ఆస్ట్రేలియా: సరస్సులో ఈదుతుంటే మొసలి పట్టుకుంది.. చివరకు దాని దవడలు చీల్చి బయటపడ్డాడు

ఉత్తర ఆస్ట్రేలియాలో ఒక వ్యక్తి మొసలి నోట్లో చిక్కుకున్నారు. ఆ మొసలి ఆయన తలను గట్టిగా నోటితో పట్టింది.
44 ఏళ్ల ఆ వ్యక్తి గురువారం క్వీన్స్‌ల్యాండ్‌లోని లేక్ ప్లాసిడ్‌లో ఈత కొడుతుండగా సుమారు ఆరున్నర అడుగుల పొడవున్న మొసలి ఆయనపై దాడి చేసింది.
వెంటనే ఆయన తన రెండు చేతులతో బలంగా మొసలి నోరు తెరవడానికి ప్రయత్నించారు.
దాని రెండు దవడలను చీల్చి పట్టుకుని తల విడిపించుకున్నారు. చేతులు వెనక్కు లాక్కునే లోపల మొసలి నోరు మూసేసింది. దాంతో ఆయన చూపుడువేలు మొసలి దంతాల మధ్య నలిగిపోయింది.
మొసలి నుంచీ తప్పించుకున్న తరువాత ఆయన చాలా దూరం ఈదుకుంటూ వచ్చి ఒడ్డుకు చేరుకున్నారు.
ఆసుపత్రికి చేరుకున్న తరువాత ఈ విషయాలన్నీ ఆయనే తమకు చెప్పారని క్రిటికల్ కేర్ డాక్టర్ పాల్ స్వీనే తెలిపారు.
ఆయనకు తల, భుజం, చేతుల మీద తేలికపాటి గాయాలయ్యాయని.. తల పైన, చేతుల మీద ఆ మొసలి తన దంతాలతో చీల్చిన గుర్తులు ఉన్నాయని డాక్టర్లు తెలిపారు.
పెద్ద ప్రమాదం ఏమీ జరగకుండా ఆ వ్యక్తి తప్పించుకోవడం చాలా అదృష్టమని అధికారులు అన్నారు.

అంత పోరాటం చేసి, గాయాలయిన తరువాత కూడా ఆ వ్యక్తి చాలా ప్రశాంతంగా ఉన్నారని పాల్ స్వీనే తెలిపారు.
తరువాత ఆయన్ను కైర్న్స్ ఆసుపత్రికి తరలించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని అక్కడి డాక్టర్లు చెప్పారు.
"ఆ వ్యక్తి గత ఎనిమిది ఏళ్లుగా వారానికి మూడుసార్లు ఆ చెరువులో స్విమ్మింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారని, ఇంత జరిగిన తరువాత కూడా ఆయన ఎక్కడకు వెళ్లేందుకు సాహసించినా ఆశ్చర్యపోనక్కర్లేదని" పాల్ స్వీనే అన్నారు.
లేక్ ప్లాసిడ్‌లో, కైర్న్స్ ప్రాంతంలో మొసళ్ల సంచారం ఎక్కువగా ఉంటుందని, అక్కడకు వెళ్లినవాళ్లు అప్రమత్తంగా ఉండాలని క్వీన్స్‌ల్యాండ్ పర్యావరణ శాఖ హెచ్చరించింది.
మొసలి దాడి గురించి మరిన్ని వివరాలు తెలుసుకునేందు తమ అధికారులను అక్కడకు పంపామని ఈ శాఖ తెలిపింది.
ఉత్తర క్వీన్స్‌ల్యాండ్ నీటి ప్రాంతాల్లో చేపలు పట్టడానికి వెళ్లేవారు కూడా ఒడ్డునుంచి దూరం నిలబడాలని, మొసళ్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని పర్యావరణ శాఖ హెచ్చరించింది.
ఇవి కూడా చదవండి:
- మదనపల్లె హత్యలు: ‘కాళికనని చెబుతూ.. నాలుక కోసి..
- మెహులీ ఘోష్: జాతరలో బెలూన్లు కాల్చిన ఈ షూటర్ గురి ఇప్పుడు ఒలింపిక్స్‌పై
- గీతా గోపీనాథ్‌పై అమితాబ్ బచ్చన్ ప్రశంసల మీద ఎందుకు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి?
- ఆంధ్రప్రదేశ్: హిందూ దేవతల విగ్రహాలు ధ్వంసం చేశానన్న ప్రవీణ్ చక్రవర్తి అసలు ఎవరు?
- వైట్ టైగర్: హాలీవుడ్ సినిమాల్లో అసలైన భారతదేశాన్ని చూపించేదెప్పుడు
- కాసిం సులేమానీ హత్య ఐఎస్‌కు వరంగా మారుతుందా
- మగాళ్లు రేప్ ఎందుకు చేస్తారు? అలాంటి ఆలోచనలు వారికి ఎందుకు వస్తాయి?
- సుభాష్ చంద్రబోస్ 'ద గ్రేట్ ఎస్కేప్': బ్రిటిష్ వాళ్ల కళ్లుగప్పి నేతాజీ దేశం ఎలా దాటారు?
- ISWOTY - సుశ్రీ దివ్యదర్శిని ప్రధాన్: ఒడిశా నుంచి దూసుకొచ్చిన ఆఫ్-స్పిన్నర్
- సూర్యుడ్ని కోల్పోయిన బీచ్.. ఇక్కడ పట్టపగలైనా చలి, చీకటే...
- బంగారం స్మగ్లింగ్‌లో భారత్ గుత్తాధిపత్యానికి తెరదించిన పాకిస్తాన్ 'గోల్డ్ కింగ్'
- అర్నబ్ గోస్వామి వాట్సాప్ చాట్ లీక్ వివాదం.. ఇమ్రాన్ ఖాన్ వరుస ట్వీట్లు.. మోదీపై ఆరోపణలు
- సింగపూర్: కోట్లు ఇస్తామన్నా ఈ రెండు ఇళ్ల యజమానులు కదలటం లేదు.. ఎందుకు?
- కోడి రామ్మూర్తి నాయుడు: ‘కలియుగ భీముడు’గా పేరు తెచ్చుకున్న ఈ తెలుగు వీరుడి కథేంటి?
- సెక్స్ అపోహలు: లైంగిక భాగస్వాములు ఎవరికి ఎక్కువగా ఉంటారు... పరిశోధనలు ఏం చెబుతున్నాయి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








