ఒక్క మిడత ‘మహమ్మారి'లా ఎలా మారుతుంది

హార్న్ ఆఫ్ ఆఫ్రికాలోకి గుంపులుగా చొచ్చుకు వచ్చి పంటలను స్వాహా చేస్తున్న ఎడారి మిడతలు ఆహార సరఫరాకు, జీవనోపాధికి ప్రమాదంగా మారాయి. గత పాతికేళ్లలో ఎన్నడూ లేనంత తీవ్రమైన కీటకాల దాడి ఇది. అంత భయంకరంగా ఎలా మారింది?

ఎడారి మిడత చిత్రం

ఇలాంటి ఒక ఎడారి మిడత సాధారణంగా ఒంటరి జీవితం గడపాలని అనుకుంటుంది. గుడ్డు నుంచి మిడతగా మారే ఇది, తర్వాత ఎగిరే జీవిగా పరిణామం చెందుతుంది. సింపుల్‌గా చెప్పాలంటే, ఇది పెద్దగా ప్రాముఖ్యతను ఇవ్వాల్సిన అవసరం లేని ఒక జీవి.

ఎడారి మిడతల గుంపు చిత్రం

కానీ, అప్పుడప్పుడూ ఈ ఎడారి మిడతలు పూర్తిగా వాటి స్వభావానికి భిన్నంగా మారిపోతాయి. పచ్చదనం తగ్గిపోతున్న ప్రాంతాల నుంచి వచ్చి ఇవన్నీ ఒకేసారి గుమిగూడినపుడు, ఉన్నట్టుండీ ఒంటరితనాన్ని వదిలి సమూహంలో జీవించే ‘చిన్నసైజు రాక్షసుల్లా' మారిపోతాయి.

మిడతలన్నీ గుంపుగా మారే ఈ కొత్త దశలో వీటి రంగు మారిపోతుంది. క్రమంగా మిడతల దండుగా తయారవుతాయి. భారీ సమూహాలుగా ఎగురుతూ పంటలపై దాడులు చేసే మహమ్మారిలా పరిణమిస్తాయి.

ఇలాంటి ఒక మిడతల దండు చాలా భారీగా ఉంటుంది. అందులో ఉండే మిడతల సంఖ్య వెయ్యి కోట్లకు పైనే ఉంటుంది. ఆ గుంపు కొన్ని వందల కిలోమీటర్ల వరకూ వ్యాపించి ఉంటుంది. అవి రోజుకు 200 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలవు. ఆహారం, పునరుత్పత్తి కోసం కనికరం లేకుండా చేసే వాటి దాడులు గ్రామీణ జీవనోపాధిని నాశనం చేస్తుంది.

ఐక్యరాజ్యసమితి ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్ఏఓ) అంచనాల ప్రకారం, ఒక సగటు మిడతల దండు ఒక ఏడాదిలో 2500 మంది కడుపు నింపడానికి సరిపోయే పంటలను నాశనం చేయగలదు.

ఇప్పటివరకూ జరిగిన మిడతల దాడుల్లో 2003-05లో పశ్చిమాఫ్రికాలో జరిగిన 2.5 బిలియన్ డాలర్ల విలువైన పంటనష్టం అత్యధికం అని ఐక్యరాజ్యసమితి చెప్పింది.

1930, 40, 50లలో కూడా చాలా ప్రాంతాల్లో మిడతల దాడుల వల్ల పంటనష్టం జరిగింది. వాటిలో కొన్ని దాడులు ఎన్నో ప్రాంతాలకు వ్యాపించాయి. వీటిని ఒక ‘మహమ్మారి'గా ప్రకటించే స్థాయికి ఆ నష్టాల గణాంకాలను చేర్చాయి.

మొత్తంగా చూస్తే, ఈ మిడతల దాడుల వల్ల ప్రపంచంలోని ప్రతి పది మందిలో ఒకరి జీవనోపాధిపై ప్రభావం పడుతోందని ఎఫ్ఏఓ అంచనా వేసింది. దీనిని ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన వలస మహమ్మారిగా చెప్పింది.

ఇలాంటి ఒక ఎడారి మిడత సాధారణంగా ఒంటరి జీవితం గడపాలని అనుకుంటుంది. గుడ్డు నుంచి మిడతగా మారే ఇది, తర్వాత ఎగిరే జీవిగా పరిణామం చెందుతుంది. సింపుల్‌గా చెప్పాలంటే, ఇది పెద్దగా ప్రాముఖ్యతను ఇవ్వాల్సిన అవసరం లేని ఒక జీవి.

కానీ, అప్పుడప్పుడూ ఈ ఎడారి మిడతలు పూర్తిగా వాటి స్వభావానికి భిన్నంగా మారిపోతాయి. పచ్చదనం తగ్గిపోతున్న ప్రాంతాల నుంచి వచ్చి ఇవన్నీ ఒకేసారి గుమిగూడినపుడు, ఉన్నట్టుండీ ఒంటరితనాన్ని వదిలి సమూహంలో జీవించే ‘చిన్నసైజు రాక్షసుల్లా' మారిపోతాయి.

మిడతలన్నీ గుంపుగా మారే ఈ కొత్త దశలో వీటి రంగు మారిపోతుంది. క్రమంగా మిడతల దండుగా తయారవుతాయి. భారీ సమూహాలుగా ఎగురుతూ పంటలపై దాడులు చేసే మహమ్మారిలా పరిణమిస్తాయి.

ఇలాంటి ఒక మిడతల దండు చాలా భారీగా ఉంటుంది. అందులో ఉండే మిడతల సంఖ్య వెయ్యి కోట్లకు పైనే ఉంటుంది. ఆ గుంపు కొన్ని వందల కిలోమీటర్ల వరకూ వ్యాపించి ఉంటుంది. అవి రోజుకు 200 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలవు. ఆహారం, పునరుత్పత్తి కోసం కనికరం లేకుండా చేసే వాటి దాడులు గ్రామీణ జీవనోపాధిని నాశనం చేస్తుంది.

ఐక్యరాజ్యసమితి ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్ఏఓ) అంచనాల ప్రకారం, ఒక సగటు మిడతల దండు ఒక ఏడాదిలో 2500 మంది కడుపు నింపడానికి సరిపోయే పంటలను నాశనం చేయగలదు.

ఇప్పటివరకూ జరిగిన మిడతల దాడుల్లో 2003-05లో పశ్చిమాఫ్రికాలో జరిగిన 2.5 బిలియన్ డాలర్ల విలువైన పంటనష్టం అత్యధికం అని ఐక్యరాజ్యసమితి చెప్పింది.

1930, 40, 50లలో కూడా చాలా ప్రాంతాల్లో మిడతల దాడుల వల్ల పంటనష్టం జరిగింది. వాటిలో కొన్ని దాడులు ఎన్నో ప్రాంతాలకు వ్యాపించాయి. వీటిని ఒక ‘మహమ్మారి'గా ప్రకటించే స్థాయికి ఆ నష్టాల గణాంకాలను చేర్చాయి.

మొత్తంగా చూస్తే, ఈ మిడతల దాడుల వల్ల ప్రపంచంలోని ప్రతి పది మందిలో ఒకరి జీవనోపాధిపై ప్రభావం పడుతోందని ఎఫ్ఏఓ అంచనా వేసింది. దీనిని ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన వలస మహమ్మారిగా చెప్పింది.

మిడతల దాడికి గురైన దేశాలు, 1926-2019
సంవత్సరంతిరోగమనంపెరుగుదల లేదా తగ్గుదలమహమ్మారి
20190180
2018000
2017000
2016500
2015200
2014700
20131000
2012900
2011700
2010400
2009500
2008800
20071300
2006100
20050200
20040230
2003500
2002000
2001000
2000200
1999400
1998700
19971200
19961500
19951500
19941300
19932000
1992500
1991000
1990300
19890150
19880026
19871500
19861200
1985200
1984000
1983700
1982500
1981500
1980600
1979040
19780150
1977300
1976900
1975700
19741100
1973700
1972500
1971400
1970700
19690110
19680250
1967700
1966200
1965400
1964600
19630100
19620290
19610290
19600044
19590047
19580041
19570037
19560035
19550043
19540040
19530043
19520027
19510410
19500330
1949900
19481200
19470290
19460360
19450042
19440047
19430043
19420035
19410240
1940060
1939500
1938300
1937600
1936600
1935600
1934090
19330180
19320027
19310035
19300045
19290041
19280034
19270220
1926080
ఆధారం: ఎఫ్ఏఓ
గమనిక: తిరోగమనం అంటే మిడతలు తక్కువ సాంద్రతతో ఉండడం. పెరుగుదల అంటే మిడతల సంతానోత్పత్తితో వాటి దాడులు పెరగడం. మహమ్మారి అంటే మిడతలు భారీ గుంపులుగా ఏడాదికి పైగా వ్యాపించడం. మహమ్మారి అంతమైతే దాన్ని తగ్గుదల అంటారు.

తూర్పు ఆఫ్రికా, పాకిస్తాన్‌లో పంటలను నాశనం చేస్తున్న మిడతల దండు

దశాబ్దాల్లోనే అత్యంత భయంకరమైన ఎడారి మిడతల దండు ఇప్పుడు హార్న్ ఆఫ్ ఆఫ్రికా అంతటా పంటలను, పచ్చికబయళ్లను నాశనం చేస్తున్నాయి. ఆ ప్రాంతమంతా ఆహార భద్రతకు ప్రమాదంగా మారాయి.

సొమాలియా, ఇథియోపియాలో వినాశనం సృష్టించిన తర్వాత ఈ భయంకరమైన కీటకాలు కెన్యాలో వ్యాపిస్తున్నాయి. 70 ఏళ్లలో ఇవి ఘోరమైన దాడులు కాగా, సొమాలియా, ఇథియోపియాలో 25 ఏళ్లలో ఇంత వినాశనం ఎప్పుడూ జరగలేదు

ఈ సంక్షోభాన్ని సొమాలియా జాతీయ అత్యవసరస్థితిగా ప్రకటించింది. పాకిస్తాన్ తర్వాత అలా చేసిన రెండో దేశం అయ్యింది. తూర్పు పాకిస్తాన్‌లోని పత్తి, గోధుమ, మొక్కజొన్న, ఇతర పంటలను మిడతల దండు నాశనం చేస్తోంది.

కానీ హార్న్ ఆఫ్ ఆఫ్రికాలో ఈ దాడులు ఎక్కువగా ఉన్నాయి. పునరుత్పత్తి చాలా వేగంగా జరుగుతుండడంతో జూన్ నాటికి మిడతల సంఖ్య 500 రెట్లు పెరగవచ్చని ఎఫ్ఏఓ చెబుతోంది.

మిడతల దాడులతో అప్రమత్తమైన దేశాలు

హార్న్ ఆఫ్ ఆఫ్రికాలో, ఎర్ర సముద్రం రెండు వైపులా, భారత్ -పాకిస్తాన్ సరిహద్దుల్లో మిడతల దండు దాడిని చూపిస్తున్న మ్యాప్. మిడతల సమూహాలు ఇథియోపియా, కెన్యా మీదుగా కూడా ఇతర దేశాలకు కూడా వెళ్తున్నాయి.ఆధారం: ఎఫ్ఏఓ

కొన్ని మిడతల సమూహాలు సరిహద్దులు దాటి యుగాండాలోకి ప్రవేశించాయని అధికారులు తెలిపారు. ఈ పరిస్థితిని సమర్థంగా ఎదుర్కోకపోతే అది స్థానిక మహమ్మారిలా మారిపోతుందని ఎఫ్‌ఏవో హెచ్చరించింది.

గత ఏడాది డిసెంబర్ నాటికి ఈ మిడతల మహమ్మారి సొమాలియా, ఇథియోపియాలలో 175 వేల ఎకరాల పంటల్ని నాశనం చేశాయి. వీటిని అదుపు చేయకపోతే ఇవి ప్రాంతీయ మహమ్మారిగా పెరగవచ్చవని ఎఫ్ఏఓ చెప్పింది.

ఎఫ్ఏఓ లెక్కల ప్రకారం ఈ మిడతలు రోజుకు 350 చదరపు కిలోమీటర్లలో ఉన్న1.8 మిలియన్ టన్నుల పంటలను స్వాహా చేస్తున్నాయని తెలుస్తోంది.

కెన్యాలో జరిగిన ఒక మిడతల దాడిలో 40 నుంచి 60 కిలోమీటర్ల ప్రాంతంలో ఉన్న పంటను అవి నాశనం చేశాయని ఈ సంస్థ భావిస్తోంది.

ఒక మిడత ఎంత తినగలదు?

ఒక ఎడారి మిడత తన బరువుకి తగిన ఆహారం తినగలదు.అంటే దాదాపు 2 గ్రాములు.ఒక పెద్ద మిడత ఎంత ఆహారం తినగలదో చూపించే ఇన్ఫోగ్రాఫిక్. ఒక చదరపు కిలోమీటరు పరిధిలో మిడతల దండు 35వేల మందికి సరిపడా ఆహారాన్ని తినగలదు.ఆధారం: ఎఫ్ ఏ ఓ

ఈ మిడతల సంక్షోభం వ్యవసాయ ఉత్పత్తి తగ్గడానికి దారితీస్తుందని, ఇప్పటికే వరదలు, కరువుతో సతమతం అవుతున్న ప్రాంతాల్లో ఆహార సరఫరాపై మరింత ప్రభావం చూపిస్తుందని, ఈ ప్రాంతంలోని 2 కోట్ల మందికి పైగా దీనికి ప్రభావితం అవుతారని అధికారులు ఆందోళన చెందుతున్నారు

కెన్యా, ఇథియోపియా గురించి మాకు ఎక్కువ ఆందోళనగా ఉంది. ఎందుకంటే చాలా భారీ మిడతల దండు ఉన్న ప్రాంతాలు ఇవే అని ఎఫ్ఏఓలో మిడతల గురించి అంచనా వేసే సీనియర్ అధికారి కీత్ క్రెస్‌మన్ చెప్పారు.

ఆలీ బిలా వాకో పంటలపై మిడతల దాడులతో జరిగిన నష్టానికి సాక్ష్యం ఇది.

దానికితోడు, ఇథియోపియాలో వాటి పునరుత్పత్తి జరుగుతోంది. దాంతో అక్కడ మిడతల సంఖ్య పెరుగుతోంది అని ఆయన పేర్కొన్నారు.

సుదీర్ఘ కాలంపాటు సంభవించిన కరవు తర్వాత ఇటీవల వర్షాలు పడడంతో ఈ సంవత్సరం పంటలు బాగా పండుతాయని ఈశాన్య కెన్యాలో నివసించే ఆలీ బిలా వాకో అనే 68 ఏళ్ల రైతు ఆశపడ్డారు.

కానీ, ఆయన మొక్కజొన్న, బీన్స్ పంటనంతా మిడతలు నాశనం చేశాయి.

"అవి మా పంటను చాలావరకూ తినేశాయి, మిగిలింది ఎండిపోయింది. ఇది చాలా బాధించింది. పంట బాగా పండింది. కానీ, మా కళ్ల ముందున్న ఆహారం ఇప్పుడు మా నోటికి అందకుండా పోయింది."

1960లలో జరిగిన మిడతల దాడులను గుర్తు చేసుకున్న వాకో, అవి కనుచూపుమేరలో కనిపించే ఆకాశాన్ని ఎలా కమ్మేస్తాయో వివరించారు.

"అప్పుడు పూర్తిగా చీకటైపోతుంది, సూర్యుడు కూడా కనిపించడు" అని ఆయనన్నారు.

ప్రతికూల వాతావరణం కూడా ఈ సంక్షోభానికి ఆజ్యం పోసింది.

మిడతల ప్రస్తుత దాడులకు 2018-19లో కురిసిన భారీ వర్షాలు, తుపానులే కారణం.

ఎడారి మిడతలు సాధారణంగా పశ్చిమ ఆఫ్రికా, భారత్ మధ్య 1.60 కోట్ల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోని దాదాపు 30 దేశాల్లో ఉన్న ఉష్ణమండల ప్రాంతాల్లో నివసిస్తాయి.

కానీ, రెండేళ్ల క్రితం దక్షిణ అరేబియా ద్వీపకల్పంలో ఏర్పడిన తేమ, అనుకూల పరిస్థితులు మూడు తరాల మిడతలు ఎవరికీ తెలీకుండా పెరిగేందుకు దోహదపడ్డాయి అని ఐక్యరాజ్య సమితి తెలిపింది.

2018 నుంచి మిడతల సంఖ్య పెరుగుతోంది.

మిడతల గుంపులు అనేక సీజన్లలో ఎలా వృద్ధి చెందాయో, అరేబియా ద్వీపకల్పం నుంచి ఆఫ్రికా వైపు, భారత్-పాకిస్తాన్ సరిహద్దు వైపు ఎలా పయనించాయో ఈ మ్యాప్ చూపిస్తోంది.ఆధారం: ఎఫ్ఏఓ, జనవరి 2020

2019 ప్రారంభం నాటికి మొదటి మిడతల గుంపు యెమెన్, సౌదీ అరేబియా, ఇరాన్ వైపు వెళ్లి, సంతానోత్పత్తి చేసి తూర్పు ఆఫ్రికావైపు వెళ్లాయి.

2019 సంవత్సరాంతానికి ఎరిత్రియా, డిజిబౌటీ, కెన్యాలో మిడతల దండు మరింత విస్తరించింది.

కెన్యా సాంబూరు ప్రాంతంలో దండెత్తుతున్న మిడతల చిత్రాలు

మిడతల దండు సంఖ్య ఎర్రసముద్రానికి రెండువైపులా కూడా పెరుగుతోంది. ఈజిఫ్ట్, సూడాన్, ఎరిత్రియా, సౌదీ అరేబియా, యెమెన్‌, భారత-పాకిస్తాన్ సరిహద్దులపై కూడా వీటి ప్రభావం పడుతోంది. ఈ పరిస్థితిని ఐక్యరాజ్యసమితి ‘చాలా ఆందోళనకర స్థితి'గా వర్ణించింది.

భౌగోళికంగా వీటి ప్రభావం విస్తృతంగా ఉండడంతో ఈ మిడతల దండుతో
పోరాడడం చాలా కష్టమైనప్పటికీ,
ఈ మిడతల సంఖ్య పెరగకుండా తొలి దశలోనే మరిన్ని చర్యలు చేపట్టి ఉండాలని ఎఫ్ఏఓ
క్రెస్‌మన్ అభిప్రాయపడ్డారు.

కొన్ని కీలక దేశాల్లో సమర్ధంగా చర్యలు చేపట్టి ఉంటే ఈ పరిస్థితి కాస్త తగ్గించి ఉండేవాళ్లం అన్నారు.

భారీ మిడతల దండును అడ్డుకోడానికి ప్రజలు ప్రయత్నిస్తున్నారు.

హార్న్ ఆఫ్ ఆఫ్రికాలో మిడతల సమూహాల పరిమాణం, వినాశన సామర్థ్యం ఇంతకు ముందెప్పుడూ లేని విధంగా ఉండడంతో వాటిని ఎదుర్కోడానికి దేశాలు అల్లాడుతున్నాయి.

దాడుల్ని అరికట్టడం రెండు అంశాలపై ఆధారపడి ఉంటుంది. పర్యవేక్షించడం, సమర్ధంగా నియంత్రించడం.

ఎఫ్ఏఓ ద్వారా నడిపే ది డెసర్ట్ లోకస్ట్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ మిడతల దండు వచ్చే సమయం, వాటి స్థాయి, చొరబడే ప్రాంతం, వాటి పునరుత్పత్తి గురించి ముందస్తు హెచ్చరికలు చేస్తోంది.

కానీ, వాటి జనాభా చాాల భారీ స్థాయికి చేరడంతో హార్న్ ఆఫ్ ఆఫ్రికా లాంటి ప్రాంతాల్లో మిడతల సంఖ్యను తగ్గించడానికి, మరిన్ని సమూహాలు ఏర్పడకుండా అడ్డుకోడానికి అత్యవసర చర్యలు అవసరం అవుతున్నాయి.

మిడతల దండును ఎలా అడ్డుకుంటున్నారు

మిడతల దాడుల్ని అరికట్టేందుకు క్రిమిసంహారకాల పిచికారీ విధానాలను తెలిపే సమాచారంఆధారం: ఎఫ్ఏఓ

జీవ క్రిమిసంహారకాలు, సహజంగా మిడతలను తినేవాటిని పరిచయం చేయడం లాంటి పర్యావరణ అనుకూల పద్ధతులపై పరిశోధనలు జరుగుతున్నప్పటికీ, అందరూ ఎక్కువగా ఉపయోగిస్తున్న నియంత్రణ పద్ధతి క్రిమి సంహారకాలు పిచికారీ చేయడమే.

చేతి పంపులు, నేలపై నడిచే వాహనాలు లేదా విమానాల ద్వారా రసాయనాలు ఉపయోగించి చాలా తక్కువ సమయంలో మిడతల దండును చంపగలుగుతున్నారు.

ఇప్పుడు కెన్యా, ఇథియోపియా, సొమాలియా దేశాలలో చాలా భారీ స్థాయి ఏరియల్ ఆపరేషన్స్ అవసరం అయ్యాయి. కానీ భద్రతా కారణాల వల్ల ఇది సాధ్యం కావడం లేదు అని క్రెస్‌మన్ చెప్పారు.

ప్రస్తుతం మిడతల జనాభా ప్రధానంగా పరిపక్వ దశలో ఉండటం వల్ల విమానాలతో రసాయనాలను గట్టిగా కొట్టడం వల్ల ప్రయోజనం ఉంటుంది. అలా పరిపక్వ దశలో, గుడ్లు పెట్టే మిడతల సంఖ్యను మనం తగ్గించవచ్చు. అన్నారు.

ముఖ్యంగా వీటిని అరికట్టడానికి తగిన మౌలిక సదుపాయాలు గానీ, వాటి గురించి తగిన సమాచారం గానీ లేకపోవడంతో కొన్ని దశాబ్దాలుగా ఎలాంటి చర్యలూ చేపట్టని దేశాలకు ఇది కష్టంగా మారింది.

ముఖ్యంగా వీటిని అరికట్టడానికి తగిన మౌలిక సదుపాయాలు గానీ, వాటి గురించి తగిన సమాచారం గానీ లేకపోవడంతో కొన్ని దశాబ్దాలుగా ఎలాంటి చర్యలూ చేపట్టని దేశాలకు ఇది కష్టంగా మారింది.

సొమాలియా, ఇథియోపియా, కెన్యా, పాకిస్తాన్‌లో ఇప్పుడు తీసుకున్న చర్యలు తర్వాత ఏం జరుగుతుంది అనేది నిర్ణయిస్తాయి. ఈ మిడతల దండు మరిన్ని సరిహద్దులు దాటితే, మరిన్ని ప్రాంతాలకు చేరితే, మరిన్ని పంటలు నాశనం చేస్తే, దానిని మహమ్మారిగా ప్రకటించాలి .

కానీ కెన్యా రైతు అలీ బిలా వాకో, ఆయన కుటుంబం కోసం ఏదైనా చేయడం ఇప్పటికే ఆలస్యమైంది. మిడతల దండు దాడి చేసినపుడు, వాటితో పోరాడ్డానికి వాళ్లు చేయగలిగింది ఒక్కటే. ఆయిల్ డబ్బాలపై కొడుతూ, అరవడం మాత్రమే...

అయినా, జరుగుతున్నదంతా చూసి బిలా వాకో వేదాంత ధోరణిలో మాట్లాడుతున్నారు.

"ఇది దేవుడి కోరిక, ఇవన్నీ ఆయన సైన్యం" అంటారాయన

క్రెడిట్

ప్రొడక్షన్: లూసీ రోడ్జెర్స్, ఫీల్డ్ ప్రొడక్షన్: జో ఇన్ వుడ్, డిజైన్ : జో బార్తోలోమీ , మిల్లీ వకీరా, డెవలప్మెంట్: బెకీ రష్, కాట్రియోనా మోరీసన్, ప్యూరిటీ బిరిర్,మిడతల చిత్రాలు: స్విడ్బర్ట్ ఆర్ ఆత్, స్టీఫెన్ రోజర్స్, గెట్టి ఇమేజెస్


ఈ కథనంపై మరింత సమాచారం