కరోనావైరస్: భారత్‌లోని 18 రాష్ట్రాల్లో ‘డబుల్ మ్యూటెంట్ వేరియంట్’.. తెలుగు రాష్ట్రాల్లో 104 మందిలో యూకే, 20 మందిలో దక్షిణాఫ్రికా వేరియంట్

ఫొటో సోర్స్, Getty Images
దేశవ్యాప్తంగా 18 రాష్ట్రాల్లో సేకరించిన కరోనా శాంపిళ్లలో ఒక కొత్త డబుల్ మ్యూటెంట్ వేరియంట్‌ను గుర్తించినట్లు భారత ఆరోగ్య మంత్రిత్వ శాఖ చెప్పింది.
దేశంలోని 18 రాష్ట్రాల్లో సేకరించిన శాంపిళ్లలో ఒక డబుల్ మ్యూటెంట్ వేరియంట్‌తో పాటు 771 ఇతర వేరియంట్ల కరోనావైరస్‌లను గుర్తించినట్లు వెల్లడించింది.
మొత్తం 10,787 శాంపిళ్లు సేకరించగా అందులో 736 మందిలో యూకే వేరియంట్ పాజిటివ్, 34 మందిలో దక్షిణాఫ్రికా వేరియంట్, ఒకరిలో బ్రెజిల్ వేరియంట్ గుర్తించినట్టు తెలిపింది.
భారత్‌లో కోవిడ్ కేసులు మళ్లీ పెరుగుతున్న సమయంలో ఈ నివేదిక వచ్చింది.
అయితే, కేసులు పెరగడానికి.. ఈ కొత్త వేరియంట్లకు సంబంధం ఉందనడానికి ఎలాంటి ఆధారాలు లభించలేదని చెప్పింది.
భారత్‌లో బుధవారం కొత్తగా 47,262 పాజిటివ్ కేసులు, 275 మరణాలు నమోదయ్యాయి. ఈ ఏడాది ఇదే అత్యధికం.
భారత మంత్రిత్వ శాఖ కింద ఉన్న 10 జాతీయ ప్రయోగశాలల బృందం ఇండియన్ SARS-CoV-2 కన్సార్టియం ఆన్ జీనోమిక్స్ (INSACOG) ఈ శాంపిళ్ల జీనోమ్ సీక్వెన్సింగ్ చేసింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
తెలుగు రాష్ట్రాలలో..
ఆంధ్రప్రదేశ్‌లో 17 శాంపిళ్లలో యూకే వేరియంట్, 3 శాంపిళ్లలో దక్షిణాఫ్రికా వేరియంట్‌ను గుర్తించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్(ఎన్‌సీడీసీ) వెల్లడించిన వివరాలలో ఉంది.
తెలంగాణలో 87 శాంపిళ్లలో యూకే వేరియంట్.. 17 మందిలో దక్షిణాఫ్రికా వేరియంట్ ఉన్నట్లు గుర్తించారు.

మరింత ప్రాణాంతకమా?
ఒక వైరస్ జెనెటిక్ కోడ్ అంటే ఒక మాన్యువల్‌లాంటిది. వైరస్‌లో మ్యుటేషన్లు సాధారణమే కానీ వాటిలో ఎక్కువ శాతం అంత ముఖ్యమైనవి కావు. వ్యాప్తి చెందే సామర్థ్యంలో కానీ, ప్రమాదకరంగా సోకడంలో కానీ పెద్దగా మార్పులు ఉండవు.
కానీ యూకే, దక్షిణాఫ్రికా వేరియంట్‌లలో వేగంగా వ్యాపించే గుణం, మరింత ప్రాణాంతకంగా పరిణమించే గుణం ఉన్నాయి.
డబుల్ మ్యూటేషన్ అంటే రెండు మ్యూటేషన్లు కలిసికట్టుగా ఒకే వైరస్‌లో ఉండడం అని వైరాలజిస్ట్ షాహిద్ జమీల్ చెప్పారు.
వైరస్ స్పైక్ ప్రొటీన్‌లోని కీలక ప్రాంతాల్లో ఉన్న ఒక డబుల్ మ్యూటేషన్ మనిషి శరీరంలోని రోగ నిరోధక శక్తిని దాటుకుని సోకే ప్రమాదం ఉంటుందని చెప్పారు.
స్పైక్ ప్రొటీన్ అనేది మనిషి శరీర కణాల్లోకి చొచ్చుకుపోవడానికి వైరస్ ఉపయోగించే ఒక భాగం.
గత ఏడాది డిసెంబరుతో పోల్చితే మహారాష్ట్ర నుంచి సేకరించిన శాంపిళ్లలో E484Q, L452R మ్యుటేషన్లు ఎక్కువగా కనిపించాయని ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది.
డబుల్ మ్యుటేషన్ వేరియంట్లు రోగనిరోధక శక్తి కన్నుగప్పి శరీరంలోకి చేరే ప్రమాదం అధికంగా ఉంటుందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ చెప్పింది.
భారత్‌లో ఎల్452ఆర్, ఈ484క్యూ మ్యుటేషన్లు కలిసి వస్తున్నట్లు ఉందని డాక్టర్ జమీల్ అన్నారు.
అయితే, దేశంలో కేసుల పెరుగుదలకు.. ఈ డబుల్ మ్యూటెంట్ వేరియంట్‌కు సంబంధం లేదని ప్రభుత్వం చెబుతోంది.
''దేశంలో వీవోసీ(వేరియంట్స్ ఆఫ్ కన్సర్న్)లు, డబుల్ మ్యూటెంట్ వేరియంట్‌ను గుర్తించినప్పటికీ కేసుల పెరుగుదలకు ఇవే కారణం అనడానికి సరిపడా ఇలాంటి కేసులు ఇంకా లభించలేద''ని ప్రభుత్వం చెప్పింది.

ఫొటో సోర్స్, Getty Images
"ఆందోళన కలిగించే ఈ వేరియంట్లేవీ ప్రజల్లో వ్యాపించకుండా మనం నిరంతరం పర్యవేక్షించాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు వ్యాపించనంత మాత్రాన భవిష్యత్తులో వ్యాపించదని కాదు" అని డాక్టర్ జమీల్ బీబీసీ ప్రతినిధి సౌతిక్ బిశ్వాస్‌కు చెప్పారు.
నావెల్ కరోనా వైరస్ జీనోమ్ సీక్వెన్సింగ్ చేసిన దేశాల్లో భారత్ కూడా ఉంది.
దేశంలో 1.17 కోట్లకు పైగా కేసులు, లక్షా 60 వేల మరణాలు ఇప్పటికే నమోదు కాగా కొత్త మ్యుటేషన్లను గుర్తించే ప్రయత్నాలు ఇంకా కొనసాగుతున్నాయి.
వైరస్‌తో ఏడాదిగా పోరాడుతూ ఇప్పటికే అలసిన దేశంలోని ఆరోగ్య వ్యవస్థకు ఇది అత్యంత క్లిష్ట దశ అని కొంతమంది నిపుణులు చెబుతున్నారు.
దేశంలో మళ్లీ కేసులు పెరుగుతున్న తరుణంలో ఇప్పటికే పలు రాష్ట్రాలు వైరస్ కట్టడి కోసం ఆంక్షలు అమల్లోకి తెస్తున్నాయి.
దిల్లీ, ముంబయి వంటి నగరాల్లో విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లలు, షాపింగ్ కాంప్లక్సులు వంటి చోట రాండమ్‌గా కరోనా పరీక్షలు నిర్వహించాలని ఇప్పటికే ఆదేశించారు.
ఇవి కూడా చదవండి:
- బానిసలుగా వచ్చి బాద్‌షాలయ్యారు
- తైవాన్: స్వలింగ సంపర్కుల వివాహాన్ని చట్టబద్ధం చేసిన తొలి ఆసియా దేశం
- ఫ్రెండ్స్ సమక్షంలో పూలతో ప్రపోజ్ చేసి, హగ్ చేసుకున్న ప్రేమ జంట... బహిష్కరించిన యూనివర్సిటీ
- 173 మందితో వెళ్తున్న విమానంలో మంటలు చెలరేగితే ల్యాండింగ్‌కు అనుమతి ఇచ్చారు.. తరువాత ఏమైందంటే
- తెలంగాణ బడ్జెట్ 2021: రూ.2,30,826 కోట్లతో బడ్జెట్.. వెయ్యి కోట్లతో సీఎం దళిత్ ఎంపవర్మెంట్ ప్రోగ్రాం
- నరేంద్ర మోదీ: ‘‘తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో కోవిడ్ వ్యాక్సిన్ల వృధా 10 శాతం పైనే ఉంది’’
- కరోనావైరస్: మిగతా దేశాలు వ్యాక్సీన్ తయారు చేసుకోకుండా ధనిక దేశాలు అడ్డుపడుతున్నాయా?వరల్డ్ హ్యాపీనెస్ డే: అత్యంత సంతోషకర దేశంగా ఫిన్లాండ్, 139వ స్థానంలో భారత్
- నోబెల్‌కు 5 సార్లు నామినేట్ అయిన ‘భారత అణు కార్యక్రమ పితామహుడు’ మరణానికి కారణమేంటి
- విశాఖపట్నం: మహానగరం మధ్యలో అభయారణ్యం... అందులో రహస్య గిరిజన గ్రామం...
- వంటకాల కోసం తగువులాడుకుంటున్న దేశాలు... భారత్, పాకిస్తాన్ల మధ్య కూడా ఓ వివాదం
- చైనా, తైవాన్: రెండు దేశాల మధ్య పైనాపిల్ యుద్ధం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








