తాలిబాన్లు అఫ్గానిస్తాన్‌లో శాంతి స్థాపన కోసం అమెరికాతో ఒప్పందం చేసుకున్న తరువాత ఏం చేయబోతున్నారు?

ఫొటో సోర్స్, AFP
- రచయిత, సికందర్ కిర్మానీ
- హోదా, బీబీసీ న్యూస్ కాబుల్
అమెరికా, అఫ్గానిస్తాన్, తాలిబాన్ అధికారులు శనివారం నాడు దోహాలో కుదిరిన ఒప్పందాన్ని "శాంతి ఒప్పందం" అని పిలవకుండా చాలా జాగ్రత్తగా వ్యవహరించారు. అయితే, ఈ ఒప్పందం దిశగా అడుగులు వేసేందుకు వారం రోజులుగా "హింసను తగ్గించేందుకు" చేసిన ప్రయత్నాలు లేదా ఒక రకమైన పాక్షిక ఒడంబడిక మూలంగా అఫ్గానిస్తాన్‌లో భవిష్యత్తు పట్ల ఆశలు పెరుగుతున్న సూచనలు కనిపిస్తున్నాయి.
ఈ ఒప్పందానికి ఎందుకు ఇన్నేళ్ళు పట్టింది?
అఫ్గానిస్తాన్‌లో అధిక భూభాగాన్ని తాలిబాన్లు తమ అధీనంలోకి తెచ్చుకోవడం, ఆ ప్రయత్నాలను నిరంతర కొనసాగించడం వల్లే ఇక్కడ యుద్ధ వాతారవరణం కొనసాగుతూ వచ్చింది. అయితే, ఈ దేశంలోని ప్రధాన నగరాలపై మాత్రం తాలిబాన్లు తమ ప్రభావం చూపలేకపోయారు.
అదీగాక కొన్నేళ్లుగా అటు తాలిబన్ నాయకత్వానికి , అటు అమెరికా సైన్యానికి యుద్ధం ద్వారా కచ్చితంగా ఏ ఒక్కరూ పూర్తిగా పైచేయి సాధించే పరిస్థితి లేదన్న తత్వం బోధపడుతూ వచ్చింది .
అదే సమయంలో, అఫ్గాన్ గడ్డపైనుంచి తమ సైన్యాన్ని వెనక్కి రప్పించాలనుకుంటున్నానంటూ అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ తన మనసులో మాటను బయటపెట్టారు.
2018లో అమెరికా ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయం శాంతి స్థాపన చర్చల్లో అడుగు ముందుకు పడటానికి ప్రధాన కారణం.
నిజానికి అప్పటి వరకు తాలిబన్లు తమ తిరుగుబాటును ఏ మాత్రం గుర్తించని అప్ఘానిస్థాన్ ప్రభుత్వంతో మొదట చర్చలు జరిపాలన్నది అమెరికా విధానం. కానీ, ఆ తర్వాత అగ్ర రాజ్యం తన మనసు మార్చుకుంది.
తాజా ఒప్పందం మిలిటెంట్లకు అప్గాన్ ప్రభుత్వం సహా ఇతర రాజకీయ పార్టీల నేతలకు మధ్య నేరుగా మరింత విస్తృతమైన చర్చలు జరగడానికి ఆస్కారం కల్పించింది .

ఫొటో సోర్స్, Getty Images
మున్ముందు మరిన్ని సవాళ్లు
అయితే ఆ చర్చలు మరిన్ని సవాళ్లతో కూడుకొని ఉంటాయి. తాలిబన్ల విజన్ అయిన ఇస్లామిక్ ఏమిరేట్ అన్న భావనకు అలాగే 2001లో ఏర్పాటు చేసిన ప్రజాస్వామ్య ఆధునిక అఫ్గానిస్తాన్ అన్న భావనలకు మధ్య రెండు వర్గాలు ఎంతో కొంత రాజీ ధోరణి అవలంబించాల్సినవసరం ఉంటుంది.
ఇక మహిళల హక్కుల విషయంలోనూ, ప్రజాస్వామ్యం విషయంలోనూ తాలిబన్ల పంథా ఏంటన్న ప్రశ్నలకు అఫ్గానిస్తాన్ అంతర్గత చర్చలు మాత్రమే సమాధానం చెప్పగలవు.
ఇప్పటి వరకు ఈ విషయంలో తాలిబన్లు కావాలనే అనిశ్చితిని కొనసాగిస్తూ వచ్చారు . అంతేకాదు చర్చలు ప్రారంభమయ్యే ముందు మరిన్ని అడ్డంకులు కూడా ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
జైళ్లలో మగ్గుతున్న తమ 5 వేల మంది ఖైదీలను చర్చలు మొదలు కావడానికి ముందే విడుదల చెయ్యాలని తాలిబన్లు కోరుతున్నారు. అయితే, అఫ్గాన్ ప్రభుత్వం మాత్రం తాలిబన్లను కాల్పుల విరమణకు ఒప్పించడంలో ఆ ఖైదీలను పావులా వాడుకోవాలని భావిస్తోంది.

ఫొటో సోర్స్, Getty Images
ఇక అధ్యక్ష ఎన్నికల ఫలితాలపై అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ, ప్రత్యర్థి అబ్దుల్లాల మధ్య వివాదం కొనసాగుతునే ఉంది . ఈ ఎన్నికల్లో అష్రఫ్ భారీ ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారన్నది అబ్దుల్లా ప్రధాన ఆరోపణ.
ఈ రాజకీయ అనిశ్చితి నేపధ్యంలో తాలిబన్లతో చర్చల సమయంలో అంతర్జాతీయ పరిశీలకులు కోరినట్టు అన్ని వర్గాలతో కూడిన చర్చల బృందాన్ని ఏర్పాటు చెయ్యడం అంత తేలికైన విషయమేం కాదు.
తాలిబన్లు తమ ఒప్పందానికి కట్టుబడకపోతే ఏం జరుగుతుంది ?
ఒక వేళ ఇంట్రా-అఫ్గాన్ చర్చలు ప్రారంభమైనప్పటికీ అవి కొలిక్కి వచ్చేసరికి ఏళ్లు పడుతుందని ఓ అఫ్గాని అధికారి నాతో చెప్పారు . కానీ తాలిబన్లు తాజా ఒప్పందానికి కట్టుబడి ఉంటే 14 నెలల్లోనే అమెరికా తన బలగాలను ఉపసంహరించుకుంటామని అమెరికా చెబుతోంది.
కానీ ఒక వేళ తాలిబన్లు హామీ ఇచ్చినట్టు జరగకపోతే అమెరికా బలగాలు అక్కడే కొనసాగుతాయా.. లేదా అన్న విషయంలో ఇప్పటికిప్పుడైతే ఎలాంటి స్పష్టత లేదు .
బలగాలను వెనక్కి రప్పించడం అన్నది నియమాలకు లోబడే జరుగుతుందన్న సంగతిని అఫ్గాన్ అధికారులు నొక్కి చెబుతున్నారు.
అయితే అఫ్గాన్ అంతర్గత చర్చల ముందు 'ఉపసంహరణ' అన్నది ఆరంభం మాత్రమేనని ఇదే ముగింపు కాదని ఓ అఫ్గాన్ దౌత్యాధికారి నాతో చెప్పారు.
ఒక వేళ అమెరికా తన బలగాలను ఉపసంహరించుంటే వెంటనే తాలిబన్లు తిరిగి తమ పాత వాసనల్ని బయట పెడతారని... అప్పుడు అఫ్గాన్ బలగాలు మరింత ప్రమాదంలో చిక్కుకుంటాయన్న భయాన్ని ఆయన వ్యక్తం చేశారు.

ఫొటో సోర్స్, Reuters
చూస్తుంటే ప్రస్తుతం ప్రకటించిన రాయతీల పట్ల తాలిబన్లు సంతృప్తి ఉన్నట్లు కనపించడం లేదని, ఈ ఒప్పందాన్ని తాలిబన్ మద్దతుదారులు ఒక విజయంగా భావిస్తున్నట్టు లేదని కొందరు విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
ప్రస్తుతం తాలిబన్లు అంతర్జాతీయంగా గుర్తింపును, చట్టబద్ధతను కోరుకుంటున్నారు. దోహాలో జరిగిన కార్యక్రమం ద్వారా ఎంతో కొంత అది నేరవెరినట్టే. అంతేకాదు తాము అనుకున్న లక్ష్యాలను చేరుకునేందుకు చర్చలు మంచి అవకాశాన్నిచ్చాయని వారు భావించవచ్చు.
నిజానికి దేశంలో హింస తగ్గాలన్నది సగటు అఫ్గానీ పౌరుల ఆశ. సాధారణంగా అఫ్గాన్లో వసంత కాలం ఆరంభం యుద్ధ వాతావరణాన్ని మోసుకొస్తుంది. మరి ఈ సారి కూడా అదే జరగనుందా..? లేక ఇంకేదైనానా ..? రానున్న మరి కొద్ది వారాల్లో తెలియనుంది.

ఇవి కూడా చదవండి
- అఫ్ఘానిస్తాన్: తాలిబాన్లతో చర్చలు జరిపిన మహిళ ఫాజియా కూఫీ కథ ఇదీ...
- దిల్లీ హింస: సరిహద్దులు దాటి.. అల్లరి మూకను ఎదిరించి.. ఎన్నో ప్రాణాలు కాపాడిన పోలీస్ హీరో నీరజ్ జాదౌన్
- దిల్లీ హింస: అల్లర్లు చెలరేగిన వీధుల్లో ఐదు గంటల ప్రత్యక్ష అనుభవం ఇది...
- ఏనుగు ఈ స్టార్ హోటల్‌కు రెగ్యులర్ కస్టమర్.. చూడండి ఏం చేస్తోందో
- బాంబే డక్: ‘భారతదేశ చేపల్లో అద్భుతమైన చేప’
- అండర్-19 ప్రపంచకప్ సెమీస్ హీరో యశస్వి జైశ్వాల్... పగలంతా ప్రాక్టీస్, రాత్రి పానీపూరీ అమ్మకం
- పిల్లల్ని కనడానికి సరైన వయసు ఏది?
- కరోనావైరస్ ఎఫెక్ట్: పడిపోతున్న బీర్ల అమ్మకాలు... డెటాల్‌కు పెరుగుతున్న గిరాకీ
- ఒక్క మిడత ‘మహమ్మారి'లా ఎలా మారుతుంది
- వుహాన్ డైరీ: మరణించడానికి మూడు గంటల ముందు ఆయనకు హాస్పిటల్ బెడ్ దొరికింది
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









