భవిష్యత్తులో యంత్రాలు మనుషుల్లా మాట్లాడగలవా?

ఫొటో సోర్స్, Emmanuel Lafont
మనకు నొప్పి పుడితే ఎలా ఉంటుందో, ఒక పీతకు కూడా అలాంటి ఫీలింగే ఉంటుందా.
మనకు నొప్పి గురించి చెప్పే అవే సెన్సర్స్ మనుషుల్లో, పీతల్లో ఉంటాయనే విషయం మనకు తెలుసు. వాటిని 'నోసిసెప్టార్స్' అంటారు. పీతల్ని మరగబెట్టిన నీళ్లలో వేసినప్పుడు, అవి నొప్పితో విలవిల్లాడుతున్నట్టు తమ కాళ్లను కదుపుతుంటాయి.
అంటే, వాటికి వేడినీళ్ల స్పర్శ తెలుస్తోందా, లేక వేడి నీళ్లలో ముంచడం వల్ల అది వాటి శరీర స్పందన మాత్రమేనా అనే ప్రశ్న ఎదురవుతుంది.
మనం ఏదైనా ఒక పని చేసినప్పుడు మన మనసులు సంక్లిష్టమైన చేతన అనుభవంతో నిండి ఉంటాయి.
కానీ జంతువులకు మనలాంటి శరీరాలు ఉన్నా, అవి కూడా అలాంటి అనుభూతి పొందగలవనేది మనం తెలుసుకోలేం.
అంటే ఒక కుక్కను చూస్తే. కుక్క మెదడు, మనిషి మెదడు కంటే మరీ భిన్నంగా ఏమీ ఉండదు. అది కూడా మనలాగే బయటి ప్రపంచాన్ని చూడగలదు, వినగలదు. కానీ దానిలో మనిషిలో ఉన్న అదే స్పృహ ఉంటుందా అనేది చెప్పడం చాలా కష్టం.
ఇక వైజ్ఞానిక స్పృహ విషయం గురించి ఎప్పుడు ఆలోచించినా, ఎన్నో రకాల చిక్కుప్రశ్నలు ఎదురవుతాయి. ఉదాహరణకు, మనుషుల్లాంటి మెదడు ఉన్న జంతువులకు అవగాహన అనేది ఉంటుందా. మనుషుల్లో అవగాహన ఎప్పుడు పుడుతుంది. భవిష్యత్తులో కంప్యూటర్ కూడా మన మెదడులాగే అంతర్గత జీవిత అనుభవాన్ని పొందగలదా?

ఫొటో సోర్స్, Emmanuel Lafont
శాస్త్రవేత్త జూలియో టోనోనీ ఈ ప్రశ్నల్లో చాలా వాటికి సమాధానాలు వెతికే ప్రయత్నం చేశారు. ఆయన దానికోసం 'ఇంటిగ్రేటెడ్ ఇన్ఫర్మేషన్ థియరీ'ని ఆవిష్కరించారు. అంటే మన మెదడులో ఉంటే రకరకాల భాగాలు రకరకాల పనులు చేస్తాయి. తర్వాత అవి తమ సమాచారాన్ని పరస్పరం షేర్ చేసుకుంటాయి. దాంతో మన మెదడులో ఆ స్పృహకు సంబంధించిన ఒక పెద్ద చిత్రం ఏర్పడుతుంది.
అసలు స్పృహ అంటే ఏంటి. జూలియో టోనొనీ ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వడంతో ఈ సిద్ధాంతం మొదలవుతుంది.
ఏ అనుభవం అయినా మనకు స్పృహ అనుభూతి పొందేలా చేస్తుందని టోనోనీ చెప్పారు. అంటే దానికి చాలా కోణాలు ఉంటాయని చెప్పారు. ఆయన కొన్ని ప్రత్యేక పాయింట్స్ గురించి కూడా చెప్పారు. తేడా ఏంటంటే. ఉదాహరణకు మనం ఒక టేబుల్ మీద ఉన్న ఒక పుస్తకాన్ని చూస్తుంటాం. అది ఎర్ర రంగులో ఉంది. ఆ పుస్తకం దగ్గర ఒక కాఫీ కప్పు కూడా ఉంది. అంటే మన మెదడులోని రకరకాల భాగాలు ఆ వేరు వేరు సమాచారాన్ని ప్రాసెస్ చేస్తాయి. తర్వాత ఆ సమాచారాన్నంతా కలిపి ఒక పెద్ద చిత్రంగా మన ముందు పెడతాయి. దానితో మనం టేబుల్ మీద ఎర్ర రంగు పుస్తకం ఉందని, దాని పక్కనే ఒక కాఫీ కప్పు కూడా పెట్టుందని తెలుసుకోగలుగుతాం.
బ్రిటష్ రచయిత వర్జీనియా వుల్ఫ్ దీనిని 'లెక్కలేనన్ని అణువులు నిరంతరం వర్షించడం' అని చెప్పారు.
స్పృహ అనే ఈ సిద్ధాంతం సాయంతో జూలియో టోనోనీ మనం ఒక మనిషి లేదా కంప్యూటర్ స్పృహను లెక్కించవచ్చని చెప్పారు. దానికోసం దాని మెదడులోని రకరకాల భాగాల నుంచి అందే సమాచారాన్ని, అది ఒకటిగా ఎలా జోడిస్తోందో తెలుసుకోవాల్సి ఉంటుందని చెబుతారు.
మన మెదడు ఒక కంప్యూటర్ సీపీయూలా ఉంటుంది. మనం దీన్ని డిజిటల్ కెమెరా ఉదాహరణతో మరింత బాగా అర్థం చేసుకోవచ్చు. డిజిటల్ కెమెరా వెలుతురును బట్టి విడివిడి పిక్సెల్‌ను బంధిస్తాయి. తర్వాత కెమెరాలోకి వెళ్లి ఆ పిక్సెల్స్ అన్నీ కలిసి ఒక భారీ చిత్రంగా మన ముందుకు వస్తుంది. మన మెదడు కూడా అదే పని చేస్తుంది. మెదడులోని కొన్ని భాగాలు రంగులను గుర్తిస్తాయి. కొన్ని ఆకారాలు, కొన్ని ప్రాంతాలు తెలుసుకుంటే, కొన్ని అక్కడ ఉన్న వస్తువుల మధ్య తేడాను గుర్తిస్తాయి. అవన్నీ కలిపి మనకు ఒక పూర్తి చిత్రంగా కనిపిస్తుంది.

ఫొటో సోర్స్, Emmanuel Lafont
మన జ్ఞాపకాలు కూడా అలాగే ఉంటాయి. మన జ్ఞాపకాలు రకరకాల ప్రాంతాల్లో బంధీ అయిన అనుభవాలు కాదు. ఆ అనుభవాలన్నిటినీ పిండుకోవడమే. ఉదాహరణకు మనం ఒక జిలేబీని చూసినప్పుడు, దానిని తినాలనే కోరిక కలుగుతుంది. కొన్నిసార్లు వెంటనే, మనం చిన్నతనంలో రుచిచూసిన జిలేబీ అనుభవం కూడా గుర్తొస్తుంది.
ఇది నిరూపించడానికి అన్ని ఆధారాలూ నిరూపించాల్సి ఉంటుందని, కానీ అవి ప్రస్తుతం లభించడం లేదని జూలియో టోనోనీ చెప్పారు.
దీనిపై అమెరికా, కాలిఫోర్నియాలోని బర్కిలీ యూనివర్సిటీ డేనియెల్ టోకర్ "అన్ని సమాచారాల ఏకీకరణే మన స్పృహ. అది సహజ జ్ఞానం లాంటిదే. కానీ, దానిని బలోపేతం చేయడానికి ఆధారాల అవసరం ఉంటుంది" అన్నారు.
ఈ రీసెర్చ్ సరిగానే ఉందని టోకర్ కచ్చితంగా భావిస్తున్నారు. "జూలియో టోనోనీ థియరీ సరికాదనే విషయం రాబోవు కాలంలో తెలిసినా. మిగతా జీవాల గురించే కాదు, మెషిన్ల స్పృహ గురించి కూడా మనుషులు తెలుసుకునేందుకు ఈ సిద్ధాంతం మనకు సాయం చేస్తుంది" అన్నారు.
"ఈ సిద్ధాంతం ద్వారా ఒక పీతకు కూడా నొప్పి ఉంటుంది అనే విషయం తెలిస్తే. దాని ప్రభావం విపరీతంగా ఉంటుంది. జంతు హక్కుల కోసం పోరాటం చేసేవారికి, వారి వాదన వినిపించడానికి ఇది బలమైన సాక్ష్యం అవుతుంది" అన్నారు.
ఈ సిద్ధాంతం సాయంతో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌కు సంబంధించిన ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు వెతకవచ్చు.

ఫొటో సోర్స్, Emmanuel Lafont
ఉదాహరణకు మెషిన్లు ముందు ముందు మనుషుల్లా ఆలోచించగలవా. మాట్లాడగలవా అనేది కూడా తెలుసుకోవచ్చు.
అయితే టోనోనీ మాత్రం ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ యంత్రాలకు సంబంధించి ప్రస్తుతం మన ముందు ఉన్న వాటిని ఆధారంగా చూస్తే, ఆ మెషిన్లు మనుషుల్లాంటి అంతర్గత జీవిత అనుభవాలను ఎప్పటికీ పొందలేవని చెప్పచ్చు అన్నారు.
"ఆ.. ముందు ముందు టోనోనీ సిద్ధాంతం సరైనదే అని నిరూపితమైతే, అప్పుడు మనం పరస్పరం ఎలా మాట్లాడుకుంటాం అనేది అర్థం చేసుకోగలం".
అమెరికా మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో థామస్ మలోన్ ఈ సిద్ధాంతాన్ని చాలా మందిపై ఒకేసారి అమలు చేశారు. ఆయన తరచూ గ్రూపులో పనిచేసేవారిలో సామూహిక స్పృహ కనిపించడం గమనించారు. వారంతా ఒకేలా ఆలోచించేవారు. ఒకే అనుభూతి పొందేవారు. ఒకే విధంగా నిర్ణయాలు తీసుకునేవారు. ఎలాంటి పరిస్థితి ఎదురైనా ఒకేలా స్పందించేవారు.
అయితే, ప్రస్తుతం ఈ ప్రయోగం ప్రారంభ దశలోనే ఉందని థామస్ మలోన్ హెచ్చరిస్తున్నారు. దీనిపై ఇంకా రీసెర్చ్ చేయాల్సిన అవసరం ఉందన్నారు.
ఇప్పుడు, ఒక పీతను వేడి నీళ్లలో వేసినప్పుడు, అది తనకు భయంకరమైన కష్టం వచ్చినట్టు ఫీలవుతోందని మనం నమ్మకంగా చెప్పలేం. ఒక సమాజం లేదా కంప్యూటర్‌లో సామూహిక స్పృహ ఉంటుందా, ఉండదా అనేది కూడా మనం చెప్పలేం. కానీ భవిష్యత్తులో జూలియో టోనోనీ సిద్ధాంతంతో ఈ ప్రశ్నలకు జవాబులు లభిస్తాయని మాత్రం భావించవచ్చు.
ఇవి కూడా చదవండి:
- హైడ్రోజన్‌తో నడిచే డ్రోన్లు.. ‘ఢీకొట్టినా పేలిపోవు’ అంటున్న హెచ్2గో పవర్
- పెరిగిన ద్రవ్యోల్బణం ప్రభావం సామాన్య ప్రజలపై ఎలా ఉంటుంది?
- రాత్రిలా మారిన పగలు... పరుగులు తీసిన ప్రజలు
- రాళ్లలో దొరికే సిలికాన్.. మన జీవితాలను ఎలా మార్చేసింది
- వాతావరణ మార్పులను ఎదుర్కొనేందుకు పెద్ద ప్రయత్నం చేస్తున్న చిన్న దేశం
- గాలి నుంచి ఆహారం తయారు చేస్తున్న ఫిన్లాండ్ శాస్త్రవేత్తలు.. ఇదెలా సాధ్యం?
- అసలు పుతిన్ ఎవరు.. ఆయన ఏం కోరుకుంటున్నారు?
- RSS 'ఇద్దరు పిల్లల ప్లాన్' వల్ల భారత్‌కు కలిగే లాభమేంటి... జరిగే నష్టమేంటి
- ఆనందం ఏ వయసులో తగ్గిపోతుంది... సైన్స్ ఏం చెబుతోంది?
- వాతావరణ మార్పు అంటే ఏమిటి? భూమి వేడెక్కితే ఏం జరుగుతుంది?
- చైనా కరెన్సీ నోట్లపై చిరస్థాయిగా నిలిచిపోయిన 'ట్రాక్టర్ హీరోయిన్' ఇక లేరు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








