ఏనుగులు తగలబడుతున్నప్పుడు తీసిన ఫొటోకు అంతర్జాతీయ అవార్డు

ఫొటో సోర్స్, Biplab Hazra/Sanctuary Wildlife Photography Awards
కొందరు రెండు ఏనుగులను తగులబెట్టిన చిత్రాలు వైల్డ్ లైఫ్ ఫొటోగ్రఫీ పోటీల్లో టాప్‌లో నిలిచాయి. పైన మీరు చూస్తోంది అందులో ఒకటి.
(హెచ్చరిక: ఈ ఘటనకు సంబంధించిన మరో చిత్రం కింద ఉంది. అది మిమ్మల్ని బాధపెట్టొచ్చు.)
తూర్పు భారత్‌లో ఓ గున్న ఏనుగు, పెద్ద ఏనుగును కొందరు గుంపు తగులబెట్టగా బిప్లాబ్ హజ్రా అనే ఫొటో గ్రాఫర్ ఆ చిత్రాలను తన కెమెరాలో బంధించారు.
ఈ చిత్రాలను శాంక్చురీ మేగజీన్ ఉత్తమ చిత్రాలుగా ఎంపిక చేసింది. ఏనుగులపై ఇక్కడ ఇలాంటి దాడులు సర్వసాధారణమేనని పేర్కొంది.
మనుషులు.. మదగజాల మధ్య నిత్యం పోరు జరిగే పశ్చిమ బెంగాల్లోని బంకురా జిల్లాలో ఈ ఫొటోలు తీశారు.
అయితే అక్కడ అసలు ఏం జరిగిందో మాత్రం ఇప్పటికీ స్పష్టత లేదు.
ఈ జిల్లాలో ఏనుగుల దాడిలో మనుషులు చనిపోయారంటూ నిత్యం వార్తలు వస్తుంంటాయి.

ఫొటో సోర్స్, Biplab Hazra/Sanctuary Wildlife Photography Awards
ఈ ఫొటో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
బంకురాలో ఉండే మాణిక్ మజుందార్ మట్లాడుతూ.. ఈ జీవ విధ్వంసానికి స్థానికులదే బాధ్యతని వ్యాఖ్యానించారు.
అయితే ఏనుగులు కూడా ఇక్కడ నిత్యం పంటలు నాశనం చేస్తూ.. విధ్వంసం సృష్టిస్తూ ప్రజలను భయ భ్రాంతులకు గురి చేస్తుంటాయని తెలిపారు.
మా ఇతర కథనాలు:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









