ఏనుగు ఈ స్టార్ హోటల్‌కు రెగ్యులర్ కస్టమర్.. చూడండి ఏం చేస్తోందో

ఫొటో సోర్స్, Jetwing
శ్రీలంక చూడ్డానికి వెళ్లే చాలామంది పర్యటకులు.. అక్కడ ఏనుగును చూడాలని కోరుకుంటుంటారు.
కొందరు మాత్రం లగ్జరీ హోటల్‌లో ఉండి, గది తలుపు తెరవగానే కారిడార్లో ఏనుగు తిరగాలని ఆశిస్తారు.
మరీ అతిగా ఆశిస్తున్నారు అనుకుంటున్నారా. శ్రీలంకలోని జెట్‌వింగ్ యాలా హోటల్లో తరచూ జరిగేది అదే మరి.
స్థానికంగా నట్ట కోట (కురచ తోక) అని పిలిచే ఏనుగు ఈ స్టార్ హోటల్‌లో కలియదిరుగుతూ, కనిపించిన వస్తువుల్ని తన తొండంతో కదుపుతూ ఉంది. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అయ్యింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
చాలామంది ఆశ్చర్యపోతూ ఈ వీడియోను షేర్ చేశారు. అయితే, యాలా జాతీయ పార్కు సమీపంలో ఉన్న ఈ హోటల్ సిబ్బంది మాత్రం ఇదంతా తమకు మామూలే అంటున్నారు. ఈ ఏనుగు 2013 నుంచి 'మా విశ్వసనీయమైన కస్టమర్' అని చెబుతున్నారు.
''మొదట్లో ఏడాదికి కొన్ని సార్లు మాత్రమే నట్ట కోట మా హోటల్‌కి వచ్చేవాడు.. సీజనల్ విజిటర్‌లాగా. తర్వాత పొదల్లోకి వెళ్లిపోయేవాడు. ఇప్పుడు మాత్రం బీచ్ పక్కన ఉన్న మిగతా రిసార్టులను కూడా తరచూ సందర్శిస్తున్నాడు'' అని జెట్‌వింగ్ హోటల్ అధికార ప్రతినిధి బీబీసీతో అన్నారు.


''కొన్నేళ్ల కిందట మా హోటల్‌లో శాశ్వతంగా మకాం పెట్టాడు. మేం కూడా నట్ట కోటను ఇబ్బంది పెట్టలేదు. చెట్ల నీడలో పడుకునేవాడు, హోటల్ మొత్తం తిరిగేవాడు'' అని ఆ ప్రతినిధి తెలిపారు.

ఫొటో సోర్స్, facebook/JetwingYala
అయితే, నట్ట కోట ఎల్లప్పుడూ ఇంత మంచిగా ఉండేవాడు కాదు. కార్లలోంచి పండ్లను, కిచెన్‌లో నుంచి ఆహార పదార్థాలను దొంగిలించేవాడు.
అయితే, తాము అతడిని ఎప్పుడూ కొట్టలేదని, ఇలాంటి 'చిలిపి పనులు' చేసినా వదిలేసేవాళ్లమని తెలిపారు.
హోటల్‌కు వచ్చే పర్యటకులకు మాత్రం.. 'మీ పండ్లు, కూరగాయలకు మీరే బాధ్యత' అని చెప్పేవారు.

ఫొటో సోర్స్, facebook/JetwingYala
ఇప్పుడు కిచెన్ తలుపుకు అడ్డంగా ఒక విద్యుత్ కంచె వేశారు. అలా అక్కడున్న ఆహార పదార్థాల జోలికి వెళ్లకుండా ఏనుగును అడ్డుకుంటున్నారు.
''ప్రశాంతంగా ఉండే నట్ట కోట వైఖరి అతిథులను కూడా అలరిస్తుంటుంది. అతని వీడియోలను తీస్తూ వాళ్లు కూడా ఆనందిస్తుంటారు'' అని హోటల్ చెబుతోంది.
ఇవి కూడా చదవండి:
- అస్సాం: ‘అడవుల్ని ఆక్రమిస్తున్న టీ తోటలు’.. మనుషుల్ని చంపుతున్న ఏనుగులు
- ‘మనుషులపై ఏనుగులకు తీవ్రంగా పెరుగుతున్న కోపం’
- ఏనుగుల దెబ్బకు భయపడి చెట్లపై బతుకుతున్నారు
- సింహాలు, ఖడ్గమృగాలు, ఏనుగుల మధ్యలో క్రికెట్ ఆడదామా...
- ఆంధ్రప్రదేశ్‌కు మూడు రాజధానులు: విశాఖపట్నంలో సచివాలయం, రాజ్‌భవన్.. అమరావతిలో అసెంబ్లీ.. కర్నూలులో హైకోర్టు
- ఆంధ్రా, తెలంగాణల్లో ఎన్ఆర్సీ, ఎన్పీఆర్ అమలు చేస్తారా? ముస్లింలు ఎందుకు ఆందోళన చెందుతున్నారు?
- జైల్లో సొరంగం తవ్వారు.. 75 మంది ఖైదీలు పరారయ్యారు
- థీమ్ పార్క్ ప్రారంభోత్సవానికి పందితో బంగీ జంప్ చేయించారు
- భవిష్యత్తులో యంత్రాలు మనుషుల్లా మాట్లాడగలవా?
- వినోదం కోసం ఇంట్లో చిరుతల్ని పెంచుకుంటున్నారు
- ఆనందం ఏ వయసులో తగ్గిపోతుంది... సైన్స్ ఏం చెబుతోంది?
- వాతావరణ మార్పు అంటే ఏమిటి? భూమి వేడెక్కితే ఏం జరుగుతుంది?
- RSS 'ఇద్దరు పిల్లల ప్లాన్' వల్ల భారత్‌కు కలిగే లాభమేంటి... జరిగే నష్టమేంటి
- కరీమ్ లాలా: ఈ ముంబయి మాఫియా డాన్‌ను ఇందిరా గాంధీ ఎందుకు కలిశారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









