మెసెంజర్ రూమ్స్: ఫేస్‌బుక్ కొత్త వీడియో కాల్‌లో ఒకేసారి 50 మంది మాట్లాడుకోవచ్చు

ఫొటో సోర్స్, copyrightFACEBOOK
సోషల్ మీడియా వీడియో కాల్స్‌కి డిమాండ్ పెరగటంతో ఫేస్‌బుక్.. తన వాట్సాప్, మెసెంజర్ యాప్‌లతో పాటు ప్రధాన ఫేస్‌బుక్ యాప్‌కు కూడా పెద్ద సంఖ్యలో సరికొత్త వీడియో కాలింగ్ ఫీచర్లను జోడించింది.
కొత్తగా చేర్చిన ‘మెసెంజర్ రూమ్స్’ ఫీచర్ ద్వారా జనం గ్రూప్ వీడియో చాట్ చేసుకోవచ్చు. అందులో 50 మంది చేరొచ్చు.
ఈ ఫీచర్లను తమ ప్రణాళిక కన్నా ముందుగానే విడుదల చేశామని, కరోనావైరస్ లాక్‌డౌన్ అందుకు కారణమని ఫేస్‌బుక్ సంస్థ బీబీసీతో చెప్పింది.
గ్రూప్ చాట్‌లోకి అవాంఛిత అతిథులు వచ్చిపడకుండా నిరోధించటానికి క్రిప్టోగ్రాఫర్లతో కలిసి పనిచేసినట్లు తెలిపింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
ఈ కొత్త ఫీచర్లు బ్రిటన్‌లో శుక్రవారం నాడు కొందరు యూజర్లకు అందుబాటులోకి వచ్చినా.. ఫేస్‌బుక్ ఖాతాదారులందరికీ చేరటానికి కొన్ని వారాల సమయం పడుతుంది.
కరోనావైరస్ మహమ్మారి సమయంలో వీడియో కాలింగ్ సేవలు విపరీతంగా పెరిగాయి. కరోనావైరస్ ప్రభావం తీవ్రంగా ప్రాంతాల్లో మెసెంజర్‌లో వీడియో కాలింగ్ గత ఏడాది కన్నా రెట్టింపయిందని ఫేస్‌బుక్ తెలిపింది.
ప్రత్యర్థి యాప్ ‘జూమ్’ వినియోగదారులు ఏప్రిల్ నెలలోనే 30 కోట్ల మంది పెరిగారు. అమెరికాలో మార్చి ప్రారంభంలో మొదటిసారిగా ప్రధాన నగరాల్లో జనం ఇళ్లలోనే ఉండాలని ఆదేశాలు ఇచ్చినపుడు హౌస్‌పార్టీ యాప్‌ను 20 లక్షలకు పైగా డౌన్‌లోడ్ చేసుకున్నారు.
మైక్రోసాఫ్ట్ టీమ్స్ వంటి కొన్ని యాప్‌లు.. ఈ మహమ్మారి సమయంలో ప్రీమియం ఫీచర్లను ఉచితంగా అందిస్తున్నట్లు ప్రకటించాయి.
ఫేస్‌బుక్ సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ ఒక బ్లాగ్ పోస్టు ద్వారా ఫేస్‌బుక్ కొత్త మెసెంజర్ రూమ్స్‌ను పరిచయం చేశారు.

ఫొటో సోర్స్, FACEBOOK
కొత్త ఫీచర్లు...
హౌస్‌పార్టీ తరహాలో మెసెంజర్ రూమ్స్ కూడా జనం విడివిడిగా రూమ్ వీడియో కాల్‌లోకి వచ్చి, వెళ్లటానికి వీలుంటుంది.
‘‘భౌతిక ప్రపంచంలో అలా వెళుతూ జనంతో కలవటానికి అవకాశం ఉంటుంది. అటువంటి అవకాశం మెసెంజర్ రూమ్స్‌లో ఉంచాం. ఇటువంటి ఫీచర్ మరే యాప్‌లో లేదు’’ అని ఫేస్‌బుక్ న్యూస్‌ఫీడ్ వైస్ ప్రెసిడెంట్ జాన్ హెజిమాన్ పేర్కొన్నారు.
ఈ రూమ్‌లను ఫేస్‌బుక్ మెసెంజర్ ద్వారా ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ ఫీచర్‌ను ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్‌లకు కూడా త్వరలో జోడించాలన్నది ప్రణాళికగా ఆ సంస్థ చెప్పింది.
మెసెంజర్ రూమ్‌లను క్రియేట్ చేసే వారు ఆ రూమ్‌లను ప్రైవేటుగా ఉంచుకోవచ్చు. అవాంఛిత పార్టిసిపెంట్లను బ్లాక్ చేయవచ్చు. ఫేస్‌బుక్‌లో లేని వారికి ఇన్విటేషన్లు పంపించవచ్చు.
పార్టిసిపెంట్లు ఆగ్‌మెంటెడ్ రియాలిటీ ఫిల్టర్లను ఉపయోగించి, తమ బ్యాక్‌గ్రౌండ్లను అప్పటికప్పుడు మార్చేసుకోవచ్చు.
ఇక అందరికీ కనిపించే రూమ్‌ల జాబితా ఫేస్‌బుక్ న్యూస్ ఫీడ్ అగ్రభాగంలో కనిపిస్తుంది.
ఈ సర్వీసును ఫేస్‌బుక్ మెసెంజర్‌ను అత్యధికంగా ఉపయోగించే అర్జెంటీనా, పోలండ్‌లలో పరీక్షించారు. పరీక్షించే సమయంలో ఈ రూమ్‌లు ఏక కాలంలో 17 నుంచి 20 మంది పార్టిసిపెంట్లను చేర్చుకోగలిగాయి. ఈ సంఖ్య రాబోయే వారాల్లో 50 మంది వరకూ పెరుగుతుందని ఫేస్‌బుక్ చెప్పింది.

- కరోనావైరస్- మీరు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు
- కరోనావైరస్ లక్షణాలు ఏంటి? ఎలా సోకుతుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- కరోనావైరస్ ఇన్ఫెక్షన్ సోకకుండా ఉండడానికి పాటించాల్సిన జాగ్రత్తలు... ఆరు మ్యాపుల్లో
- కరోనావైరస్కు వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది... దాన్ని ఎలా తయారు చేస్తారు?
- కరోనావైరస్: సోషల్ మీడియాలో తప్పుడు సమాచారాన్ని ఎలా గుర్తించాలి?
- కరోనావైరస్: ఒకసారి వైరస్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ వస్తుందా?
- కరోనావైరస్; ఎండ వేడి ఎక్కువగా ఉంటే వైరస్ నశిస్తుందా?
- కరోనావైరస్: వస్తువులు, ఇతర ఉపరితలాల మీద, గాలిలో ఈ వైరస్ ఎంత కాలం సజీవంగా ఉంటుంది?
- కరోనావైరస్ మన శరీరం మీద ఎలా దాడి చేస్తుంది? ఇది సోకిన వారిలో కొందరు చనిపోవడానికి కారణం ఏమిటి
- మాస్క్‌లు వైరస్ల వ్యాప్తిని అడ్డుకోగలవా
- కరోనావైరస్: ఇంక్యుబేషన్ పీరియడ్ ఏమిటి? వైరస్ - ఫ్లూ మధ్య తేడా ఏమిటి?
- సెక్స్ ద్వారా కరోనావైరస్ సోకుతుందా? కీలకమైన 8 ప్రశ్నలు, సమాధానాలు

‘జూమ్‌బాంబింగ్’
ఈ ఉత్పత్తిని అభివృద్ధి చేసేటపుపడు తమ పోటీదారుల నుంచి తాము నేర్చుకున్నామని ఫేస్‌బుక్ అంగీకరించింది.
జూమ్ యాప్ వీడియో కాల్స్‌లో ‘జూంబాంబింగ్’ – అంటే ఆహ్వానం లేని గెస్టులు చొరబడటం, అసభ్యంగా మాట్లాడటం, పోర్నోగ్రఫీ షేర్ చేయటం వంటివి - జరుగుతుండటంతో దానిని నిరోధించటానికి ఆ సంస్థ కృషి చేస్తోంది.
ఈ సమస్యను నివారించటానికి ఫేస్‌బుక్ ప్రధాన్యమిచ్చిందని మెసెంజర్ ప్రొడక్ట్ డైరెక్టర్ స్టెఫనీ టియాని తెలిపారు.
మెసెంజర్ రూమ్స్‌ను హ్యాకర్లు ఛేదించకుండా పటిష్టంగా తయారుచేయటానికి క్రిప్టోగ్రాఫర్లతో కలిసి పనిచేసినట్లు చెప్పారు.
లాంచ్ చేసే సమయంలో ఈ వీడియో చాట్లకు ఎండ్-టు-ఎండ్ ఎన్‌స్క్రిప్షన్ ఉండదని.. కానీ భవిష్యత్తులో ఎన్‌స్క్రిప్షన్ జోడించాలని ఆశిస్తున్నామని ఆయన వివరించారు.
తన ప్లాట్‌ఫామ్‌ల మీద వీడియో కాల్స్‌ను వినటం కానీ, పర్యవేక్షించటం కానీ తాము చేయబోమని ఫేస్‌బుక్ ఉద్ఘాటించింది.
అయితే.. యూజర్లు ఒక మెసెంజర్ రూమ్‌ను తెరిచినపుడు సంబంధిత సమాచారాన్ని ఫేస్‌బుక్ సమీకరిస్తుంది. ఆ సమాచారాన్ని.. ఈ ఉత్పత్తిని, పనితీరును మెరుగుపరచటానికి ఉపయోగిస్తామని సంస్థ పేర్కొంది.
ప్రకటించిన ఫీచర్లలో ఇంకొన్ని:
- వాట్సాప్ వీడియో కాల్‌కు ప్రస్తుతం నలుగురిని యాడ్ చేసే వీలుంది. దీనిని ఎనిమిది మందికి పెంచారు.
- ఫేస్‌బుక్ లైవ్ ప్రసారాల్లో ‘లైవ్ విత్’ ఫీచర్‌ను తిరిగి చేర్చారు. దీని ద్వారా లైవ్ స్ట్రీమ్ చేస్తున్న ఒక యూజర్, మరో యూజర్‌ను తనతో పాటు లైవ్ షోలో చేరటానికి ఆహ్వానించవచ్చు.
- ఇన్‌స్టాగ్రామ్ లైవ్ వీడియోలను డెస్క్‌టాప్ కంప్యూటర్లలో వీక్షించే ఏర్పాటును కూడా చేర్చారు.
ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of YouTube ముగిసింది
కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104


ఇవి కూడా చదవండి:
- కోవిడ్-19 విషయంలో కొందరు నైజీరియన్లు తెగ సంబరపడుతున్నారు.. ఎందుకో తెలుసా
- కరోనావైరస్: మూలికా వైద్యానికి వైరస్ లొంగుతుందా? టీ తాగితే రాకుండా ఉంటుందా?
- ఆంధ్రప్రదేశ్: 'పంట బాగా పండినా, లాక్‌డౌన్ నాన్నను మాకు దూరం చేసింది'
- కరోనావైరస్: తెలుగు రాష్ట్రాల లాక్‌డౌన్ సమయంలో తండ్రి అయిన ఒక కొడుకు కథ
- ‘రంజాన్ మాసంలో ముస్లింలు ఇళ్లలోనే ప్రార్థనలు చేసుకోవాలి’ : మతపెద్దల మార్గదర్శకాలు
- కరోనావైరస్: లాక్‌డౌన్‌తో దేశంలో రోజూ ఎన్ని వేల కోట్ల నష్టం వస్తోంది? ఎన్ని ఉద్యోగాలు పోతాయి?
- ఏపీలో క్వారంటైన్, ఐసోలేషన్ కేంద్రాల్లో ఏం జరుగుతోంది? డిశ్ఛార్జ్ అయిన వాళ్లు ఏం చెబుతున్నారు?
- కరోనావైరస్: రాయలసీమలో ఈ మహమ్మారి ఎలా వ్యాపిస్తోంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








