కరోనావైరస్: భారత్, బ్రెజిల్, బ్రిటన్, దక్షిణాఫ్రికాలలోని కొత్త వేరియంట్లు ప్రమాదకరమా?

- రచయిత, మిషెల్ రాబర్ట్స్
- హోదా, హెల్త్ ఎడిటర్, బీబీసీ న్యూస్ ఆన్‌లైన్
కరోనావైరస్‌లో ఒక కొత్త రకాన్ని 2020 చివర్లో తొలిసారిగా భారతదేశంలో గుర్తించారు. అదే వేరియంట్ ఇప్పుడు బ్రిటన్‌లో కూడా కనిపించింది.
ఈ కొత్త వేరియంట్ అనేక రకాల జన్యు మార్పులకు గురై ఉంటుంది కాబట్టి ఇది మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.
అంతకుముందు వచ్చిన కోవిడ్ ఇంఫెక్షన్లుగానీ ప్రస్తుతం వాడుతున్న వ్యాక్సీన్లు గానీ ఈ వేరియంట్ నుంచి పూర్తి రక్షణ కల్పించలేవని వారు అభిప్రాయపడుతున్నారు.
ఈ కొత్త వేరియంట్ తీరు తెన్నులు ఎలా ఉంటాయో తెలుసుకునేందుకు మరింత అధ్యయనం అవసరం.
ఇండియన్ వేరియంట్ ఏమిటి?
కోవిడ్‌లో కొత్త రకాలు లేదా వేరియంట్లు వేలల్లో పుట్టుకొస్తున్నాయి. ఇండియన్ వేరియంట్ (బీ.1.617) సోకిన కేసులు బ్రిటన్‌లో 100 కన్నా ఎక్కువే నమోదయ్యాయి.
ఈ సంఖ్య పెద్దదిగా కనిపిస్తోందిగానీ బ్రిటన్‌లో కరోనావైరస్‌లో వస్తున్న జన్యుపరమైన మార్పులను అధ్యయనం చేసేందుకు సేకరించిన కోవిడ్ శాంపిల్స్‌లో ఇది 1% కన్నా తక్కువ.
ఇండియన్ వేరియంట్ సోకినవారిలో కొందరికి అంతర్జాతీయ ప్రయాణాల వలన కరోనా సోకలేదని తెలుస్తోందని పబ్లిక్ హెల్త్ ఇంగ్లండ్ చెప్పింది.
వీరికి ఈ వేరియంట్ ఎలా సోకిందో తెలుసుకునే దిశలో దర్యాప్తులు చేస్తున్నారు.
బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఈ నెల చివర్లో భారతదేశం రావలసి ఉండగా, కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ పర్యటనను వాయిదా వేశారు.
అంతే కాకుండా, భారతదేశాన్ని ట్రావెల్-బ్యాన్ రెడ్ లిస్టులో పెడుతున్నట్లు బ్రిటన్ ప్రకటించింది అయితే, యూకే, బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా వేరియంట్ల మాదిరి ఇండియన్ వేరియంట్ కూడా ప్రమాదకరమైనదని చెప్పేందుకు కావలసినంత సమాచారం అందుబాటులో లేదు.
అలాగే, ప్రస్తుతం భారతదేశంలో విపరీతంగా పెరుగుతున్న కోవిడ్ కేసులకు ఇదే కారణమని చెప్పలేమని నిపుణులు అంటున్నారు.
యూకే, బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా వేరియంట్లు ఏమిటి?
కొత్తగా కొన్ని వేల రకాల కోవిడ్ వైరస్ వేరియంట్లు పుట్టుకొచ్చాయి. బ్రెజిల్ వేరియంట్ కాకుండా పి1 అనే కొత్త వేరియంట్ వైరస్‌లను కూడా గుర్తించారు. యూకే వేరియంట్ లేదా కెంట్ వేరియంట్‌గా పిలిచే (B.1.3.5.1.) రకం వైరస్ ప్రస్తుతం బ్రిటన్లో ఎక్కువగా ఉంది.
ఈ వైరస్ ఇప్పటికే 50 దేశాలకు వ్యాపించి మరింత పరివర్తన చెందుతున్నట్లు కనిపిస్తోంది. దక్షిణ ఆఫ్రికా వేరియంట్ (B.1.3.5.1.) యూకే సహా మరో 20 దేశాలలో కనిపించింది. అయితే, కొత్త వేరియంట్‌లు పుట్టుకు రావడం ఊహించని విషయమేమి కాదని నిపుణులు చెబుతున్నారు.
వ్యాప్తి చెందడానికి వైరస్‌లు పరివర్తన చెందుతూ తమ నమూనాలను తయారు చేసుకుంటూ ఉంటాయి. కాకపోతే వీటి లక్షణాలు కొన్ని అనూహ్యంగా ఉన్నాయి. అయితే, ఈ వైరస్ కొత్త వేరియంట్లు సోకిన వారిలో ఎక్కువమంది తీవ్రంగా జబ్బు పడినట్లు ఆధారాలు లేవు.

ఫొటో సోర్స్, Getty Images
అయితే, ఈ వైరస్ వేరియంట్లు సోకిన వృద్ధులకు, ఇతర దీర్ఘకాలిక వ్యాధుల వారికి ఇన్ఫెక్షన్ ముప్పు ఎక్కువగా ఉంది. యూకే వేరియంట్‌తో మరణించే అవకాశాలు 30శాతం ఎక్కువని పరిశోధనలు చెబుతున్నాయి. అయితే, వీటికి స్పష్టమైన ఆధారాలు మాత్రం లభించలేదు.
చేతులు శుభ్రపర్చుకోవడం, భౌతిక దూరం పాటించడం, మాస్క్ వేసుకోవడంలాంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదం తగ్గుతుంది. అయితే, కొత్త వేరియంట్లు పాత వాటి కంటే వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లు కనిపించడంతో మరింత అప్రమత్తంగా ఉండటం అవసరం.
యూకే, సౌత్ ఆఫ్రికా, బ్రెజిల్ వేరియంట్లు త్వరగా వ్యాప్తి చెందుతున్నాయి. ఈ మూడు వేరియంట్‌లలో శరీరంలోని కణాలకు అతుక్కునే స్పైక్ ప్రోటీన్‌లో చాలా మార్పులు జరిగాయి. దీంతో ఇన్ఫెక్షన్ చాలా వేగంగా వ్యాప్తి చెందుతుంది.
సెప్టెంబరులో కనిపించిన యూకే, కెంట్ స్ట్రెయిన్ 70శాతం ఎక్కువగా వ్యాప్తి చెందే లక్షణం ఉంది. ఈ వ్యాప్తి చెందే గుణం 30-50 శాతం ఉంటుందని ఇంగ్లాండ్ పబ్లిక్ హెల్త్ నిర్వహించిన పరిశోధన చెబుతోంది.
అక్టోబరులో సౌత్ ఆఫ్రికా వేరియంట్ కనిపించింది. ఈ స్పైక్ ప్రోటీన్‌లో ప్రముఖమైన మార్పులు కనిపించాయి. ఆందోళన కలిగించే మార్పులతో యూకే వేరియంట్‌తో కొన్ని కేసులు వచ్చినట్లు నిపుణులు తెలిపారు.
అందులో కీలకమైన E484K అనే మ్యుటేషన్ ఉంది. ఇది వైరస్‌తో పోరాడగలిగే రోగ నిరోధక శక్తి, యాంటీ బాడీల మీద దాడి చేస్తుంది. జూలైలో కనిపించిన బ్రెజిల్ వేరియంట్‌లో కూడా E484K మ్యూటేషన్ కూడా ఉంది.

ఫొటో సోర్స్, Getty Images
వ్యాక్సీన్లు ఇంకా పని చేస్తాయా?
మొదటిసారి వెలుగు చూసిన కరోనావైరస్ వేరియంట్‌కు అనుగుణంగా ప్రస్తుతం వ్యాక్సీన్ల తయారీ జరిగింది. కానీ, పూర్తిగా కాకపోయినా ఈ టీకాలు కొంత వరకు పని చేస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
గతంలో ఒకసారి వైరస్ సోకిన వారిలో తయారయిన యాంటీబాడీలపై కూడా బ్రెజిల్ వేరియంట్ దాడి చేస్తోంది. కానీ, ఈ కొత్త వేరియంట్‌లపై ఫైజర్ వ్యాక్సీన్ బాగా పని చేస్తోందని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి. అయితే ఈ వైరస్ ప్రభావం కాస్త తక్కువగానే ఉంది.
త్వరలో ఆమోదం పొందనున్న నోవావాక్స్ , జాన్సన్ అండ్ జాన్సన్ తయారు చేసిన వ్యాక్సీన్లు కొంత వరకు ఈ కొత్త వేరియంట్‌లకు రక్షణ కల్పిస్తాయని చెబుతున్నారు.
కొత్తగా వచ్చిన యూకే వేరియంట్ నుంచి ఆక్స్‌ఫర్డ్ ఆస్ట్రాజెనెకా వ్యాక్సీన్ రక్షణ కల్పిస్తుందని ఆ వ్యాక్సీన్ తయార బృందం విడుదల చేసిన సమాచారంలో ఉంది. అయితే ఇది సౌతాఫ్రికా వేరియంట్‌కి పని చేయడం లేదు.
కానీ, ఇది తీవ్రమైన అనారోగ్యం నుంచి కొంత వరకు రక్షిస్తుందని చెబుతున్నారు. అయితే, ఈ వేరియంట్ కి మోడెర్నా వ్యాక్సీన్ పని చేయవచ్చని కొన్ని ఫలితాలు చెబుతున్నాయి. అయితే, ఇది దీర్ఘకాలికంగా పని చేయకపోవచ్చు.
ప్రస్తుతం ఉన్న వేరియంట్‌లకు భిన్నంగా ఉండే వేరియంట్‌లు కూడా భవిష్యత్తులో తలెత్తవచ్చు. అయితే, వాటి పై పోరాడేందుకు కొన్ని వారాల్లో లేదంటే నెలల్లో వ్యాక్సీన్‌ను కొంత వరకు మార్చవచ్చని నిపుణులు చెబుతున్నారు.
ఫ్లూ వైరస్‌లో వచ్చే మార్పులను ఎదుర్కోవడానికి ప్రతి సంవత్సరం కొత్తగా టీకాలో మార్పులు చేసినట్లే కరోనా వైరస్ విషయంలో కూడా జరగవచ్చు.

ఫొటో సోర్స్, Getty Images
ఏమి చేయవచ్చు?
మరిన్ని కొత్త వేరియంట్లు రావచ్చు. ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు వీటి పై దృష్టి పెట్టి, ముఖ్యమైన వాటిపై అధ్యయనం చేస్తున్నారు. నిపుణులు కరోనావైరస్ వ్యాక్సీన్‌లను అప్‌డేట్ కూడా చేస్తున్నారు.
భవిష్యత్తులో పుట్టుకొచ్చే వేరియంట్‌లకు వ్యాక్సీన్‌లు తయారు చేసేందుకు బయో ఫార్మాస్యూటికల్ కంపెనీ క్యూర్ వేక్‌తో ఒక ఒప్పందం కుదుర్చుకున్నట్లు ప్రకటించింది. వీటి కోసం ఇప్పటికే 5 కోట్ల డోసులను ఆర్డర్ చేసింది.
ఇవి కూడా చదవండి:
- మహాత్మా గాంధీ: పాకిస్తాన్‌కు రూ.55 కోట్లు ఇవ్వాలన్న డిమాండే హత్యకు కారణమా?
- మెహులీ ఘోష్: జాతరలో బెలూన్లు కాల్చిన ఈ షూటర్ గురి ఇప్పుడు ఒలింపిక్స్‌పై
- గీతా గోపీనాథ్‌పై అమితాబ్ బచ్చన్ ప్రశంసల మీద ఎందుకు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి?
- ఆంధ్రప్రదేశ్: హిందూ దేవతల విగ్రహాలు ధ్వంసం చేశానన్న ప్రవీణ్ చక్రవర్తి అసలు ఎవరు?
- వైట్ టైగర్: హాలీవుడ్ సినిమాల్లో అసలైన భారతదేశాన్ని చూపించేదెప్పుడు
- కాసిం సులేమానీ హత్య ఐఎస్‌కు వరంగా మారుతుందా
- మగాళ్లు రేప్ ఎందుకు చేస్తారు? అలాంటి ఆలోచనలు వారికి ఎందుకు వస్తాయి?
- సుభాష్ చంద్రబోస్ 'ద గ్రేట్ ఎస్కేప్': బ్రిటిష్ వాళ్ల కళ్లుగప్పి నేతాజీ దేశం ఎలా దాటారు?
- కోడి రామ్మూర్తి నాయుడు: ‘కలియుగ భీముడు’గా పేరు తెచ్చుకున్న ఈ తెలుగు వీరుడి కథేంటి?
- సెక్స్ అపోహలు: లైంగిక భాగస్వాములు ఎవరికి ఎక్కువగా ఉంటారు... పరిశోధనలు ఏం చెబుతున్నాయి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








