తున్నట్లు చెప్పారు.

"మీరొక స్వచ్చంద సంస్థను నిర్వహిస్తూ, మోకాళ్ల దగ్గర చిరిగినట్లుగా ఉండే జీన్స్‌ని ధరిస్తారు. మీతో పాటు పిల్లలున్నారు? వారికేమి విలువలు నేర్పిస్తారు? అని ఆయన ఆమెను అడిగారు.

ఇలాంటి జీన్స్ ధరించడం నైతిక పతనానికి నిదర్శనమంటూ , అలాంటి దుస్తులు ధరించడానికి అంగీకరించే తల్లితండ్రులను విమర్శించారు.

ముఖ్యంగా అమ్మాయిలు రిప్డ్ జీన్స్ వేసుకోవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.

"భారతీయులు రిప్డ్ జీన్స్ ధరించి నగ్నత్వం వైపు పరుగులు పెడుతుంటే, విదేశీయులు మాత్రం పూర్తిగా ఒళ్లంతా కప్పే దుస్తులతో యోగా చేస్తున్నారు" అన్నారాయన.

అయితే, రావత్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర విమర్శలను ఎదుర్కొన్నాయి.

మహిళలకు క్షమాపణ చెప్పాలని, లేదా పదవి నుంచి రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది.

కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ ప్రధాని మోదీ, ఆయన క్యాబినెట్ అనుచరులు మోకాళ్లు కనిపించేలా వేసుకున్న దుస్తులతో ఉన్న ఫోటోలను గురువారం షేర్ చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ద్వారా ఆయన స్త్రీల పట్ల ద్వేషాన్ని పెంచుతున్నారని దిల్లీ కమిషన్ ఫర్ విమెన్ హెడ్ స్వాతి మాలివాల్ ట్వీట్ చేశారు.

రావత్ చెప్పిన విషయంతో పాటు ఆయన చెప్పిన విధానంతోనూ సమస్య ఉందని ఆమె ట్వీట్ చేశారు.

మహిళలను పైనుంచి కింద వరకు చూస్తారనే విషయాన్ని ఆయన ఒప్పుకున్నట్లుగా ఉందని ఆమె అన్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

ఆయన వ్యాఖ్యలు ట్విటర్‌లో చర్చకు దారితీశాయి. దీంతో చాలా మంది అమ్మాయిలు, అబ్బాయిలు రిప్డ్ జీన్స్ వేసుకున్న ఫొటోలతో, #RippedJeanstwitter, #RippedJeans అనే హాష్ ట్యాగ్ లతో ట్విటర్‌ను నింపేశారు.

కొంతమంది ఆయనను ట్యాగ్ కూడా చేశారు.

రిప్డ్ జీన్స్ గురించి విచారించడం మానేసి చీలిపోయిన ఆర్ధిక వ్యవస్థ, మహిళల భద్రత గురించి ఆలోచించమని కొందరు సలహా ఇచ్చారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 3
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 3

ఈ వివాదంపై స్పందించిన రావత్ శుక్రవారం క్షమాపణ తెలుపుతూ ఎవరి మనోభావాలనూ గాయపరచాలని తాను అనుకోలేదని చెప్పారు.

ఎవరినీ అగౌరవపరచాలనే ఉద్దేశం తనకు లేదని.. ఎవరికి ఇష్టం వచ్చిన దుస్తులు వారు ధరించవచ్చని అన్నారు.

అయితే, మహిళల వస్త్రధారణపై సలహాలు ఇచ్చిన వారిలో ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి ఒక్కరే లేరు.

విదేశీ పర్యాటకులు దేశంలో పర్యటించేటప్పుడు స్కర్టులు, డ్రెస్సులు వేసుకోవద్దంటూ సూచించే ఒక జాబితాను ఎయిర్ పోర్టులలో ఇవ్వాలని అయిదేళ్ల కిందట అప్పటి సాంస్కృతిక శాఖ మంత్రి మహేశ్ శర్మ సూచించారు. చిన్న పట్టణాలలో పర్యటకులు రాత్రి పూట ఒంటరిగా వెళ్లవద్దని కూడా ఆయన సూచించారు.

మహిళలపై జరిగే అత్యాచారాలకు, లైంగిక దాడులకు చాలామంది రాజకీయ నాయకులు దుస్తులతో ముడిపెట్టిన సందర్భాలు ఉన్నాయి.

మహిళలు జీన్స్ ధరించడం భారతీయ సంస్కృతికి వ్యతిరేకమని ప్రముఖ గాయకుడు జేసుదాస్ గతంలో అన్న మాటలు కూడా వివాదాస్పదమయ్యాయి.

పితృస్వామ్యం నాటుకుపోయిన భారతీయ గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు ధరించే దుస్తులపై తీవ్రమైన ఆంక్షలు ఉంటాయి.

జీన్స్, స్కర్ట్స్ ధరించిన అమ్మాయిలు, షార్ట్స్ ధరించిన అబ్బాయిలను సామాజికంగా బహిష్కరిస్తామని గత వారం ఉత్తర ప్రదేశ్‌లోని ఒక గ్రామంలో కుల పంచాయితీ తీర్పు చెప్పింది.

అమ్మాయిలు జీన్స్ ధరించడం, మొబైల్ ఫోన్‌లను వాడటాన్ని ఉత్తర్ ప్రదేశ్‌లోని బట్టిస గ్రామంలో ఒక కుల పంచాయతీ పదేళ్ల క్రితం నిషేధించింది.

2014లో 46 గ్రామాలకు చెందిన గ్రామ పెద్దలు ఒక సమావేశంలో ఇలాంటి నిషేధాన్నే ప్రకటించారు.

2017లో హర్యానా, రాజస్థాన్లోని కొన్ని గ్రామాల్లో మహిళలు జీన్స్ ధరించటాన్ని, మొబైల్ ఫోన్ వాడటాన్ని నిషేధించారు.

ప్రియాంక చోప్రా

ఫొటో సోర్స్, Gotham

దుస్తుల గురించి భారతీయ నాయకులకు ఎందుకంత పట్టింపు?

భారతదేశంలో 1980 ప్రాంతంలో డెనిమ్స్‌కి ఆదరణ పెరిగింది.

దాంతో చాలామంది యువత వాటి పట్ల ఆకర్షితులవ్వడం మొదలు పెట్టారు.

భారతీయ డెనిమ్ మార్కెట్ 4 బిలియన్ డాలర్లకు పైగా విలువ చేస్తుంది. ఇది 2028 నాటికి 12.6 బిలియన్ డాలర్లకు పెరుగుతుందనే అంచనా కూడా ఉంది.

గత కొన్నేళ్లుగా ఈ రిప్డ్ జీన్స్ బాగా పాపులర్ అయ్యాయి. వీటిని సినీ నటుల నుంచి సాధారణ ప్రజల వరకు ధరించడం మొదలుపెట్టారు.

అయితే, వీటితో "భారతీయులకు ప్రేమ, ద్వేషంతో కూడిన సంబంధం ఉంది" అని ఫ్యాషన్ డిజైనర్ ఆనంద్ భూషణ్ అన్నారు.

"యువతకు ఇప్పుడు ఫ్యాషన్ ప్రపంచానికి అనుగుణంగా ఉండి ట్రెండ్ కి సరిపోయేవిధంగా కనిపించాలని ఉంటుంది. కానీ, వాళ్ల తల్లిదండ్రులకు, తాతమామ్మలకు పిల్లలు ఇలాంటి చిరిగిన దుస్తులు ఎందుకు ధరిస్తారో అర్థం కాదు" అని ఆయన అన్నారు.

"అయితే, పిల్లల దుస్తుల వైఖరి గురించి తల్లి తండ్రులు మాట్లాడటం వేరు, ప్రజాధికారులు సమాజంలో రుగ్మతలకు దుస్తులే కారణమని నిందించడం వేరు" అని అన్నారు.

"ఇది మహిళలను నియంత్రణలో ఉంచేందుకు ఒక ప్రయత్నం. పితృస్వామ్యాన్ని సమర్ధించే పురుషులు సంస్కృతి అనే ముసుగులో మహిళల వస్త్రధారణను నియంత్రించే ప్రయత్నం" అని భూషణ్ అన్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 4
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 4

"కొత్తగా చెప్పడానికి ఏమీ మిగలక జీన్స్ మన సంస్కృతిలో భాగం కాదని, అవి పశ్చిమ దేశాల నుంచి వచ్చాయనే పాత వాదనలే వినిపిస్తారు" అని ఆయన అన్నారు.

ఈ రిప్డ్ జీన్స్ గురించి రావత్ చేసిన వ్యాఖ్యలు ఊహించని పరిణామాలు ఎదుర్కొన్నాయి.

ఈయన వ్యాఖ్యలు కొంత మందిని మొదటి సారి రిప్డ్ జీన్స్ వేసుకునేలా ప్రేరేపించాయి.

ముంబయికి చెందిన క్యాన్సర్ కౌన్సెలర్ ఆమె ఫోటోలను ట్విటర్ లో పోస్టు చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 5
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 5

రావత్ వ్యాఖ్యలు చాలా "అవమానకరంగా , హాస్యాస్పదంగా ఉన్నాయని" ఆయన మాటలు విన్న తర్వాత తన జీన్స్‌ని చింపి రిప్డ్ జీన్స్‌లా మార్చానని ఆమె చెప్పారు.

"నాకు 69 సంవత్సరాలు. నేను సాధారణంగా చీరలే కట్టుకుంటాను. పిల్లలు ఇలా ముక్కలుగా కత్తిరించిన జీన్స్ ఎందుకు ధరిస్తారని అనుకుంటూ ఉండేదానిని" అని చెప్పారు.

కానీ, రావత్ చేసిన వ్యాఖ్యలు మహిళలకు వ్యతిరేకంగా ఉన్నాయని అన్నారు. అందుకే ఆమె ప్యాంట్ కి కన్నాలు పెట్టి ధరించిన ఫోటోను ట్విటర్లో పోస్టు చేసినట్లు చెప్పారు.

అవి చాలా సౌకర్యవంతంగా ఉన్నాయని ఆమె నవ్వుతూ చెప్పారు.

కానీ, మహిళలు ఏమి ధరించాలనేది వారి స్వీయ విషయమని, ఇతరులకు సంబంధం లేనిదని అన్నారు.

"ఇది రావత్ ఆలోచించాల్సిన విషయం కాదు. ఆయన ఉత్తరాఖండ్లో కరుగుతున్న మంచు పర్వతాల గురించి, రాష్ట్రం ఎదుర్కొంటున్న పర్యావరణ సమస్యల గురించి ఆందోళన చెందాలి కానీ, మహిళల వస్త్రధారణ గురించి కాదు" అని ఆమె అన్నారు.

తీర్థ్ సింగ్ రావత్ వ్యాఖ్యలపై నిరసన తెలుపుతున్న దిల్లీ మహిళా కాంగ్రెస్ నాయకురాలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, తీర్థ్ సింగ్ రావత్ వ్యాఖ్యలపై నిరసన తెలుపుతున్న దిల్లీ మహిళా కాంగ్రెస్ నాయకురాలు

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)